విభాగాలు ఎన్ని?
- ఆఫ్-క్యాంపస్ ప్రోగ్రామ్‌లు (1)
- ఆర్ ఆర్ బీ (1)
- ఇంగ్లిష్ (17)
- ఇంజినీరింగ్ (29)
- ఇంటర్న్ షిప్ లు (1)
- ఉపకార వేతనాలు (8)
- ఎలిజిబిలిటీ టెస్ట్ (5)
- ఏపీపీఎస్ సీ (25)
- ఏరోనాటిక్స్ (2)
- ఐఐటీ (2)
- ఐటీ/ సాఫ్ట్ వేర్ (2)
- ఐటీఐ... ఉద్యోగాలు (3)
- కాస్ట్ అకౌంటెన్సీ (1)
- కౌన్సెలింగ్ (2)
- జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు (3)
- జూనియర్ లెక్చరర్స్ (2)
- టాపర్ (1)
- దూరవిద్య (4)
- నైపుణ్యాలు (3)
- పీజీ (6)
- పీహెచ్ డీ (8)
- పోలీస్ (7)
- ఫార్మసీ (4)
- ఫైనాన్స్ (1)
- ఫ్యాషన్ డిజైనింగ్ (1)
- బోధన రంగం (7)
- బ్యాంకింగ్ (8)
- మీడియా (1)
- మేనేజ్ మెంట్ (2)
- మేనేజ్ మెంట్/ ఎంసీఏ (16)
- యూజీ/ పీజీ (3)
- యూపీఎస్ సీ (4)
- విదేశీ విద్య (9)
- వీఆర్ఏ (2)
- వీఆర్ఓ (2)
- వైద్యవిద్య (8)
- సందేహాలూ సమాధానాలూ (4)
- సమ్మర్ ఫెలోషిప్ లు (1)
- సహకార బ్యాంకులు (1)
- సాఫ్ట్ వేర్ (3)
- సివిల్స్ (16)
- సైన్సెస్ (1)
- స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (1)
- స్వాగతం (1)
- హాస్పిటాలిటీ (2)
- హెల్త్ కేర్ (2)
Showing posts with label వైద్యవిద్య. Show all posts
Showing posts with label వైద్యవిద్య. Show all posts
Tuesday, 30 December 2014
Wednesday, 2 July 2014
Friday, 22 February 2013
ఎంసెట్ నగారా
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్రుతతో ఎదురు చూస్తోన్న ఎంసెట్ ప్రకటన వెలువడింది. ఎంపీసీ విద్యార్థుల విషయంలో స్పష్టతతో, బైపీసీ విద్యార్థులకు సంశయం కొనసాగిస్తూ ఈ నోటిఫికేషన్ రూపొందింది. మంచి భవితకు బాట కోసం ఎంసెట్‌లో మెరుగైన ర్యాంకు సాధన అత్యవసరం. దీనికి పూర్తిస్థాయిలో సంసిద్ధం కావాల్సిన తరుణమిది!
పోటీ పరీక్ష ఏదైనా దానికి తయారయ్యే విధానం, మానసిక సంసిద్ధత.. ఈ రెండు అంశాల మేరకే ఫలితాలుంటాయి. కష్టపడి చదవడం తప్పనిసరే కానీ, నిర్దిష్ట ప్రణాళికతో కష్టపడటం ముఖ్యం. అప్పుడే గెలుపు సులభమవుతుంది. కానీ చాలామంది విద్యార్థులు ప్రణాళికకు ప్రాధాన్యం ఇవ్వక నష్టపోతున్నారు.
ప్రణాళికకు అంత ప్రాధాన్యం ఎందుకో ఒక్క ఉదాహరణ ద్వారా చూద్దాం.
ఇద్దరు విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాస్తున్నారని అనుకుందాం. ఒక విద్యార్థి హిందీలో 90 మార్కులు, మిగిలిన అన్ని సబ్జెక్టుల్లో 92 మార్కులు తెచ్చుకున్నాడని అనుకుందాం. వేరొక విద్యార్థి అన్ని సబ్జెక్టుల్లో 99 లేదా 100 మార్కులు తెచ్చుకుంటూ ఒక సబ్జెక్టులో హిందీ కాకుండా 90 మార్కులు సాధించాడని అనుకుందాం.
ఈ ఇద్దరిలో మొదటి విద్యార్థికి 10 గ్రేడ్ పాయింట్ అంటే 10/10, రెండో విద్యార్థికి 9.8 గ్రేడ్ పాయింట్ అంటే 9.8/10 వచ్చినట్లు అవుతుంది. మార్కులపరంగా చూస్తే మొదటి విద్యార్థి మార్కులు కేవలం 550/600. మరి రెండో విద్యార్థి మార్కులు 590/600 వరకూ ఉండే అవకాశముంది. మరి ఈ ఇద్దరిలో తేడా అంటే ప్రణాళిక మాత్రమే.
మారిన గ్రేడింగ్ విధానం అర్థం చేసుకుని ప్రాధాన్యం గుర్తించి చదివిన విద్యార్థి 10/10 తెచ్చుకుంటే అవగాహన లేక ప్రణాళిక లేకుండా చాలా కష్టపడి కూడా రెండో విద్యార్థి తెచ్చుకున్నది 9.8/10 మాత్రమే. కాబట్టి మార్కులు సాధించాలంటే కష్టపడాల్సిందే. అయితే అవగాహనతో సరైన ప్రణాళికతో కష్టపడి చదివితే కచ్చితంగా మేటి ర్యాంకుకు అవకాశం ఉంటుంది.
ప్రకటన ప్రకారం...
ఇంజినీరింగ్, మెడికల్, డెంటల్, బయోటెక్నాలజీ, అగ్రికల్చరల్, ఫార్మసీ, ఆయుర్వేద, యునాని, హోమియోపతిల ప్రవేశానికి ఎంసెట్ ర్యాంకు ఉపయోగపడుతుంది.
ఈ పరీక్ష రాయడానికి నిబంధనలు చూస్తే... భారతీయులై, ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారై ఉండాలి. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందినవారు లేదా సీనియర్ ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులు అర్హులు. రిజర్వేషన్ కేటగిరీలలో ఉన్న విద్యార్థులకు 40 శాతం మార్కులు సరిపోతాయి.
* బయోటెక్నాలజీలో చేరాలంటే బైపీసీ విద్యార్థులు లెక్కలులో బ్రిడ్జి కోర్సు పరీక్ష పాసై ఉండాలి.
* ఇంజినీరింగ్, ఫార్మసీలైతే విద్యార్థికి డిసెంబరు 31, 2013 లోపు 16 సంవత్సరాలు పూర్తి అయివుండాలి. గరిష్ఠ వయః పరిమితి లేదు.
* మెడికల్ విభాగంలో అయితే డిసెంబరు 31, 2013లోపు విద్యార్థి 17 సంవత్సరాలు పూర్తిచేసి ఉండాలి. అలా కాని పక్షంలో ప్రవేశ అర్హత లభించదు. అలాగే గరిష్ఠ వయః పరిమితి జనరల్ కేటగిరి అయితే 22 ఏళ్ళు, రిజర్వేషన్ కేటగిరి అయితే 25 సంవత్సరాలు.
ఎలా సంసిద్ధమవ్వాలి?
ఇంటర్ పరీక్షలు మార్చి 6వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. ద్వితీయ సంవత్సరం పరీక్షల ఆఖరు తేదీ మార్చి 19 వరకూ ఇంటర్‌కు మాత్రమే ప్రాధాన్యం ఇస్తే సరిపోతుంది.
ఇంటర్‌లో మూడు రకాల ప్రశ్నలుంటాయి. LAQ, SAQ, VSAQవీటిలో సాధారణ విద్యార్థులు LAQ, SAQలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి చదువుతారు. కచ్చితంగా మంచి మార్కులు లేదా నూరు శాతం మార్కులు సాధించాలనే ధ్యేయంతో ఉన్నవారు అధికంగా VSAQలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అంటే అకాడమీ పుస్తకాలు చదవడంతో బాటు ఆబ్జెక్టివ్ ఓరియెంటేషన్‌లో కూడా తయారీ కావాలి.
అకాడమీ పుస్తకాలు చదవడం అంటే చివర్లో ఉన్న ప్రశ్నలు జవాబులు మాత్రమే కాకుండా పాఠ్యాంశం కూడా పూర్తిగా కనీసం ఒక్కసారైనా చదివి ఉండాలి. సీనియర్ ఇంటర్ పరీక్షలు పూర్తయ్యేవరకూ ఈ సిలబస్‌కు పరిమితమై ఆబ్జెక్టివ్ ప్రశ్నలు కూడా అభ్యాసం చేస్తూ వెళ్ళాలి.
కాలవ్యవధి స్వల్పంగా ఉంది కాబట్టి రాని అంశాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి చదవడం సరికాదు. దానికి బదులు- వచ్చిన అంశాలనే ఒకటికి రెండుసార్లు పునశ్చరణ చేసుకుంటూ వెళితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పరీక్షలో కూడా వేగం పెరుగుతుంది.
ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షల తర్వాత ఎంపీసీ విద్యార్థులు అయితే జేఈఈ- మెయిన్స్‌కు తయారవుతుంటారు. 10 రోజుల్లో జూనియర్ సిలబస్ పూర్తి చేసుకుని మిగిలిన వారం రోజులూ గ్రాండ్ టెస్టులు నిర్వహించుకోవడం మేలవుతుంది.
ఆ తర్వాత ఎంసెట్, బిట్‌శాట్ రెండు పరీక్షలకూ ఒక ప్రణాళిక వేసుకోవాలి. ప్రథమ, ద్వితీయ సంవత్సర సిలబస్ రెండింటినీ పునశ్చరణ చేసుకుంటూ నమూనా పరీక్షలు వీలైనన్ని ఎక్కువగా రాయాలి. ఎంసెట్‌లో రుణాత్మక మార్కుల్లేవు కాబట్టి జవాబు తెలియనప్పటికీ ప్రతి ప్రశ్నకూ ఏదో ఒక జవాబు రాసే చాన్స్ తీసుకోవచ్చు. ఏప్రిల్ ఆఖరు వారం నుంచి గ్రాండ్ టెస్టులు రాయడం ప్రారంభించాలి.
బైపీసీ విద్యార్థులు అయితే మార్చి 19 తర్వాత కనీసం 20 రోజులు ప్రథమ సంవత్సర సిలబస్ పునశ్చరణ చేసుకోవాలి. సిలబస్‌ను చిన్న భాగాలుగా విభజించి నమూనా పరీక్షల రూపంలో అభ్యాసం చేయాలి. బయాలజీ విద్యార్థులు అధికశాతం నష్టపోవడానికి కారణాలు.. సబ్జెక్టుపై అవగాహన లేక కాదు! వాటిని ప్రశ్నల రూపంలో తర్ఫీదు పొందకపోవడమే. అందుకే వీలైనన్ని నమూనా పరీక్షలు రాయాలి. ఇక్కడ కూడా రుణాత్మక మార్కుల్లేవు కాబట్టి మీ ప్రశ్నకు జవాబు గుర్తించకుండా వదిలి వేయాల్సిన అవసరం లేదు.
ఎంపీసీ లేదా బైపీసీ ఏ విభాగం అయినా మన అకాడమీ పుస్తకాలకు మాత్రమే పరిమితమైనా ఎంసెట్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధించుకోవచ్చు. ప్రణాళికాబద్ధమైన తయారీ ఏ విద్యార్థికయినా విజయం సాధించిపెడుతుంది!
(పూర్తి కథనం కోసం www.eenadu.net లో చదువు విభాగం చూడండి..)
Wednesday, 23 January 2013
ఎంసెట్... నీట్ - సన్నద్ధత ఎలా?
ఎంసెట్-నీట్... ఏ పరీక్ష రాయాల్సివచ్చినా, ఒకవేళ రెండూ రాయాల్సివచ్చినా బైపీసీ విద్యార్థులు తయారుగా ఉండటం మేలు. అనుకూల అంశాలను గుర్తుచేసుకుంటూ ఆశావహ దృక్పథంతో ప్రణాళిక వేసుకోవాలి; ఆత్మవిశ్వాసంతో సన్నద్ధత కొనసాగించాలి!
ఇంటర్మీడియట్ బైపీసీ విభాగంలోని ప్రవేశపరీక్షలకు దాదాపు 1,25,000 మంది విద్యార్థులు సిద్ధమవుతున్నారు. జాతీయ, రాష్ట్రస్థాయి పరీక్షల్లో ఏది ఖరారవుతుందనే విషయంపై అనిశ్చితి ఉన్నప్పటికీ ప్రిపరేషన్‌ను కొనసాగిస్తుండటమే సరైన చర్య.
బైపీసీ విభాగంలో జరిగే పోటీ పరీక్షల్లో సబ్జెక్టుపై అవగాహన ఎంత అవసరమో ఆత్మవిశ్వాసం అంతకంటే ఎక్కువ అవసరమవుతోంది. ప్రణాళికతో తయారు కాగలిగితే ఈ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
జరగబోయే నీట్, ఎంసెట్ రెండు పరీక్షలూ ప్రాధాన్యం సంతరించుకోవచ్చు. ఎంబీబీఎస్, బీడీఎస్‌లలో ప్రవేశాలు నీట్ ద్వారా జరిగితే; మిగిలిన కోర్సులైన యునానీ, ఆయుర్వేదిక్, హోమియోపతి, అగ్రికల్చరల్ బీఎస్సీ, వెటర్నరీ సైన్స్, ఫార్మసీ, నర్సింగ్ లాంటి కోర్సుల్లో ప్రవేశం ఎంసెట్ ద్వారా జరిగే అవకాశం ఏర్పడుతోంది. నీట్ గురించి సుప్రీంకోర్టు తీర్పు వెలువడేలోపు సంశయం కంటే సన్నద్ధత చాలా అవసరం.
ఎంసెట్ 2012 :
మార్కుల, ర్యాంకుల విశ్లేషణ
తయారయ్యేదెలా?
* సీనియర్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 4 నుంచి, మార్చి మొదటివారంలో థియరీ పరీక్షలూ ప్రారంభమవుతున్నాయి కాబట్టి సీనియర్ ఇంటర్ ఆఖరి పరీక్ష మార్చి 19వ తేదీ వరకూ రెండో సంవత్సరం సిలబస్‌కే పరిమితమై చదవాలి.
* ఇంటర్ పరీక్షకు VSAQప్రశ్నలపై బాగా తయారైతే అది ఎంసెట్‌కు కూడా ప్రయోజనం.
* చాలామంది ఈ సమయంలో మొదటి సంవత్సరం సిలబస్ పునశ్చరణ అని సమయాన్ని నష్టపరుచుకుని సీనియర్ సిలబస్ పూర్తికాక ఒత్తిడికి గురవుతుంటారు. అలా కాకుండా మార్చి 19 వరకూ ఆబ్జెక్టివ్‌తో కలిపి రెండో సంవత్సరం సిలబస్ సంపూర్ణంగా పూర్తిచేయగలిగితే ఆ తర్వాత ప్రథమ సంవత్సర సిలబస్ పునశ్చరణకు కావలసిన సమయం దొరుకుతుంది.
* ఇంటర్ అకాడమీ పుస్తకాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి చదివినా సరిపోతుంది. నీట్‌కు అయితే అదనంగా బోటనీ, జువాలజీ ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు కూడా కచ్చితంగా చదవాలి. అయితే ఈ అదనపు అంశాలు మార్చి 19 తర్వాత చదువుకోవచ్చు.
* ఇంటర్ పరీక్షల ముందు నెలరోజులు పాఠాలు వినడం కంటే విద్యార్థి స్వయంగా అభ్యసించడానికి ప్రయత్నిస్తే అధికలాభం. సందేహాలు వస్తే వెంటనే అధ్యాపకుల సాయంతో నివృత్తి చేసుకోవచ్చు.
* కొంతమంది ఒక వారం ఒక సబ్జెక్టు పూర్తిచేయాలని ప్రయత్నిస్తూవుంటారు. అయితే ఒకే సబ్జెక్టు అంత ఎక్కువ కాలం చదివితే అవగాహనలోపం ఏర్పడవచ్చు. ఇతర సబ్జెక్టులు ఎక్కువకాలం చదవలేదు కాబట్టి మనసులో వాటిపై భయం పెంచుకుని, ఆ సబ్జెక్టులు కూడా సరిగా చదవలేరు. అందుకే వీలైనంతవరకూ ప్రతిరోజూ అన్ని సబ్జెక్టులూ చదవాలి (పరీక్షల సమయంలో తప్పించి).
* సిద్ధాంతపరమైన ప్రశ్నలు చదివినపుడు ఆకళింపు చేసుకోలేకపోతే కొంత సమయం లెక్కలు చేసి, మళ్ళీ సిద్ధాంతపరమైన భాగాలను చదివితే సరిపోతుంది.
* ఈ సమయంలో కొత్త అంశాలు చదవకుండా, చదివిన అంశాలను పునశ్చరణ చేసుకుంటే ఆత్మస్త్థెర్యం పెంచుకోవచ్చు.
* ఎంసెట్ బైపీసీ విభాగంలో 160 మార్కులకు 115 మార్కులపైన సాధించగలిగితే సీటు సాధించినట్లే. ఆ మార్కులు పొందాలంటే బయాలజీలో 75, కెమిస్ట్రీలో 35, ఫిజిక్స్‌లో మిగిలిన మార్కులు సాధించగలిగితే సరిపోతుంది. పట్టున్న సబ్జెక్టులో అధిక మార్కులు సాధించటం ముఖ్యం!
పూర్తి కథనం కోసం www.eenadu.net చదువు విభాగం చూడండి!
Monday, 10 December 2012
'నీట్' పరీక్షలో గెలుపు సులువే!
మార్పు అనివార్యమైనపుడు దానికి తగ్గట్టుగా మనల్ని మల్చుకోకతప్పదు. సానుకూలవైఖరితో ముందడుగు వేస్తేనే సత్ఫలితాలు వస్తాయి. 2013లో సీనియర్ ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే ఎం.పి.సి., బై.పి.సి. విద్యార్థులకు జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో పూర్తిమార్పులు చోటు చేసుకున్నాయి. ఎం.పి.సి. విద్యార్థులకు జేఈఈ- మెయిన్స్ మాదిరిగానే బై.పి.సి. వారికి 'నీట్' రాయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ మార్పును తల్చుకుని బెంబేలుపడకుండా మంచి ర్యాంకు సాధనకు దీక్షతో సమాయత్తం కావాలి!
ఆంధ్రప్రదేశ్‌లోని 14 ప్రభుత్వ, 25 ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో 5600 మెడికల్ సీట్లూ; మూడు ప్రభుత్వ, 18 ప్రయివేట్ డెంటల్ కళాశాలల్లో 1790 సీట్లూ ఉన్నాయి. అంటే మెడికల్, బీడీఎస్‌లతో కలిపి 7390 సీట్లను ఈ విద్యాసంవత్సరం నుంచి 'నీట్'లో వచ్చిన ర్యాంకు ఆధారంగా కేటాయిస్తారన్నమాట.
అయితే ఇప్పటికీ చాలామంది 'నీట్ ఉందా? ఎంసెట్ ఉందా? లేదా రెండూ ఉన్నాయా?' అనే సందిగ్ధంలో ఉన్నారు. రెండు పరీక్షలు జరిపే అవకాశమే లేదు. సుప్రీంకోర్టు తీర్పుననుసరించి ఒకే పరీక్ష ఉంటుంది. అయితే అది 'నీట్' అవడానికే అవకాశం ఎక్కువ!
ఎందువల్లనంటే- మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2010లోనే దేశంలోని మెడికల్ కళాశాలలన్నిటికీ ఒకే ప్రవేశపరీక్ష జరగాలని ఒక స్పెషల్ గెజిట్ విడుదల చేసింది. (గెజిట్ నెం. MCI-31(1)/2010_Med/49068, dated 21.12.2010). దాన్ని అనుసరించి 2012లోనే ఉమ్మడి జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష నిర్వహించవలసిన అవసరం ఏర్పడింది.
అయితే వివిధ రాష్ట్రాలు 2012లో విద్యార్థులు సంసిద్ధం తయారుకాలేరని అభ్యంతరం చెప్పటం, కొన్ని సాంకేతిక కారణాల వల్లా మళ్ళీ ఒక స్పెషల్ గెజిట్ విడుదల చేశారు. పరీక్షను 2013 నుంచి జరుపుతామని నిర్ణయించారు. (గెజిట్ నెం.MCI-31(1)/2010_Med/62051, dated 15.02.2012). ఈ రెండు గెజిట్‌ల ఆధారంగా మెడికల్ కౌన్సిల్ 2013లో ప్రవేశపరీక్ష జరిపే దిశలో విధివిధానాలతో నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో పరీక్ష జరగడానికే అవకాశాలు అధికం. పరీక్ష తెలుగులో జరుగుతుంది కాబట్టి తెలుగు మీడియం విద్యార్థులు కూడా ఎటువంటి మానసిక ఒత్తిడీ లేకుండా పరీక్షకు తయారుకావచ్చు.
ఈ పరీక్షకు సంబంధించి కొన్ని ముఖ్యమైన తేదీలు తెలుసుకుంటే వాటినుంచి తయారీ విధానం గురించి ఆలోచించుకోవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తు
ఈ పరీక్షకు డిసెంబర్ 31వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు భర్తీ చేయాలి. దీనికోసం www.cbseneet.nic.inఅనే వెబ్‌పేజీని ఓపెన్ చేసి మొదటగా నమూనా దరఖాస్తును ప్రింట్ తీసుకోవాలి. దాన్ని నింపి, దాని ఆధారంగా మళ్ళీ ఆన్‌లైన్‌లో భర్తీ చేస్తే తప్పులు చేసే అవకాశం ఉండదు.
నిర్ణీత ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు భర్తీ చేసిన తర్వాత దాన్ని A5 పేపరుపై ప్రింటు తీసుకోవాలి. వీటిని మూడు నుంచి ఐదు కాపీల వరకు ప్రింటు తీసుకొని వాటిపై ఫొటోగ్రాఫ్ అంటించి అటెస్టేషన్ చేయించాలి. ఫొటోగ్రాఫు నవంబరు ఒకటో తర్వాత తీసినదై ఉండాలి. ఫొటోగ్రాఫ్ కింద విద్యార్థిపేరు, ఫొటోతీసిన తేదీ ప్రింటు అయి ఉండాలి. ఆ ఫొటోగ్రాఫ్‌ని అంటించిన తర్వాత సంబంధిత కాలేజీ ప్రిన్సిపల్/ గెజిటెడ్ ఆఫీసర్ చేత దానిపై సంతకం చేయించాలి. మిగిలిన సంతకాలు కూడా పూర్తిచేసి CBSE ఆఫీస్‌కు పంపించవలసి ఉంటుంది. ముందుగా ఈ దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేస్తే ఇక పూర్తిగా పరీక్షకు తయారయ్యే విధానంపైనే దృష్టి సారించవచ్చు.
సంసిద్ధమయ్యే విధమెలా?
ఎంసెట్‌కూ, నీట్‌కూ ఉన్న తేడాలు గమనించాలి. ఎంసెట్‌లో 160 ప్రశ్నలకు మాత్రమే జవాబులు గుర్తించవలసి ఉంటుంది. నీట్‌లో 180 ప్రశ్నలుంటాయి. ఈ 180 ప్రశ్నలు మూడు సమవిభాగాలుగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీల్లో 60 ప్రశ్నల చొప్పున ఉంటాయా లేదా బయాలజీ (బోటనీ + జువాలజీ) 90 ప్రశ్నలు, ఫిజిక్స్ 45, కెమిస్ట్రీ 45 ప్రశ్నలు ఉంటాయా అనేది ఇంతవరకు వివరణ ఇవ్వలేదు. అయితే CBSE PMT పరీక్షలో 200 ప్రశ్నలు (50X4) ఉంటున్నాయి కాబట్టి 45 X4 అంటే బోటనీ 45, జువాలజీ 45, ఫిజిక్స్ 45, కెమిస్ట్రీ 45 ప్రశ్నలు ఉండే అవకాశం ఎక్కువ.
ఎంసెట్ కంటే అదనంగా 20 ప్రశ్నలు పెరుగుతున్నందున పరీక్షలో వేగం కొంత పెంచుకోవాలి. అయితే జాతీయస్థాయి పరీక్షల్లో మనరాష్ట్ర ఎంసెట్ కంటే భౌతిక, రసాయనశాస్త్ర పేపర్లు సులభంగా ఉంటున్నాయి కాబట్టి పెద్దగా ఒత్తిడికి గురవ్వాల్సిన అవసరం లేదు.
రుణాత్మక మార్కులపై మన రాష్ట్ర విద్యార్థులకు అభ్యాసం లేదు కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోవాలి. జవాబు గుర్తించేటప్పుడు తెలియని ప్రశ్నలకు జవాబులు వదిలివేయడం మేలు. లేదా నాలుగు సమాధానాలను స్పష్టంగా చదివి; కనీసం రెండు జవాబులు ఆ ప్రశ్నకు వర్తించవని భావిస్తే మిగిలిన రెండింట్లో ఒకదాన్ని గుర్తించడానికి ఛాన్స్ తీసుకోవచ్చు. అంతేకానీ ఏమీ తెలియకుండా జవాబు గుర్తించడం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదు.
1) రుణాత్మక మార్కులు ఉన్నాయి 2) ప్రశ్నల సంఖ్య పెరిగింది. ఈ రెండు అంశాలనూ అధిగమించాలంటే ఎక్కువసార్లు పునశ్చరణ చేయాల్సిందే. వీలైనన్ని ఎక్కువ నమూనా పరీక్షలు రాయాలి.
సిలబస్‌లో వ్యత్యాసాలు
మన విద్యార్థుల పరంగా చూస్తే- నీట్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీలలో దాదాపు తేడా లేదనే చెప్పాలి. కానీ జీవశాస్త్రం (బయాలజీ)లో వ్యత్యాసం చాలా ఉంది. జాగ్రత్తపడవలసిన ఓ అంశం- ప్రతి సబ్జెక్టులోనూ కటాఫ్ మార్కు సాధిస్తేనే ర్యాంకు పొందే అవకాశం ఉండటం.
మన ఎంసెట్‌లో సీటు సాధించడానికి ఇటువంటి కనీసమార్కు లేదు కాబట్టి బయాలజీ, కెమిస్ట్రీ చదువుకొని కూడా ర్యాంకు సాధించగల్గుతున్నారు. అంటే బయాలజీలో 75 మార్కులు, కెమిస్ట్రీలో 35 మార్కులు సాధించి ఫిజిక్స్‌లో 2 లేదా 3 మార్కులు సాధించినవారు కూడా మెడికల్‌లో చేరే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ప్రతి సబ్జెక్టులోనూ కటాఫ్ మార్కు సాధించాలి కాబట్టి మూడు సబ్జెక్టులకూ సమప్రాధాన్యం ఇచ్చి తయారుకావాలి.
మన రాష్ట్రవిద్యార్థులకు సీట్ల కేటాయింపు
ఆంధ్రప్రదేశ్, జమ్ము కాశ్మీర్ విద్యార్థులు నేషనల్‌పూల్‌లో లేరు కాబట్టి ఈ రాష్ట్రాల్లో నూరు శాతం సీట్లు అదే రాష్ట్ర విద్యార్థులతోనే నింపుతారు. అంటే ఎంసెట్ స్థానంలో నీట్ జరుగుతుంది. సీట్లు నింపే పద్ధతీ, సీట్ల సంఖ్యా గతంలో మాదిరే ఉంటుంది. అయితే మన రాష్ట్రవిద్యార్థులు ఇతర డీమ్డ్ యూనివర్సిటీల్లోనూ, ఇతర రాష్ట్రాల్లోని ప్రయివేట్ కళాశాలలో కేటగిరి-సి సీట్లనూ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అదనంగా 300 వరకూ సీట్లు లభ్యం అవుతాయి.
'నీట్' మన రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు- ఈ ఐదు కేంద్రాల్లో మే 5న జరుగుతుంది. ఈ పరీక్ష ఆంధ్రప్రదేశ్‌లో డైరక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పర్యవేక్షణలో జరుగుతుంది.
- పి.వి.ఆర్.కె. మూర్తి
(కటాఫ్ పర్సంటైల్ అంటే? పునశ్చరణ అవసరం ఏమిటి?... వీటి కోసం eenadu.net లో చదువు విభాగం చూడండి.)
Monday, 20 February 2012
వైద్య విద్యకు విభిన్న మార్గాలు!
జాతీయస్థాయి ఉమ్మడి వైద్య ప్రవేశపరీక్ష- (NEET ) వచ్చే ఏడాది రంగప్రవేశం చేసే అవకాశముంది. ఈ సంవత్సరానికి మాత్రం వైద్యవిద్య చదవాలనుకునేవారు వివిధ రకాల ప్రవేశపరీక్షలకు యథావిధిగా సిద్ధమవ్వాల్సిందే. ఈ సందర్భంగా విద్యార్థులు తెలుసుకోవలసిన విషయాలూ, పాటించాల్సిన సూచనలూ... ఇవిగో!
ఇంటర్మీడియట్ ఎంపీసీ విభాగంలో ఉన్న విద్యార్థులకు ఎన్ని అవకాశాలున్నాయో బైపీసీ వారికి కూడా అంతకంటే అధిక అవకాశాలే ఉన్నాయి. అయితే బైపీసీ విద్యార్థులూ, వారి తల్లిదండ్రులూ కేవలం ఎంబీబీఎస్ దృష్టితోనే ఉంటున్నారు కాబట్టి అవకాశాలు పరిమితమనే అభిప్రాయం వ్యాపించింది.
ఈ గ్రూపు తీసుకుంటే విద్యాభ్యాసానికీ, 'సెటిల్' అవటానికీ చాలాకాలం పడుతుందనే అభ్యంతరం తల్లిదండ్రుల నుంచి తరచూ వినిపిస్తుంటుంది. ఎందుకంటే ఎంబీబీఎస్ ఐదున్నర ఏళ్ళ తర్వాత సూపర్ స్పెషాలిటీతో కలిసి మొత్తం 11 సంవత్సరాల వరకూ చదవాలి కాబట్టి. కానీ వీరి కెరియర్ ప్రారంభం ఆలస్యం కావొచ్చు కానీ పదవీ విరమణ కూడా లేటుగానే ఉంటుంది కదా?
వీరు స్థిరపడినంతగా ఇంజినీర్లు లేదా ఇతర వృత్తివిద్యా కోర్సుల్లో ఉండే విద్యార్థులు స్థిరపడే అవకాశాలు తక్కువ. ప్రారంభంలో ఒక ఇంజినీర్ ఐదేళ్ళలోనే స్థిరపడి సంపాదించడం ప్రారంభించవచ్చు కానీ పది సంవత్సరాల తర్వాత ఒక డాక్టరు ఆదాయంలో ఇంజినీర్ ఆదాయం సగం కూడా ఉండకపోవచ్చు. సంపాదన కంటే కూడా వృత్తిలో పొందే సంతృప్తి ఒక వైద్యుడు పొందినట్లుగా మిగిలిన ఏ వృత్తిలో ఉన్న ఉద్యోగి కూడా పొందకపోవచ్చు.
మెడికల్ విభాగంలో కూడా విద్యార్థులను కొంతవరకూ సంతోషంగా ఉంచడానికి మెడికల్ కోర్సును నాలుగున్నర ఏళ్ళకు కుదించే దిశలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ మెడికల్ (NEET)ప్రారంభించిన తర్వాత అన్నిటికీ ఉమ్మడి సిలబస్ ఏర్పడుతుంది కాబట్టి మెడికల్ విద్యార్థులు ఒక ఏడాది ఆదా చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి.
ఈ సంవత్సరం సంగతేమిటి?
వైద్యవిద్య ప్రవేశపరీక్షలు రాసే విద్యార్థులు గమనించాల్సిన ముఖ్య విషయం- వీరు మొదట ఎంసెట్‌లో కచ్చితంగా సీటు సాధించగలమని నమ్మకం ఏర్పడితేనే మిగిలిన ప్రవేశపరీక్షల గురించి ఆలోచించడం మేలు. ఎందుకంటే మిగిలిన ఏ ప్రవేశపరీక్ష ద్వారా భర్తీ అయ్యే సీట్లతో పోల్చుకున్నా మన ఎంసెట్- మెడికల్ సీట్ల సంఖ్య చాలా ఎక్కువ.
2011 అడ్మిషన్ల ప్రకారం- మన రాష్ట్రంలో మొత్తం 37 వైద్యకళాశాలలున్నాయి. వీటిలోని సీట్ల సంఖ్య 4950. (ప్రభుత్వ కళాశాలల సీట్లు 1800 + ప్రైవేటు కళాశాలల్లో 3150.)
ఎయిమ్స్‌లాంటి సంస్థలో మొత్తం సీట్లు 45 లోపే. ఎ.ఎఫ్.ఎం.సి.లో బాలికలకు రిజర్వ్ చేసిన 25 సీట్లతో కలిపి మొత్తం ఉన్నవి 130 సీట్లే. వాటిమీద ఎక్కువ దృష్టి పెట్టేకంటే దాదాపు 5000 మెడికల్ సీట్లు భర్తీ చేసే మన ఎంసెట్ ర్యాంకు మీదే అధిక శ్రద్ధ వహించటం తెలివైన పని కదా? దీనిలో కచ్చితంగా సీటు సాధించగలమని ధీమా ఏర్పడిన తర్వాతే మిగిలిన ప్రవేశ పరీక్షల గురించి ఆలోచించాలనేది అందుకే!
వెటర్నరీ సైన్స్ (బీవీఎస్‌సీ) చదివినవారు ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశాలు ఎక్కువ. మన రాష్ట్రంలో సుమారు నాలుగువేలమంది పశువైద్య నిపుణుల కొరత ఉంది. రాష్ట్రంలో బీవీఎస్‌సీ అందించే కళాశాలలు మూడున్నాయి. రాష్ట్రస్థాయిలో ఎంసెట్ ద్వారా, జాతీయస్థాయిలో ఆలిండియా ప్రీ వెటర్నరీ టెస్ట్ (ఏఐపీవీటీ) ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తారు. అయితే ఎంసెట్ రోజునే ఏఐపీవీటీ కూడా నిర్వహిస్తున్నారు!
ప్రణాళిక ఎలా?
డాక్టరు కావడానికి అవకాశమిచ్చే (ఇంతకుముందు పేర్కొన్న) అన్ని కోర్సులకూ ప్రవేశం ఎంసెట్ ద్వారానే. ఎంసెట్ మే 12న కాబట్టి ఇంటర్ పరీక్షలు పూర్తయ్యేవరకూ కేవలం ద్వితీయ సంవత్సరం ఇంటర్ పరీక్షలపైనే దృష్టి పెట్టాలి. ఆ తర్వాత ఎంసెట్ గురించి ఆలోచించడం మేలు.
అనంతరం సుమారుగా 55 రోజులుంటాయి. 10 గ్రాండ్ టెస్టులు 20 రోజుల్లో పూర్తిచేయగలిగితే మిగిలిన 35 రోజులూ సమగ్ర సన్నద్ధతకు ఉపయోగపడతాయి. ఆ సమయంలో ప్రథమ సంవత్సర సిలబస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి చదవాలి.
జాతీయస్థాయి పరీక్షల్లో బయాలజీ ప్రాధాన్యం తగ్గుతుంది. ఇంగ్లిష్ లేదా ఆప్టిట్యూడ్ లాంటి అదనపు విభాగాల్లో సాధన చేయాల్సివుంటుంది. MGIMS పరీక్షలో గాంధీయ చింతన (గాంథియన్ థాట్స్)పై మూడు గంటల పరీక్ష అదనం. జాతీయప్రవేశపరీక్షలన్నిటిలో సీట్ల సంఖ్య చాలా తక్కువ, అదనంగా కొంత సన్నద్ధం కావాల్సివుండటం వల్ల మన విద్యార్థులు ఈ పరీక్షల్లో కొంత వెనకబడివున్నారు. ఈ పరీక్షల్లో విజేతలు కావాలంటే ఇంగ్లిష్, ఆప్టిట్యూడ్‌లలో అభ్యాసం తప్పనిసరి.
ఈ వివిధ రకాల పరీక్షలభారం ఈ ఏడాదితోనే ముగియవచ్చు. 2013 నుంచి దేశమంతటా NEETప్రారంభిస్తే విద్యార్థులపై ఈ అదనపు భారం, ఒత్తిడి తగ్గిపోతాయి.
భవితను తీర్చిదిద్దుకునేలా...
ఎంపీసీ విద్యార్థులు కానీ, బైపీసీ విద్యార్థులు కానీ వృత్తి విద్యలకు ఇచ్చే ప్రాధాన్యం బేసిక్ సైన్సెస్‌కు కూడా ఇస్తే మేలని విద్యావేత్తల అభిప్రాయం. నేడు బేసిక్ సైన్స్‌లలో ఎంఎస్సీ చేసిన అభ్యర్థుల సంఖ్య చాలా తక్కువగా కనపడుతోంది.
ఎంఎస్‌సీ ఇంటిగ్రేటెడ్ కోర్సు (5 సంవత్సరాలు)
డిపార్ట్‌మెంట్ అటామిక్ ఎనర్జీ వారు నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (NEST)ద్వారా కింది ప్రసిద్ధ సంస్థల్లో విద్యావకాశం కల్పిస్తున్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసర్చ్, భువనేశ్వర్; సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్, ముంబాయి; విశ్వభారతి, శాంతినికేతన్. గత ఏడాది నుంచి ఐఐఎస్‌సీ, బెంగళూర్‌లో కూడా బేసిక్ సైన్సెస్ బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లలో బీఎస్, ఎంఎస్‌లను ప్రారంభించారు.
వీటికి ఎంత గిరాకీ ఉందంటే ఈ కోర్సుల్లో చేరినవెంటనే అంటే ప్రథమ సంవత్సరం నుంచే స్త్టెపెండ్ రూపంలో రూ.5వేలు, సంవత్సరానికి అదనంగా రూ.20 వేలు ఇస్తారు. ఒకసారి ఈ సంస్థల్లో చేరినవారు ఉద్యోగం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు.
యూనివర్సిటీ ఆఫ్ పుణె, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లలో కూడా ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సులను ప్రారంభించారు. వీటిలో అధికశాతం కోర్సులు 2007 తర్వాతే ప్రారంభమయ్యాయి. కొన్నిటిని 2011లోనే ఆరంభించారు. కాబట్టి వీటిపై చాలామందికి సరైన అవగాహన లేదు.
NEST సంగతులు
ఈ పరీక్ష మే 27న జరుగుతుంది. ఇది మొత్తం ఐదు భాగాలుగా ఉంటుంది. మొదటి విభాగంలో జనరల్ ప్రశ్నలుంటాయి. ఇవి విద్యార్థులందరూ రాయాల్సిందే. మిగిలిన విభాగాలు- బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్. ఈ నాలుగింటిలో ఏవైనా మూడు విభాగాలు రాయాల్సివుంటుంది. అన్ని విభాగాలకూ మార్కులు సమం.
ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలోనే! కానీ కొన్ని ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు కూడా ఉండొచ్చు. తప్పు సమాధానానికి రుణాత్మక మార్కులుంటాయి. పరీక్ష ఇంగ్లిష్‌లోనే ఉంటుంది. మన రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, విశాఖపట్నాల్లో ఉన్నాయి. ఇంటర్లో 60 శాతం మార్కులు వచ్చివున్నవారు మాత్రమే పరీక్ష రాయటానికి అర్హులు. సిలబస్ సీబీఎస్‌ఈ 12 తరగతిది మాత్రమే. పరిశోధన ఆసక్తి ఉన్న విద్యార్థులకూ, అధ్యాపక వృత్తిలో రాణించదలిచినవారికీ చక్కటి అవకాశం.
ఇంకా ఇతర కోర్సులు
బైపీసీ వారు మన రాష్ట్రంలో చదవటానికి అవకాశమున్న ఇతర కోర్సులు- బీఫార్మసీ, బీటెక్ (బయోటెక్నాలజీ), బీఎస్‌సీ హార్టికల్చర్, అగ్రికల్చరల్ బీఎస్‌సీ, ఫిజియోథెరపీ, బీఎస్‌సీ నర్సింగ్, మెడికల్ మైక్రో బయాలజీ, మెడికల్ బయో టెక్నాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్, బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ... ఇలా చాలా ఉన్నాయి.
హార్టికల్చర్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు చాలా ఉన్నాయి. సివిల్ సర్వీసెస్‌లో విజయం సాధిస్తున్నవారిలో ఎక్కువశాతం అగ్రికల్చర్ బీఎస్‌సీ నుంచే వస్తున్నారు. కాబట్టి బైపీసీ వారికి ఎంబీబీఎస్ అనేదే కాకుండా ఇతర అవకాశాలూ ఎక్కువే.
- పి.వి..ఆర్.కె. మూర్తి.
Sunday, 18 December 2011
నిమ్స్‌లో పీజీ మెడికల్ కోర్సులు
మెడిసిన్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ సూపర్ స్పెషాలిటీ కోర్సులను అందిస్తోంది నిజామ్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్).
వివిధ వైద్య విభాగాల్లో ఎం.డి., ఎం.ఎస్. కోర్సుల్లో ప్రవేశానికి నిమ్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కోర్సుల వ్యవధి మూడేళ్లు. నిమ్స్ ఎంట్రన్స్ టెస్ట్ (NIMSET)ద్వారా వీటిలో ప్రవేశం లభిస్తుంది.
కోర్సుల వివరాలు...
* ఎం.డి. ఎనస్థీషియాలజీ: 7 సీట్లు
* ఎం.డి. జనరల్ మెడిసిన్: 4 సీట్లు
* ఎం.డి. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్: 3 సీట్లు
* ఎం.ఎస్. ఆర్థోపెడిక్స్: 4 సీట్లు
* ఎం.డి. పాథాలజీ: 5 సీట్లు
* ఎం.డి. రేడియోథెరపీ: 1 సీటు
అన్ని కోర్సులకు అర్హత ఎంబీబీఎస్. 31 మార్చి 2012 నాటికి ఇంటర్న్‌షిప్ పూర్తి చేసుండాలి. నిమ్‌సెట్‌లో 15 శాతం ప్రశ్నలు అసర్షన్, రీజనింగ్ పద్ధతిలో ఉంటాయి. మరికొన్ని మల్టీ రెస్పాన్స్ పద్ధతిలో, మిగతావి ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో ఉంటాయి. నమూనా ప్రశ్నలు నిమ్స్ వెబ్‌సైట్‌లో లభిస్తాయి. ప్రశ్నలు రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో అమల్లో ఉన్న ఎంబీబీఎస్ కోర్సు స్థాయిలో ఉంటాయి.
ఆంధ్ర యూనివర్సిటీ, ఉస్మానియా, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీల పరిధిలోని అభ్యర్థులకు వరుసగా 42 శాతం, 36 శాతం, 22 శాతం చొప్పున సీట్లను కేటాయిస్తారు. నిమ్స్ వెబ్‌సైట్ www.nimsexams.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. తర్వాత ప్రింట్ కాపీలను పంపించాలి.
* పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ 31 డిసెంబరు 2011.
* నిమ్‌సెట్ తేదీ: 12 ఫిబ్రవరి 2012
* కౌన్సెలింగ్ తేదీ: 26 ఫిబ్రవరి 2012
వివిధ వైద్య విభాగాల్లో ఎం.డి., ఎం.ఎస్. కోర్సుల్లో ప్రవేశానికి నిమ్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కోర్సుల వ్యవధి మూడేళ్లు. నిమ్స్ ఎంట్రన్స్ టెస్ట్ (NIMSET)ద్వారా వీటిలో ప్రవేశం లభిస్తుంది.
కోర్సుల వివరాలు...
* ఎం.డి. ఎనస్థీషియాలజీ: 7 సీట్లు
* ఎం.డి. జనరల్ మెడిసిన్: 4 సీట్లు
* ఎం.డి. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్: 3 సీట్లు
* ఎం.ఎస్. ఆర్థోపెడిక్స్: 4 సీట్లు
* ఎం.డి. పాథాలజీ: 5 సీట్లు
* ఎం.డి. రేడియోథెరపీ: 1 సీటు
అన్ని కోర్సులకు అర్హత ఎంబీబీఎస్. 31 మార్చి 2012 నాటికి ఇంటర్న్‌షిప్ పూర్తి చేసుండాలి. నిమ్‌సెట్‌లో 15 శాతం ప్రశ్నలు అసర్షన్, రీజనింగ్ పద్ధతిలో ఉంటాయి. మరికొన్ని మల్టీ రెస్పాన్స్ పద్ధతిలో, మిగతావి ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో ఉంటాయి. నమూనా ప్రశ్నలు నిమ్స్ వెబ్‌సైట్‌లో లభిస్తాయి. ప్రశ్నలు రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో అమల్లో ఉన్న ఎంబీబీఎస్ కోర్సు స్థాయిలో ఉంటాయి.
ఆంధ్ర యూనివర్సిటీ, ఉస్మానియా, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీల పరిధిలోని అభ్యర్థులకు వరుసగా 42 శాతం, 36 శాతం, 22 శాతం చొప్పున సీట్లను కేటాయిస్తారు. నిమ్స్ వెబ్‌సైట్ www.nimsexams.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. తర్వాత ప్రింట్ కాపీలను పంపించాలి.
* పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ 31 డిసెంబరు 2011.
* నిమ్‌సెట్ తేదీ: 12 ఫిబ్రవరి 2012
* కౌన్సెలింగ్ తేదీ: 26 ఫిబ్రవరి 2012
Monday, 21 November 2011
జాతీయ స్థాయిలో ర్యాంకులు పండిద్దాం!
వైద్యవిద్య లక్ష్యంగా ఉన్న విద్యార్థులు ఏ ప్రవేశపరీక్ష రాయాల్సివుంటుందో స్పష్టత లేక ఇటీవల గందరగోళపడ్డారు. 'నీట్' రాయటానికి రెండేళ్ళ వెసులుబాటు రాబోతుందంటూ వచ్చిన తాజా ప్రకటన ఊరటనిచ్చేదే! ఈ సమయంలో సీనియర్ ఇంటర్, లాంగ్ టర్మ్ విద్యార్థులు ఏ విధంగా సంసిద్ధమైతే జాతీయస్థాయి మెడికల్ పరీక్షల్లో రాణించగలరో, ఎంసెట్‌తో అనుసంధానం ఎలా చేసుకోవాలో పరిశీలిద్దాం!
జాతీయస్థాయి మెడికల్ ప్రవేశపరీక్షలూ, ఇంజినీరింగ్ జాతీయస్థాయి ప్రవేశపరీక్షలకూ సీట్ల పరంగా, విధి విధానాల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇంజినీరింగ్ విభాగంలో ఉన్న ఐఐటీ-జేఈఈ విషయం చూస్తే సీట్లలో రాష్ట్రాలకు కేటాయింపులు లేకపోవడం, పరీక్ష కూడా గణితం, భౌతిక రసాయనశాస్త్రాల్లో మాత్రమే జరగటం గమనించవచ్చు. అదే మెడికల్ ప్రవేశపరీక్షల్లో సీట్ల సంఖ్య చాలా స్వల్పం. వాటిలో రాష్ట్రాలకు కేటాయింపు ఉంది. పరీక్ష విధానంలో కూడా జీవశాస్త్రం, భౌతిక రసాయనశాస్త్రాలకు తోడుగా ఇంగ్లిష్, జనరల్ ఆప్టిట్యూడ్ ఉంటాయి.
ఈ కారణాల వల్ల జాతీయ పరీక్షల మెడికల్ విభాగంలో సీట్లు సాధించే విద్యార్థుల సంఖ్య మన రాష్ట్రం నుంచి సాపేక్షంగా చాలా తక్కువగా ఉంటోంది. అందుకే ఇప్పటినుంచి ప్రణాళికాబద్ధంగా ప్రారంభిస్తే పరీక్షల సమయానికి మన విద్యార్థులు కూడా ఇతర రాష్ట్ర విద్యార్థులతో దీటుగా ప్రతిభ కనపరిచే అవకాశముంది.
నీట్... కథాకమామిషూ
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న మెడికల్ కళాశాలల్లో డిగ్రీలో చేరడానికి నిర్వహించే ప్రవేశపరీక్ష NEET (National Eligibility cum Entrance Test). దీని ఉద్దేశం చాలా మంచిదే.
ఇప్పుడు జాతీయస్థాయిలో వైద్యవిద్య ప్రవేశపరీక్షలు దాదాపు పదికి పైగా జరుగుతున్నాయి. AIPMT, AIIMS, AFMC, JIPMER, MGIMS, BHU, AMU, CMC, MAHE, SRM, Comed Kమొదలైనవి. వీటిలో మన రాష్ట్ర విద్యార్థులు ఎనిమిదికి పైగా పరీక్షలకు హాజరవుతున్నారు. అయితే ఒకే కోర్సుకు ఇన్ని రకాల ప్రవేశపరీక్షలు లేకుండా విద్యార్థులకు ఒత్తిడి తగ్గించి వారిలో ఉన్న ప్రతిభను పూర్తిగా వెలికితీయాలనే 'నీట్'కు శ్రీకారం చుట్టారు. ఒకే పరీక్ష ద్వారా అన్ని రాష్ట్రాల్లో ప్రవేశమనేది నిజంగా హర్షణీయం.
అయితే సమస్యంతా కేవలం ఇప్పుడు సీనియర్ ఇంటర్ విద్యార్థులకు తగిన సమయం లేకపోవడమే! 'నీట్' వాయిదాకు ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ రాయటం, దాన్ని పరిశీలిస్తామని కేంద్రం హామీ ఇవ్వటం విద్యార్థులకు సంతోషకరమైన విషయం. త్వరగా ఈ ఆదేశాలు వెలువడితే ఆందోళన లేకుండా ఆత్మవిశ్వాసంతో ప్రవేశపరీక్షలకు సిద్ధమవుతారు.
ప్రశ్నల సంఖ్యను తొలిగా 180కి పెంచి అభ్యాసం మొదలుపెట్టాలి. జాతీయ పరీక్షల అభ్యర్థులు 180 ప్రశ్నలతో (బోటనీ 45, జువాలజీ 45, ఫిజిక్స్ 45, కెమిస్ట్రీ 45) సాధన చేయాలి. తరవాత 200 ప్రశ్నలకు మారవచ్చు. ఇప్పటివరకు విద్యార్థులకు రుణాత్మక మార్కులపై అవగాహన లేదు. అభ్యాసం కూడా లేదు. జాతీయస్థాయి పరీక్షలన్నిటిలో రుణాత్మక మార్కులున్నాయి. అభ్యాసం లేక మన రాష్ట్ర విద్యార్థులు అధికంగా నష్టపోతున్నది ఈ మార్కుల వల్లనే!
తుది ర్యాంకు నిర్థారణ రుణాత్మక మార్కుల ఆధారంగానే జరుగుతుంది. విద్యార్థులు అభ్యాసం చేసేటప్పుడు తెలిసినవాటికే జవాబులు గుర్తించడం మంచిది. ఇక అభ్యాసం చేయబోయే పరీక్షల్లో 160 మార్కులకు కాకుండా ప్రశ్నల సంఖ్యను కనీసం 180కి పెంచి రుణాత్మక మార్కులతో సాధన చేయడం ప్రారంభించాలి. అన్ని పరీక్షలలో ఫిజిక్స్, కెమిస్ట్రీలలో ఎంసెట్ కన్నా ప్రశ్నల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రశ్నల సరళి ఎంసెట్ కంటే సులభంగా ఉంటుంది.
విద్యార్థులు సిద్ధాంతపరమైన ప్రశ్నలకు ప్రాధాన్యం ఇస్తూ, వాటికి తోడు లెవెల్-1, లెవెల్-2 వరకు ఉన్న ప్రశ్నలకుసన్నద్ధమయితే సరిపోతుంది. ఎక్కువగా సమయం నష్టపోయే లెవెల్-3, లేదా క్లిష్టమైన ప్రశ్నలను వదిలేస్తే సరి. ఉదాహరణకు భౌతికశాస్త్రంలోని విద్యుత్తు వలయాలు, కెపాసిటర్లు, రెసిస్టర్లతో ఉన్న ప్రశ్నలను పూర్తిగా వదిలేసినా ఎటువంటి నష్టమూ ఉండదు.
ఇక జాతీయస్థాయి మెడికల్ ప్రవేశపరీక్షలన్నిటిలో మన విద్యార్థులు ఎక్కువగా నష్టపోతున్నది ఇంగ్లిష్, జనరల్ ఆప్టిట్యూడ్. ఈ పరీక్షలు రాసేవారు ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాక ఇవి కొంత సాధన చేయాలి. నమూనా పరీక్షలు కూడా వీటిలో వీలైనన్ని ఎక్కువ అభ్యాసం చేయాలి.
భౌతిక శాస్త్రం
భౌతిక శాస్త్రంలో నీట్, ఇతర జాతీయ పరీక్షల సిలబస్ చూస్తే మన ఎంసెట్‌తో పోల్చితే ఎక్కువ మార్పులు లేవు. కొన్ని స్వల్పమైన అంశాలను అదనంగా జత చేశారు.
అవి ఇంటర్ మొదటి సంవత్సరంలో...
*Circular motionలో Vehicle on level road,Banked Road (పాత సిలబస్‌లో ఉంది)
*Work done by variable force.
*Centre of mass of uniform rod
*Kepler's laws of planetory motion
*Kinetic theory of gases
ద్వితీయ సంవత్సర సిలబస్‌లో...
Unit - i 1. Vande graf generator (Electrostatics) Unit - iii Toroidal solenoids, Cyclotrn Unit-iv iii. Eddy Currents, AC Generator Unit-v iv. Displacement Current v. Electromagnetic Spectrum Unit-vi vi. Reflection of Light, Spherical Mirrors, Mirror Formula vii. Scattering of Light, blue color of the sky and reddish appearance of the sun at sunrise and sunset. viii. Human eye, image formation and accomodation, correction of eye defects using lenses. Unit-vii ix. Davisson - Gerner experiment Unit-Viii x. Bohrmodel, Energy Levels, Hydrozen Spectrum
ప్రథమ, ద్వితీయ సంవత్సర సిలబస్‌లలో భౌతికశాస్తంలో విద్యార్థి అదనంగా చదవవలసిన అంశాలు ఇవి. అయితే ఇవన్నీ మన సిలబస్‌లో కొద్దిగా పొడిగింపు మాత్రమే. ఇవి పెద్దగా వ్యవధి తీసుకోవు కాబట్టి మొదటగా ఎంసెట్ అంశాలనే సాధన చేసుకుంటూ పోవాలి. ఈ ఫిజిక్స్ అదనపు సిలబస్ సాధనకు 25 రోజులు చాలు. అంటే ఈ అదనపు భాగమంతా ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాక ఏప్రిల్‌లో నేర్చుకోవచ్చు. కారణం- ఈ జాతీయస్థాయి ప్రవేశపరీక్షలన్నీ మే-జూన్‌లలో ఉండటమే.
రసాయన శాస్త్రం
రసాయన శాస్త్రంలో సీబీఎస్‌ఈతో పోల్చినపుడు ఎంసెట్ సిలబస్ వ్యత్యాసాలు దాదాపుగా లేవనే చెప్పవచ్చు. సీబీఎస్‌ఈ సిలబస్‌తో పోల్చినపుడు UNIT-1,2, 3, 4, 6,10,12, 14, 15 లలో ఎటువంటి మార్పూ లేదు.
UNIT-V 1. Suspensions 2. Multimolecular and macro molecular colloids UNIT-VI iii. In group 15: Preparation and properties of phosphine iv. In group 16: Trends in Physical and chemical properties of Dioxygen. v. In group 17: Preparation Properties and uses of Hydrochloric acid. UNIT-VII vi. Preparation and properties of K2, cr2, O7 and Kmno4 UNIT-IX vii. Crystal field theory. UNIT-XI viii. Mechanism of dehydrogen with special reference to Methanol. UNIT-XIII ix. Cyanides and iso cyanides
వీటిలో అధిక భాగానికి అదనపు కాలం నష్టపోకుండా సీనియర్ సిలబస్‌తో పాటే పూర్తి చేసుకోవచ్చు.
- పి.వి.ఆర్.కె. మూర్తి
Subscribe to:
Posts (Atom)