ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Showing posts with label దూరవిద్య. Show all posts
Showing posts with label దూరవిద్య. Show all posts

Saturday, 10 December 2011

సెంట్రల్‌ యూనివర్సిటీలో దూరవిద్య కోర్సులు

    దేశంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థ యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ దేశంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థ యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ దూరవిద్య పద్ధతిలో వివిధ పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తోంది.

యూనివర్సిటీ ఆధ్వర్యంలోని సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ అండ్‌ వర్చ్యువల్‌ లెర్నింగ్‌ ఈ కోర్సులను నిర్వహిస్తోంది.

ఎన్‌ఐఆర్‌డీ, జీవీకే బయోసైన్సెస్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, ట్రూత్‌ ల్యాబ్స్‌, నార్మ్‌ సహకారంతో ప్రత్యేక కోర్సులను అందిస్తోంది.

పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ప్రోగ్రామ్‌ల వివరాలు...
    * ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌
    * కెమికల్‌ ఎనాలిసిస్‌ అండ్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌
    * సైబర్‌ లాస్‌ అండ్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌
    * బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌
    * క్రిమినల్‌ జస్టిస్‌ అండ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌
    * గవర్నన్స్‌
    * హ్యూమన్‌ రైట్స్‌
    * టెలికమ్యూనికేషన్స్‌
    * కమ్యూనికేటివ్‌ ఇంగ్లిష్‌
    * ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌ ఇన్‌ హిందీ
    * మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ ట్రాన్స్‌లేషన్‌ టెక్నిక్స్‌ ఇన్‌ తెలుగు
    * మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ ట్రాన్స్‌లేషన్‌ టెక్నిక్స్‌ ఇన్‌ ఉర్దూ
    * మెడిసినల్‌ బోటనీ
    * సస్టయినబుల్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌
    * టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ ఇన్‌ అగ్రికల్చర్‌
    * బయో ఇన్ఫర్మేటిక్స్‌

వీటిలో చాలావరకు కోర్సులకు ప్రధాన అర్హత ఏదైనా డిగ్రీ. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని కోర్సులకు ప్రత్యేక అర్హతలు అవసరం. కోర్సుల వ్యవధి ఏడాది. విద్యార్థులతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తోన్న అభ్యర్థులు సంబంధిత రంగంలో తమ అవగాహన, సామర్థ్యాలు పెంపొందించుకోవడానికి ఈ ప్రోగ్రామ్‌లు ఉపయోగపడతాయి. అర్హత పరీక్షలో ప్రతిభ, అకడమిక్‌ రికార్డు, అనుభవం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులకు ప్రవేశ పరీక్ష ఉంటుంది.
    * కెమికల్‌ ఎనాలిసిస్‌ అండ్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కోర్సుకు డిగ్రీలో కెమిస్ట్రీ చదివుండాలి.
    * టెలికమ్యూనికేషన్స్‌ కోర్సుకు డిగ్రీలో మేథ్స్‌ లేదా ఫిజిక్స్‌ లేదా ఎలక్ట్రానిక్స్‌ చదివినవారు అర్హులు.
    * ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌ కోర్సులకు అభ్యర్థులు డిగ్రీలో సంబంధిత లాంగ్వేజ్‌ను (హిందీ, ఉర్దూ, తెలుగు) ఒక సబ్జెక్టుగా చదివుండాలి.
    * టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ ఇన్‌ అగ్రికల్చర్‌ కోర్సుకు కనీసం రెండేళ్ల అనుభవం అవసరం.
    * బయో ఇన్ఫర్మేటిక్స్‌ కోర్సుకు డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు అసవరం.

ఏడాదిలో ఒకటి లేదా రెండుసార్లు కాంటాక్టు తరగతులు నిర్వహిస్తారు. ఫీజులు కోర్సును బట్టి వేర్వేరుగా ఉంటాయి.

ఈ వివరాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో లభిస్తాయి. దరఖాస్తులను కూడా వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ 31 జనవరి 2012.

Sunday, 4 December 2011

స్టాక్‌ మార్కెట్స్‌లో పీజీ డిప్లొమా

బాంబే స్టాక్‌ ఎక్చేంజ్‌ (బీఎస్‌ఈ) ట్రైనింగ్‌ ఇన్ స్టిట్యూట్‌, ఇగ్నో సంయుక్తంగా పీజీ డిప్లొమా ఇన్‌ స్టాక్‌ మార్కెట్స్‌ కోర్సును నిర్వహిస్తున్నాయి.

స్టాక్‌ మార్కెట్లకు సంబంధించిన విభాగాల్లో కెరియర్‌కు ఈ కోర్సు ఉపయోగపడుతుంది.

స్టాక్‌ మార్కెట్‌ రంగానికి సంబంధించిన ప్రాథమిక అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలనుకునేవారు కూడా ఈ కోర్సు చేయవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు స్టాక్‌ మార్కెట్‌ రంగంలోని పరిశ్రమల్లో పనిచేయడానికి అవసరమైన సామర్థ్యాలను అందిస్తారు.

ప్రైమరీ మార్కెట్‌ సంబంధిత కంపెనీల్లో ఇప్పటికే పనిచేస్తోన్నవారికి కూడా ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. అర్హతలు, సామర్థ్యాలను పెంపొందించుకోవచ్చు. శిక్షణలో భాగంగా జనరల్‌ మేనేజ్‌మెంట్‌ అంశాలపై కూడా అవగాహన కల్పిస్తారు. ఈ కోర్సు ప్రధానంగా గ్రాడ్యుయేట్ల కోసం ఉద్దేశించినది.

దూరవిద్య పద్ధతిలో దీన్ని అందిస్తారు.

ఎంబీఏ, ఇంజినీరింగ్‌, ఎం.కాం, సీఏ, సీఎస్‌, ఐసీడబ్ల్యుఏ, లా, తదితర ప్రొఫెషనల్‌ కోర్సులు చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

కోర్సు వ్యవధి ఏడాది.

మొదటి సెమిస్టర్‌లో మేనేజ్‌మెంట్‌ ఫంక్షన్స్‌, క్వాంటిటేటివ్‌ ఎనాలిసిస్‌, మేనేజీరియల్‌ అప్లికేషన్‌, ఎకనమిక్‌ అండ్‌ సోషల్‌ ఎన్విరాన్‌మెంట్‌, క్యాపిటల్‌ మార్కెట్స్‌, ఫైనాన్షియల్‌ మార్కెట్స్‌ అంశాలుంటాయి.

చివరి సెమిస్టర్‌లో కార్పొరేట్‌ ఫైనాన్స్‌, ఫండమెంటల్‌ అండ్‌ టెక్నికల్‌ ఎనాలిసిస్‌, ఫారెక్స్‌ మార్కెట్స్‌, డెరివేటివ్స్‌, డెట్‌ మార్కెట్స్‌, ఇంటర్నేషనల్‌ స్టాక్‌ మార్కెట్స్‌, తదితర అంశాలుంటాయి.

కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు బీఎస్‌ఈ ట్రైనింగ్‌ ఇన్ స్టిట్యూట్‌, ఇగ్నో సంయుక్తంగా పీజీ డిప్లొమా ఇన్‌ స్టాక్‌ మార్కెట్స్‌ డిగ్రీని ప్రదానం చేస్తాయి.

ఇతర వివరాలకు బీఎస్‌ఈ వెబ్‌సైట్‌ http://www.bseindia.com/ చూడగలరు.

పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ  20 డిసెంబరు 2011.

Saturday, 19 November 2011

దూర విద్యలో ఎం.ఎడ్‌.


దూరవిద్య కోర్సులకు ప్రసిద్ధిగాంచిన ఇగ్నో మాస్టర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (ఎం.ఎడ్‌.) కోర్సును నిర్వహిస్తోంది.

ఈ కోర్సుకు ఎన్‌సీటీఈ గుర్తింపు ఉంది. విద్యారంగంలో పనిచేస్తోన్న వారికి ఈ కోర్సు వల్ల ప్రయోజనం ఉంటుంది. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తోన్న గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు, కాలేజీలు, ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థల్లో పనిచేస్తోన్నవారు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ ఇగ్నో ఎం.ఎడ్‌. చేయవచ్చు.

ఇగ్నో ఎం.ఎడ్‌. కోర్సు ఇంగ్లిష్‌ మాధ్యమంలో ఉంటుంది. ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. గరిష్ఠంగా నాలుగేళ్లలో కోర్సు పూర్తిచేయవచ్చు.

కనీసం 55 శాతం మార్కులతో బి.ఎడ్‌. ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎడ్‌ తర్వాత ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూలు, విద్యా పరిశోధన సంస్థలో కనీసం రెండేళ్లు పనిచేసుండాలి.

కోర్సు మొత్తానికి ఫీజు రూ.36000. ప్రవేశ సమయంలో మొత్తం ఫీజు చెల్లించాలి. ప్రింటెడ్‌ మెటీరియల్‌, ఆడియో, వీడియో ప్రోగ్రామ్‌లు, ఫీల్డ్‌ ప్రాజెక్టులు, వర్క్‌షాప్‌లు, అసైన్‌మెంట్లు, టెలీకాన్ఫరెన్స్‌లు, తదితర సాధనాల ద్వారా కోర్సును నిర్వహిస్తారు.

దేశవ్యాప్తంగా 51 ఇగ్నో ప్రాంతీయ కేంద్రాల్లో, 33 ప్రోగ్రామ్‌ స్టడీ సెంటర్లలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. కోర్సు జనవరి 2012 నుంచి ప్రారంభమవుతుంది.

దరఖాస్తులను ఇగ్నో వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. లేదా అన్ని ఇగ్నో ప్రాంతీయ కేంద్రాల నుంచి పొందవచ్చు. మనరాష్ట్రంలో ఇగ్నో హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ కేంద్రాల నుంచి దరఖాస్తులు పొందవచ్చు.

పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ  20 నవంబరు 2011.

ఇతర వివరాలు ఇగ్నో వెబ్‌సైట్‌ లో లభిస్తాయి.

Tuesday, 25 October 2011

ఇగ్నోలో ఈ-లెర్నింగ్‌ డిప్లొమా

నిరంతరం నూతన కోర్సులు ప్రవేశపెట్టడం ద్వారా ఇగ్నో వివిధ రకాల అభ్యర్థులను ఆకర్షిస్తోంది. తాజాగా పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ఈ-లెర్నింగ్‌ (పీజీడీఈఎల్‌) కోర్సును ఇగ్నో ప్రారంభించింది.

విద్యార్థులతోపాటు విద్యారంగంలోని అనేక ఇతర వర్గాలను దృష్టిలో ఉంచుకొని ఇగ్నో ఈ-లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. ఇది పూర్తిగా ఆన్‌లైన్‌ పద్ధతిలో కొనసాగనుంది.

దూరవిద్యలో ఈ-లెర్నింగ్‌ పద్ధతులను విస్తృతంగా వినియోగిస్తోన్న ఇగ్నో, ఈ నైపుణ్యాలను విద్యారంగంలో పనిచేసే వివిధ రకాల అభ్యర్థులకు అందించడానికి సిద్ధమైంది. జనవరి 2012 నుంచి పీజీడీఈఎల్‌ కోర్సును ప్రారంభించనుంది. ఇగ్నో ఆధ్వర్యంలోని స్టాఫ్‌ ట్రైనింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ (స్ట్రయిడ్‌) ఈ కోర్సును నిర్వహించనుంది. ఈ-లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌లకు అవసరమైన ప్రణాళిక, డిజైనింగ్‌, అభివృద్ధి, ఆచరణ, మూల్యాంకనం, తదితర అంశాల్లో నిపుణులను తయారుచేయడం ఈ ప్రోగ్రామ్‌ లక్ష్యం.

ఎవరికి ప్రయోజనకరం?
ఆన్‌లైన్‌ శిక్షణతోపాటు న్యూఢిల్లీలో ప్రాక్టికల్‌ తరగతులు ఉంటాయి. ప్రాజెక్టు వర్క్‌ కూడా చేయాలి. కోర్సు నిర్వహణ, మూల్యాంకనం ఎక్కువగా ఆన్‌లైన్‌ పద్ధతుల్లో ఉంటాయి. విద్యారంగంలో పనిచేసే ఉపాధ్యాయులు, ట్రైనర్లు, ట్రైనింగ్‌ మేనేజర్లు, ఇన్‌స్ట్రక్షనల్‌ డిజైనర్లు, కోర్సు డెవలపర్లకు ఈ ప్రోగ్రామ్‌ ద్వారా ప్రయోజనం ఉంటుంది. ఈ-లెర్నింగ్‌ పద్ధతులు పాటించే పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో పనిచేసేవారికి కూడా ఉపయోగపడుతుంది.

ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. గరిష్ఠంగా రెండేళ్లలో పూర్తిచేయవచ్చు. మొత్తం సీట్లు 50. ఏదైనా గ్రాడ్యుయేషన్‌ చేసిన అభ్యర్థులు అర్హులు. ఉన్నత విద్యార్హతలు గలవారికి ప్రాధాన్యం ఇస్తారు. కోర్సు ఫీజు రూ.15000. ప్రవేశ సమయంలో ఫీజు చెల్లించాలి. ప్రోగ్రామ్‌లో మొత్తం 5 కోర్సులు ఉంటాయి. అవి... ఇంట్రడక్షన్‌ ఆఫ్‌ ఈ-లెర్నింగ్‌, డిజైన్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌ ఆఫ్‌ ఈ- లెర్నింగ్‌ కోర్సెస్‌, మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ ఈ- లెర్నింగ్‌ ప్రాజెక్ట్స్‌, టెక్నాలజీస్‌ ఫర్‌ ఈ-లెర్నింగ్‌, ప్రాజెక్ట్‌ వర్క్‌.

ఎంపికలో వివిధ రకాల అర్హతలకు వెయిటేజీ ఉంటుంది. గ్రాడ్యుయేషన్‌కు 50 శాతం, పీజీ డిగ్రీకి 20 శాతం, ఎం.ఫిల్‌., పీహెచ్‌డీకి 10 శాతం, విద్య, సంబంధిత రంగాల్లో పనిచేస్తున్నట్లయితే 10 శాతం వెయిటేజీ ఉంటుంది. కోర్సు నుంచి మధ్యలో మానేసే అవకాశం ఉంటుంది. మొదటి ఆర్నెళ్ల తర్వాత (మూడు కోర్సులు పూర్తిచేసి) కోర్సు నుంచి వైదొలగితే సర్టిఫికెట్‌ ఇన్‌ ఈ-లెర్నింగ్‌ పట్టా లభిస్తుంది. ప్రోగ్రామ్‌లో సూచించిన ఐదు కోర్సులు పూర్తి చేస్తే డిప్లొమా ఇన్‌ ఈ-లెర్నింగ్‌ లభిస్తుంది.

* కోర్సులో చేరిన అభ్యర్థులకు పర్సనల్‌ కంప్యూటర్‌ అందుబాటులో ఉండాలి. హెడ్‌ఫోన్‌, మల్లీమీడియా సౌకర్యం తప్పనిసరి. వెబ్‌కామ్‌ కూడా ఉంటే మంచిది. వీడియో కాన్ఫరెన్సింగ్‌కు అవసరమైన స్పీడ్‌తో ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉండాలి.

* ఇగ్నో ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రింట్‌లను ఇతర సంబంధిత సర్టిఫికెట్‌ కాపీలతో పంపాల్సిన చిరునామా: జి. మైథిలి, ఎనలిస్ట్‌ (సెలక్షన్‌ గ్రేడ్‌), స్త్ట్రెడ్‌, ఇగ్నో. న్యూఢిల్లీ- 110068.