జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో అగ్రశ్రేణిలో నిలవటం అనిర్వచనీయమైన అనుభూతి! లక్ష్యం సాధించి, ఆ స్థాయికి చేరుకోవటానికి పాటించిన క్రమం, పడిన కష్టం గుర్తుచేసుకోవటం ఎంతో మధురంగా ఉంటుంది. ఉజ్వల భవితకు ముఖద్వారమైన 'గేట్' (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్)లో జయకేతనం ఎగురవేసిన సుజీత్ కుమార్ (ఈసీఈ ) ఆ విశేషాలను ఇలా పంచుకున్నాడు..
'ఆత్మవిశ్వాసం' నా విజయంలో ప్రధాన పాత్ర వహించింది. కానీ ఈ నమ్మకం నాకు ఆఖరిదశలో... పరీక్ష రాసేరోజు మాత్రమే పూర్తిగా ఏర్పడింది. అనుకున్నట్టు కాకుండా రివిజన్ కొద్దిగా తగ్గిందని తెలుసు కానీ దాని గురించి ఆలోచించలేదు. కాన్సెప్టులు నాకు స్పష్టంగా ఉన్నాయని తెలుసు. అదే ధైర్యం!
... అయినా కొంత ఉత్కంఠ, టెన్షన్... తెల్లారి పరీక్ష. తెల్లవారుఝామున 2 గంటలదాకా చదువుతూనే ఉన్నాను. నిజానికి పరీక్ష ముందు ఇంతసేపు మేలుకోవటం మంచిది కాదు. ఆరుగంటలకే మెలకువ వచ్చేసింది. టెన్షన్‌తో ఉదయం 9 గంటలదాకా ప్రిపరేషన్ ఆపలేదు. వదిలేసిన మ్యాథ్స్ రివిజన్ కూడా పూర్తయ్యాక.. అప్పుడు- ఆ ఆఖరి సమయంలో- వచ్చేసింది ఆత్మవిశ్వాసం!
'ఈసారి పరీక్ష కష్టంగా ఉండి, సరిగా రాయకపోయినా పర్లేదు, మరోసారి రాయగలను. ఎందుకంటే... నాకు కాన్సెప్టులపై స్పష్టత ఉంది కాబట్టి'!- ఈ నమ్మకం వచ్చాక ఇక టెన్షనే లేదు. పరీక్షకు హాజరై, ప్రశాంతమైన మనసుతో రాయటం మొదలుపెట్టాను. తేలికైనవి ముందు రాసేశాను, కష్టమైనవి రెండో రౌండుకు వదిలేసి. అందుకే జనరల్ ఆప్టిట్యూడ్‌తో పాటు 1.45 గంటల్లోనే సగం పేపర్ పూర్తిచేశా.
మళ్ళీ ప్రశ్నపత్రం చూసుకున్నాను. ఒక ప్రాబ్లమ్ అయితే పూర్తి పేజీ నిడివి ఉంది. చూడగానే దాన్ని అంతకుముందు వదిలేశా. ఇప్పుడు తరచిచూస్తే విచిత్రంగా అది చాలా తేలిక సమస్య! భయపెట్టటానికి ఇంత నిడివితో ఇచ్చివుంటారు.
పట్టు వదలకుండా...
నా ప్రిపరేషన్ గురించి చెప్పాలంటే- చదివినంతవరకూ బాగా చదివాను. కాన్సెప్టులపై అస్పష్టత ఉంటే దాన్ని క్లారిఫై చేసుకునేదాకా వదల్లేదు. ఏదైనా ప్రాబ్లమ్ రాకపోతే సొల్యూషన్ తెలిసేవరకూ దానిమీదే ఉన్నాను. ప్రిపరేషన్ విషయంలో కష్టమైన అంశాలనే ముందు ప్లాన్ చేసుకోవాలి. వాటికి ఎక్కువ సమయమే పడుతుంది కాబట్టి. తర్వాతే తేలికైనవాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. లేకపోతే చివర్లో మనకు వ్యవధి సరిపోకపోవచ్చు. పరీక్ష ముందు రివిజన్ పెండింగ్ లేకుండా చూసుకుంటే ఆత్మస్త్థెర్యం పెరుగుతుంది.
గేట్‌లో నాకిది మూడో ప్రయత్నం. మొదటిసారి అసలేమీ చదవకుండా రాశాను. మార్కులు 42/100, గేట్ ర్యాంకు 5,898! రెండో ప్రయత్నంలో బాగా చదివాను. కొన్ని కాన్సెప్టులు అంత క్లియర్‌గా లేవు. సమయం లేక ప్రాబ్లమ్స్ సాధన చేయలేకపోయాను. మార్కులు 32/100 మాత్రమే. కానీ 3,360 ర్యాంకు! ప్రశ్నపత్రం చాలా కష్టంగా ఇవ్వటం దీనికి కారణం. దీనిబట్టి తెలిసేదేమిటంటే... ఎంత కష్టపడితే అంత మంచి ర్యాంకు వస్తుంది. ఇతరుల గురించి పట్టించుకోకూడదు.
మూడోసారి గేట్ రాసినపుడు బాగా చదివాను. కాన్సెప్టులు క్లియర్‌గా ఉన్నాయి. ప్లాబ్లమ్స్ కూడా సాధన చేశాను. గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా, వాటిని చివరి నిమిషం వరకూ సవరించుకుంటూ వచ్చాను. మొదటి రెండు సార్లూ సమయం లేక తేలికైనవి కూడా వదిలేశాను. ఇప్పుడలా కాకుండా తేలికైన ప్రశ్నలకు ముందు జవాబులు గుర్తించాను. దీనివల్ల జరిగే ప్రయోజనం ఆత్మస్త్థెర్యం రావటం! పేపర్ సులువుగా ఉంది కాబట్టి మార్కులశాతం 88.67 వచ్చింది. ర్యాంకు తెలిసిందే కదా? మొదటి ర్యాంకు!
నిరాశపడకూడదు
గేట్ కోసం రోజుకు 8 గంటల చొప్పున చదివితే ఆరు నెలల సమయం సరిపోతుంది. సన్నద్ధతకు తప్పనిసరిగా ఒక ప్రణాళిక అనుకోవాలి. దాన్ని పాటించటానికి నిర్దిష్ట వ్యవధి పెట్టుకోవాలి. అనుకోని అవాంతరాలు వచ్చినపుడు ప్రణాళిక సరిగా పాటించటం లేదని నిరాశపడిపోకూడదు. 'అయిందేదో అయింది. ఉన్న సమయాన్ని గరిష్ఠంగా సద్వినియోగం చేయాలి' అనుకోవాలి. పరిస్థితిని బట్టి డైనమిక్‌గా దాన్ని మార్చుకోవటం కూడా అవసరం. ఏది ఏమైనా ప్రిపరేషన్ సకాలంలో పూర్తవుతుందనే ఆత్మవిశ్వాసం ఉండాలి.
గేట్ రాసేవారు తమ కళాశాల గ్రంథాలయాన్ని ఉపయోగించుకుంటే సందేహాలు వచ్చినపుడు వివిధ పుస్తకాలను సంప్రదింంచే వీలుంటుంది. చదువుకునే వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది.
క్రమం పాటిస్తే సులువు
గేట్‌లో సాధారణంగా అన్ని సబ్జెక్టులకూ సమాన ప్రాధాన్యం ఉంటుంది. పాత పేపర్లు సాధన చేస్తే వేటికి ఎక్కువ ప్రాధాన్యం ఉందో తెలుస్తుంది. ఆ ప్రకారం సిద్ధమవ్వొచ్చు. కానీ టాప్ ర్యాంకు రావాలంటే మాత్రం సిలబస్ మొత్తం కవర్ చేయాల్సిందే. ఇంజినీరింగ్ మ్యాథ్స్‌కు మార్కులు తక్కువని దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దీనికి సరిగా సన్నద్ధమైతే ఇంజినీరింగ్ సబ్జెక్టులు చదివేటపుడు సమయం బాగా ఆదా అవుతుంది. మ్యాథ్స్‌లో పునాది సరిగా ఏర్పరచుకోకపోతే ప్రిపరేషన్ సమయం చాలా పెరుగుతుంది!
ఎలక్ట్రో మాగ్నటిక్ థియరీ లాంటి కొన్ని సబ్జెక్టుల్లో మొదటి కొన్ని చాప్టర్లు మిగతావాటికి ఆధారంగా ఉంటాయి. ఇంటర్లో చదివినవాటికి కొనసాగింపు కొన్ని ఉంటాయి. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ తర్వాత కమ్యూనికేషన్స్ చదవటం; ఎలక్ట్రానిక్ డివైసెస్, ఎనలాగ్ సర్క్యూట్స్ వరసగా, ఈ రెంటికీ ముందు నెట్‌వర్క్ థియరీ చదవటం ... ఈ క్రమం చక్కని అవగాహననిస్తుంది.
ప్రాథమికాంశాలు (బేసిక్స్) ఎంత బాగా చదివితే సబ్జెక్టు అంత సులభం. సమస్యల సాధనలో ఎక్కువ పేజీలు రాయటం బీటెక్‌కు పనికిరావొచ్చు కానీ, గేట్‌కు క్లుప్తంగా సాల్వ్ చేయటమే ప్రధానం. మ్యాథ్స్‌లో పట్టుంటేనే ఇది సాధ్యం!
ఉపయోగపడే సైట్లు
నేనైతే పరీక్షకు ఒక్కణ్ణే సిద్ధమయ్యాను గానీ, 'కంబైన్డ్ స్టడీ' చాలా ఉపయోగకరమే! ఒకే రకమైన మనస్తత్వం ఉన్న ఇద్దరు ముగ్గురు కలిసి చదివితే అద్భుతాలు సృష్టించవచ్చు. సొంతంగా సన్నద్ధమయ్యేటపుడు ఎక్కడైనా చిక్కుముడి ఏర్పడితే సమయం వృథా అవుతుంటుంది. ఇలాంటపుడు సమయం ఉంటే http://nptel.iitm.ac.in/వెబ్‌సైట్‌లో నిపుణులైన అధ్యాపకుల బోధనలున్న వీడియోలు చూస్తే సందేహనివృత్తి అవుతుంది. తర్వాత పాఠ్యపుస్తకాలు చదివితే అర్థమవుతుంది. www.coursera.org వెబ్‌సైట్‌లో విదేశీ ప్రొఫెసర్ల పాఠాలు ఉచితంగా చూడొచ్చు. ఇవి చాలా ఉపయోగం.
మాక్ టెస్టులు నిర్దిష్ట సమయం పెట్టుకుని రాయటం మంచిది. రాసి, ఎక్కడ, ఏమేం తప్పులు చేశామో బేరీజు వేసుకోవాలి. అవి పునరావృతం కాకుండా చూసుకోవాలి. నేను పరీక్ష ముందు రెండు టెస్టులు రాశాను. సరైన మైండ్‌సెట్, సమయ నిర్వహణ వీటితో అలవడతాయి. పాత పేపర్లు 8 నుంచి 10 సంవత్సరాలవి సాల్వ్ చేయటం మేలు.కాన్సెప్టుల విషయంలో 'నాదే కరెక్టు' అనే ధోరణి సరికాదు. ఇవి సుస్పష్టంగా (క్రిష్టల్ క్లియర్) ఉండాలి. నిరంతరం విశ్లేషించుకుంటూ ఉండాలి. ఎంత చదివినా రివిజన్ ఉండాలి. తప్పులు తెలుసుకోవాలి. అన్ని ప్రాబ్లమ్స్‌నూ సాల్వ్ చేసేలా ఉండాలి. పరిష్కరించకుండా దేన్నీ వదలకూడదు. ఏ సమస్య అయినా చేయలేకపోయామంటే ఆ కాన్సెప్ట్‌పై పూర్తి అవగాహన రాలేదని అర్థం!
నేను హైదరాబాద్ 'ఏస్ ఇంజినీరింగ్ అకాడమీ'లో కోచింగ్ తీసుకున్నాను. అనుభవజ్ఞులైన అధ్యాపకులు మన సమయం తగ్గిస్తారు. కోచింగ్ లేకుండా కూడా గేట్‌కు సిద్ధం కావచ్చు. అయితే దీనికి సమయం చాలా ఎక్కువ తీసుకుంటుంది.
ఇంజినీరింగ్ ఫైనలియర్లో కీలకమైన ప్రాజెక్టు, పరీక్షలూ, క్యాంపస్ ప్లేస్‌మెంట్లూ ఉంటాయి. వీటి మధ్య గేట్‌కు సన్నద్ధమవటం పరీక్షే. అందుకే రెండో సంవత్సరం నుంచీ గేట్‌మీద దృష్టిపెట్టటం మంచిది. సబ్జెక్టులో కష్టంగా ఉన్నవాటిని నోట్స్‌గా రాసుకోవాలి. గేట్ సన్నద్ధతలో అవి ఉపయోగపడతాయి. సమయం కూడా బాగా ఆదా అవుతుంది.