విభాగాలు ఎన్ని?
- ఆఫ్-క్యాంపస్ ప్రోగ్రామ్‌లు (1)
- ఆర్ ఆర్ బీ (1)
- ఇంగ్లిష్ (17)
- ఇంజినీరింగ్ (29)
- ఇంటర్న్ షిప్ లు (1)
- ఉపకార వేతనాలు (8)
- ఎలిజిబిలిటీ టెస్ట్ (5)
- ఏపీపీఎస్ సీ (25)
- ఏరోనాటిక్స్ (2)
- ఐఐటీ (2)
- ఐటీ/ సాఫ్ట్ వేర్ (2)
- ఐటీఐ... ఉద్యోగాలు (3)
- కాస్ట్ అకౌంటెన్సీ (1)
- కౌన్సెలింగ్ (2)
- జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు (3)
- జూనియర్ లెక్చరర్స్ (2)
- టాపర్ (1)
- దూరవిద్య (4)
- నైపుణ్యాలు (3)
- పీజీ (6)
- పీహెచ్ డీ (8)
- పోలీస్ (7)
- ఫార్మసీ (4)
- ఫైనాన్స్ (1)
- ఫ్యాషన్ డిజైనింగ్ (1)
- బోధన రంగం (7)
- బ్యాంకింగ్ (8)
- మీడియా (1)
- మేనేజ్ మెంట్ (2)
- మేనేజ్ మెంట్/ ఎంసీఏ (16)
- యూజీ/ పీజీ (3)
- యూపీఎస్ సీ (4)
- విదేశీ విద్య (9)
- వీఆర్ఏ (2)
- వీఆర్ఓ (2)
- వైద్యవిద్య (8)
- సందేహాలూ సమాధానాలూ (4)
- సమ్మర్ ఫెలోషిప్ లు (1)
- సహకార బ్యాంకులు (1)
- సాఫ్ట్ వేర్ (3)
- సివిల్స్ (16)
- సైన్సెస్ (1)
- స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (1)
- స్వాగతం (1)
- హాస్పిటాలిటీ (2)
- హెల్త్ కేర్ (2)
Showing posts with label విదేశీ విద్య. Show all posts
Showing posts with label విదేశీ విద్య. Show all posts
Sunday, 2 November 2014
Tuesday, 21 August 2012
విదేశాల్లో విద్య, ఉద్యోగాలకు మెలకువలు
ఇంజినీరింగ్, ఇతర కోర్సుల్లో ప్రవేశించేవారిలో , ఇప్పటికే చదువుతున్నవారిలో చాలామంది అభిలాష- విదేశాల్లో పీజీ చదవాలనీ, అక్కడే ఉద్యోగం సాధించి స్థిరపడాలనీ! ప్రమాణాలు తీసికట్టుగా ఉంటున్న మన సగటు కళాశాలల్లో చదువుతున్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో ఏ మెలకువలు పాటించాలి? మార్గం ఎలా సుగమం చేసుకోవాలి ? ఇదిగో మార్గదర్శనం...
కోర్సులో ప్రవేశించిన దగ్గర్నుంచీ డిగ్రీ చేతికందేలోపు మూడు/నాలుగు సంవత్సరాల కాలం తక్కువేమీ కాదు. ఈ వ్యవధిని ఎంత ప్రయోజనకరంగా మల్చుకోగలం అన్నదానిపైనే కెరియర్, భావి జీవిత గమనం ఆధారపడివుంటాయి. ప్రవేశపరీక్ష వరకూ బాగా కష్టపడి చదివి కఠినమైన పోటీలో సీటు సంపాదించిన ప్రతిభావంతులైన విద్యార్థులే తర్వాత నిర్లక్ష్యధోరణితో ఫెయిలవుతున్న ఉదంతాలు ఐఐటీల్లో కూడా గమనించవచ్చు. ఈ పరిస్థితిలోకి జారిపోకుండా విద్యార్థులు జాగ్రత్త వహించాలి.
విదేశాల్లో ఉద్యోగం సంపాదించాలంటే అర్హతలూ, నైపుణ్యాలూ మెరుగైన స్థాయిలో ఉండాల్సిందే కదా! వేరే దేశంలో భిన్న సంస్కృతుల నేపథ్యం ఉన్నవారితో కలిసి పనిచేస్తే అది వృత్తిపరమైన ఎదుగుదలకూ, వ్యక్తిగత వికాసానికీ కూడా ఉపయోగపడుతుంది. తాత్కాలికంగా కావొచ్చు; శాశ్వతంగా కావొచ్చు- విదేశాల్లో విధుల నిర్వహణ విశిష్ట అనుభవాన్ని సంపాదించిపెడుతుందని అక్కడ ఉద్యోగాల్లో కొనసాగుతున్న నిన్నటి ఇంజినీరింగ్ విద్యార్థులు ఘంటాపథంగా చెపుతున్నారు.
విదేశాల్లో రాణించటానికి తోడ్పడే లక్షణాలేమిటి?
కమ్యూనికేషన్ సామర్థ్యాలు
మనది ఆంగ్లం మాతృభాషగా ఉన్న దేశం కాదు. మన నిత్యవ్యవహారాలన్నీ మాతృభాష సాయంతోనే సజావుగా నడిచిపోతుంటాయి. ఇంగ్లిష్ పరీక్షలో చాలామంచి మార్కులు తెచ్చుకున్నప్పటికీ మన విద్యార్థుల్లో చాలామంది ఆంగ్లభాషా వాగ్ధాటి చాలా తక్కువ. ఇంగ్లిష్ అంతర్జాతీయ భాష కాబట్టి మనం ఏ దేశం వెళ్ళాలన్నా ఈ భాషపై పట్టు ఉండటం అవసరం.
కళాశాల విద్య కోసమే కాదు, దైనందిన జీవితంలో కూడా దీని ఆవశ్యకత ఎక్కువని తెలిసిందే. కాబట్టి స్వదేశంలో విద్యాభ్యాసం పూర్తికాకముందే ఆంగ్ల భాషా వ్యక్తీకరణలో నైపుణ్యం పెంచుకోవటానికి కృషి చేయటం ముఖ్యం.
సబ్జెక్టు పరిజ్ఞానం, కోర్సులు
మనదేశంలోని విధానానికి భిన్నంగా విదేశాల్లో విద్యావ్యవస్థ ఉంటుంది. ఇక్కడ సిద్ధాంతపరమైన దృష్టి అధికం. కానీ విదేశాల్లో ప్రయోగ అనుభవానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి ఈ లోపం సవరించుకునేందుకు అదనంగా మన విద్యార్థులు కృషి చేయాల్సిందే.
ప్రధానంగా కంప్యూటర్ సైన్స్, ఐటీ బ్రాంచిల విద్యార్థులు విదేశాల్లోని ఈ కోర్సుల స్థాయి అందుకోవటానికి తమ అవగాహన సామర్థ్యాలను పెంచుకోకతప్పదు. అదనపు కోర్సుల, లాంగ్వేజెస్ పరిజ్ఞానం సాధించగలిగితే ఎల్లప్పుడూ ఉపయోగమే. విదేశాల్లో ఈ కోర్సుల నిర్మాణం ఇక్కడి కోర్సుల మాదిరి ఉండదు. ఎక్కడ చదివినా ఈ కోర్సులకు సంబంధించిన అదనపు పరిజ్ఞానం మాత్రం పెంపొందించుకోవాలి.
సరైన కోర్సు ఎంపిక
తమ స్నేహితుల, కుటుంబసభ్యులిచ్చిన సమాచారం, సలహాలపై ఆధారపడే ఎక్కువమంది కోర్సు/ బ్రాంచిలను ఎంచుకుంటుంటారు. ఇది సరైన ఎంపిక కాకపోయే ప్రమాదముంది. దీనికంటే తన ఆసక్తి, అభిరుచులకు ప్రాధాన్యం ఇస్తూ నిర్ణయం తీసుకోవటానికి ప్రయత్నించటం మేలు.
చదవబోయే కోర్సులో ఏమేం నేర్చుకోవాల్సివుంటుంది, కళాశాల తీరు ఎలా ఉంటుందీ... ఇవన్నీ పూర్తిగా తెలుసుకుని చేరటం వల్ల తర్వాతకాలంలో ఇబ్బందులు తలెత్తవు. పూర్తిగా కోర్సుమీద మనసు కేంద్రీకృతం చేయగలుగుతారు.
కోర్సు అంశాలు తన అవగాహనకూ, ధోరణికీ సరిపోవని భావిస్తే ఇతర బ్రాంచిలను ఎంచుకోవచ్చు. ఎందుకంటే... ఇష్టమైన సబ్జెక్టులోనే ఏ విద్యార్థి అయినా విశేషంగా రాణించే అవకాశం ఉంటుంది. మెరుగైన కెరియర్‌కైనా, విదేశాలకు వెళ్ళటానికైనా ఇది పునాదిగా ఉపకరిస్తుంది.
విదేశాల్లో పరిస్థితులు
డిగ్రీ తర్వాత విదేశాల్లో కోర్సు/ఉద్యోగంలో ప్రవేశించదలిచినవారు తాము లక్ష్యంగా పెట్టుకున్న దేశంలోని పరిస్థితులను తెలుసుకోవాలి. వాతావరణ పరిస్థితులపై అవగాహన కూడా అవసరమే. చాలామంది విద్యార్థులు పరాయి దేశాలకు చేరుకున్నాక అక్కడి వాతావరణం సరిపడక వివిధ రుగ్మతలతో ఇబ్బందిపడుతుంటారు. చదువు/ విధినిర్వహణపై ఈ ప్రభావం తప్పకుండా పడుతుంది. ఈ సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం విస్మరించరానిది.
ఇతరదేశాల్లోని జీవన పరిస్థితులూ, వారి జీవన శైలి మనకంటే భిన్నంగా ఉంటుందని గుర్తించాలి. మనదేశంలో బయట కూడా బిగ్గరగా మాట్లాడుకుంటుంటాం కదా? చాలా దేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో మౌనంగా ఉండటం సాధారణం. వీటిని గమనించి అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా తమను మల్చుకోవాలి. విద్యార్థులకు ఆ దేశంలో బంధువులూ, స్నేహితులూ ఉంటే సాపేక్షంగా కొంత ఉపయోగకరం.
ఇలాంటి అంశాలపై అవగాహన పెంచుకోవటం కష్టమేమీ కాదు. ఆపై విదేశాల్లో పీజీ చేసినా, కొలువులో చేరినా ఆ ప్రస్థానం సాఫీగా విజయవంతంగా మారుతుంది.
కీలక నైపుణ్యాలు ముఖ్యం
విదేశీ విద్య, ఉద్యోగాలకు ఉపకరించే కొన్ని ప్రధాన నైపుణ్యాలపై విద్యార్థులు దృష్టిపెట్టటం మేలు. తాము ఎంచుకున్న రంగాన్ని బట్టి అవసరమైనవాటిని పెంపొందించుకోవటానికి ప్రయత్నించాలి.
భాష: స్పోకెన్, రిటన్ ఇంగ్లిష్‌లో చెప్పుకోదగ్గ ప్రావీణ్యం పెంచుకోవటం.
లేఖనం: బిజినెస్ లేఖలు, ఎజెండాలు, మినిట్స్ రాసే ప్రతిభను సానపెట్టుకోవటం.
కంప్యూటర్: వర్డ్‌ప్రాసెసింగ్, స్ప్రెడ్ షీట్లు, డేటాబేసెస్ ఉపయోగించటం, పవర్ పాయింట్, వెబ్ పరిశోధన.
నిర్వహణ:to-do lists తయారీ, ఎగ్జిక్యూటివ్ సమ్మరీ, ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ ప్రణాళికలు
భావ వ్యక్తీకరణ: స్పష్టంగా, సమర్థంగా భావాలను తెలియజేసే నేర్పు, మార్కెటింగ్ వ్యూహాల పరిజ్ఞానం.

Sunday, 11 December 2011
అమెరికా విద్యాభ్యాసానికి దరఖాస్తుల తరుణం!
తమ కలల కోర్సులు చదవటానికి యు.ఎస్.ఎ.కు ఏటా లక్షమందికి పైగా విద్యార్థులు ప్రయాణమవుతూవుంటారు.
అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందటం ఉజ్వల భవితను తీర్చిదిద్దుకోవటంలో మొదటి మెట్టు. ఆ దేశంలో అడ్మిషన్ల ప్రక్రియ చాలా సంక్లిష్టం.
ఈ సందర్భంగా విద్యార్థులు తెలుసుకోవాల్సిన విషయాలను శుభకర్ ఆలపాటి వివరిస్తున్నారు!
గత ఐదేళ్ళుగా యు.ఎస్.ఎ.కు విద్యాభ్యాసం కోసం వెళ్ళే భారతీయ విద్యార్థుల సంఖ్య నిలకడగా పెరుగుతోంది. వీసా అనుమతి పొందేవారి కంటే ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారి సంఖ్య రెట్టింపు ఉంటుంది.
విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకోవటంతో తొలి అడుగు మొదలవుతుంది. యు.ఎస్.ఎ. విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందటం అనిశ్చితం కాబట్టి ముందుజాగ్రత్తగా చాలామంది విద్యార్థులు కనీసం 3-4 విశ్వవిద్యాలయాలకు దరఖాస్తులు పంపుకుంటారు. దీనిమూలంగా విశ్వవిద్యాలయాలకు అందే దరఖాస్తుల సంఖ్య భారీగా ఉంటుంది.
ప్రవేశం సాధించటం, వీసా... ఈ మొత్తం ప్రక్రియకు నెలల కాలం పడుతుంది. ముందుగానే విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేయటం ఎంతో మేలు. దీనివల్ల ఆఖరి నిమిషంలో పడే అనవసరపు హైరానా తప్పుతుంది; ఆందోళన తగ్గుతుంది.
రెండు సీజన్లు
యు.ఎస్.ఎ. విశ్వవిద్యాలయాల ప్రవేశాలకు రెండు సీజన్లుంటాయి. ఫాల్ (సెప్టెంబరు), స్ప్రింగ్ (జనవరి). కొద్ది యూనివర్సిటీలు మాత్రం సమ్మర్ (మే) కూడా ప్రవేశాలు అందిస్తాయి. వీటిలో అన్ని యూనివర్సిటీలూ, కోర్సులూ ప్రారంభయ్యేదీ, ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు చేరేదీ ఫాల్‌లోనే. తమ విద్యాసంవత్సరం ముగిశాక వచ్చే ఈ సమయంలో చేరటానికే విద్యార్థులు మొగ్గుచూపుతుంటారు. బ్యాచిలర్స్ డిగ్రీ తర్వాత కాలం వృథా కాకుండా వెంటనే మాస్టర్స్‌లో కొనసాగటానికి వీలవుతుందన్నమాట!
దరఖాస్తు గడువులు
ఈ తేదీలు ఒక్కో యూనివర్సిటీకి ఒక్కో రకంగా ఉంటాయి. విశ్వవిద్యాలయ విధానాలూ, నిబంధనల ఆధారంగా వీటిని నిర్ణయిస్తారు.
సాధారణంగా ఉత్తమ ర్యాంకింగ్ ఉన్న విశ్వవిద్యాలయాలకు విదేశీ విద్యార్థులు దరఖాస్తు చేయాల్సిన గడువులు కింది విధంగా ఉంటాయి.
ఫాల్: డిసెంబరు 31 స్ప్రింగ్: ఆగస్టు1
కొన్ని ఇతర విశ్వవిద్యాలయాలకు:
ఫాల్: మార్చి 1 స్ప్రింగ్: అక్టోబరు 1
అంత మంచి ర్యాంకులు లేని విశ్వవిద్యాలయాలకు:
ఫాల్: మే 1 స్ప్రింగ్: నవంబరు 1
ఒకే విశ్వవిద్యాలయంలో ఒక్కో విభాగానికి ఒక్కో రకమైన గడువుతేదీలు కూడా ఉంటాయి. ఫార్మసీ, హెల్త్ సైన్సెస్, సైన్సెస్ లాంటి కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభమవటానికి చాలా తక్కువ వ్యవధే ఉంటుంది. అందుకని ముందుగానే దరఖాస్తు చేయాల్సివుంటుంది.
ఆర్థిక మాంద్యం మూలంగా ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధుల అలభ్యత వల్ల చాలా విశ్వవిద్యాలయాలకు ఫండింగ్ అవకాశాలు తక్కువే. ఒకప్పటితో పోలిస్తే ఉపకార వేతనాలు చాలా తక్కువ. వీటి అవసరమున్నవారు తుది గడువు కంటే చాలాముందే దరఖాస్తు చేసుకోవటం శ్రేయస్కరం.
ఉపకారవేతనాలతో పాటు ప్రవేశం కావాలంటే చాలా విశ్వవిద్యాలయాలకు వేర్వేరు గడువు తేదీలుంటాయి. వీటి వివరాలను వెబ్‌సైట్లలో కూడా పేర్కొనరు. అందుకే ఉపకార వేతనాలూ, ఫీజు రాయితీలూ కావాలనుకున్నవారు జాప్యం లేకుండా దరఖాస్తు చేయటం చాలా ముఖ్యం. మొదట వచ్చిన దరఖాస్తులకు ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి.
యు.ఎస్. విద్యార్థి వీసా (ఎఫ్ 1) ప్రక్రియ చాలా వ్యవధి తీసుకుంటుంది. ప్రవేశాల దగ్గర్నుంచి వీసా వరకూ 3-6 నెలల సమయం, ఒకోసారి అంతకంటే అధిక సమయం కూడా పడుతుంది. అయితే కొన్నిసార్లు చాలా వేగంగా ఈ ప్రక్రియ పూర్తవటం కూడా జరగొచ్చు.
అన్నీ పరిశీలించాకే...
దరఖాస్తును వివిధ విభాగాలవారీగా సాకల్యంగా సమీక్షించాకే I 20 ను నిర్థారిస్తారు. ఈ నిర్ణయ సమాచారం ఏర్‌మెయిల్ ద్వారానే పంపుతారు కాబట్టి సీటు పొందిన విషయం వెంటనే కాకుండా... దాదాపు 20 రోజుల్లో విద్యార్థికి తెలిసే అవకాశముంది.
ఫాల్ ఇన్‌టేక్‌లో విద్యార్థికి ప్రవేశంతో పాటు ఇతర అవకాశాలుంటాయి... ఫండింగ్, అసిస్టెంట్‌షిప్స్, ఉపకారవేతనాలు, ఆన్‌క్యాంపస్ వసతి మొదలైనవి. అన్ని దేశాల నుంచీ దరఖాస్తులు వస్తుంటాయి కాబట్టి 'ఇంటర్నేషనల్ అడ్మిషన్స్ డిపార్ట్‌మెంట్' అర్హతలున్న విద్యార్థులందరికీ ప్రవేశాలూ, ఉపకారవేతనాలను ఖరారు చేయలేదు. కారణం- సీట్లు, ఫండింగ్, అసిస్టెంట్‌షిప్ అవకాశాలు పరిమితం కాబట్టి.
ఏ విద్యార్థి అయినా నవంబరులో, డిసెంబరు ప్రథమ భాగంలో దరఖాస్తు పంపుకుంటే ప్రవేశాలు పొందటానికి ఎక్కువ అవకాశాలుంటాయి. అదే విద్యార్థి కాలయాపన చేసి, అదే విశ్వవిద్యాలయానికి ఏ ఫిబ్రవరిలోనో దరఖాస్తు చేస్తే ప్రవేశం లభించకపోవచ్చు.
యూనివర్సిటీ నుంచి ఫండింగ్/అసిస్టెంట్‌షిప్ పొందిన విద్యార్థులకు యు.ఎస్. ఎంబసీలో ఎక్కువ అనుకూలత ఉండి వీసా లభించే అవకాశం పెరుగుతుంది.

Tuesday, 15 November 2011
ఆస్ట్రేలియా వీసాకు కొత్త నిబంధనలు
విద్యార్జనపై ఆసక్తి ఉన్న ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులు తమ దేశంలో చదవటాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఆస్ట్రేలియా వీసా నిబంధనల్లో కొన్ని మార్పులను అమలు చేస్తోంది. మరికొన్నిటిని వచ్చే ఏడాది ప్రవేశపెట్టనుంది.
ఈ మార్పులను పరిశీలిద్దాం.
మైకేల్ నైట్ రివ్యూ సిఫార్సుల ఆధారంగా న్యూఢిల్లీలోని ఆస్ట్రేలియన్ హైకమిషన్ విద్యార్థి వీసాల మంజూరుకు నూతన నిబంధనలను ప్రకటించింది. ఇవి ఈ నెల 5 నుంచే అమల్లోకి వచ్చాయి. ముఖ్యమైన కొన్ని మార్పులను ప్రవేశపెట్టి వీసా ప్రక్రియ సులభం చేయటానికి ప్రయత్నించారు.
ఆస్ట్రేలియా హై కమిషన్ విడుదల చేసిన గత కొద్దినెలల గణాంకాలు పరిశీలిస్తే భారతదేశంలో వీసా దరఖాస్తులు సమర్పించిన రెండో పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తాజా మార్పుల మూలంగా ఈ సంఖ్య మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.
జెన్యూన్ టెంపరరీ ఎంట్రన్స్ (GTE)ని నూతనంగా ప్రవేశపెట్టారు.
దీనికి పరిశీలించే వివిధ అంశాలు:
* దరఖాస్తుదారు విద్యానేపథ్యం ఉత్తమంగా ఉండాలి.
* విద్యార్థి ఆంగ్లభాషా నైపుణ్యం బాగుండాలి.
* దరఖాస్తుదారు ఇమిగ్రేషన్ చరిత్ర..
* విద్యాపరంగా అంతరాయాలు, వయసు
* భారత్‌లో దరఖాస్తుదారు ప్రస్తుత స్థితి
* ఇంటర్వ్యూ (విద్యార్థి కెరియర్ లక్ష్యం, ఫలానా కోర్సు, విద్యాసంస్థను ఎంచుకోవటానికి హేతువు, ఆస్ట్రేలియాలోనే విద్యాభ్యాసానికి మొగ్గుచూపటానికి కారణం...)
తగ్గిన ఆర్థిక భారం
సబ్ క్లాస్ 573 (AL3) పరిధిలో హయ్యర్ డిప్లొమా, అసోసియేట్ డిగ్రీ, బ్యాచిలర్, బ్యాచిలర్ (ఆనర్), గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్, గ్రాడ్యుయేట్ డిప్లొమా, మాస్టర్ కోర్సులు వస్తాయి. 575 సబ్ క్లాస్ (AL3)కింద ఫౌండేషన్ స్టడీస్ ప్రోగ్రాం, నాన్ అవార్డ్ ప్రోగ్రాములు ఉన్నాయి. ఈ కోర్సులు చదవటానికి విద్యార్థికి కనీసం ఉండాల్సిన ఆర్థిక స్థోమతను తగ్గించారు. చూపాల్సిన నిధులు మూడు మాసాలనాటివై ఉండాలి. ఈ నిధులను గరిష్ఠంగా 18 నెలలు చూపితే సరిపోతుంది. స్పాన్సర్‌గా ఎవరైనా ఉండొచ్చు.
సబ్ క్లాస్ 572 (AL4)పరిధిలో సర్టిఫికెట్ IV,డిప్లొమా, అడ్వాన్స్ డిప్లొమాలు ఉన్నాయి. ఇవి చదవటానికి విద్యార్థి చూపించే నిధులు మూడు మాసాలనాటివై ఉండాలి. వీటిని గరిష్ఠంగా 2 ఏళ్ళు చూపాల్సివుంటుంది. కేవలం రక్తసంబంధికులు (తల్లిదండ్రులు, తాత-అమ్మమ్మలు, తోబుట్టువులు) మాత్రమే స్పాన్సర్ చేయాల్సివుంటుంది. Aunt, uncle ఆస్ట్రేలియా పౌరులైవుంటే వారు కూడా స్పాన్సర్లుగా అర్హులవుతారు.
ముందస్తు రుసుము
ఆఫర్ లెటర్ ఆధారంగానే దరఖాస్తు చేయాలి. వీసాకు దరఖాస్తు చేసేముందే విద్యార్థి రుసుము ముందుగానే చెల్లించి, eCOE తప్పనిసరిగా పొందాల్సివుంటుంది. PVAవిధానాన్ని రద్దు చేశారు.
పదిహేను రోజులకు 40 గంటలసేపు పనిచేయటానికి అవకాశం కల్పించారు. గతంలో వారానికి 20 గంటలు పనిచేయటానికి వీలుండేది.
టోఫెల్ (ఐబీటీ), ఐఈఎల్‌టీఎస్, పీటీఈ, సీఏఈ టెస్టు స్కోర్లను పరిగణనలోకి తీసుకుంటారు.
పబ్లిక్ ఇంట్రెస్ట్ క్రైటీరియా (PIC)ని కొత్తగా ప్రవేశపెట్టారు. దీని ప్రకారం... ఆస్ట్రేలియా హైకమిషన్ /DIACకి సమర్పించిన ఏ డాక్యుమెంటయినా నకిలీదని తేలితే వీసాను తిరస్కరించటమే కాకుండా, ఆ దరఖాస్తుదారు మూడు సంవత్సరాల పాటు ఆస్ట్రేలియాకు దరఖాస్తు చేయకుండా అనర్హత వేటు వేస్తారు.
- శుభకర్ ఆలపాటి

Thursday, 3 November 2011
విద్యార్థి వీసాకు విధి విధానాలు
విదేశాల్లో చదవదల్చిన విద్యార్థులకు వీసా మంజూరు విషయంలో దేశాలను బట్టి పద్ధతులూ మారుతుంటాయి. అవసరమైన పత్రాలు, నిబంధనలు, విధానాలు నిర్దిష్టంగా తెలుసుకుని విద్యార్థులు ముందడుగు వేయాలి. ఏర్పాట్లన్నీ పూర్తిచేసుకుని సమగ్ర వివరాలతో దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి ప్రయాసా లేకుండా వీసా పొందవచ్చు. ఈ సందర్భంగా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు అవసరమో శుభకర్ ఆలపాటి వివరిస్తున్నారు!
యు.ఎస్.ఎ. లాంటి కొన్ని దేశాలను మినహాయిస్తే ఎక్కువ దేశాల్లో విద్యార్థులు వీసా ఇంటర్వ్యూలకు హాజరయ్యే అవసరం లేదు. సంబంధిత హైకమిషన్/కాన్సలేట్ నిర్దేశించిన పత్రాలను సమర్పించే డ్రాప్ బాక్స్ పద్ధతి సరిపోతుంది. ఇంటర్వ్యూ లేకుండానే వీసా మంజూరు చేస్తారు కాబట్టి డాక్యుమెంట్లదే కీలకపాత్ర అవుతుంది. అందుకే వాటిని సమర్పించేటపుడు విద్యార్థులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వుంటుంది.
వీసా దరఖాస్తులో కీలక సారాంశం రెండు అంశాలపై ఆధారపడివుంటుంది. ఎ) విద్యార్థి ప్రొఫైల్ బి) ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్
ఎ) విద్యార్థి ప్రొఫైల్
ఏ దేశమైనా తమ విద్యాసంస్థలకు వచ్చి చదువుకునే విద్యార్థులు ఉత్తమ నేపథ్యంతో ఉండాలని ఆశించటం సహజం. అంటే అత్యుత్తమ మార్కుల శాతం, మంచి గ్రేడ్‌లు మాత్రమే ఉండాలని కాదు. ఆ విద్యార్థులు అంతరాయం లేకుండా చదువు సాగించాలనీ, చదువు ముగిసిన తర్వాత వర్క్ అనుభవం కొనసాగించాలనీ ఆశించటం. ఈ కారణం వల్లనే సమర్పించే డాక్యుమెంటేషన్ వారిని మంచి విద్యార్థులుగా నిరూపించేలా ఉండటం చాలా ముఖ్యం.
అయితే చాలామంది సక్రమమైన, తగిన డాక్యుమెంట్లు సమర్పించటంలో విఫలమవుతుంటారు.
* ఎందరో విద్యార్థులు తమ గ్రాడ్యుయేషన్ తర్వాత షార్ట్‌టర్మ్ కోర్సులు, ఇతర ప్రిపరేటరీ కోర్సులు చేస్తుంటారు. ఇవి 3 నెలల నుంచి ఏడాది వ్యవధితో ఉంటాయి. కాబట్టి ఈ కోర్సుల గురించి తెలిపే డాక్యుమెంటేషన్ లేకుంటే ఈ వ్యవధిలో విద్యార్థి ఖాళీగా ఉన్నాడనే నిర్థారణకు వచ్చే ప్రమాదముంది.
* విదేశాలకు వెళ్ళటానికి ముందు చాలామంది విద్యార్థులు కొన్ని నెలలపాటు తాత్కాలికంగా పనిచేస్తుంటారు. అయితే ఆ ఎక్స్‌పీరియన్స్ లెటర్, సర్వీస్ సర్టిఫికెట్లను సమర్పించటంలో మాత్రం నిర్లక్ష్యం చూపుతుంటారు.
ఇలాంటి ధోరణి సమాచార లోపాన్ని సృష్టిస్తుంది. అందుకే విద్యార్థులు స్వల్ప వ్యవధులకు సైతం డాక్యుమెంటేషన్ విస్మరించకుండా ఉంటే వారి ప్రొఫైల్ సంపూర్ణంగా ఉంటుంది. ఈ తరహా చిన్న విషయాలే విద్యార్థి ప్రొఫైల్‌ను మెరుగ్గా మారుస్తాయి; వీసా పొందే అవకాశాలను అధికం చేస్తాయి.
బి) ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్
ఇది ఒక్కో దేశానికి ఒక్కో రకంగా ఉంటుంది. సంబంధిత దేశాల ఇమిగ్రేషన్ రెగ్యులేషన్స్‌ను బట్టి ఇది దేశానికీ, దేశానికీ- నిన్నటికీ రేపటికీ మారుతుంటుంది. దీనివల్ల విద్యార్థులు తికమకపడిపోతుంటారు. సరైన మార్గదర్శకత్వం లేక హై కమిషన్ అవసరాలకు తగ్గట్టుగా డాక్యుమెంటేషన్ చేయకపోతే వీసా చేజారినట్టే. అందుకే తగినవిధంగా డాక్యుమెంటేషన్ చేయటం చాలా అవసరం.
విద్యార్థులు తమ ప్రాథమిక లక్ష్యం గురించి సందేహాలకు అతీతంగా రుజువు చేసుకోవాలి. నకిలీ డాక్యుమెంటేషన్‌కు ఆస్కారం ఇవ్వకుండా సరైన పేపర్ వర్క్‌నే సమర్పించాలి. సమాచారలోపం వల్లనో, మరో కారణం వల్లనో తప్పుడు డాక్యుమెంటేషన్ సమర్పించటం మూలంగా వీసా తిరస్కరణకే అవకాశం ఎక్కువ.
టెలిఫోనిక్ ఇంటర్వ్యూ
కొన్ని దేశాలకు సంబంధించిన వీసా ప్రక్రియలో భాగంగా హైకమిషన్ లేదా కాన్సలేట్ నుంచి విద్యార్థులకు ఫోన్ కాల్ రావొచ్చు. విద్యార్థి ఉద్దేశాలూ, లక్ష్యాలను తెలుసుకోవటం దీని లక్ష్యం. అలాంటి సందర్భంలో విద్యార్థి తగిన సమాచారంతో సిద్ధమైవుండాలి. అడిగిన ప్రశ్నలకు స్పష్టంగా జవాబులు చెప్పగలగాలి. వీసా పొందటానికి ఇది ముఖ్యమైన అంశమే. దీని ఆధారంగా కూడా వీసా లభించటం, లభించకపోవటం వుంటుంది. ఇటీవలి కాలంలో చాలా హైకమిషన్లు ఈ తరహా టెలిఫోనిక్ ఇంటర్వ్యూలకే మొగ్గు చూపుతూ విద్యార్థుల తీరును అంచనా వేస్తున్నాయి.
మొత్తమ్మీద కాన్సలేట్ల అవసరాలు గ్రహించటం, వాటికి అనుగుణంగా సిద్ధమవటం వీసాను అభిలషించే విద్యార్థులకు చాలా ముఖ్యం. దేశాలన్నీ తమ ఇమిగ్రేషన్ వెబ్‌సైట్లలో సంపూర్ణ సమాచారాన్ని ఉంచుతున్నాయి.
వాటిని క్షుణ్ణంగా చదవటం వల్ల విద్యార్థులు వివిధ అంశాలపై స్పష్టత ఏర్పరచుకోవచ్చు.
Monday, 17 October 2011
ఇలా వీసా... ఛలో అమెరికా!
విదేశీ విద్యాసంస్థలో ప్రవేశం పొందినంతమాత్రాన వీసాను మంజూరు చేయరు. వీసా ప్రక్రియకు అది ఆరంభం మాత్రమే.
సాధారణంగా చాలామంది విద్యార్థులకు అమెరికాలో చదవాలనేది ఓ స్వప్నం! మెజారిటీ విద్యార్థులు కోరుకునే అమెరికాలో ప్రవేశం పొందటం క్లిష్టమైన విషయమే. వీసా అనుమతిని పొందటం కోసం విద్యార్థులు ఇంటర్వ్యూకు హాజరవ్వాలనే నిబంధన చాలా తక్కువ దేశాల్లోనే ఉంది. అమెరికా దానిలో ఒకటి.
విద్యాసంస్థ నుంచి అడ్మిషన్ లెటర్ (I 20 ) పొందగానే విద్యార్థులు ఏ చర్యలు అనుసరించాలో చూద్దాం.
*I 20 పొందగానే విద్యార్థి వీసా రుసుము (ఫీ) 140 డాలర్లు (1 USD = 50 INR) చెల్లించాలి. ఎంపిక చేసిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల్లోనే ఈ రుసుమును చెల్లించాలి.
ఈ లింకు చూస్తే వివరాలు తెలుస్తాయి.
https://www.vfs-usa.co.in/USIndia/pdf/HDFC%20Locationsfeescenter.pdf
* రుసుము చెల్లించేటపుడు విద్యార్థి పాస్‌పోర్ట్ మొదటి పేజీ తాలూకు స్పష్టమైన ఫొటో కాపీని బ్యాంకుకు సమర్పించాల్సివుంటుంది. అప్పుడు బ్యాంకు వారు వీసా రుసుము రసీదును (డూప్లికేట్ కాపీ- 10 అంకెల బార్‌కోడ్ నంబర్ అతికించి) ఇస్తారు. ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ షెడ్యూల్‌కు ఈ బార్‌కోడ్ ఉపయోగపడుతుంది. వీసా రుసుము రసీదు కొనుగోలు చేసిన తర్వాత ఒక రోజుకు ఇది యాక్టివేట్ అవుతుంది. వీసా రుసుమును వెనక్కి ఇచ్చెయ్యరు. ఏడాది బాటు ఇది చెల్లుతుంది.
* విద్యార్థులు ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ షెడ్యూల్ కోసం DS-160 పత్రాన్ని నింపాల్సివుంటుంది.
ఈ పత్రం లభించే లింకు:
http://ceac.state.gov/genniv/
* కన్ఫర్మేషన్ కాపీని ప్రింట్ తీసుకోవాలి. దీనిలో CEAC బార్‌కోడ్ నంబర్ ఉంటుంది. ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ షెడ్యూల్‌కి ఈ నంబర్ ఉపయోగపడుతుంది.
* ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ షెడ్యూల్ కోసం కింది లింకులు చూడండి. (హెచ్‌డీఎఫ్‌సీ రసీదు సంఖ్య, సీఈఏసీ బార్‌కోడ్ ముఖ్యమైనవి)
https://www.vfs-usa.co.in/ApplnForms/RegularUser.aspx
*ఇంటర్వ్యూకు వెళ్ళేముందు విద్యార్థి SEVIS రుసుము 200 డాలర్లు చెల్లించాల్సివుంటుంది.
ఈ వెబ్‌సైట్ ద్వారా... www.fmjfee.com
దీంతోపాటు వీసా కోసం ఫైనాన్షియల్ డాక్యుమెంట్ తయారుచేయటం చాలా ముఖ్యం.
వీసా ఇంటర్వ్యూ కోసం ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు
విద్యార్థులు యు.ఎస్.లో చదువు కోసం తమవద్ద తగినన్ని నిధులుండేలా చూడాలి. బోధనా రుసుము, జీవన వ్యయం, ప్రయాణం, పుస్తకాలు, స్టేషనరీ... ఇతర రుసుములన్నిటికీ సరిపోయేలా ఈ నిధులుండాలి. చాలా విశ్వవిద్యాలయాలకు ఇది దాదాపు రూ.15-25 లక్షల మధ్య ఉంటుంది.
ఈ నిధులన్నీ ఈ రూపంలో చూపాలి.
*ఫిక్సెడ్ డిపాజిట్లు
*బ్యాంకు నిల్వ
*స్పాన్సర్స్ పీఎఫ్‌లు
* విద్యారుణాలు
* తపాలా బ్యాండ్లు
* మ్యూచ్యువల్ ఫండ్లు
విద్యార్థులు రూ.80 లక్షల నుంచి కోటి వరకూ ఫిక్సెడ్ ఆస్తులు చూపించాలి.
ఇవి ఏ రూపంలో ఉండొచ్చంటే...
* ప్లాట్లు
* ఫ్లాట్లు
* ఇల్లు
* భూములు
* పొలాలు/ వ్యవసాయ భూములు
* వార్షిక ఆదాయం కూడా చూపించవచ్చు.
* ఇవి ఎన్ని రకాలుగా ఉండొచ్చంటే...
* వేతన ఆదాయం
* వ్యాపార ఆదాయం
* వ్యవసాయ ఆదాయం
* అద్దె ఆదాయం
* పెన్షన్; ఎఫ్‌డీలూ మొదలైనవాటి వడ్డీ
ఫైనాన్షియల్ డాక్యుమెంట్లతో పాటు తీసుకువెళ్ళాల్సిన డాక్యుమెంట్లు
* టెన్త్
* ఇంటర్మీడియట్
* డిగ్రీకి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలూ (విడి మార్కుల షీట్లతో కలిపి)
* GRE, TOEFL/IELTs స్కోరు కార్డులు
* ఎక్‌స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్
* పాస్‌పోర్టు
* DS-160 కన్ఫర్మేషన్
* హెచ్‌డీఎఫ్‌సీ రసీదు
* ఇంటర్వ్యూ లేఖ
* SEVISరుసుము రసీదు
*CA & CE నివేదిక
*స్పాన్సర్స్ నుంచి అఫిడవిట్
విద్యార్థి వీసా ఇంటర్వూకు వెళ్ళేటపుడు పైన ప్రస్తావించిన డాక్యుమెంట్లన్నీ ఒరిజినల్స్ తీసుకువెళ్ళాలి.
వీసా ఇంటర్వ్యూ
పైన చెప్పిన డాక్యుమెంట్లన్నీ సిద్ధమైనంతమాత్రాన వీసా వచ్చేసినట్టే అనుకోవచ్చా? లేదు! అత్యంత ముఖ్యమూ, కీలకమూ అయిన వీసా ఇంటర్వ్యూ ఉంది కదా? దీన్ని ధైర్యంగా ఎదుర్కొని, వీసా అధికారి ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సివుంటుంది. ఇక్కడే చాలామంది విద్యార్థులు విఫలమవుతూ వీసా పొందలేకపోతున్నారు. ఆ పరిస్థితి ఎదురుకాకూడదంటే ఇంటర్వ్యూకు హాజరవ్వటానికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ముఖ్యమైన ఈ ప్రక్రియ ఉద్దేశం ఏమిటంటే... విద్యార్థి తన చదువు ముగిసిన తర్వాత తన ఆర్థిక, సామాజిక బంధాలు, కుటుంబ పరిస్థితుల దృష్ట్యా స్వదేశానికి తిరిగి రావటానికి సిద్ధంగా ఉంటాడని రుజువు కావాలి. దీన్నే వీసా అధికారి ఆశిస్తారు. ఈ ఇంటర్వ్యూ 1-3 నిమిషాల వ్యవధిలో ముగియవచ్చు.
వీసా అధికారితో మాట్లాడేటపుడు...
* వస్త్రధారణ హుందాగా ఉండాలి. మొహంలో చిరునవ్వు కనిపించాలి.
* ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి. అధికారి కళ్ళలోకి చూస్తూ జవాబులు చెప్పాలి. ధీమాగా ఉంటూనే అధికారి పట్ల గౌరవం ప్రదర్శించాలి.
* అడిగిన ప్రశ్నలన్నిటికీ నిజాయతీగా, స్పష్టంగా సమాధానాలు చెప్పాలి.
* మీరు చదవబోయే విద్య, పొందబోయే డిగ్రీ భారత్‌లో మీకెంత ఉపయోగకరమో వివరించగలగాలి. స్వదేశానికి తిరిగి వచ్చాక మీ లక్ష్యాలేమిటన్నది వివరణ ఇవ్వగలిగివుండాలి.
* సుదీర్ఘంగా జవాబు చెప్పటమో, పొంతన లేని సంగతులు మాట్లాడటమో చేయకూడదు.
ప్రశ్నలు ఎలా ఉంటాయి?
వీసా ఇంటర్వ్యూలో రకరకాల ప్రశ్నలను అడుగుతుంటారు. కొన్ని నమూనా ప్రశ్నలను చూద్దాం.
అమెరికాయే ఎందుకని?
* Why do you want to study in the USA?
* Why do you wish to study in the US and not in India?
విశ్వవిద్యాలయాలూ, ప్రవేశం
* How many universities did you apply for?
* Which universities (both admits and rejects) did you apply for?
* Which universities accepted you?
* Why did you choose a specific university?
* Can you tell me some details about your university?
* Can you mention the names of some professors?
* Do you know anyone (in USA) or in your University?
* What do you plan to study at the university?
విద్యాసంబంధ అంశాలు
* Where did you do your bachelor's degree from?
* What is your undergraduate GPA/ Percentage?
* Do you have any backlogs?
* Why you have so many backlogs?
* What is your specialisation?
* Could you please show me your GRE/TOEFL scorecard?
ఉపకార వేతనాలు
* Did you receive any scholarships?
* Why do you think the university is giving a scholarship to you?
* Why haven't you received any scholarship?
భవిష్య ప్రణాళికలు
* What will you do after completing MS?
* What are your plans after graduation?
* What will you do if your visa is rejected?
* Will you comeback to home during summers?
* How will your study in the US be helpful to you in your home country after comeback?
సబ్జెక్టును మార్చుకుంటే...
* (If you have changed the field of specialisation, e.g. you have bachelor's degree in Mechanical Engineering and are going for a masters in Computer Science) Why do you want to change your major?
* What steps have you taken to ensure that you will be able to perform well in the new field you wish to change to?
ఆర్థిక విషయాలు
* Who is sponsoring you?
* What does your father do?
* What is your father's annual income? Does he pay income tax?
* How many brothers and sisters do you have?
* Are your parents retired? If yes, how will they pay for your education expenses?
* If you have xx brothers and sisters so your father's savings are for all, how will he finance you?
* Have you received any loans?
* Why you have not taken a loan?
ఇతర ప్రశ్నలు
* Do you have a brother/sister, or any other relative already at this university?
* Do you have any relatives in USA?
(If you are currently working) why are you leaving your current job?
* Have you ever been to the US?
ఈ వ్యాస రచయిత.. శుభకర్ ఆలపాటి.
Tuesday, 4 October 2011
విదేశీ విద్యార్థులకు ఆస్ట్రేలియా ఆహ్వానం
మన దేశ విద్యార్థులు పెద్దసంఖ్యలో ఉన్నతవిద్యకోసం వెళ్ళే దేశాల్లో ఆస్ట్రేలియాది మొదటిశ్రేణి. అయితే భారతీయ విద్యార్థులపై జరిగిన దాడులూ, ఇతర కారణాలతో స్తబ్ధత ఆవరించింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం విదేశీ విద్యార్థులకు సంబంధించి కొత్తగా సంస్కరణలు అమల్లోకి తెస్తోంది. ఇవి ప్రయోజనకరంగా, విద్యార్థులను ఆకట్టుకునేలా ఉన్నాయనీ, ఆస్ట్రేలియా విద్యాపరంగా పూర్వవైభవం సంతరించుకోవచ్చనే అంచనాలు పెరుగుతున్నాయి.
ఈ కథనం రాసినవారు- శుభకర్ ఆలపాటి
నాణ్యమైన విద్య మాత్రమే కాకుండా చక్కని జీవనశైలి కావాలనుకునే విద్యార్థులు గమ్యంగా ఎంచుకునే దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. ఈ మధ్య విద్యారంగంలో ఆస్ట్రేలియా ప్రాభవంకొంత తగ్గినప్పటికీ ప్రాచుర్యం మాత్రం అలాగే ఉంది.
ప్రపంచంలో నివాస యోగ్య ప్రదేశాల్లో అత్యుత్తమమైనవాటి జాబితాను తయారుచేస్తే దానిలో ఆస్ట్రేలియా తప్పనిసరిగా చోటుచేసుకుంటుంది. విద్యార్థులు ప్రామాణిక విద్య నేర్చుకోవటానికీ, విద్యాపరంగా అభివృద్ధి చెందటానికీ, ఆసక్తి ఉంటే వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడటానికీ ఆకర్షణీయమైన అవకాశాలున్న దేశమిది. ఇక్కడి వాతావరణం దాదాపు భారత్ తరహాలోనే ఉంటుంది. ఆస్ట్రేలియాలో చదవటానికి ఎక్కువమంది మొగ్గుచూపటానికి ఇదో ముఖ్య కారణం.
రాజధాని Canberraతో పాటు సిడ్నీ, మెల్‌బోర్న్, బ్రిస్‌బేన్, పెర్త్, అడిలైడ్, డార్విన్, హోబర్ట్ ఇక్కడి ప్రధాన నగరాలు. ఈ దేశంలో జనాభా చాలా తక్కువ. అందులోనూ అందమైన తీరప్రాంతం పొడవునా జనజీవనం అధికంగా కనిపిస్తుంది.
ఏమిటి ప్రత్యేకతలు?
ఇక్కడ చదువుకునే విద్యార్థుల్లో వినూత్న ఆలోచనాపథం, సృజనాత్మకత, స్వతంత్ర దృక్పథం పెంపొందుతాయనేది ప్రాచుర్యంలో ఉన్న అభిప్రాయం.
బృందంలో భాగంగా పనిచేసే నేర్పు, ప్రభావశీలంగా భావ ప్రకటన, ప్రాయోగిక నైపుణ్యాలు, మేధో సామర్థ్యం... ఇవన్నీ మెరుగుపరుచుకుంటేనే అంతర్జాతీయ స్థాయిలో నెగ్గుకురాగలం. ఆస్ట్రేలియాలో చదువుకునే క్రమంలో విద్యార్థులు వీటిని గణనీయంగా పెంపొందించుకోగలుగుతారు.
ఆధునిక కాలంలో విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను నూతన బోధన పద్ధతుల ద్వారా అందించటం ఆస్ట్రేలియా ప్రత్యేకత. అత్యాధునిక సాంకేతికత, అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, బహుళ సంస్కృతులకు కేంద్రంగా ఉండటం ఇక్కడి విద్యాసంస్థల విశిష్టత. విదేశీ విద్యార్థులు ఎంచుకోవడానికి విస్తృతమైన స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. నవీన సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికీ, పరిశోధనలకూ వీలు ఏర్పడుతుంది.
ఏ కోర్సులకు ప్రాధాన్యం?
ఆస్ట్రేలియాలో ఉత్తమ కోర్సులుగా ప్రాచుర్యం పొందినవి: హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ హాస్పిటాలిటీ, ఇంజినీరింగ్, ఎంబీఏ, ఫిజియోథెరపీ, మెడిసిన్ అండ్ లైఫ్ సైన్సెస్, ఐటీ అండ్ కంప్యూటర్ సైన్స్, ఏవియేషన్, స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్, ఎడ్యుకేషన్ అండ్ టీచింగ్, మెడికల్ రేడియాలజీ
మనదేశ విద్యార్థులు ఆస్ట్రేలియాలో ఎక్కువగా చేరుతున్న కోర్సులు- బిజినెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, సైన్స్, హాస్పిటాలిటీ మొదలైనవి. ఇక్కడ విద్యార్థులకు అత్యధిక అవకాశాలు అందించే డిగ్రీ కోర్సులు... బిజినెస్ కోర్సుల నుంచి కంప్యూటర్ సైన్స్, ట్రేడ్స్, ఎడ్యుకేషన్ వరకూ అన్ని స్థాయుల్లో ఉన్నాయి. ఆస్ట్రేలియా విద్యాసంస్థలు అందించే డిగ్రీలను అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ గుర్తిస్తోంది. దీనివల్ల ఏ భారతీయ విశ్వవిద్యాలయంలోనైనా తర్వాతి చదువులకూ, ప్రభుత్వోద్యోగాలకూ అవకాశం ఏర్పడుతుంది.
ఆస్ట్రేలియా వ్యాప్తంగా వివిధ వొకేషనల్ విద్య, శిక్షణ కళాశాలల్లో చాలామంది విదేశీ విద్యార్థులు చేరుతున్నారు. నాణ్యమైన విద్యాసంస్థలూ, కోర్సులు అందుబాటులో ఉంచటానికి అక్కడి ప్రభుత్వం వివిధ చర్యలు చేపట్టింది. దీని ప్రకారం విద్యాసంస్థలన్నీ అక్రిడిటేషన్ పొందివుండాలి. అంతర్జాతీయ విద్యార్థులకు అందించే కోర్సులన్నీ తప్పనిసరిగా అనుమతి పొందివుండాలి. కామన్‌వెల్త్ రిజిస్టర్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ కోర్సెస్ ఫర్ ఓవర్‌సీస్ స్టూడెంట్స్ (CRICOS) లో లిస్టయివుండాలి. విద్యార్థులకు అందించే అర్హతలు ఆస్ట్రేలియన్ క్వాలిఫికేషన్స్ ఫ్రేమ్‌వర్క్‌కు తగివుండాలి.
ప్రవేశానికి ఏం కావాలి?
కోర్సుల అవసరాలను బట్టి వివిధ దేశాలూ, అక్కడి విశ్వవిద్యాలయాల్లో ఒక్కోటి ఒక్కోరకమైన ప్రవేశ అర్హతలను నిర్దేశిస్తున్నాయి. ఆస్ట్రేలియా దేశంలో ఇమిగ్రేషన్ విభాగం వారు TOEFLను అనుమతించటం లేదు. కాబట్టి ఇక్కడ చదవదల్చిన విద్యార్థులు IELTS పరీక్ష రాయటం తప్పనిసరి. దానిలో స్కోరు తక్కువ వచ్చినప్పటికీ ఈ దేశాల్లో చదవటానికి ప్రవేశం లభిస్తుంది.
పరిగణనలోకి తీసుకునే స్కోరు: 5- 5.5.
* ఇన్‌టేక్స్: ఇక్కడ ఇన్‌టేక్ రెండు సీజన్లలో జరుగుతుంది. ఇక్కడి విద్యాసంస్థల ప్రధానమైన ఇన్‌టేక్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి/ మార్చి తొలిభాగంలో జరుగుతుంది. జులై /ఆగస్టు నెలల్లో మరో ఇన్‌టేక్ ఉంది. కొన్ని స్పెషలైజ్‌డ్ ప్రోగ్రామ్స్‌కు సంబంధించిన కోర్సుల్లో ఈ ఇన్‌టేక్‌లో కూడా ఎక్కువమందే చేరతారు. మే, అక్టోబరు, నవంబరుల్లో ప్రారంభమయ్యే కోర్సులు కూడా ఉన్నాయి.
ట్యూషన్ ఫీజు/విద్యావ్యయం (AUDఏటా)
అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్:
యూనివర్సిటీలు: 16,000- 27,000
కళాశాలలు: 13,000- 17,000
పోస్టు గ్రాడ్యుయేట్ స్టడీస్:
యూనివర్సిటీలు: 17,000- 28,000
కళాశాలలు: 15,000- 21,000
ఆస్ట్రేలియా హై కమిషన్ వీసా మార్గదర్శకాల ప్రకారం ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి జీవనవ్యయం 18,000 AUD అవుతుంది.
* ఉపకారవేతనాలు: ఎక్కువమంది అంతర్జాతీయ విద్యార్థులు పూర్తి ఫీజును చెల్లించేవారే. అయితే ఉపకార వేతనాలకు (స్కాలర్‌షిప్పులు) దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉంది.
ఆస్ట్రేలియా ప్రభుత్వం, విద్యాసంస్థలు, ఇతర సంస్థలెన్నో ఉపకారవేతనాలు అందిస్తున్నాయి. వొకేషనల్ విద్య, శిక్షణ, స్టూడెంట్ ఎక్స్చేంజెస్, అండర్ గ్రాడ్యుయేట్, పీజీ స్టడీ, రిసర్చ్‌లలో ఈ వెసులుబాటు లభిస్తుంది.
దరఖాస్తు సమయంలో...
ఆస్ట్రేలియాలో విద్యాభ్యాసం కోసం చేసే దరఖాస్తులో సిద్ధం చేసుకోవాల్సిన డాక్యుమెంట్ల జాబితా:
బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ (యూనివర్సిటీ)
* టెన్త్ (ప్రిన్సిపల్ అటెస్ట్ చేసినది- సీల్డ్‌కవర్లో)
* 10+2 / డిప్లొమా (ప్రిన్సిపల్ అటెస్ట్ చేసినది- సీల్డ్‌కవర్లో)
* బ్యాచిలర్స్ / మాస్టర్స్- విడి మార్క్‌షీట్లు
* కన్సాలిడేటెడ్ / ప్రొవిజనల్ / డిగ్రీ / కోర్సు కంప్లీషన్
* IELTS స్కోరు
* రికమండేషన్ లెటర్స్ (అవసరమైతే)
* స్టేట్‌మెంట్ ఆఫ్ పర్సస్ (అవసరమైతే)
* సీవీ లేదా రెజ్యూమే
* ఎక్స్‌పీరియన్స్ లెటర్ (ఉంటేనే)
* పాస్‌పోర్ట్ జిరాక్స్ (తొలి, చివరి పేజీలు)
* ఎక్స్‌ట్రా కరిక్యులర్ సర్టిఫికెట్లు (ఉంటేనే)
* పాస్‌పోర్టు సైజు ఫొటో

Wednesday, 7 September 2011
విశ్వవిద్యాలయాల ఎంపికలో జాగ్రత్త!
'ఉన్నత విద్య అభ్యసించాలంటే విశ్వవిద్యాలయం ఎంపిక కీలకం.. తొందరపాటు తగదు.. ప్రపంచంలో ఎక్కడ చదవాలనుకున్నా.. తొలుత సమగ్ర అధ్యయనం అవసరం. అనేక విధాలుగా విశ్వవిద్యాలయాల పుట్టుపూర్వోత్తరాలను తెలుసుకోవాలి. అందుకు అనేక మార్గాలున్నాయి. వాటిని వినియోగించుకుంటే మున్ముందు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు...' అని అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ఇండియానా విశ్వవిద్యాలయం అధ్యక్షుడు మైఖేల్ మెక్ రాబీ అన్నారు.
11 రోజుల భారతదేశ పర్యటనకు వచ్చిన ఆయన మంగళవారం 'న్యూస్‌టుడే'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ విశేషాలు ఇవాళ ఈనాడు హైదరాబాద్ సిటీ ఎడిషన్లో వచ్చాయి. ఇతర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు కూడా ఉపయుక్తంగా ఉంటాయనే ఉద్దేశంతో ఇక్కడ ఇస్తున్నాం.
అమెరికా విశ్వవిద్యాలయాలకు ఇచ్చే ర్యాంకింగ్ చాలా ప్రతిష్ఠాత్మకమైందని చెప్పిన మైఖేల్ మెక్ రాబీ.. అన్ని కోణాల్లో అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే విద్యార్థులను చేర్చాలని సూచించారు. షాంఘై, బీజింగ్ స్థాయిలో హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతోందని ప్రశంసించారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో చాలా విషయాలు తనను అబ్బుర పరిచాయన్నారు.
ఇంకా అనేక అంశాలపై ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
ప్రశ్న: అమెరికాలో విశ్వవిద్యాలయాలు మూసివేయడం వల్ల భారతీయ విద్యార్థులు కష్టాల పాలవుతున్నారు. ఇందుకు పరిష్కారం ఏమిటి?
జవాబు: ఉన్నత విద్య కోసం అమెరికా వచ్చే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా ఉంది. వివిధ కారణాలరీత్యా ఇటీవల అమెరికాలో రెండు విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి. అందువల్ల భారతీయ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడిన మాట వాస్తవమే. అయితే విశ్వవిద్యాలయాల ఎంపికలో తొందరపాటు పనికి రాదు. సమగ్ర అధ్యయనం, పరిశీలన తరువాతే వాటిని ఎంపిక చేసుకోవాలి.
ప్ర: విశ్వవిద్యాలయాలను ఎలా ఎంపిక చేసుకుంటే బాగుంటుంది?
జ: అమెరికాలో వందల సంఖ్యలో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసినవి ఆ రెండు మాత్రమే. అంత మాత్రాన అన్నింటి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విశ్వవిద్యాలయాల ర్యాంకింగును ప్రామాణికంగా తీసుకోవాలి. సమాచారం కోసం భారతదేశంలో ఉన్న అమెరికన్ కాన్సులేట్ కార్యాలయాలను సంప్రదించవచ్చు. అక్కడ పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. అంతర్జాలం(ఇంటర్‌నెట్) ద్వారా తెలుసుకోవచ్చు. ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. విశ్వవిద్యాలయం ఎప్పుడు పుట్టింది? ఎంతమంది విద్యార్థులున్నారు? ఫ్యాకల్టీ ఎలా ఉంది? ఫలితాల తీరు తెన్నులు ఏమిటి? ఆ విశ్వవిద్యాలయానికి ఉన్న గుడ్‌విల్ ఎలా ఉంది? ఇలా అన్ని విషయాలు పరిశీలించాలి. ఆ తరువాతే వాటిని ఎంపిక చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నది నా అభిప్రాయం.
ప్ర: హైదరాబాద్ విశ్వవిద్యాలయంతో కుదిరిన అవగాహనఒప్పందం విద్యార్థులకు ఎలా ఉపయుక్తం కానుంది?
జ: మేధో సంపత్తి విస్తృతమయ్యే కొద్దీ ప్రపంచ వ్యాప్తంగా అవకాశాలు ఆవిష్కృతం అవుతున్నాయి. అక్కడి నుంచి బోధనా సిబ్బందిని ఇక్కడికి పంపటం ద్వారా విద్యార్థులకు పలు అంశాలపై మరింత మేథస్సును పంచేందుకు అవకాశం దొరుకుతుంది. ఆయా అంశాలు వృత్తిగత జీవితానికి ఎంతో ఉపకరిస్తాయి. పరిశోధనాంశాల్లో కూడా రెండు విశ్వవిద్యాలయాలు ఇకనుంచి ముందడుగు వేస్తాయి. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో పచ్చదనం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక్కడి ఫ్యాకల్టీ చాలా బాగుంది. వివిధ విషయాలకు సంబంధించిన 12 మంది డీన్స్‌తో అనేకాంశాలను చర్చించాను. వారి ఎక్స్‌పోజర్ ఎంతో విస్తృతంగా ఉంది. నన్ను ఆకట్టుకుంది.
ప్ర: మీ పరిశోధనల్లో ప్రపంచానికి ఆందోళన కలిగిస్తున్న పర్యావరణానికి ఎలాంటి స్థానం ఉంది? ఆ రంగంలో అవకాశాలు ఎలా ఉన్నాయి?
జ: పర్యావరణానికి సంబంధించిన ప్రత్యేక వ్యవస్థ ఉంది. ఈ విషయంలో సామాజిక బాధ్యత కూడా ఉంది. ఇక్కడ చేసిన పరిశోధనల్లో అంశాలు, విధాన నిర్ణయాలుగా కూడా మారాయి. భారతీయ విశ్వవిద్యాలయాలతో కలిసి పర్యావరణంపై పరిశోధనలు చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఈ రంగంలో అవకాశాలు కూడా మెండుగానే ఉన్నాయి.
ప్ర: అంతర్జాతీయ విద్యలో భాగంగా చైనా, కెన్యా, మెక్సికోతదితర దేశాల్లో మాదిరిగా 'అవుట్ రీచ్' ప్రాజెక్టుల జాబితాలో భారతదేశం ఉందా?
జ: మా ప్రాథమ్యాల్లో భారతదేశం ఎప్పుడూ ఉంటుంది. అవుట్ రీచ్ ప్రోగ్రామ్‌ను ప్రస్తుతం భారత్‌లో ప్రవేశపెట్టే యోచన లేదు. భవిష్యత్తు గురించి ఇప్పుడే చెప్పలేను. ఇక్కడి విధానాలు సైతం ఒక కారణం కావచ్చు. రెండోది ప్రస్తుతం చేపట్టిన దేశాల్లో వెనుకబాటుతనం చాలా అధికంగా ఉంది.
ప్ర: జీవన ప్రమాణాల మెరుగుదలకు మీ విశ్వవిద్యాలయం లైఫ్‌సైన్సెస్‌లో కీలక పరిశోధనలు చేస్తోంది. వాటిని భారతదేశ విశ్వవిద్యాలయాలకు కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయా?
జ: నిస్సందేహంగా ఉన్నాయి. హైదరాబాద్ విశ్వవిద్యాలయంతో చర్చించాల్సిన అజెండాలో ఆ అంశాన్ని చేర్చుకుని వచ్చాను. చర్చించాను కూడా. ఈ విశ్వవిద్యాలయం కూడా మెడికల్ సైన్సెస్ రంగంలోకి రాబోతుందని తెలుసుకున్నాం. మా లైఫ్ సైన్స్‌స్ విభాగం అమెరికాలో రెండో స్థానంలో ఉంటుంది. అతిపెద్ద నెట్‌వర్క్ ఆస్పత్రులు ఉన్నాయి. పరిశోధనలు విస్తృతంగా సాగుతున్నాయి. వాటిని చెప్పలేనుగానీ చాలా కీలకం అని మాత్రం చెప్పగలను. ఈ రంగంలోనూ హైదరాబాద్ విశ్వవిద్యాలయంతో కలిసి పని చేసేందుకు ఉత్సాహంగా ఉన్నాం.
ప్ర: ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)లో మీకు నచ్చిన అంశాలు ఏమిటి? అంతర్జాతీయంగా ఏ స్థాయిలో ఉంటుందని భావిస్తారు?
జ: అక్కడి ప్రమాణాల గురించి వ్యాఖ్యానించటం సాహసమే.ఐఐఎంకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. అందుకే అక్కడికి వెళ్లాను. పరిశీలించాను. పలు అంశాలపై చర్చించాను. వారు చేస్తున్న కృషి ఘనంగా ఉంది.
ప్ర: 11 రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ, ముంబయి, బెంగళూరులో పర్యటించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు. మీరు గుర్తించిన అంశాలు ఏమిటి?
జ: హైదరాబాద్ రావటం ఇదే మొదటిసారి. విస్తృతంగా పర్యటించలేక పోయాను. ఇక్కడ జరిగిన, జరుగుతున్న అభివృద్ధి మాత్రం విశ్వవ్యాప్తంగా చర్చనీయాంశమే. మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థ హైదరాబాద్ రావడం అంటే చిన్న విషయం కాదు. షాంఘై, బీజింగ్ స్థాయిలో ఈ నగరం అభివృద్ధి జరుగుతోందని నా భార్య లారీ బర్న్స్‌కు ఇంతకుముందే చెబుతూ వచ్చాను. ఇతర నగరాలతో పోల్చినా హైదరాబాద్ అందంగా కనిపిస్తోంది.
(హైదరాబాద్ - న్యూస్‌టుడే)
Monday, 22 August 2011
విదేశీ విద్యకు విధివిధానాలు
బీటెక్ అవకుండానే ‘ఫారిన్’కు వెళ్ళటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు మన విద్యార్థులు.
విదేశీ పట్టా అత్యుత్తమ భవితను అందిస్తుందని నమ్మేవారి సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది.
* కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలు 'స్థిరపడే' అవకాశాలను అందిస్తున్నాయి.
* యు.కె., ఐర్లాండ్ వేగవంతమైన కోర్సులనూ, సంపాదించే అవకాశాలనూ ఇస్తున్నాయి.
* పరిశోధనకూ, ఉత్తమ శ్రేణి విద్యా నైపుణ్యానికీ యు.ఎస్.ఎ. వీలు కల్పిస్తోంది.
* జర్మనీ, స్వీడన్ లాంటి దేశాల్లో తక్కువ ఫీజుకే చదువుకునే సౌకర్యం ఉంది.
విద్యార్థులను ఆకర్షించటంలో వీటన్నిటిలో యు.ఎస్.ఎ. మిగిలిన దేశాలకంటే ముందంజలో ఉంది.
విదేశంలో చదవాలనుకునే విద్యార్థులు నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
* సరైన దేశం, విద్యాసంస్థ
* విద్యాపరమైన అర్హతలు
* ఆర్థిక సామర్థ్యం
* కెరియర్ అవకాశాలు.
వీటి గురించీ, ప్రవేశాలకు డెడ్ లైన్లు, pre requisite tests కు ఎంత స్కోర్లుండాలి...
ఇవన్నీ వివరంగా ఇవాళ చదువులో ప్రచురించిన ప్రధాన కథనం లో తెలుసుకోవచ్చు.
ఈ వ్యాస రచయిత శుభకర్ ఆలపాటి.
Subscribe to:
Posts (Atom)