విభాగాలు ఎన్ని?
- ఆఫ్-క్యాంపస్ ప్రోగ్రామ్‌లు (1)
- ఆర్ ఆర్ బీ (1)
- ఇంగ్లిష్ (17)
- ఇంజినీరింగ్ (29)
- ఇంటర్న్ షిప్ లు (1)
- ఉపకార వేతనాలు (8)
- ఎలిజిబిలిటీ టెస్ట్ (5)
- ఏపీపీఎస్ సీ (25)
- ఏరోనాటిక్స్ (2)
- ఐఐటీ (2)
- ఐటీ/ సాఫ్ట్ వేర్ (2)
- ఐటీఐ... ఉద్యోగాలు (3)
- కాస్ట్ అకౌంటెన్సీ (1)
- కౌన్సెలింగ్ (2)
- జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు (3)
- జూనియర్ లెక్చరర్స్ (2)
- టాపర్ (1)
- దూరవిద్య (4)
- నైపుణ్యాలు (3)
- పీజీ (6)
- పీహెచ్ డీ (8)
- పోలీస్ (7)
- ఫార్మసీ (4)
- ఫైనాన్స్ (1)
- ఫ్యాషన్ డిజైనింగ్ (1)
- బోధన రంగం (7)
- బ్యాంకింగ్ (8)
- మీడియా (1)
- మేనేజ్ మెంట్ (2)
- మేనేజ్ మెంట్/ ఎంసీఏ (16)
- యూజీ/ పీజీ (3)
- యూపీఎస్ సీ (4)
- విదేశీ విద్య (9)
- వీఆర్ఏ (2)
- వీఆర్ఓ (2)
- వైద్యవిద్య (8)
- సందేహాలూ సమాధానాలూ (4)
- సమ్మర్ ఫెలోషిప్ లు (1)
- సహకార బ్యాంకులు (1)
- సాఫ్ట్ వేర్ (3)
- సివిల్స్ (16)
- సైన్సెస్ (1)
- స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (1)
- స్వాగతం (1)
- హాస్పిటాలిటీ (2)
- హెల్త్ కేర్ (2)
Showing posts with label పీహెచ్ డీ. Show all posts

Tuesday, 28 October 2014
Saturday, 3 December 2011
ప్రముఖ సంస్థల్లో పరిశోధనలకు... జెస్ట్-2012
ఫిజిక్స్, కంప్యూటర్స్, ఇతర శాస్త్ర విజ్ఞాన సంబంధిత సబ్జెక్టుల్లో పరిశోధనలు చేయాలనుకునే అభ్యర్థులకు మంచి అవకాశం... జాయింట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (జెస్ట్- 2012).
దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 23 శాస్త్ర పరిశోధన సంస్థల్లో ప్రవేశానికి నిర్వహిస్తోన్న పరీక్ష ఇది.
ఫిజిక్స్, థీరీటికల్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులకు సంబంధించిన అంశాల్లో ఇంటెగ్రేటెడ్ ఎం.ఎస్‌సి లేదా ఎం.టెక్.- పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశానికి జెస్ట్ అవకాశం కల్పిస్తుంది. జెస్ట్ స్కోరుతోపాటు, ఇతర అంశాల ఆధారంగా ఆయా సంస్థలు దాదాపు అభ్యర్థులందరికీ స్కాలర్‌షిప్‌లు అందిస్తాయి.
శాస్త్ర విజ్ఞాన రంగంలో ప్రపంచ స్థాయి సంస్థలు మనదేశంలో చాలా ఉన్నాయి. బెంగళూరులోని ఐఐఎస్‌సీ, జేఎన్‌సీఏఎస్‌ఆర్, ఐఐఎస్‌ఈఆర్‌లు, ఎన్‌ఐఎస్‌ఈఆర్, హోమీ భాభా ఇనిస్టిట్యూట్, రామన్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ మొదలైనవి అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ పరిశోధన సంస్థలు పేరు గడించాయి. ఇలాంటి సంస్థల్లో ప్రవేశం పొందడం, పరిశోధనలు చేయడం కొద్ది మంది సైన్స్ విద్యార్థులకు మాత్రమే లభించే అవకాశం. ఇలాంటి అనేక సంస్థలు జాయింట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్‌లో ప్రతిభ ఆధారంగా సీట్లను భర్తీ చేస్తున్నాయి. చాలా సంస్థలు ఇంటెగ్రేటెడ్ ఎం.ఎస్‌సి./ ఎం.టెక్. - పీహెచ్‌డీ కోర్సులను కూడా నిర్వహిస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి కూడా జెస్ట్ ర్యాంకునే ప్రాతిపదికగా తీసుకుంటారు.
జెస్ట్-2012తోపాటు ఇతర విద్యార్హతల విషయంలో సంస్థలు వేటికవే ప్రత్యేక నిబంధనలను పాటిస్తున్నాయి. సంబంధిత సంస్థల వెబ్‌సైట్లలో ఈ సమాచారం లభిస్తుంది. ఫిజిక్స్‌లో ప్రవేశానికి దాదాపు అన్ని సంస్థలు ఎం.ఎస్‌సి. ఫిజిక్స్ లేదా సంబంధిత సబ్జెక్టులో ఎంఈ/ ఎం.టెక్. డిగ్రీని ప్రధాన అర్హతగా పరిగణనలోకి తీసుకుంటున్నాయి. కొన్ని సంస్థలు బీఈ, బీటెక్ చేసిన అభ్యర్థులను కూడా అనుమతిస్తున్నాయి.
* థీరీటికల్ కంప్యూటర్ సైన్స్‌లో ప్రవేశానికి కంప్యూటర్ సైన్స్, ఇతర సంబంధిత సబ్జెక్టుల్లో ఎం.ఎస్‌సి./ ఎంఈ/ ఎంటెక్/ ఎంసీఏ అవసరం. కంప్యూటర్ సైన్స్‌లోని మేథమేటికల్ అంశాలపై అభ్యర్థులకు మంచి ఆసక్తి ఉండాలి.
ఇంటెగ్రేటెడ్ కోర్సులకు...
* ఇంటెగ్రేటెడ్ ఎం.ఎస్‌సి.- పీహెచ్‌డీ: ఈ కోర్సు మూడు సంస్థల్లో అందుబాటులో ఉంది. అవి... ఐఐఎస్‌ఈఆర్, పుణె; హెచ్‌ఆర్‌ఐ, అలహాబాద్; ఎస్‌ఎన్‌బీఎన్‌సీబీఎస్, కోల్‌కతా. వీటిలో ప్రవేశానికి ఏదైనా డిగ్రీని ప్రధాన అర్హతగా పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
* ఎం.ఎస్‌సి. (రిసెర్చ్) - పీహెచ్‌డీ ఇంటెగ్రేటెడ్ ప్రోగ్రామ్: ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేథమేటికల్ సైన్సెస్, చెన్నైలో ఈ కోర్సు ఉంది. బి.ఎస్‌సి./ బీఈ/ బీటెక్ అభ్యర్థులు అర్హులు.
* ఇంటెగ్రేటెడ్ పోస్ట్ బి.ఎస్‌సి. - పీహెచ్‌డీ: కోల్‌కతాలోని ఎస్‌ఎన్‌బీఎన్‌సీబీఎస్‌లో ఈ కోర్సును నిర్వహిస్తున్నారు. బి.ఎస్‌సి. (ఫిజిక్స్/ మేథ్స్)/ బీఈ/ బీటెక్ డిగ్రీలున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
* ఇంటెగ్రేటెడ్ ఎం.టెక్.- పీహెచ్‌డీ: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఈ కోర్సును అందిస్తోంది. ఎం.ఎస్‌సి. (ఫిజిక్స్/ అప్లయిడ్ ఫిజిక్స్)/ బీఈ/ బీటెక్ అభ్యర్థులు అర్హులు.
* ఆయా సంస్థల్లో లభించే స్పెషలైజేషన్ల ఆధారంగా సంస్థలు ప్రవేశార్హతలను నిర్ణయిస్తాయి.
* జెస్ట్- 2012లో ప్రశ్నలు ఫిజిక్స్, థీరీటికల్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఉంటాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో, విద్యా సంస్థల్లో అమల్లో ఉన్న సిలబస్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.
దరఖాస్తు విధానం
అభ్యర్థులు సాధ్యమైనంతవరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇంటర్నెట్, ప్రింట్ అవుట్‌లు లభించని తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయవచ్చు. జెస్ట్ 2012ను చెన్నైలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేథమేటికల్ సైన్సెస్ నిర్వహిస్తుంది.
ఈ సంస్థ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో http://www.jest.org.in/apply దరఖాస్తు చేయవచ్చు.
సంస్థల వారీగా పరిశోధనలకు అందుబాటులో ఉన్న స్పెషలైజేషన్లు, ఇతర వివరాలు కూడా వెబ్‌సైట్‌లో లభిస్తాయి.
* మనరాష్ట్రంలో హైదరాబాద్, విశాఖపట్నంలలో పరీక్ష కేంద్రాలున్నాయి.
* ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల్లో దరఖాస్తులు చేరడానికి చివరితేదీ: 15 డిసెంబరు 2011.
* పరీక్ష తేదీ: ఫిబ్రవరి 19, 2012.
Friday, 25 November 2011
బిట్స్‌లో పీహెచ్‌డీ
సాంకేతిక విద్య, పరిశోధనలకు ప్రసిద్ధిగాంచిన బిర్లా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్, పిలానీ) పీహెచ్‌డీ కోర్సులను నిర్వహిస్తోంది.
రెగ్యులర్ పద్ధతితోపాటు ఆఫ్ క్యాంపస్ విధానంలో ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, సైన్సెస్, తదితర సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ చేసే అవకాశం కల్పిస్తోంది.
పిలానీ, గోవా, హైదరాబాద్ క్యాంపస్‌లలో ప్రవేశానికి బిట్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
బిట్స్‌లో పీహెచ్‌డీ కోర్సులకు ఎంపికైన అభ్యర్థులను ప్రాజెక్టు లేదా రిసెర్చ్ అసిస్టెంట్‌షిప్‌లకు కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
వీటికి ఎంపికైతే ట్యూషన్ ఫీజుల్లో రాయితీతోపాటు నెలకు రూ.10000 నుంచి రూ.14000 స్టయిపెండ్ పొందే అవకాశం ఉంటుంది. ఈ అభ్యర్థులకు బిట్స్‌లోని బోధన, ఇతర అభివృద్ధి కార్యకలాపాల్లో పాల్గొనాల్సి ఉంటుంది.
బిట్స్ క్యాంపస్‌లలో పీహెచ్‌డీకి అందుబాటులో ఉన్న సబ్జెక్టులు:
బయోలాజికల్ సైన్సెస్, కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎకనమిక్స్ అండ్ ఫైనాన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, మేథమేటిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్, ఫార్మసీ, ఫిజిక్స్, లాంగ్వేజెస్ అండ్ హ్యుమానిటీస్.
* ఇంటర్ డిసిప్లీనరీ సబ్జెక్టులు:
బయోటెక్నాలజీ, ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్, రోబోటిక్స్, నానోసైన్స్ అండ్ నానోటెక్నాలజీ, వాటర్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ హెల్త్ మొదలైనవి.
రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా తాత్కాలికంగా ప్రవేశం కల్పిస్తారు. తర్వాత అభ్యర్థులు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ రాయాలి. ఇందులో మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ వ్యవధి 3 గంటలు. అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టులో తెలివితేటలు, ప్రాథమిక భావనలు, వాటిని వర్తింపచేయడంలో సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైనవారినే ప్రోగ్రామ్‌కు అంతిమంగా ఎంపిక చేస్తారు.
బిట్స్ పీహెచ్‌డీ కోర్సులకు కనీసం 60 శాతం మార్కులతో ఎం.ఇ./ ఎం.ఫార్మ్/ ఎంబీఏ/ ఎం.ఫిల్. పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఎం.ఎస్‌సి./ బి.ఇ./ బి.ఫార్మ్ అభ్యర్థులు కూడా పీహెచ్‌డీకి దరఖాస్తు చేయవచ్చు. వీరికీ 60 శాతం మార్కులు అవసరం. లాంగ్వేజెస్, హ్యుమానిటీస్‌లో పీహెచ్‌డీ చేయడానికి కనీసం 55 శాతం మార్కులతో ఎం.ఎ. పూర్తి చేసినవారు కూడా అర్హులు.
బిట్స్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు.
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 5 డిసెంబరు 2011.
ఇతర వివరాలు బిట్స్ వెబ్‌సైట్ లో లభిస్తాయి.

Sunday, 6 November 2011
సీడీఎఫ్‌డీ రిసెర్చ్ స్కాలర్స్ ప్రోగ్రామ్
మాలెక్యులర్, సెల్ బయాలజీలో ఆధునిక పరిశోధనలకు దేశవ్యాప్తంగా పేరున్న సంస్థ సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్‌డీ).
కేంద్ర బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలోని సీడీఎఫ్‌డీ... ప్రతి సంవత్సరం రెండు దశల్లో రిసెర్చ్ స్కాలర్స్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోంది. ప్రస్తుతం 'రిసెర్చ్ స్కాలర్స్ ప్రోగ్రామ్ 2011' కింద రెండో దశ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆధునిక జీవశాస్త్రాల్లో పరిశోధనలు చేయాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.
సీడీఎఫ్‌డీ ప్రధానంగా జెనెటిక్స్, కంప్యూటేషనల్ అండ్ స్ట్రక్చరల్ బయాలజీ, కేన్సర్ బయాలజీ, ఇమ్యునాలజీ, స్ట్రక్చరల్ బయాలజీ, సెల్ సైకిల్ రెగ్యులేషన్, బ్యాక్టీరియల్ జెనెటిక్స్, జెనోమిక్స్, తదితర అంశాల్లో పరిశోధనలు నిర్వహిస్తోంది. ఇంటర్ డిసిప్లీనరీ పరిశోధనలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని వివిధ రకాల విద్యానేపధ్యం ఉన్న అభ్యర్థులను రిసెర్చ్ స్కాలర్స్ ప్రోగ్రామ్‌లోకి తీసుకుంటోంది. ప్రవేశం పొందిన అభ్యర్థులు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లేదా మణిపాల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేయడానికి ప్రోత్సహిస్తోంది.
రాత పరీక్ష లేదా లాన్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంబీబీఎస్ చేసిన అభ్యర్థులకు ప్రత్యేకంగా రెండు రిసెర్చ్ ఫెలోషిప్‌లు కేటాయిస్తారు. వీరిలో ఒక అభ్యర్థి హ్యుమన్ జెనెటిక్స్ విభాగంలో యూనివర్సిటీ ఆఫ్ పిట్స్‌బర్గ్, సీడీఎఫ్‌డీ సంయుక్తంగా నిర్వహించే ప్రోగ్రామ్‌లో ట్రెయినీగా పనిచేయాలి.
అభ్యర్థులు ఎంబీబీఎస్/ ఏదైనా సైన్స్, టెక్నాలజీ, అగ్రికల్చర్ సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ చేసుండాలి. ఎంబీబీఎస్ అభ్యర్థులు తప్ప మిగిలిన వారందరూ సీఎస్‌ఐఆర్/ యూజీసీ/ డీబీటీ/ ఐసీఎంఆర్/ ఐసీఏఆర్ నిర్వహించే నెట్ పరీక్షలో జేఆర్‌ఎఫ్ సాధించాలి. లేదా గేట్‌లో 90 శాతం మార్కులు అవసరం. జెస్ట్ అభ్యర్థులు కూడా అర్హులు. ఎంబీబీఎస్ అభ్యర్థులకు ఈ పరీక్షల స్కోర్లు ఏవీ అవసరం లేదు. ఆయా పరీక్షలు రాసి, ఫలితాల కోసం నిరీక్షిస్తోన్న అభ్యర్థులు కూడా అర్హులు.
* సీడీఎఫ్‌డీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. లేదా నిర్దేశిత నమూనాలో ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
* పూర్తిచేసిన దరఖాస్తులు చేరడానికి చివరితేదీ 25 నవంబరు 2011.
అర్హులైన అభ్యర్థుల జాబితాను 8 డిసెంబరు 2011న ప్రకటిస్తారు.
కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష 16 జనవరి 2012న ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైనవారికి మరుసటి రోజే ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
సంస్థ చిరునామా: సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్‌డీ), గృహకల్ప బిల్డింగ్ 7, ఎంజే రోడ్, నాంపల్లి, హైదరాబాద్.

Thursday, 27 October 2011
మేనేజ్‌మెంట్‌లో పరిశోధనలకు ఆర్‌మ్యాట్
మేనేజ్‌మెంట్‌లో పరిశోధనలు చేయాలనుకునే అభ్యర్థుల కోసం ఆలిండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) రిసెర్చ్ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూట్ టెస్ట్ (ఆర్ మ్యాట్)ను నిర్వహిస్తోంది.
దీని ద్వారా మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ చేయవచ్చు. మేనేజ్‌మెంట్ రంగంలో ఉన్నత విద్యార్హతలు, ఉత్తమ నైపుణ్యాలు గల మానవ వనరులను తయారుచేయడం ఈ పరీక్ష లక్ష్యం.
ఆర్‌మ్యాట్ ఆధారంగా ఏఐఎంఏకు చెందిన సెంటర్ ఫర్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్ (సీఎంఈ), అలీగడ్ ముస్లిం యూనివర్సిటీ సంయుక్తంగా పీహెచ్‌డీ (బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) కోర్సును అందిస్తున్నాయి.
మేనేజ్‌మెంట్, దీని అనుబంధ కామర్స్, హ్యుమానిటీస్, సైన్స్, ఇంజినీరింగ్ సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉన్నవారు ఆర్‌మ్యాట్‌కు అర్హులు. పీజీడీఎం లేదా పీజీడీఐటీఎం చేసినవారు కూడా దరఖాస్తు చేయవచ్చు. కనీసం 55 శాతం మార్కులు ఉండాలి. చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు చేసినవారు కూడా అర్హులు. మేనేజీరియల్ స్థాయిలో కనీసం ఐదేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా ఏదైనా మేనేజ్‌మెంట్ ఇన్ స్టిట్యూట్‌లో కనీసం మూడేళ్లు ఫ్యాకల్టీగా చేసుండాలి.
ఆర్‌మ్యాట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
పరీక్షలో 100 ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి.
పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.
నెగటివ్ మార్కులు ఉండవు.
ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది.
ఆర్‌మ్యాట్ పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష. ఎంపికైన అభ్యర్థులకు కాంటాక్టు తరగతులను ఏఐఎంఏ, న్యూఢిల్లీలో నిర్వహిస్తారు.
* ఆర్‌మ్యాట్‌కు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా ఫీజు చెల్లించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తిచేయాలి. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రింట్‌లను సంబంధిత డాక్యుమెంట్లతో సహా 'మేనేజర్ (పీహెచ్‌డీ ప్రోగ్రామ్), ఆలిండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ -సీఎంఈ, మేనేజ్‌మెంట్ హౌస్, 14 ఇనిస్టిట్యూషనల్ ఏరియా, న్యూఢిల్లీ- 110003' చిరునామాకు పంపించాలి. కోర్సు ఫీజులు, ఇతర వివరాలు ఏఐఎంఏ వెబ్‌సైట్‌లో లభిస్తాయి.
* ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: 18 నవంబరు 2011
* దరఖాస్తు ప్రింట్ల స్వీకరణకు చివరితేదీ: 25 నవంబరు 2011
* ఆర్‌మ్యాట్ తేదీ: 10 డిసెంబరు 2011

Thursday, 20 October 2011
న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ
న్యాయశాస్త్రంలో పరిశోధనలు చేయాలనుకునే అభ్యర్థులకు విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ ఆఫ్ లా మంచి అవకాశాలను కల్పిస్తోంది.
పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ పద్ధతుల్లో పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌డీ (పార్ట్‌టైమ్) కోర్సులను అందిస్తోంది. సోషల్ సైన్సెస్, సైన్సెస్ నేపధ్యంతోపాటు లా డిగ్రీ ఉన్న అభ్యర్థులు పీహెచ్‌డీ కోర్సులు చేయవచ్చు.
ఈ సంస్థకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉంది.
ఏపీ యూనివర్సిటీ ఆఫ్ లా అందిస్తోన్న కోర్సులు, అర్హతలు, ఇతర వివరాలు...
* పీహెచ్‌డీ (ఫుల్‌టైమ్): ఇందులో పీహెచ్‌డీ ఇన్ లా, పీహెచ్‌డీ ఇన్ సోషల్ సైన్సెస్ విత్ లా, పీహెచ్‌డీ ఇన్ సైన్సెస్ విత్ లా, పీహెచ్‌డీ ఇన్ హ్యూమన్ రైట్స్ లా స్పెషలైజేషన్లు ఉన్నాయి. న్యాయశాస్త్రంలో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు అర్హులు. తాము చేపట్టబోయే పరిశోధనతో సంబంధం ఉన్న ఇతర పీజీ కోర్సులు చేసినవారు కూడా అర్హులు. ఇంటర్ డిసిప్లీనరీ అధ్యయనాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రవేశార్హతల విషయంలో అనేక మినహాయింపులను ఏపీ యూనివర్సిటీ ఆఫ్ కల్పిస్తోంది. వీటి వివరాలు సంస్థ వెబ్‌సైట్‌లో లభిస్తాయి.
* పీహెచ్‌డీ (పార్ట్‌టైమ్): ఏదైనా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జిలు ఈ ప్రోగ్రామ్‌కు అర్హులు. ఎల్‌ఎల్‌బీ చేసినవారికి కనీసం పదేళ్లు, ఎల్‌ఎల్‌ఎం చేసుంటే కనీసం ఐదేళ్లు అనుభవం అవసరం. లా లో మాస్టర్స్ డిగ్రీ తర్వాత కనీసం మూడేళ్లు బోధన అనుభవం ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. న్యాయశాస్త్రం పట్ల మంచి ఆసక్తి ఉన్న సోషల్ సైన్సెస్ అభ్యర్థులు కూడా అర్హులు.
* పీహెచ్‌డీ ఇన్ హ్యూమన్ రైట్స్ లా: ఈ కోర్సును పార్ట్‌టైమ్ లేదా ఫుల్‌టైమ్ పద్ధతుల్లో చేయవచ్చు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుంచి పీజీ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా ఉన్న అభ్యర్థులు ఈ ప్రోగ్రామ్‌కు అర్హులు.
* పీహెచ్‌డీతోపాటు ఎల్‌ఎల్‌డీ కోర్సు కూడా అందుబాటులో ఉంది. లా లో పీహెచ్‌డీ చేసిన అభ్యర్థులు దీనికి అర్హులు. ఈ కోర్సును పార్ట్‌టైమ్ పద్ధతిలో మాత్రమే నిర్వహిస్తున్నారు.
ఎంపిక, దరఖాస్తు విధానం
ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా పీహెచ్‌డీ కోర్సులో అడ్మిషన్ లభిస్తుంది. నెట్ / స్లెట్ ఉత్తీర్ణులు కూడా ప్రవేశ పరీక్ష రాయాలి. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. పరీక్ష సిలబస్, మోడల్ ప్రశ్నపత్రాలు, దరఖాస్తులను ఏపీ యూనివర్సిటీ ఆఫ్ లా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
* పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 15 నవంబరు 2011
* ప్రవేశ పరీక్ష తేదీ: 11 డిసెంబరు 2011

Thursday, 15 September 2011
రెండు అగ్రశ్రేణి సంస్థలు నిర్వహించే కోర్సు
ఇంజినీరింగ్‌లో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న సంస్థ- ఐఐటీ బాంబే.
ఆస్ట్రేలియాలోని అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఒకటి మొనాష్ యూనివర్సిటీ. ఉన్నత స్థాయి ఇంజినీరింగ్ పరిశోధనలకు ఈ సంస్థ పేరు పొందింది.
ఈ రెండూ కలిసి పీహెచ్‌డీ కోర్సును అందిస్తున్నాయి!
ప్రపంచంలోని రెండు అగ్రశ్రేణి సంస్థలు కలిసి నిర్వహిస్తోన్న కోర్సు ఇది. దీని ద్వారా అభ్యర్థులు ఉన్నత స్థాయి కెరియర్‌ను అందుకోవచ్చు. ప్రత్యేక అంశాల్లో పరిశోధనలు చేయడానికి ఈ సంస్థలు అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నాయి.
ఐఐటీ బాంబేలో ప్రత్యేకంగా 'ఐఐటీబీ మొనాష్ రిసెర్చ్ అకాడమీ' పేరుతో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పీహెచ్‌డీ కోర్సును నిర్వహిస్తున్నాయి.
కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు ఐఐటీ బాంబే, మొనాష్ అకాడమీ సంయుక్తంగా డిగ్రీని ప్రదానం చేస్తాయి. రెండు సంస్థలకు చెందిన బోధన సిబ్బంది ప్రోగ్రామ్ నిర్వహణలో పాలుపంచుకుంటారు.
డిసెంబరు 2011 సెషన్‌కు నోటిఫికేషన్ వెలువడింది. ప్రోగ్రామ్‌కు ఎంపికైన అభ్యర్థులు కింది అంశాల్లో పరిశోధనలు నిర్వహించాలి.
1. అడ్వాన్స్‌డ్ కంప్యూటేషనల్ ఇంజినీరింగ్, సిమ్యులేషన్ అండ్ మాన్యుఫ్యాక్చర్
2. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్
3. క్లీన్ ఎనర్జీ
4. వాటర్
5. నానోటెక్నాలజీ
6. బయోటెక్నాలజీ అండ్ స్టెమ్ సెల్ రిసెర్చ్
అభ్యర్థులు ఎక్కువకాలం ఐఐటీ బాంబేలో పరిశోధనలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్యవేక్షకుల మార్గనిర్దేశం, శిక్షణ ఇక్కడ లభిస్తుంది. రెండు సంస్థలకు చెందిన పర్యవేక్షకులు అభ్యర్థులను ఎప్పటికప్పుడు మూల్యాంకనం చేస్తారు. కోర్సులో భాగంగా మొనాష్ యూనివర్సిటీలో 3 నెలలు పరిశోధనలు చేయవచ్చు. ఇన్ఫోసిస్, గూగుల్, టీసీఎస్, కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం తదితర సంస్థలు ఇండస్ట్రీ భాగస్వాములుగా ఉన్నాయి.
కోర్సు కాలంలో ఏడాదికి సుమారు రూ.2,24,000 స్కాలర్‌షిప్ లభిస్తుంది.
ఇవిగాక ఆస్ట్రేలియాలో పరిశోధనలు నిర్వహించడానికి ప్రత్యేకంగా గ్రాంట్‌లు లభిస్తాయి. అభ్యర్థుల అర్హతలు, గ్రేడ్‌లు, పరిశోధనల తీరును బట్టి స్కాలర్‌షిప్ మొత్తాన్ని నిర్ణయిస్తారు. జూన్ 2011 సెషన్‌లో ఎంపికైన అభ్యర్థుల జాబితా సంస్థ వెబ్‌సైట్‌లో లభిస్తుంది.
* ఇంజినీరింగ్ లేదా సైన్సెస్‌లో గ్రాడ్యుయేషన్ లేదా పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్లకు గేట్‌లో మంచి స్కోరు కూడా అవసరం. గేట్ స్కోరు లేకపోతే కనీసం రెండేళ్ల పరిశోధన అనుభవం కావాలి.
* దరఖాస్తులను సంస్థ వెబ్‌సైట్. నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ 3 అక్టోబరు 2011.

స్కాలర్‌షిప్‌లు, అర్హతలు
ఎంపికైన అభ్యర్థులకు అద్భుతమైన స్కాలర్‌షిప్ అందుబాటులో ఉండటం ఈ కోర్సు ప్రత్యేకత. కోర్సు కాలంలో ఏడాదికి సుమారు రూ.2,24,000 స్కాలర్‌షిప్ లభిస్తుంది.
ఇవిగాక ఆస్ట్రేలియాలో పరిశోధనలు నిర్వహించడానికి ప్రత్యేకంగా గ్రాంట్‌లు లభిస్తాయి. అభ్యర్థుల అర్హతలు, గ్రేడ్‌లు, పరిశోధనల తీరును బట్టి స్కాలర్‌షిప్ మొత్తాన్ని నిర్ణయిస్తారు. జూన్ 2011 సెషన్‌లో ఎంపికైన అభ్యర్థుల జాబితా సంస్థ వెబ్‌సైట్‌లో లభిస్తుంది.
* ఇంజినీరింగ్ లేదా సైన్సెస్‌లో గ్రాడ్యుయేషన్ లేదా పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్లకు గేట్‌లో మంచి స్కోరు కూడా అవసరం. గేట్ స్కోరు లేకపోతే కనీసం రెండేళ్ల పరిశోధన అనుభవం కావాలి.
* దరఖాస్తులను సంస్థ వెబ్‌సైట్. నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ 3 అక్టోబరు 2011.
Thursday, 8 September 2011
బేసిక్ సైన్సెస్ లో పీహెచ్‌డీ కోర్సులు
బేసిక్ సైన్సెస్‌లో పరిశోధనలకు అధిక ప్రాధాన్యం ఇస్తోన్న సంస్థ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్ - తిరువనంతపురం).
బయోలాజికల్, కెమికల్, ఫిజికల్, మేథమేటికల్ సైన్సెస్‌లో పీహెచ్‌డీ కోర్సులను నిర్వహిస్తోంది.
జనవరి 2012 నుంచి ప్రారంభం కానున్న అకడమిక్ సెషన్‌లో ప్రవేశానికి ఐఐఎస్‌ఈఆర్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
కింది సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ కోర్సులను నిర్వహిస్తోంది...
* బయోలాజికల్ సైన్సెస్:
బయోలాజికల్/ కెమికల్/ ఫిజికల్/ మేథమేటికల్/ మెడికల్ సైన్సెస్/ ఇంజినీరింగ్ లేదా మెడిసిన్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు అర్హులు. కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో ఉంటుంది. మేథ్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలడుగుతారు.
* కెమికల్ సైన్సెస్:
కనీసం 60 శాతం మార్కులతో కెమిస్ట్రీలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసుండాలి. పరిశోధన అనుభవం, ప్రచురణలు ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు.
* ఫిజికల్ సైన్సెస్:
ఫిజికల్ సైన్సెస్, ఇంజినీరింగ్, టెక్నాలజీలో మాస్టర్ డిగ్రీ అవసరం. 60 శాతంపైగా మార్కులున్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
* మేథమేటికల్ సైన్సెస్:
ఇంజినీరింగ్/ టెక్నాలజీ/ మేథమేటిక్స్/ స్టాటిస్టిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా ఇంజినీరింగ్ / టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీతోపాటు మేథ్స్ ఒలింపియాడ్‌లలో ప్రతిభ చూపినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జాతీయ స్థాయిలో నిర్వహించే సీఎస్‌ఐఆర్ - యూజీసీ జేఆర్‌ఎఫ్ / డీబీటీ- జేఆర్‌ఎఫ్/ గేట్/ ఐసీఎంఆర్ - జేఆర్‌ఎఫ్, తదితర పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఈ అభ్యర్థులకు అర్హత పరీక్షల్లో మినహాయింపులు కూడా ఉంటాయి.
* దరఖాస్తులను ఐఐఎస్‌ఈఆర్, తిరువనంతపురం వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 30 సెప్టెంబరు 2011.
Subscribe to:
Posts (Atom)