ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Tuesday, 30 August 2011

బ్రాంచి ఏదైనా కళాశాలకే ప్రాముఖ్యం !

ఇంజినీరింగ్‌ విద్య చదవాలంటే కళాశాలను చూడాలా?  బ్రాంచిని చూడాలా?

ఈ ప్రశ్న ప్రతి సంవత్సరం విద్యార్థులకూ, వారి తల్లిదండ్రులకూ ఎదురయ్యేదే!

ఎంసెట్‌ లో ఉత్తమ ర్యాంకులు తెచ్చుకున్నవారు దేనికి మొగ్గు చూపారు?

వారు కళాశాల పేరు ప్రఖ్యాతులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. తాము ఎంచుకున్న కళాశాలలో ఏ కోర్సులో  సీటు వచ్చినా ఫర్వాలేదనీ, భవితకు ఢోకా ఉండదనే భావనతో చేరిపోతున్నారు.

వెబ్ కౌన్సెలింగ్ ధోరణి ఈ విషయాన్నే నిరూపిస్తోంది.  కన్వీనర్‌ కోటాలో జరిగిన సీట్ల కేటాయింపును, యాజమాన్య కోటాలో చేరే విద్యార్థులను పరిశీలించినప్పుడు కూడా ఇదే విషయం స్పష్టమవుతోంది.

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ కళాశాలల సంఖ్య ఏడు వందలు దాటిపోవడంతో ఎందులో చేరాలనే దానిపై విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. సుమారు మూడు వందల కళాశాలల నుంచి మాత్రమే రెండు బ్యాచులు బయటికొచ్చాయి. ఈ విద్యార్థులకు లభించిన ప్లేస్‌మెంట్స్‌, అర్హత, అనుభవం గల అధ్యాపకులు, మౌలిక సదుపాయాలను పరిగణనలోకి తీసుకొని విద్యార్థులు కళాశాలలను ఎంచుకుంటున్నారు.

ఈ క్రమంలో రాష్ట్రంలో ముఖ్యంగా యాభై కళాశాలల్లో మాత్రమే ప్రాంగణ నియామకాల ద్వారా విద్యార్థులను చేర్చుకునేందుకు ఐటీ, సాఫ్ట్‌వేర్‌ సంస్థలు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. ఇదే సమయంలో విశ్వవిద్యాలయాల్లోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో, రాష్ట్రంలోని టాప్‌ 10 నుంచి 20 కళాశాలల్లో ఏ సీటు వచ్చినా చేరేందుకు విద్యార్థులు ఆసక్తిని కనబరుస్తున్నారు.

టాప్‌ 100 ర్యాంకర్లలో చేరింది నలుగురే!
కాలేజీల ఎంపిక సమయంలో విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందని భావించి, ఇంజినీరింగ్‌ కళాశాలలకు గ్రేడింగ్‌ ఇవ్వడానికి ఉన్నత విద్యాశాఖ కసరత్తుచేసినా... న్యాయపరమైన సమస్యలు తలెత్తుతాయన్న ఉద్దేశంతో ప్రస్తుతానికి పక్కనబెట్టింది. దీనివల్ల విద్యార్థులు కళాశాలల నేపథ్యంపై సమాచారాన్ని సేకరిస్తూ, సరైన నిర్థారణకు వచ్చిన తర్వాతే వాటిలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.

ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా కన్వీనర్‌ కోటాలో జరిగిన సీట్ల కేటాయింపును పరిశీలిస్తే (పట్టిక చూడండి) ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

* ఎంసెట్‌ ఇంజినీరింగ్‌లో తొలి వంద ర్యాంకులు సాధించినవారిలో నలుగురు మాత్రమే కళాశాలల్లో సీట్లు పొందారు. విశ్వవిద్యాలయాలకు చెందిన ఇంజినీరింగ్‌ కళాశాలల్లోనే వీరికి సీట్ల కేటాయింపు జరిగింది. రెండో ర్యాంకరు ఆంధ్రా వర్శిటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో మెకానికల్‌ సీటు పొందారు. 500 ర్యాంకులలోపు ఉన్న విద్యార్థుల సంఖ్య స్వల్పంగానే ఉంది.

* ఎంసెట్‌ ఇంజినీరింగ్‌లో మంచి ర్యాంకులు పొందిన వారిలో ఎక్కువమంది ఐఐటీ జేఈఈ, ఏఐఈఈఈ, ఇతర పోటీ పరీక్షల్లోనూ అగ్రస్థానాల్లో నిలుస్తున్నారు. దీనివల్ల ఎంసెట్‌లో మంచి ర్యాంకు వచ్చినప్పటికీ ఇతర విద్యాసంస్థల్లో చేరుతున్నారు.

* జేఎన్‌టీయూ హైదరాబాద్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో చేరేందుకు విద్యార్థులు బాగా ఆసక్తి కనబరిచారు.

* ఓయూలో ఓపెన్‌ కేటగిరీలో 379 ర్యాంకరు ఈసీఈలో సీటు సంపాదించారు. అదే జేఎన్‌టీయూ హైదరాబాదులో 71వ ర్యాంకర్‌ ఈసీఈ సీటు పొందారు. కంప్యూటర్‌ సైన్స్‌, ఈఈఈ, మెకానికల్‌, సివిల్‌లోనూ ఇదే ధోరణి కనిపించింది.

* జేఎన్‌టీయూ హైదరాబాద్‌, ఆంధ్రా వర్శిటీ, ఓయూ, జేఎన్‌టీయూ కాకినాడ వర్శిటీ కళాశాలల అనంతరం మంచి ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ప్రాధాన్యం ఇచ్చారు.

* ఎప్పటిలాగే ఈసారి కూడా ఈసీఈలో చేరేందుకు విద్యార్థులు ప్రాధాన్యం ఇచ్చారు. ఈసీఈలో సీటు లభించకపోతే వరుసకమ్రంలో కంప్యూటర్‌ సైన్స్‌, ఈఈఈ, మెకానికల్‌, సివిల్‌లో చేరేందుకు ఆసక్తి చూపించారు. ఈ ఒరవడి పాత కళాశాలల్లో అధికంగా ఉంది. మిగిలిన వాటి విషయంలో విద్యార్థులు తాము అనుకున్న కోర్సులో చేరడానికే మొగ్గుచూపారు.

* యాజమాన్య కోటాలోనూ విద్యార్థులు కళాశాలల నేపథ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
                                             - ఇట్టా సాంబశివరావు (న్యూస్‌టుడే, హైదరాబాద్‌)

Monday, 29 August 2011

బ్యాంకు క్లర్కుల పరీక్షకు సిద్ధం కండి!

బీపీఎస్ క్లర్కు పోస్టుల  ప్రకటన వివరాలు ఈ టపాలో తెలుసుకున్నాం కదా?  టెన్త్ అర్హతతోనే బ్యాంకు పరీక్ష రాసే అవకాశమిది.

ఈ ఉమ్మడి పరీక్షా విధానం స్వరూపం ఏమిటి?

ఒక్కో విభాగానికి మరి ఎలా సిద్ధమవ్వాలి?

ప్రిపరేషన్లో ఏయే మెలకువలు పాటించాలి?

గతంలో బ్యాంకు పరీక్షలు  రాసి ఎంపిక కానివారు సవరించుకోవలసిన లోపాలు ఏమిటి?

బ్యాంకు ఉద్యోగార్థులు ఎవరికైనా ఇవి సహజంగా వచ్చే సందేహాలు!

వీటిని నివృత్తి చేయటానికి  ఇవాళ చదువు పేజీలో ప్రచురించిన ప్రధాన కథనం ఇది. 

 

ఎంఐటీ లో ప్రవేశం ఎలా?

నదేశంలో అత్యుత్తమంగా ఇంజినీరింగ్ విద్యను చదవాలంటే చేరాల్సింది ఐఐటీల్లో.

మరి విదేశాల్లో?

వెంటనే స్ఫురించే సంస్థ - అమెరికాలోని మాసాచుసెట్స్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)


 ఇక్కడ 115 దేశాలకు చెందిన 3,168 మంది విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారు.

దీనిలో ప్రవేశం పొందటమెలా? ఏ పరీక్షలు రాయాలి?

ఈ వివరాలను సాక్షాత్తూ MIT లో సీటు సాధించిన విద్యార్థి చెపితే?

ఎంతో  బాగుంటుంది కదూ?

ఈ చక్కటి  ఆలోచనను ఆచరణలోకి తెచ్చింది ‘ఈనాడు’ పత్రిక.

MIT లో ఇటీవల ప్రవేశం పొందిన హైదరాబాద్ విద్యార్థి అనూప్‌రెడ్డి తో విద్యార్థుల  చర్చా కార్యక్రమం  ఏర్పాటు చేసింది. ఆదివారం  హైదరాబాద్ లో !

విద్యార్థులతోపాటు అధిక సంఖ్యలో తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (SAT)  గురించి తెలుసుకున్నారు.  చాలామంది విద్యార్థుల సందేహాలు నివృత్తి అయ్యాయి.

‘ఈనాడు జర్నలిజం స్కూల్‌’ ప్రిన్సిపల్‌ ఎం.నాగేశ్వరరావు ఈ కార్యక్రమానికి మోడరేటర్ గా వ్యవహరించారు.  ప్రపంచ వ్యాప్తంగా శాట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోటీ, ప్రాధాన్యం గురించి ఆయన వివరించారు.

ఈ కార్యక్రమ విశేషాలు ఇవాళ హైదరాబాద్ మినీ ఎడిషన్లో ప్రచురితమయ్యాయి. ఇతర ప్రాంతాల విద్యార్థులు కూడా చదవటానికి వీలుగా పూర్తి కథనం ఇక్కడ ఇస్తున్నాం!


MIT  వెబ్ సైట్ ను  ఇక్కడ  క్లిక్ చేసి చూడొచ్చు!

సివిల్స్ కు సరికొత్త వ్యూహం !


మాసాల్లో మార్గశిర మాసం గొప్పది అన్నట్టుగా...  పరీక్షలన్నిట్లో ఏ పరీక్ష గొప్పదంటే ... వెనువెంటనే ఎవరైనా చెప్పే  సమాధానం... సివిల్స్ !   

సివిల్ సర్వీసెస్  ప్రిలిమినరీ పరీక్షలో ఈ సంవత్సరం  కొత్త విధానం ప్రవేశపెట్టారు.  దీని గురించి అభ్యర్థుల్లో  ఎన్నెన్నో వూహాగానాలు ప్రచారమయ్యాయి.

వీటన్నిటికీ తెర దించుతూ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించి, ఫలితాలూ ప్రకటించారు.



ప్రశ్నల స్వభావాన్ని విశ్లేషిస్తే తెలిసే అంశాలేమిటి?



బ్రెయిన్‌ ట్రీ డైరెక్టర్‌ గోపాలకృష్ణ చెబుతున్న విశేషాలు ఇవాళ ‘చదువు’లో  ప్రచురితమైన కథనం లో ఇక్కడ క్లిక్ చేసి  చదవండి. 

Thursday, 25 August 2011

ఇంజినీరింగ్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ 5 నుంచి!

 
హైదరాబాద్‌, న్యూస్‌టుడే:  ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ మలివిడత కౌన్సెలింగ్‌ సెప్టెంబరు  5 వ తేదీ నుంచి 8 వ  తేదీ మధ్య నిర్వహించనున్నారు.

9 వ తేదీన సీట్లు కేటాయిస్తారు.

రెండో విడత కౌన్సెలింగ్‌ను తొలుత సెప్టెంబరు 3వ తేదీ నుంచి ప్రారంభించాలని భావించారు. పీజీఈసెట్‌, ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌ తేదీలను పరిగణనలోకి తీసుకుని ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ తేదీల్లో మార్పు చేశామని ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు జయప్రకాష్‌రావు వెల్లడించారు.

ఐసెట్‌కు 75వేల మంది గైర్హాజరు:

ఐసెట్‌-2011 ప్రవేశాల్లో భారీగా సీట్లు మిగలనున్నాయి.

1,26,454 మంది అర్హత సాధించగా 51వేల మంది ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు వచ్చారు. 75వేల మంది గైర్హాజరయ్యారు.

3, 4 తేదీల్లో పాలిటెక్నిక్‌ కౌన్సెలింగ్‌:

పాలిటెక్నిక్‌ మలివిడత కౌన్సెలింగ్‌ (సీప్‌-2011) వచ్చేనెల 3,4 తేదీల్లో జరగనుంది.

అదే నెల 5న సీట్లు కేటాయిస్తారు.

తొలివిడత కౌన్సెలింగ్‌లో 8వేల వరకు సీట్లు మిగిలాయి.

ఇంగ్లిష్ లో... ఇబ్బంది నుంచి బయటపడండి!

ఇంగ్లిష్  collocations లో ఈ సారి మరికొన్ని వ్యక్తీకరణలు:  

ఈ  సంభాషణ  చూడండి- 

Sumanth: I heaved a sigh of relief when I heard the news that Vibhav is out of danger.
(వైభవ్‌ ప్రమాదం నుంచి బయటపడ్డాడన్నమాట వినగానే 'హమ్మయ్యా' అనుకున్నాను.)

a) Pradhan: You look relaxed, what could be the reason?
(చాలా విశ్రాంతిగా కన్పడ్తున్నావు. కారణం ఏమయి ఉండొచ్చు?)
Vardhan: The exams are over. Reason to heave a sigh/ breathe a sigh of relief.
(పరీక్షలయిపోయాయి. 'హమ్మయ్య' అని ఊపిరి పిల్చుకునేందుకు సరైన కారణమే కదా?

b) Sundar: You need not pay any more. Your dues are cleared.
(నువ్వింకేం చెల్లించక్కర్లేదు. నువ్వు తీర్చాల్సిన అప్పు తీరిపోయింది.)
Jayaram: Oh...! What a relief!
(ఎంత హాయిగా ఉందో- ఇలా అనుకోటం. heaving/ breathing a sigh of relief).

ఈ సంభాషణల్లో  collocation point: Relief


The happiness we feel when a bad thing ends/ a bad thing doesn't happen =

మనం అనుభవిస్తున్న ఇబ్బంది తొలగిపోయినప్పుడు, మనం భయపడ్డ ఇబ్బంది జరగనప్పుడు, మనకు కలిగే హాయి. మంచి ఎండలోంచి నీడలోకి వచ్చినప్పుడు/ AC roomలో ఉన్నప్పుడు కలిగే హాయి relief. 'హమ్మయ్య' అని ఊపిరి పీల్చుకోటం - relief.
పెద్దబరువు మననెత్తినించి దిగిపోయినప్పుడు కలిగే ఊరట- relief.

అలాంటి relief కల్గినప్పుడు, మనం 'హమ్మయ్య' అని ఊపిరి పీల్చుకోవటం- Breathe a sigh of relief (sigh = నిట్టూర్పు -

we sigh in sorrow, we sigh in relief too = నిరాశలోనూ నిట్టూర్పు విడుస్తాం. కష్టం నుంచి బయట పడ్డప్పుడూ ఊపిరి పీల్చుకుని నిట్టూర్పు విడుస్తాం.

Heave a sigh/ Breathe a sigh of relief = హాయిగా ఊపిరి పీల్చుకోటం.

అంటే - ఇబ్బంది నుంచి బయటపడటం అన్నమాట!   

A sigh of relief = అలా ఇబ్బంది నుండి బయట పడ్డప్పుడు మనం హాయిగా ఊపిరి పీల్చుకోటం = Heave/ breathe a sigh of relief.

When a person is declared out of danger, the relatives heave/ breathe a sigh of relief=  ఎవరికైనా ప్రమాదం తప్పింది అన్నప్పుడు వాళ్ల దగ్గర చుట్టాలు ఊపిరి పీల్చుకుంటారు.

ఇలాంటి మరికొన్ని collocations ను చదువు ఆన్ లైన్ ఎడిషన్లో ఇక్కడ చదవండి.
ఈ శీర్షిక రచయిత  ఎం. సురేశన్‌.

Wednesday, 24 August 2011

ఐఐఎంల తర్వాత అగ్రగామి సంస్థలేవి?


ఇంజినీరింగ్‌ విద్య అంటే ఐఐటీలే. ఇవి మేనేజ్‌మెంట్‌ కోర్సులను కూడా నిర్వహిస్తున్నాయి.

ఐఐఎంల తర్వాత నాణ్యమైన మేనేజ్‌మెంట్‌ శిక్షణ వీటిలో లభిస్తోంది!

ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఐఐటీలు ఏటా నిర్వహించే జాయింట్‌ మేనేజ్‌మెంట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (జేఎంఈటీ)పై ఈ ఏడాది సందిగ్థత  ఏర్పడింది. ఈ పరీక్షకు  స్పందన తగ్గిపోతుండటంతో ఐఐటీలు ఆలోచనలో పడ్డాయి. జేఎంఈటీకి బదులుగా క్యాట్‌ ఆధారంగా ఐఐటీల్లో కూడా మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశం కల్పించాలనే ప్రతిపాదనలపై ఐఐటీలు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నాయి.

వీటితోపాటు బెంగళూరులోని ఐఐఎస్‌సీ కూడా ఎంబీఏ కోర్సు నిర్వహిస్తోంది.

మేనేజ్‌మెంట్‌ కోర్సుల నిర్వహణకు జాతీయస్థాయిలో ప్రసిద్ధిగాంచిన కార్పొరేట్‌ సంస్థలు మనదేశంలో అనేకం ఉన్నాయి.  వీటిలో ప్రముఖమైనవి...

ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ,
ఇర్మా,
నార్సీమోంజీ,
సింబయోసిస్‌,
ఎఫ్‌.ఎం.ఎస్‌.,
టిస్‌.


ఇవన్నీ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల ఆధారంగా ఎంబీఏ లేదా పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఉన్నత ప్రమాణాలతో కోర్సుల నిర్వహణలో ఈ సంస్థలన్నీ ఐఐఎంలతో పోటీపడుతున్నాయి.

ఎంబీఏ చదవాలనుకునే అభ్యర్థులు కేవలం ఐసెట్‌ మీదనే ఆధారపడటం కంటే ఇలాంటి ప్రఖ్యాత సంస్థల మీద దృష్టిపెట్టడం మంచిది.

ఈ సంస్థలు నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో కొంత సారూప్యం ఉంటుంది. ప్రణాళిక ప్రకారం సిద్ధమైతే వీటిలో విజయం సాధించి మంచి భవిష్యత్తు  అందుకోవచ్చు!

పూర్తి వ్యాసాన్ని చదువు ఆన్ లైన్ ఎడిషన్లో  ఇక్కడ చదవండి.  ఈ వ్యాస రచయిత  రామకృష్ణ.  

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగ ప్రకటన

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంపై ఆసక్తి ఉన్నవారికో  మంచి వార్త!
 
సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్- ఎక్స్, గ్రూప్-వై విభాగాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులను భర్తీ చేయబోతున్నారు.

దీనికోసం కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్  (10+ 2 )  ఎగ్జామినేషన్ ప్రకటన ను  స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)   విడుదల చేసింది.


ఇంటర్ పాసైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయ: పరిమితి  18- 27 సంవత్సరాలు.

ఎలా ఎంపిక చేస్తారు?

రాత పరీక్ష ఉంటుంది.

దీంతోపాటు  నిర్వహించే  పరీక్షలు -

డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు అభ్యర్థులకు... స్కిల్ టెస్టు

లోయర్  డివిజన్ క్లర్క్ పోస్టు అభ్యర్థులకు... టైపింగ్ టెస్టు.   

దరఖాస్తు చివరితేదీ : సెప్టెంబరు 16.

పరీక్ష : డిసెంబరు 4.


ఆగస్టు 23 ఈనాడు ప్రతిభలో ఈ ప్రకటన వివరాలు  చూడొచ్చు.

దరఖాస్తు ప్రక్రియ,  పరీక్ష విధానం వివరాల కోసం  SSC  వెబ్ సైట్ ఇక్కడ  చూడండి.   వెబ్ సైట్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ( అయితే SSC వెబ్ సైట్ ఇంగ్లిష్ సెక్షన్ అంత త్వరగా ఓపెన్ కావటం లేదు.... ఓపిగ్గా ప్రయత్నించాలి..! )

Tuesday, 23 August 2011

గ్రూప్‌-1 నగారా మోగింది!


 ఇంకో  నెలరోజుల్లోనే  గ్రూప్‌-1 మెయిన్స్‌ రాతపరీక్ష ! 

సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 3 వరకూ పరీక్ష  నిర్వహించబోతున్నట్లు ఏపీపీఎస్‌సీ ప్రకటించింది.

ఇప్పుడున్న వ్యవధిలో  ప్రిపరేషన్‌ను పతాకస్థాయికి తీసుకువెళ్ళాలి. ఇదే అభ్యర్థుల కర్తవ్యం.

ఆశావహ దృక్పథంతో, విజయోత్సాహంతో పరీక్షను ఉత్తమంగా రాయటానికి సర్వం సన్నద్ధం చేసుకోవాలి!

ఒక్కో పేపర్ కు ఒక్కో స్వభావం. దాన్ని గుర్తించి  అనుగుణంగా సిద్ధమైతేనే గెలుపు సాధ్యమవుతుంది.

ఈ పట్టిక చూడండి-





 ఇలాంటి  ఉపయోగపడే చాలా  సూచనలతో  ఓ  కథనం చదువు  పేజీలో ప్రచురితమైంది. రచయిత కొడాలి భవానీ శంకర్.‌

 ఈనాడు చదువు నెట్ ఎడిషన్లో  చదవటానికి ఇక్కడ  క్లిక్ చేయండి! 


బ్యాంకుల్లో ఉద్యోగాలు!


బ్యాంకు ఉద్యోగం సాధించాలనుకునేవారికి ఓ శుభవార్త!

బ్యాంకు క్లర్కు కొలువుల  నియామకాల కోసం  కొత్త గా IBPS ఏర్పడింది కదా?  ఈ సంస్థ  ఏటా రెండుసార్లు కామన్ రిటన్ ఎగ్జామినేషన్ (CWE)  నిర్వహిస్తుంది.

 తాజాగా   19 బ్యాంకుల్లో క్లరికల్ పోస్టుల భర్తీ  కోసంప్రకటన విడుదల చేసింది. 

చూడండి... ఆ ప్రకటన!  ఇవాళ ఈనాడు ఉద్యోగ అవకాశాలు పేజీలో వచ్చిందీ ప్రకటన.



పదో తరగతి  చదివినవారు కూడా దరఖాస్తు చేసి, రాతపరీక్ష రాయవచ్చు.  కాకపోతే వారికి టెన్త్ లో  60 శాతం మార్కులుండాలి. కనీసం 18 సంవత్సరాల వయసు తప్పనిసరి.  గరిష్ఠ వయ: పరిమితి - 28 సంవత్సరాలు (ఇది జనరల్ క్యాటగిరీకి వర్తిస్తుంది) . 

టెన్త్ లో  60 శాతం రాకపోయివుంటే ఇంటర్మీడియట్ చదివి, దానిలో 50 శాతం మార్కులొచ్చినా సరిపోతుంది.

ఇంటర్లో 50 శాతం మార్కులు కూడా రానివారు ఉంటారు కదా?  అలాంటి వారు  డిగ్రీ  పాసైవుంటే  చాలు;  దరఖాస్తు చేసుకోవచ్చు.

వెబ్ సైట్  ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు పంపటానికి చివరి తేదీ: సెప్టెంబరు 24.

రాత పరీక్ష  నవంబరు 27న! 

Monday, 22 August 2011

డిగ్రీ చదవటానికి స్కాలర్ షిప్పులు


 భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో ‘ఫౌండేషన్‌ ఫర్‌ అకడమిక్‌ ఎక్స్‌లెన్స్‌ అండ్‌ యాక్సెస్‌ (ఎఫ్‌ఏఈఏ)’ సంస్థ ఉంది. ఇది వివిధ  ఉపకార వేతనాలను (స్కాలర్‌షిప్‌లు) అందిస్తోంది.

 ప్రస్తుతం  షెడ్యూల్డ్‌ కులాల, షెడ్యూల్డ్‌ తెగల  అభ్యర్థులు వివిధ డిగ్రీ కోర్సులు చదవడానికి ఈ సంస్థ  ఆర్థిక సహాయం చేస్తోంది.

ఆర్ట్స్‌, కామర్స్‌, సైన్స్‌, మెడికల్‌, ఇంజినీరింగ్‌, ఇతర సాంకేతిక  సబ్జెక్టుల్లో అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కు  ఈ స్కాలర్‌షిప్‌లు వర్తిస్తాయి.

మొత్తం  స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 230.

ఇంటర్మీడియట్‌ / 10+2 ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.  గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కాలేజీలో డిగ్రీ మొదటి ఏడాది కోర్సు చదువుతున్న అభ్యర్థులూ అర్హులే.

స్కాలర్‌షిప్‌ వ్యవధి గరిష్ఠంగా ఐదేళ్లు.  దీనిలో భాగంగా ట్యూషన్‌ ఫీజులు, హాస్టల్‌, పుస్తకాలు, ఇతర ఖర్చులను ఎఫ్‌ఏఈఏ భరిస్తుంది.

ఎఫ్‌ఏఈఏ కొన్ని విద్యాసంస్థలను సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా గుర్తించింది. వాటిలో చదివే విద్యార్థులకు అయ్యే అన్ని ఖర్చులనూ భరిస్తుంది.  ఫుల్‌టైమ్‌ కోర్సులకు మాత్రమే స్కాలర్‌షిప్‌ వర్తిస్తుంది.

* దరఖాస్తుల పరిశీలన తర్వాత ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలను అన్ని ప్రధాన నగరాల్లో నిర్వహిస్తారు.

* ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు.

పూర్తిచేసిన దరఖాస్తులను, ఫొటోతో సహా 'Foundation for Academic Excellence and Access (FAEA), C-25, Qutab Institutional Area, New Mehrauli Road, New Delhi- 110016'  చిరునామాకు పంపాలి.

* దరఖాస్తులు పంపటానికి  చివరి తేదీ: 27 ఆగస్టు 2011.

టాప్ ర్యాంకర్లు ఏ కాలేజీల్లో చేరుతున్నారు?



తొలి విడత ఎంసెట్ - ఎంపీసీ కౌన్సెలింగ్ ముగిసింది.

ఎంసెట్ లో అగ్రశ్రేణి ర్యాంకులు సాధించిన విద్యార్థుల ఎంపిక ఎలా ఉంటుంది?  ఏ ఇంజినీరింగ్ కళాశాలలో,  ఏ బ్రాంచిలో  చేరబోతున్నారు?

ఈ విషయాలు తెలుసుకోవటం  ఆసక్తి కరం కదూ?

ఓపెన్ క్యాటగిరి  విద్యార్థులు ఏ కళాశాలల్లో, ఏ బ్రాంచిలను ఎంచుకున్నారో ఇక్కడ పట్టికలో చూడొచ్చు.

వారు ఎంచుకున్న కళాశాలల్లో ప్రారంభ , ముగింపు ర్యాంకులు ఎలా ఉన్నాయో కూడా  దీనిలో పరిశీలించవచ్చు.


విదేశీ విద్యకు విధివిధానాలు


    బీటెక్ అవకుండానే  ‘ఫారిన్’కు వెళ్ళటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు మన విద్యార్థులు.

    విదేశీ పట్టా అత్యుత్తమ భవితను అందిస్తుందని నమ్మేవారి సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది.

* కెనడా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా దేశాలు 'స్థిరపడే' అవకాశాలను అందిస్తున్నాయి.

* యు.కె., ఐర్లాండ్‌ వేగవంతమైన కోర్సులనూ, సంపాదించే అవకాశాలనూ ఇస్తున్నాయి.

* పరిశోధనకూ, ఉత్తమ శ్రేణి విద్యా నైపుణ్యానికీ యు.ఎస్‌.ఎ. వీలు కల్పిస్తోంది.

* జర్మనీ, స్వీడన్‌ లాంటి దేశాల్లో తక్కువ ఫీజుకే చదువుకునే సౌకర్యం ఉంది.

విద్యార్థులను ఆకర్షించటంలో వీటన్నిటిలో యు.ఎస్‌.ఎ. మిగిలిన దేశాలకంటే ముందంజలో ఉంది.


    విదేశంలో చదవాలనుకునే విద్యార్థులు నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

*  సరైన దేశం, విద్యాసంస్థ
*  విద్యాపరమైన అర్హతలు
*  ఆర్థిక సామర్థ్యం
*  కెరియర్‌ అవకాశాలు.

వీటి గురించీ,  ప్రవేశాలకు డెడ్ లైన్లు,  pre requisite tests కు ఎంత  స్కోర్లుండాలి...

ఇవన్నీ వివరంగా  ఇవాళ చదువులో ప్రచురించిన   ప్రధాన కథనం లో తెలుసుకోవచ్చు.
  
ఈ వ్యాస రచయిత  శుభకర్‌ ఆలపాటి.

Sunday, 21 August 2011

గ్రూప్స్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది!

న రాష్ట్రంలోని  ఉద్యోగార్థులు ప్రధానంగా భావించే రెండు పరీక్షల షెడ్యూల్ ని  ప్రకటించారు. 
 

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 3 వరకూ నిర్వహించబోతున్నారు.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్ సీ) కార్యదర్శి పూనం మాలకొండయ్య శనివారం ఈ విషయం తెలిపారు.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పరీక్షలు  జరుగుతాయి.
 



ఈ వార్త ఇవాళ ఈనాడులో  వచ్చింది.




 గ్రూప్-2 పరీక్షలను  అక్టోబరు 15, 16 తేదీల్లో నిర్వహిస్తారు.

 

ఏపీపీఎస్ సీ అధికారిక  ప్రకటన కూడా  వెలువడింది. చూడండి.  














విద్యార్థులకు ఉపయోగపడే  మరో రెండు ముఖ్యమైన వార్తలు...






Friday, 19 August 2011

ప్రకటించిన తేదీల్లోనే గ్రూప్స్ పరీక్షలు!

గ్రూప్ -2 పరీక్ష వాయిదా పడొచ్చనే  వదంతుల మధ్య ‘అలాంటిదేమీ లేద’ని  ఏపీపీఎస్సీ  స్పష్టీకరించింది.

ఇవాళ ఈనాడు లో వచ్చిన వార్తను చూశారా?




గ్రూప్‌-2 వాయిదా లేదు: ఏపీపీఎస్సీ

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారమే గ్రూపు-2 పరీక్షలు జరుగుతాయని ఎపీపీఎస్సీ వర్గాలు పేర్కొన్నాయి.  

కమిషన్‌ సమావేశం గురువారం జరిగింది.

గ్రూపు-1 ప్రధాన పరీక్షలు సెప్టెంబరు 25 నుంచి 30 వరకు జరగనున్నాయి. 

అక్టోబరు 15, 16 తేదీల్లో గ్రూపు-2 పరీక్షలు జరుగుతాయని ఏపీపీఎస్సీ ప్రకటించింది.


కాబట్టి  ‘వాయిదా’ పడుతుందనే ఆలోచనను వదిలేసి గ్రూప్స్  పరీక్షలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావటం అభ్యర్థుల కర్తవ్యం!

Thursday, 18 August 2011

8 వ తరగతి నుంచి పీహెచ్ డీ వరకూ ఆర్థిక సహాయం!


'నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఎగ్జామినేషన్‌' (ఎన్‌టీఎస్‌ఈ) !  

ఇది జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశపరీక్ష.  దీని ద్వారా ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులను ఎంపిక చేసి, వారికి  ఉపకార వేతనాలు (స్కాలర్ షిప్పులు)  అందిస్తారు. 


ఎన్‌సీఈఆర్‌టీ (నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌) వీటిని అందిస్తుంది. 


 ఎన్‌టీఎస్‌ఈ స్కాలర్‌షిప్‌లకు ఎంపికైన అభ్యర్థులకు ఎనిమిదో తరగతి నుంచి పీహెచ్‌డీ పూర్తి చేసేవరకూ ప్రత్యేక సబ్జెక్టుల్లో ఆర్థిక సహాయం లభిస్తుంది.  


సైన్సెస్‌, సోషల్‌ సైన్సెస్‌, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, మేనేజ్‌మెంట్‌, లా కోర్సులు చదివే అందరికీ ఈ స్కీమ్‌ వర్తిస్తుంది.


ఎన్‌టీఎస్‌ఈ-  2012  ప్రకటన  వెలువడింది! 

8వ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు ఎంపిక పరీక్ష రాయడానికి అర్హులు.


* ఆంధ్రప్రదేశ్‌లో చదువుతున్న విద్యార్థులు 'డిప్యూటీ కమిషనర్‌, డైరెక్టర్‌ ఫర్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్స్‌ కార్యాలయం, చాపెల్‌ రోడ్‌, ఆబిడ్స్‌, హైదరాబాద్‌' నుంచి దరఖాస్తులు పొందవచ్చు.


ఎన్‌సీఈఆర్‌టీ వెబ్‌సైట్‌  చూడండి.


* పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 ఆగస్టు 2011.


‘చదువు’ లో ప్రచురించిన ఈ  కథనం లో పూర్తి వివరాలు చదవొచ్చు. 
 

Wednesday, 17 August 2011

‘చందమామను తీసుకొచ్చేస్తా’నంటే?

ది ‘చందమామ’ పత్రిక గురించి కాదు!
ఇంగ్లిష్ లో ఇదో వ్యక్తీకరణ. 

నిలబెట్టుకోగలమా లేమా అనే ఆలోచన లేకుండా అసాధ్యమైనవి చేస్తానంటూ కొందరు వాగ్దానాలు చేస్తుంటారు.

ఇదే Promise the moon.  Make promises without the ability to fulfil them.


ఈ వ్యక్తీకరణను ఉపయోగించిన మూడు సంభాషణలు చూడండి-

Achyuth: Mukund says that he can get us both jobs in any good company.
(ఏ కంపెనీలోనైనా మనిద్దరికీ మంచి ఉద్యోగాలిప్పించగలనని ముకుంద్‌ అన్నాడు.)

Saradhi: Well, that's promising the moon. I doubt very much his ability to do it.
(అది అసాధ్యమైన విషయం గురించి మాటివ్వటమే. అలా చేయగల శక్తి అతనికుందా అని నాకు అనుమానం.)

* * *

Nandini: The minister has promised to see that by the year end, every house has a gas connection.            (ఈ సంవత్సరాంతానికి ప్రతి ఇంటికీ gas connection ఉండేలా చూస్తానని మాటిచ్చారు మంత్రిగారు.)

Gayathri: That's promising the moon; typical of a politician.
(అది చందమామను తెచ్చివ్వగలననటమే. రాజకీయ వాదులందరూ చేసే పనిదే.)

 * * *

Sukumar: When Prasad told me that all this was going to be there I thought that he was promising the moon. I'm happy, however, that I had been proved wrong.
(ప్రసాద్‌ ఇవన్నీ ఉంటాయని నీతో అన్నప్పుడు అసాధ్యమైన వాటిని మనకందిస్తున్నాడేమోనని అన్పించింది. నేను తప్పని రుజువయినందుకు సంతోషిస్తున్నా.)

Subodh: I thought so too. I had doubted his ability to pull it off. I had thought that he was simply going into orbit without realising the effort and the expense involved in it.
(నేనూ అలానే అనుకున్నాను. ఇవన్నీ చేయగల్గేందుకతని శక్తిని శంకించాను నేను. ఇంత పెద్ద పార్టీకి కావలసిన ప్రయత్నమూ, ఖర్చూ తెలుసుకోకుండా ఏదో ఉత్సాహపడ్తున్నాడనుకున్నాను.)

* * *

ఇంగ్లిష్‌లో కొత్తగా వాడుకలోకి వచ్చే expressions తెలిసే Modern English Usage (రచయిత: ఎం. సురేశన్‌) లో  ఈ వారం Promise the moon తో పాటు  Went to town, strung out ... మొదలైనవాటి గురించి తెలుసుకోవచ్చు!

పూర్తి వివరాల కోసం ‘చదువు’లో ప్రచురితమైన ఈ వ్యాసం  చదవండి-

Tuesday, 16 August 2011

విద్యార్థులకు పనికొచ్చే పుస్తకం!


ద్యోగాల కోసం పోటీపడే  వేల, లక్షల మందిలో కొందరే విజేతలవుతారు.  వారికీ ,  మిగిలినవారికీ ఏమిటి తేడా? వారిని ఇతరుల్నుంచి  విభిన్నంగా మార్చేసే  లక్షణాలు  ఏమిటి?

వారిలో మాత్రమే ఉన్న నైపుణ్యాలు ఏమిటి?

అవే సాఫ్ట్ స్కిల్స్ !  

చిరునవ్వు, నిజాయతీ, భావ ప్రసారం (కమ్యూనికేషన్‌), సహనం, అణకువ, సమయపాలన, వినయం, కఠోరశ్రమ, నిర్ణయ కౌశలం, నిష్కాపట్యం, వివరాల పట్ల సావధానత, చొరవ, హాస్య చతురత.... ఇవన్నీ ఆ నైపుణ్యాల్లో భాగమే!

విద్యార్థులకైనా, వృత్తినిపుణులకైనా ఇవెంతో అవసరం.

ఇవి  ఏ విద్యాసంస్థల్లోనూ నేర్పనివి!  వ్యక్తిత్వాన్ని వికసింపజేసేవి;  అందరి ప్రశంసలకూ అర్హులుగా  చేసేవి!

జీవితంలో ఏ దశలోనైనా, ఎక్కడైనా  గెలుపును సులువుగా అందించే  నైపుణ్యాలివి!

వీటిని సరళంగా, క్లుప్తంగా వివరిస్తూ ఓ పుస్తకం ఇంగ్లిష్ భాషలో వెలువడింది.  రచయిత డా. రఘు కొర్రపాటి.  యు.ఎస్‌.ఎ. లోని సౌత్‌ కరొలినా ఉన్నత విద్యాకమిషనర్‌ గా వ్యవహరిస్తున్నారు.

'ఈ పుస్తకం ఫైనలియర్‌ డిగ్రీ చదువుతూ ఉద్యోగ మార్కెట్లో ప్రవేశించబోయే విద్యార్థుల కోసం' అన్నారు రచయిత.

కంప్యూటర్‌ సైన్స్‌లో, మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీలున్న ఆయన పాతికేళ్ళుగా ప్రపంచంలోని వృత్తినిపుణులనూ, విద్యార్థులనూ కలిసి గడించిన అనుభవ సారమిది.


దీనిలో ప్రస్తావించిన ఆణిముత్యాలు 108. ఈ సంఖ్య విశిష్టత ఏమిటో  ముందుమాటలో  తెలుసుకోండి! ఈ108 Pearls of wisdom ప్రముఖ పుస్తకాల దుకాణాల్లో లభ్యమవుతోంది. Diamond Books  వారు ప్రచురించారు. 

వెల రూ. 250.

భారత యువతలో ఉద్యోగార్హత నైపుణ్యాల కోసం ప్రధానమంత్రి చొరవతో రూపుదిద్దుకున్న 'నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోఆర్డినేషన్‌ బోర్డ్‌'కు అనుగుణంగా ఉన్నాయి ఈ పుస్తకంలోని  అంశాలు.  జేఎన్‌టీయూ (కాకినాడ) ఈ పుస్తకాన్ని తన విద్యార్థుల కోసం స్వీకరించింది.

వచ్చే నెలలో తెలుగు అనువాదం  అందుబాటులోకి వస్తుంది. హిందీ, తమిళం భాషల్లో కూడా  వెలువడబోతోంది.

గెలుపును తెలిపే నైపుణ్యాలు   శీర్షికతో  ‘చదువు’  ప్రచురించిన  కథనంలో ఈ పుస్తకం గురించి  పూర్తి వివరాలు చూడొచ్చు.

Monday, 15 August 2011

రైల్వే ఉద్యోగం కావాలా?

మీరు ఐటీఐ లేదా పాలిటెక్నిక్ చేసివుంటే ... మీకో శుభవార్త !
మీరిప్పుడు  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించొచ్చు.

రైల్వేలో 16వేలకు పైగా ‘అసిస్టెంట్ లోకో పైలట్స్’ ఉద్యోగాలకు ఈ మధ్యనే ప్రకటన వెలువడింది.   

రాతపరీక్షను దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని జోన్లలో నిర్వహిస్తారు. పేపర్‌ను తెలుగులో కూడా ఇస్తారు. మన  జోన్‌ నుంచి ఎక్కువ సంఖ్యలో ఖాళీలుండటం చెప్పుకోదగ్గ విషయం.

ఈ పరీక్షలో టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ సబ్జెక్టులతో పాటు జనరల్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్‌ కూడా ఉంటాయి.

విజయం సాధించాలంటే అత్యంత ప్రాధాన్య అంశం నాన్‌-టెక్నికల్‌ సబ్జెక్టులే. వీటి నుంచి దాదాపుగా 100 ప్రశ్నలు రావొచ్చు.

అవి- ప్రధానంగా అరిథ్‌మెటిక్‌, రీజనింగ్‌, జనరల్‌ ఇంగ్లిషు, జనరల్‌ అవేర్‌నెస్‌. ఈ అంశాలు ప్రతి ఒక్కరికీ కొత్త కాబట్టి వీటిపై ఎవరయితే పట్టు సాధిస్తారో వారికే ఉద్యోగం!

రాత పరీక్షకు సంపూర్ణంగా సన్నద్ధమయ్యే విధానం తెలుసుకోవాలంటే ఇవాళ ‘చదువు’ పేజీలో ప్రచురించిన కథనం కొలువుకు 'రైల్వే' స్వాగతం!  చదవండి.

దీని రాసినవారు ఎస్‌.వి. నారాయణ, బి. విష్ణువర్థన్ రెడ్డి.

ఉద్యోగ ప్రకటన  వివరాలకు  వెబ్ సైట్ చూడండి.

క్యాట్ లో మార్పులూ... వాటి మర్మం!

ఐటీల్లో ఇంజినీరింగ్ లో  చేరటానికి జేఈఈ రాయాలి. ఐఐఎంలలో  ఎంబీఏ చేయాలంటే రాయాల్సింది -  కామన్ అడ్మిషన్ టెస్ట్ CAT.

అత్యుత్తమమైన ప్రైవేటు బిజినెస్ స్కూళ్ళలో మేనేజ్ మెంట్ కోర్సులు చేయాలన్నా CAT రాయాల్సిందే !

 ప్రతి సంవత్సరం జాతీయస్థాయిలో రెండు లక్షలమంది అభ్యర్థులు పోటీ పడే  పరీక్ష ఇది.





క్యాట్ : ముఖ్యమైన తేదీలు
* దరఖాస్తుల అమ్మకం ప్రారంభం- 17 ఆగస్టు 2011
* దరఖాస్తులు తీసుకోవడానికి చివరితేదీ - 26 సెప్టెంబరు 2011
* ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: 28 సెప్టెంబరు 2011
* ఆన్‌లైన్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌)- 22 అక్టోబరు 2011 నుంచి 18 నవంబరు 2011 వరకు.
* క్యాట్‌ ఫలితాల ప్రకటన: 11 జనవరి 2012.

పరీక్ష విధానంలో ఈ ఏడాది  ప్రధాన  మార్పులు జరిగాయి.

అవేమిటి?

వీటి వల్ల విద్యార్థులకు ప్రయోజనం ఉందా?

పరీక్షకు సన్నద్ధమెలా కావాలి?

సమగ్ర సమాచారం కోసం ఇవాళ  ‘చదువు’ తాజా సంచికలో ప్రచురితమైన  ఈ కథనం చదవండి...

దీన్ని రాసినవారు -  ఐఐఎం (ఇండోర్) పూర్వ విద్యార్థి,  బోధనా నిపుణులు  రామకృష్ణ .     


Friday, 12 August 2011

ముంబయి విద్యాసంస్థలో ఎంబీఏ!

  
నదేశంలోని ప్రైవేటు బిజినెస్‌ స్కూళ్లలో అగ్రశ్రేణి లో ఉన్న సంస్థ -  ముంబయిలోని నార్జీమోంజీ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ (ఎన్‌ఎంఐఎంఎస్‌). కార్పొరేట్‌ రంగానికి అవసరమైన కోర్సులను నిర్వహించడంలో  దీనికి మంచి పేరు.   ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌, కేపిటల్‌ మార్కెట్‌ లాంటి ఆధునిక స్పెషలైజేషన్‌లతో ఎంబీఏ కోర్సులున్నాయి.

   హైదరాబాద్‌, బెంగళూరులలో కూడా క్యాంపసులున్నాయి.
 
   ఈ సంస్థలో  చేరాలంటే  'నార్సీ మోంజీ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (NMAT 2012)  రాయాలి.  దీని నోటిఫికేషన్‌ వెలువడింది.

   ఇక్కడ  అందుబాటులో ఉన్న మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లు, వాటిలోని సీట్లు:

* ఎంబీఏ - కోర్‌: 300 సీట్లు
* ఎంబీఏ యాక్చూరియల్‌ సైన్స్‌: 30
* ఎంబీఏ బ్యాంకింగ్‌ మేనేజ్‌మెంట్‌: 60
* ఎంబీఏ క్యాపిటల్‌ మార్కెట్‌: 60
* ఎంబీఏ హెచ్‌ఆర్‌: 30
* ఎంబీఏ ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌: 60
* పీజీడీఎం - బెంగళూరు, హైదరాబాద్‌ క్యాంపస్‌లలో: ఒక్కోదానిలో 60 సీట్లు

 మూడుసార్లు రాయవచ్చు...
ఎన్‌మ్యాట్‌ ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్ష. ఇది 31 అక్టోబరు 2011 నుంచి ప్రారంభమవుతుంది. ఎన్‌మ్యాట్‌ ప్రత్యేకత ఏమిటంటే అభ్యర్థులు మూడుసార్లు రాయవచ్చు. వీటిలో మంచి స్కోరు సాధించిన పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటారు. ఎన్‌మ్యాట్‌ పూర్తిగా ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలో ఉంటుంది.

పరీక్షలో మొత్తం మూడు విభాగాలుంటాయి. 
1. లాంగ్వేజ్‌ స్కిల్స్
2. క్వాంటిటేటివ్‌ స్కిల్స్
3. లాజికల్‌ రీజనింగ్‌

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అందరినీ ఎన్‌మ్యాట్‌ 2011కి పిలుస్తారు. ఎన్‌మ్యాట్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రాత పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ, ప్రెజెంటేషన్‌ దశలు ఉంటాయి. వీటన్నిటితోపాటు అకడమిక్‌ రికార్డు, పని చేసిన అనుభవం, తదితర అంశాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
 
ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉన్న అభ్యర్థులు ఎన్‌మ్యాట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు అవసరం.  ఎన్‌మ్యాట్‌ వెబ్‌సైట్‌  ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఫీజు కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి.

* ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: 10 అక్టోబరు 2011
* ఆన్‌లైన్‌ పరీక్ష: 8 ఆగస్టు 2011 నుంచి 25 అక్టోబరు 2011 వరకు
* రెండోసారి, మూడోసారి రాయడానికి: 31 అక్టోబరు 2011 నుంచి 4 జనవరి 2012 వరకు.

పూర్తి వివరాలకు చదువు ఆన్ లైన్ ఎడిషన్ లోని  నార్సీమోంజీలో ఎంబీఏకి ఎన్‌మ్యాట్‌  చదవండి!

Wednesday, 10 August 2011

స్వచ్ఛంద సంస్థల నిర్వహణలో డిగ్రీ!


సామాజిక శాస్త్రాల అధ్యయనమంటే  వెంటనే  గుర్తొచ్చే పేరు టాటా ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిస్‌).

సోషల్‌ వర్క్‌, ఎడ్యుకేషన్‌, ఇతర సోషల్‌ సైన్సెస్‌ సంబంధిత కోర్సుల నిర్వహణలో 'టిస్‌'కు మంచి పేరుంది.  ముంబయిలో ఉన్న  డీమ్డ్‌ యూనివర్సిటీ ఇది. 

స్వచ్చంద సంస్థల నిర్వహణ,  సోషల్‌ వర్క్‌ సంబంధిత విభాగాల్లో డ్యుయల్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి టిస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

* డ్యుయల్‌ డిగ్రీ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ వాలంటరీ ఆర్గనైజేషన్స్‌:

ఏడాది వ్యవధి గల ఫుల్‌ టైమ్‌ కోర్సు. స్వచ్చంద సంస్థల నిర్వహణకు అవసరమైన అన్ని మెలకువలను ఈ కోర్సులో అందిస్తారు. 

సోషల్‌ వర్క్‌లో పీజీ డిగ్రీ లేదా ఏదైనా పీజీతోపాటు కనీసం మూడేళ్లు సామాజిక అభివృద్ధి రంగంలో పనిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.  కోర్సు ఫీజు సెమిస్టర్‌కు రూ.24600.

దరఖాస్తులు సంస్థ వెబ్‌సైట్‌లో లభిస్తాయి. పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ 16 ఆగస్టు 2011.



* డ్యుయల్‌ డిగ్రీ ఇన్‌ సోషల్‌ వర్క్‌ అండ్‌ మెంటల్‌ హెల్త్‌:

బెల్జియం సంస్థల సహకారంతో టిస్‌ ఈ కోర్సును నిర్వహిస్తోంది.  ఇది కూడా ఏడాది ఫుల్‌ టైమ్‌ కోర్సు.  సామాజిక రంగానికి అవసరమైన మెంటల్‌ హెల్త్‌ ప్రొఫెషనల్స్‌ను తయారుచేయడం ఈ కోర్సు లక్ష్యం. 

టిస్‌ లేదా ఇతర సంస్థల నుంచి ఎం.ఎ. సోషల్‌ వర్క్‌ (మెడికల్‌ సైకియాట్రిక్‌ సోషల్‌ వర్క్‌ స్పెషలైజేషన్‌తో) చేసిన అభ్యర్థులు అర్హులు.  కోర్సు ఫీజు సెమిస్టర్‌కు రూ.24600.

దరఖాస్తులు టిస్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.  పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ 30 ఆగస్టు 2011.

*  ఇంటర్వ్యూలు రెండు కోర్సులకూ 16-17 సెప్టెంబరు 2011న జరుగుతాయి. 

పూర్తి వివరాలు చదువు ఆన్ లైన్ ఎడిషన్ లో చూడండి.

Tuesday, 9 August 2011

మీ ఇంగ్లిష్ సహజంగా ఉందా?

 ఇంగ్లిష్ భాషలో  రెండు గానీ, అంతకంటే ఎక్కువ కానీ  words  కలిసే వస్తుంటాయి.  అదే అర్థమున్న వేరే పదాలు ఆ place లో వాడకూడదు.

అలా చేస్తే   అసహజమైపోతుంది! 


Fast food అని వాడటం మనకు తెలుసు. కానీ దీన్ని అదే అర్థంలో  Quick food అనొచ్చా?   అలా వాడకూడదు. 

అలాగే  A quick meal ను A fast meal  అని ఉపయోగించకూడదు. 
 
Commit suicide  అనే word combination మనకు తెలిసిందే.  దీన్ని Undertake suicide  అని మార్చివేసి  వ్యవహరించకూడదు.

ఎలా సహజమో అలా  ప్రయోగించే  ఈ  word combinations ను Collocations అంటాం.

చదువు పేజీలో Collocations గురించి వారం విడిచి వారం ప్రచురితమవుతోంది. తాజా సంచికలో  12వ భాగం వచ్చింది.

Stinking rich, Closely related, Distant cousin/ close cousin, Sumptuous dinner, Throw lavish dinner  ...  ఇలాంటి collocations  గురించి ఉదాహరణలతో పాటు తెలుసుకోవాలంటే ఈ  వ్యాసం చదవండి.

Collocations  శీర్షికలో  ప్రతి వ్యాసమూ  ఒక సంభాషణతో  మొదలవుతుంది. ఆ  సంభాషణలో కొన్ని collocations   కలిసివుంటాయి.  వాటినెలా వాడాలో నమూనాగా  ఆ conversation ఉంటుంది.  

ఆ collocations అర్థం,  వాటి ప్రయోగించే తీరు గురించి ఉదాహరణపూర్వక  వివరణ తర్వాత ఉంటుంది.  ఇవన్నీ చదివితే  ఆ ప్రయోగాల గురించి స్పష్టత ఏర్పడుతుంది. ఈ శీర్షిక రచయిత  ఎం. సురేశన్.

ఇలాంటి collocations ను రోజువారీ  సంభాషణల్లో స్నేహితులతో  practice చేద్దాం. అప్పుడు మనం ఉపయోగించే ఆంగ్ల భాష natural గా ధ్వనిస్తుంది!  

Monday, 8 August 2011

‘ఇగ్నో’ లో వినూత్న ఇంజినీరింగ్ కోర్సులు!

దో ఒక  కారణంతో గతంలో ఇంజినీరింగ్‌ చేయలేకపోయినవారు చాలామంది!

వీరు  తమ లక్ష్యం నెరవేర్చుకునే మార్గం లేదా?

‘చక్కగా ఉంది’ అంటోంది-  ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) !

  Vertically Integrated Engineering Programme - VIEP 

 పేరుతో ఇంజినీరింగ్‌లో ఫుల్‌టైమ్‌ డిప్లొమా, డిగ్రీ కోర్సులను ఇగ్నో ప్రారంభించింది.  రెగ్యులర్‌ పద్ధతిలో, అభ్యర్థులకు అనుకూలమైన సమయాల్లో ఇగ్నో ఆధ్వర్యంలోని స్కూల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ వీటిని నిర్వహించబోతోంది.

పదో తరగతి నుంచే ఈ కోర్సులు అందుబాటులో ఉండటం విశేషం!

ఇప్పటివరకు ఎంపీసీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ చదివిన విద్యార్థులకు మాత్రమే ఇంజినీరింగ్‌ చేసే అవకాశం ఉంది.

లేకపోతే మూడేళ్ల డిప్లొమా చేస్తే లేటరల్‌ ఎంట్రీ పద్ధతిలో ఇంజినీరింగ్‌లో ప్రవేశం పొందవచ్చు. వీరికి 10 శాతం సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

ఈ రెండు పద్ధతులకు భిన్నంగా ఇగ్నో ఇంజినీరింగ్‌ డిగ్రీ, డిప్లొమా కోర్సులను ప్రవేశపెట్టింది. 

పదో తరగతి, ఇంటర్మీడియట్‌, ఐటీఐ, ఒకేషనల్‌, బీఎస్సీ, బీసీఏ, బీసీఎస్‌ అర్హతలున్న విద్యార్థులకు ఇంజినీరింగ్‌ కోర్సులను నిర్వహిస్తోంది.
.
*  డిప్లొమా, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి వయసు పరిమితి లేదు.

*  పదో తరగతి తర్వాత ఆరేళ్లలో ఇంజినీరింగ్‌ డిగ్రీ సాధించవచ్చు. సాంప్రదాయిక  పద్ధతిలో చదివినా ఇంతే కాలం పడుతుంది.

ఇవాళ్టి  ఈనాడు చదువు లో ప్రచురించిన ఇగ్నో ఇంజినీరింగ్‌... అందరికీ!  చదివి, పూర్తి వివరాలు తెలుసుకోండి!

జర్నలిజంలో మీరూ ప్రవేశించండి!

మీకు సామాజిక అవగాహన ఉంది.  భాషా పరిజ్ఞానం,  సాంకేతిక నైపుణ్యాలపై  ఆసక్తి ఉంది.  అయితే ఇంకేం?  ఉత్సాహం పరవళ్ళు తొక్కే మీలాంటి  విద్యార్థులనెందరినో  జర్నలిజం, మాస్‌మీడియా కోర్సులు ఆకర్షిస్తున్నాయి.

సవాళ్ళను సాహసోపేతంగా ఎదుర్కొనగలిగే యువతీ యువకులకు మీడియా సరైన కెరియర్‌!

తగిన శిక్షణ పొందితే- ఈ రంగంలో ప్రవేశించవచ్చు.  అద్భుతాలు సృష్టించి వృత్తి నిపుణులుగా రాణించగలుగుతారు.

జర్నలిజం కోర్సును అందిస్తున్న కొన్ని ప్రముఖ విద్యాసంస్థలు

* ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం
* ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌
* కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌
* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, న్యూఢిల్లీ
* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జర్నలిజం అండ్‌ న్యూమీడియా, బెంగళూర్‌
* సింబయాసిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, పుణె
* జేవియర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌, ముంబయి
* ముద్రా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌, అహ్మదాబాద్‌

విశ్వవిద్యాలయాల నుంచి జర్నలిజం పట్టాలతో వచ్చే విద్యార్థుల ప్రమాణాలు ఆశాజనకంగా లేనందున మీడియా సంస్థలే స్వయంగా కోర్సులు నిర్వహిస్తున్నాయి. విద్యార్థులను పూర్తిస్థాయి శిక్షణతో మెరికల్లా
తీర్చిదిద్ది, తమ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి!

మరో పక్క ఛానెళ్ళ విస్తృతి, పత్రికా సంస్థల విస్తరణ మూలంగా సుశిక్షిత జర్నలిస్టులు పెద్దసంఖ్యలో కావాల్సివస్తున్నారు. ఈ పరిణామాల దృష్ట్యా మీడియా సంస్థలు స్వయంగా జర్నలిజం పాఠశాలలనూ, కళాశాలలనూ స్థాపించుకోవాల్సివచ్చింది.

మీడియాలో ప్రవేశించాలనుకునేవారికి ఉపకరించే  సమాచారంతో  ‘చదువు’ పేజీ 3  వరుస  కథనాలను అందించింది.  ఈ కింది ఇచ్చిన  లింకులు క్లిక్ చేసి  ఈనాడు ఆన్ లైన్ ఎడిషన్లో  ఆ కథనాలను  చదువుకోవచ్చు.

మీడియా-1   నేటి యువతకు మేటి కెరియర్‌ 
మీడియా-2   నైపుణ్యాలుంటేనే రాణింపు 
మీడియా-3   పత్రికల సారథ్యంలో సమగ్ర కోర్సులు  

ఈ కథనాలపై  మీ అభిప్రాయాలను   పంచుకోండి! 

ఆతిథ్య రంగం ఆహ్వానిస్తోంది!


క్కని ఉపాధి అవకాశాలకు హామీ ఇస్తున్న రంగం  హాస్పిటాలిటీ (ఆతిథ్యం) . 

హోటల్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన కెరియర్‌గా మాత్రమే హాస్పిటాలిటీ ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. కానీ ఎన్నో ఇతర సేవారంగాలు కూడా  హాస్పిటాలిటీ అభ్యర్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి.

టెన్త్ / ఇంటర్మీడియట్ / డిగ్రీ చదివినవారు చదవటానికి  మంచి మంచి కోర్సులు ఉన్నాయి.  ఈ రంగంలో బాగా రాణించాలంటే  కొన్ని లక్షణాలను  పెంపొందించుకోవాల్సివుంటుంది.
 
ఈ విశేషాలను పూర్తిగా తెలుసుకోవటానికి  ఆకర్షణీయం... ఆతిథ్యం   కథనం చదవండి !

బ్యాంకు లో పాగా వేద్దామా?


కప్పుడు బ్యాంకులో ఉద్యోగం సంపాదించాలంటే  BSRB పరీక్ష రాయాల్సివచ్చేది.

ఇప్పుడు అదే తరహాలో IBPS రాత పరీక్షను నిర్వహిస్తోంది. ఈ పరీక్షలో స్కోరు 19 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) గా నియామకం పొందటానికి   ఉపయోగపడుతుంది.

ఈ కామన్ రిటన్  ఎగ్జామ్ ను కొత్తగా  ప్రవేశపెట్టారు.  మొట్టమొదటిసారి  నిర్వహించబోతున్నారు. 40 రోజుల సమయం ఉందీ పరీక్షకు!


బ్యాంకు పరీక్షల ప్రిపరేషన్లో అభ్యర్థులు తరచూ కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. విజేలకూ, వారికీ తేడా అక్కడే వస్తుంది. పొరపాట్లను  సవరించుకోగలిగితే  పరీక్షలో  విజయం సాధించటం కష్టమేమీ కాదు.


పరీక్షలోని ఐదు విభాగాల్లోనూ విడివిడిగా ఉత్తీర్ణులవ్వటం తప్పనిసరే. కాబట్టి అన్ని విభాగాల్లోనూ కనీస సంఖ్యలో ప్రశ్నలు సాధించాల్సివుంటుంది.

త్వరగా పూర్తిచేయగలిగే జనరల్‌ అవేర్‌నెస్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ లాంటి విభాగాలకు తక్కువ సమయం కేటాయించాలి. కష్టంగా ఉండే క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌లకు అధిక సమయం వెచ్చించాలి.

150 నిమిషాల వ్యవధి ఉండే ఈ పరీక్షకు కింది విధంగా సమయం కేటాయించుకోవచ్చు.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: 50 ని.
రీజనింగ్‌: 45 ని.
ఇంగ్లిష్‌: 25 ని.
జనరల్‌ అవేర్‌నెస్‌: 15 ని.
కంప్యూటర్‌ నాలెడ్జ్‌: 15 ని.


అయితే విద్యార్థులు ఈ సమయాలను తమ సౌలభ్యాన్ని బట్టి మార్చుకోవచ్చు. 
 
 ఈ పరీక్ష  ప్రిపరేషన్లో  పాటించవలసిన మెలకువల గురించి  చదువులో ఇవాళ ప్రచురించిన  లోపాలు సరిదిద్దుకుంటే బ్యాంకులో కొలువు  లో తెలుసుకోవచ్చు.

(శీర్షిక మీద క్లిక్ చేస్తే  ఈనాడు చదువు ఆన్ లైన్ ఎడిషన్ లో ఉన్న  ఈ కథనాన్ని పూర్తిగా చదువుకోవచ్చు).

బ్యాంకు పరీక్షల కోచింగ్  నిపుణులు  జి.ఎస్. గిరిధర్  అందించిన కథనమిది.

గ్రూప్-2 పరీక్షకు సిద్ధమవుతున్నారా?

న రాష్ట్రంలో రెండో ఉత్తమ సర్వీసు గ్రూప్-2. ప్రభుత్వోద్యోగం సాధించాలనుకునే లక్షలమంది అభ్యర్థులు  ఈ పరీక్ష రాస్తుంటారు.

దీనికి మీరు సిద్ధమవుతుంటే  చదువు పేజీలో ఇవాళ  ప్రచురించిన  కథనం

గ్రూప్‌-2 ...సమర సన్నాహాలు  చదవాల్సిందే.




రాత పరీక్షకు ఇంకా  70 రోజుల వ్యవధి ఉంది. ఈ సమయంలో ఎలా ప్రణాళిక వేసుకోవాలి, సరైన విధానంలో రివిజన్  (పునశ్చరణ)  ఎలా చేసుకోవాలి, ప్రిపరేషన్లో లోటుపాట్లు ఎలా తొలగించుకోవాలి... వీటన్నిటినీ  వివరంగా తెలుసుకోవచ్చు.


శాస్త్రీయంగా పునశ్చరణ చేస్తే మంచి ఫలితం సాధించవచ్చు. వారం, పది రోజులు ఒక్కో సబ్జెక్టుకి కేటాయించి జరిపే పునశ్చరణ సరైంది కాదు. 

ప్రతిరోజూ గ్రూప్‌-2లోని మూడు పేపర్లకూ సమయం కేటాయించుకోవాలి. 
 
సిలబస్‌, క్లిష్టత దృష్ట్యా పునశ్చరణ కోసం సమయ విభజన ఇక్కడ డయాగ్రమ్ లో చూపిన విధంగా విభజించుకోండి. 
 
*  ప్రతి పేపర్లోనూ కీలక/ క్లిష్టమైన పాఠ్యాంశాలు ఏమిటో స్పష్టంగా నిర్వచించుకోవాలి.  పాఠ్యాంశాల్ని ప్రతి 2, 3 రోజులకోసారి తప్పనిసరిగా పునశ్చరణ చేసుకోవాలి. 
 
*  ఎప్పటికప్పుడు పునశ్చరణ చేయడం ద్వారా జ్ఞాపకశక్తి చక్కగా స్థిరపడుతుందని గుర్తించాలి. 
 
ఈ పరీక్షకు సర్వసన్నద్ధం కావటానికి  మెలకువలు అందించిన పోటీ పరీక్షల నిపుణులు...  కొడాలి భవానీ శంకర్‌.

Sunday, 7 August 2011

‘చదువు’ పేజీ బ్లాగు మొదలైంది!


విద్యార్థులకూ,  పాఠక  మిత్రులకూ నమస్కారం!

తెలుగు ప్రజల జీవనాడిగా  అత్యధిక సర్క్యులేషన్ తో   పాఠకుల ఆదరణ పొందుతున్న   ‘ఈనాడు’ పత్రిక  ప్రతి సోమవారం ‘చదువు’ పేజీని వెలువరిస్తోంది.

విద్యార్థులకు అవసరమైన  విలువైన  సమాచారం  ప్రామాణికంగా,  సరళమైన భాషలో అందించి వారి అభ్యున్నతికి తోడ్పడటం చదువు పేజీ లక్ష్యం.

ఉన్నత విద్యావకాశాల సమాచారం,  పోటీ పరీక్షలకు  మార్గదర్శకత్వం,  ఉద్యోగ సాధనకు అవసరమైన  నైపుణ్యాల వివరాలను  ‘చదువు’ పేజీ అందిస్తోంది.

విద్యావేత్తలూ,  పోటీ పరీక్షల నిపుణులూ  అందించే ప్రామాణిక సమాచారం మీకు ఇందులో లభిస్తుంది! 
 
ఈ పేజీ  పాఠక విద్యార్థులకు మరింతగా చేరువ అయ్యేందుకు ఇప్పుడు బ్లాగు రూపంలో ఇలా...   అందుబాటులోకి వచ్చింది.


‘చదువు’ పేజీ లో ప్రచురించే అంశాలపై  పాఠకులు తమ అభిప్రాయాలు  పంచుకునేందుకు ఇదో  చక్కటి వేదిక.

*  ఈ పేజీలో  ఏయే అంశాలు ఉండాలని కోరుకుంటున్నారో  వ్యాఖ్యల రూపంలో తెలపవచ్చు.

*   మీ వ్యాఖ్యలను ఇంగ్లిష్ లో కానీ, తెలుగులో కానీ రాయవచ్చు. http://lekhini.org/  సైట్ లో ఇంగ్లిష్ స్పెలింగ్స్ తో  రాస్తే తెలుగు లిపిలోకి  దానికదే మారుతుంది.  దాన్ని  Copy &  Paste చేస్తే సరి!

*   నచ్చిన, నచ్చని  కథనాల గురించి చర్చించవచ్చు.

*  ఈ  పేజీని మెరుగుపరచటానికి సూచనలూ, సలహాలూ  ఇవ్వవచ్చు.


చదువు పేజీ ఆన్ లైన్ ఎడిషన్ లింకు ఇది-


ప్రయోజనకర  సమాచారాన్నీ, కథనాలనూ అందించేందుకు మీ నుంచి ఉత్సాహపూరితమైన  సహకారం ఆశిస్తూ...

-  ‘చదువు’ పేజీ  టీమ్

Friday, 5 August 2011

ఇంగ్లిష్ లో సరికొత్త ప్రయోగాలు!




ఆంగ్ల భాష లోని  ప్రాథమిక  సూత్రాలు  అందరికీ బాగానే తెలుసు.  వీటిని వివరించే  పుస్తకాలు మార్కెట్లో విస్తృతంగానే దొరుకుతున్నాయి.


మరి  మీలాంటి  ‘అడ్వాన్స్ డ్’ రీడర్స్ కు ఉపయోగపడే  అంశాల సంగతేమిటి?  ఆంగ్లంలో కొత్త గా వాడుకలోకి వస్తున్న వ్యక్తీకరణలను తెలుసుకోవటం ఎలా?  

దీనికి సమాధానమే   

ఈ  

శీర్షిక !   



ఈనాడు - చదువు పేజీలో ఈ Modern English Usage శీర్షిక చాలా ప్రాచుర్యం పొందుతోంది.  వారం విడిచి వారం ప్రచురించే ఈ శీర్షికను  ఎం. సురేశన్  నిర్వహిస్తున్నారు.  


ఆగస్టు 1న విడుదలైన చదువు సంచికలో ... 
 
A pain in the neck, turn on the heat, past his prime,  Quick on the uptake  ఇలాంటి వ్యక్తీకరణలను గురించి తెలుసుకోవచ్చు. (ఎర్ర అక్షరాల మీద క్లిక్ చేసి ఈ వ్యాసం చదువుకోవచ్చు).

ఈ శీర్షిక మీ భాషా నైపుణ్యాలను  మెరుగుపరుస్తుంది.  ఈ తరహా శీర్షిక మరే ఇతర పత్రికల్లోనూ లేదు!

Thursday, 4 August 2011

ఇంజినీరింగ్ విద్యకు ఎన్నో ప్రత్యేకతలు!


ఇంజినీరింగ్ అంటే శాస్త్రమే కాదు, కళ కూడా! అందుకే దీన్ని శాస్త్రీయమైన కళ  (Art of Science) అంటారు.

కొన్ని నైపుణ్యాలుంటే దీనిలో బాగా రాణిస్తారని మీకు తెలుసా? అవేమిటో గ్రహించి వాటిని పెంపొందించుకోవటం ఇంజినీరింగ్ విద్యార్థులకెంతో అవసరం.

అలాగే ఇంజినీరింగ్ విద్య ప్రత్యేకతలు కూడా కొన్ని ఉన్నాయి.

చదువు పేజీలో  ఆగస్టు 1 సంచికలో ప్రచురించిన  ఉపాధి, వికాసాలకు ఇంజినీరింగ్‌  కథనం చదవండి.

ఇలాంటి విశేషాలన్నో తెలుసుకోవచ్చు!

మీ అభిప్రాయాలను తెలుగులో కానీ  ఇంగ్లిష్ లో కానీ వ్యాఖ్యల రూపంలో తెలపండి.

ఎంబీఏ/ ఎంసీఏ కళాశాలను ఎంచుకోండి!



సెట్ రాసేసి,  ఎంబీఏ కానీ  ఎంసీఏ కానీ  చదవబోతున్నారా?  ఐసెట్ కౌన్సెలింగ్ కి సిద్ధమవుతున్నారా?

మంచి కాలేజీలో చేరితే భవితకు భరోసా దొరికినట్టే. కానీ ఉన్నవేమో  వందల కళాశాలలు. వీటిలో  ఉత్తమ కళాశాలను గుర్తించేది ఎలా?

చిక్కు సమస్యే! 


నిజానికి  ఈ సమస్య మీ ఒక్కరిదే కాదు. ఏ కళాశాలలో  చేరాలో  తేల్చుకోలేకపోతున్న విద్యార్థులు  ఎందరో ఉన్నారు !

అందుకే- మీకు ఉపయోగపడే  సమాచారంతో   ‘చదువు’ పేజీ (ఆగస్టు 1 సంచిక)  ప్రధాన కథనం   కాలేజీ కళ... తెలిసేది ఇలా!  ప్రచురించింది. 

( ఎర్రటి అక్షరాలతో  శీర్షిక కనపడుతోంది కదా? దీనిమీద క్లిక్ చేస్తే  ‘ఈనాడు’  ఆన్ లైన్ ఎడిషన్లో  చదువు పేజీలో ఉన్న  ఈ కథనం ఓపెన్ అవుతుంది. ఎంచక్కా చదువుకోవచ్చు!) 

ఈ  వ్యాసంలో  ప్రొ. ఎం.భాస్కరరావు  విలువైన సూచనలు అందించారు.

వీటిని పాటించారనుకోండీ...  ఉత్తమ కళాశాలను మీరు  తేలిగ్గానే ఎంచుకోగలుగుతారు!