విభాగాలు ఎన్ని?
- ఆఫ్-క్యాంపస్ ప్రోగ్రామ్‌లు (1)
- ఆర్ ఆర్ బీ (1)
- ఇంగ్లిష్ (17)
- ఇంజినీరింగ్ (29)
- ఇంటర్న్ షిప్ లు (1)
- ఉపకార వేతనాలు (8)
- ఎలిజిబిలిటీ టెస్ట్ (5)
- ఏపీపీఎస్ సీ (25)
- ఏరోనాటిక్స్ (2)
- ఐఐటీ (2)
- ఐటీ/ సాఫ్ట్ వేర్ (2)
- ఐటీఐ... ఉద్యోగాలు (3)
- కాస్ట్ అకౌంటెన్సీ (1)
- కౌన్సెలింగ్ (2)
- జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు (3)
- జూనియర్ లెక్చరర్స్ (2)
- టాపర్ (1)
- దూరవిద్య (4)
- నైపుణ్యాలు (3)
- పీజీ (6)
- పీహెచ్ డీ (8)
- పోలీస్ (7)
- ఫార్మసీ (4)
- ఫైనాన్స్ (1)
- ఫ్యాషన్ డిజైనింగ్ (1)
- బోధన రంగం (7)
- బ్యాంకింగ్ (8)
- మీడియా (1)
- మేనేజ్ మెంట్ (2)
- మేనేజ్ మెంట్/ ఎంసీఏ (16)
- యూజీ/ పీజీ (3)
- యూపీఎస్ సీ (4)
- విదేశీ విద్య (9)
- వీఆర్ఏ (2)
- వీఆర్ఓ (2)
- వైద్యవిద్య (8)
- సందేహాలూ సమాధానాలూ (4)
- సమ్మర్ ఫెలోషిప్ లు (1)
- సహకార బ్యాంకులు (1)
- సాఫ్ట్ వేర్ (3)
- సివిల్స్ (16)
- సైన్సెస్ (1)
- స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (1)
- స్వాగతం (1)
- హాస్పిటాలిటీ (2)
- హెల్త్ కేర్ (2)
Showing posts with label ఎలిజిబిలిటీ టెస్ట్. Show all posts
Showing posts with label ఎలిజిబిలిటీ టెస్ట్. Show all posts
Sunday, 2 November 2014
Tuesday, 28 October 2014
Wednesday, 9 January 2013
మే 10న ఎంసెట్
ఈనాడు - హైదరాబాద్ :ఇంజినీరింగ్, ఇతర వృత్తివిద్య కోర్సుల ప్రవేశపరీక్షల తేదీలతోపాటు ఫలితాల వెల్లడి, కౌన్సెలింగ్ నిర్వహణ, తరగతుల ప్రారంభం తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి ప్రకటించింది. ఇలా జరగడం ఉన్నత విద్యాశాఖ చరిత్రలో ఇదే ప్రథమం.
సుప్రీంకోర్టు ఆదేశాలతో 'అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ)' జారీచేసిన మార్గదర్శకాలను అనుసరించి ఉపముఖ్యమంత్రి, ఉన్నతవిద్యాశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం ఏడు ప్రవేశపరీక్షల తేదీలను వెల్లడించారు. నిరుడు ఎంసెట్ మే 12న జరగ్గా, ఈసారి రెండు రోజులు ముందుగా మే 10న జరుగనుంది. ఐసెట్ అదే నెల 17న ఉంటుంది. ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ ఇంజినీరింగ్(పీజీఈసెట్) తరగతులు ఆగస్టు 1న ప్రారంభమవుతాయి. ఎడ్‌సెట్(బీఈడీ), వ్యాయామవిద్య(పీఈసెట్), న్యాయవిద్య(లాసెట్, పీజీలా) బీటెక్ ద్వితీయ సంవత్సరం(ఈసెట్) తరగతులు జులైలో వేర్వేరు తేదీల్లో మొదలవుతాయి. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ అజయ్‌జైన్, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి డోబ్రియల్, ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ప్రొఫెసర్ జయప్రకాష్‌రావు, ఇతర అధికారులతో కలసి ఉపముఖ్యమంత్రి ఈ వివరాలను మీడియా ప్రతినిధులకు తెలిపారు.
2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్ యాజమాన్య కోటా సీట్ల భర్తీని ఆన్‌లైన్‌లోనే చేపడతామని స్పష్టంచేశారు. రుసుములు, ప్రవేశాల నియంత్రణ సంఘం(ఏఎఫ్‌ఆర్‌సీ) పటిష్ఠతకు సంబంధించిన చట్టాన్ని రానున్న శాసనసభ సమావేశాల్లో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఆన్‌లైన్ సీట్ల భర్తీపై హైకోర్టు ఆదేశాలను అనుసరించి త్వరలోనే ఉత్తర్వులు జారీచేస్తామన్నారు. బోధనా రుసుములు చెల్లించకుంటే జనవరి 21 నుంచి ఇంజినీరింగ్ కళాశాలలను మూసేస్తామన్న యాజమాన్యాల ప్రకటనపై విలేఖరులు ప్రశ్నించగా- దానిపై తానేమీ మాట్లాడనని రాజనర్సింహ బదులిచ్చారు. ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రత్యేక బృందాల తనిఖీలు పూర్తికావొచ్చాయన్నారు. చివరిసారిగా ప్రాంతీయ, రాష్ట్రస్థాయి బృందాల తనిఖీలను జరపబోతున్నామని వివరించారు. తనిఖీ నివేదికలను అనుసరించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాల ఆధారంగానే ర్యాంకుల ప్రకటన: ఈసారి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల ఆధారంగానే ఎంసెట్ ర్యాంకులను ప్రకటిస్తామని అజయ్‌జైన్, జయప్రకాష్‌రావు వెల్లడించారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే విద్యార్థులకు మలివిడత కౌన్సెలింగ్‌లో అవకాశాన్ని కల్పిస్తామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని చెప్పారు. ఏటా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల వెల్లడి ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తుండటంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తొలుత మార్కులను ప్రకటించి, ఈ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాక ర్యాంకులను ప్రకటిస్తున్నారు. ఈ పరీక్షల ద్వారా ఎంసెట్ ర్యాంకులు సాధించే వారు తక్కువగా ఉంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈదఫా ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాల ఆధారంగానే అధికారులు ర్యాంకులను ప్రకటించబోతున్నారు.
Thursday, 1 December 2011
మార్కులు పెరిగేట్టు...మన భాషపై మనసు పెట్టు!
తెలుగు పాఠ్యాంశాలలోని చాలామటుకు అంశాలు అభ్యర్థులు పాఠశాల, కళాశాల స్థాయుల్లో చదివినవే. అయితే వీటి అవసరం లేక మర్చిపోయి ఉంటారు. ఇప్పుడు మళ్లీ శ్రద్ధ పెట్టాలి.
'మళ్లీ గుర్తుకు తెచ్చుకుందాం.. మళ్లీ తెలుసుకుందాం' అని ఇష్టపడితే తెలుగులో మార్కులు సంపాదించడం కష్టమేమీ కాదు.
అపరిచిత గద్యం, అపరిచిత పద్యం అనేవి పాఠ్యేతర అంశాలు. వీటిల్లో రెండోది కొంచెం కష్టం. అయితే ఈ తెలియని అంశాలలో.. తెలిసినవి ఉంటాయన్నది గ్రహించాలి.
గత ప్రశ్నపత్రం ఆధారంగా అపరిచిత గద్యం, అపరిచిత పద్యం అనేవాటికి ఒక్కొక్కటికి ఆరు మార్కుల చొప్పున మొత్తం పన్నెండు మార్కులున్నాయి.
అంటే, భాషా సాహిత్యాలకు కలిపి మొత్తం 24 మార్కులుంటే ఈ అపరిచిత గద్యం, పద్యాలకే సగం మార్కులు! వీటిల్లో మనం చదువుకునే భాషా సాహిత్యాంశాలే ప్రశ్నలుగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. గద్యమైనా, పద్యమైనా ఆరు ప్రశ్నలిచ్చి సమాధానాలు రాయమంటారు. చాలావరకు సమాధానాలు ఇచ్చిన దానిలోనే ఉంటాయి. పద్యంలో కొన్ని ఉంటాయి.
కవులు, కావ్యాలు, రచయితలు, రచనలు, ప్రక్రియలు అనే అంశం రెండోది. నిర్దిష్టంగా సిలబస్ లేదు కాబట్టి ప్రాచీన, ఆధునిక కవుల్లో ముఖ్యమైనవారిని తెలుసుకోవాలి. కవికాలం, బిరుదు, ముఖ్యమైన రచనలు.. చదివితే చాలు. కొటేషన్లకి ప్రాధాన్యం లేదని గుర్తించాలి.
ప్రక్రియలు అంటే కావ్యం, ప్రబంధం, శతకం, కథ, నవల, నాటిక వంటివి. వీటిలో ముఖ్యాంశాలు మాత్రమే గుర్తుంచుకుంటే చాలు.
ఇంటర్‌స్థాయిలో వ్యాకరణం
వ్యాకరణాంశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ దాదాపుగా ఇవన్నీ పూర్వం చదివినవే. నిజానికి ఇంటర్ స్థాయివే. సంధులు, సమాసాలు, ప్రకృతి-వికృతులు, ఛందస్సు చాలా ముఖ్యం.
* సంధుల్లో సంస్కృత సంధులైన సవర్ణ, గుణ, వృద్ధి, యణా దేశాలు చదివితే చాలు. తెలుగు సంధుల్లో ఉకార సంధి, పుంప్వాదేశం, గసడదవాదేశం, ద్రుత సంధి, త్రిక సంధి, రుగాగమ సంధులకు ప్రాధాన్యమివ్వాలి.
* సమాసాలన్నీ ఇంచుమించుగా చదవాలి.
* ఛందస్సులో వృత్త పద్యాలైన ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం బాగా నేర్చుకోవాలి. వీటి గణాలు, యతి స్థానాలు గుర్తుంచుకోవాలి. ఆటవెలది, తేటగీతి, సీసం వంటి వాటి గణాలు తెలుసుకుంటే చాలు. వృత్త పద్యాలు మాత్రం ఉదాహరణలతో అభ్యాసం చేయాలి.
* కళలు, విభాష, ద్రుతం, పరుషాలు, సరళాలు వంటి కొన్ని పారిభాషిక పదాలను తెలుసుకోవాలి.
* సామెతలు, జాతీయాలు అనేవి గత ప్రశ్నపత్రం ఆధారంగా చూస్తే ప్రత్యేకంగా అడగలేదు. అపరిచిత గద్య పద్యాలనే అడుగుతున్నారని గమనించాలి.
* అలంకారాలలో వృత్త్య్తనుప్రాస, యమకం, అంత్యానుప్రాస, ఉపమ, రూపకం, ఉత్ప్రేక్ష, అతిశయోక్తి, స్వభావోక్తి, శ్లేష ముఖ్యం.
వాక్యభేదాలు
సామాన్యంగా వాక్యంపై ప్రశ్న తప్పనిసరిగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాక్య భేదాలు- వీటిలో నామ్నీకరణ వాక్యం, సామాన్య సంశ్లిష్ట సంయుక్త వాక్యాలు, ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు, కర్త్రరి, కర్మణి వాక్యాలు చాలా ముఖ్యం.
వీటిపై ప్రశ్న, ఒక వాక్యం ఇచ్చి మరొక వాక్యానికి మార్చమని అడిగేలా ఉంటుంది.
ఉదా. రాముడు అన్నం తిన్నాడు. రాముడు చదివాడు.
దీనిని సంశ్లిష్ట వాక్యంగా మార్చమంటే..
ఉదా. రాముడు అన్నం తిని చదివాడు అనాలి.
ఇదేవిధంగా ప్రత్యక్ష వాక్యం ఇచ్చి పరోక్ష వాక్యానికి మార్చమంటారు.
విషయం ఎక్కువ, మార్కులు తక్కువ
రెండో విభాగం బోధనా పద్ధతులు. ఇందులో ఆరు అంశాలకు ఆరు మార్కులున్నాయి. విషయం ఎక్కువ. మార్కులు తక్కువ. ఇందులో భాషా నైపుణ్యాలు, బోధన పద్ధతులు, మూల్యాంకనం, ఉపకరణాలు చాలా ముఖ్యమైనవి. మొదటి రెండంశాలు ఇంకా ుఖ్యమైనవి.
ప్రశ్నలు ఇలా ఉండవచ్చు.
* విస్తార పఠనానికి అనుకూలమైనది.
1. కావ్యం
2. వాచకం
3. ఉపవాచకం
4. నిఘంటువు (3)
* కిండర్ గార్టెన్ పద్ధతిని ప్రతిపాదించినవారు
1. ఫ్రోబెల్
2. మాంటిసోరి
3. కొఠారి
4. ఎవరూ కాదు (1)
నాటకీకరణ, భాషా నైపుణ్యాల వరుస.. తరగతుల వారీగా చేపట్టవలసిన కార్యక్రమాలు, పద్య గద్య వ్యాకరణ బోధనలు ప్రధానంగా చదవాలి. మూల్యాంకనంలో పూర్వపు పద్ధతుల్ని, ఆధునిక పద్ధతుల్ని తెలుసుకోవాలి. బోధనా పద్ధతులలో కిండర్ గార్టెన్, మాంటిసోరి, డాల్టన్ పద్ధతులపై శ్రద్ధ పెట్టాలి.
మొత్తం మీద కష్టమైనది ఏంటంటే, అపరిచిత పద్యం. దీనికి 7 నుంచి పదో తరగతి వరకు ఉండే తెలుగు వాచకాలలోని పద్యాలను ఒకసారి పరిశీలిస్తే అవగాహనా సామర్థ్యం అలవడుతుంది.

Monday, 5 September 2011
‘నెట్’ రాస్తున్నారా మీరు?
విశ్వవిద్యాలయ స్థాయిలో బోధన రంగంలో స్థిరపడటం మీ లక్ష్యమైతే మీరు ఓ పరీక్ష రాయాల్సివుంటుంది. అదే ‘నెట్’. అంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్!
ఈ పరీక్ష ద్వారా లెక్చర్‌షిప్‌లో ఉత్తీర్ణులవ్వాలన్నమాట.
ఉన్నత ప్రమాణాలతో నిర్వహించే పరీక్ష ఇది.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 'శాస్త్ర విజ్ఞాన, పారిశ్రామిక పరిశోధన మండలి' (సీఎస్‌ఐఆర్) ఉంది. ఈ సంస్థ శాస్త్ర రంగంలో ఉన్నత స్థాయి పరిశోధనలను ప్రోత్సహిస్తుంటుంది. యూజీసీతో కలిసి ఈ నెట్ నిర్వహిస్తోంది. దీని ద్వారా జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్‌కు ఎంపికైన అభ్యర్థులకు దేశంలోని ప్రఖ్యాత సంస్థల్లో పరిశోధనలు చేసే అవకాశం లభిస్తుంది.
ఇవాళ ‘చదువు’లో ప్రచురించిన పూర్తి కథనం ఇక్కడ చదవండి...
Subscribe to:
Posts (Atom)