విభాగాలు ఎన్ని?
- ఆఫ్-క్యాంపస్ ప్రోగ్రామ్‌లు (1)
- ఆర్ ఆర్ బీ (1)
- ఇంగ్లిష్ (17)
- ఇంజినీరింగ్ (29)
- ఇంటర్న్ షిప్ లు (1)
- ఉపకార వేతనాలు (8)
- ఎలిజిబిలిటీ టెస్ట్ (5)
- ఏపీపీఎస్ సీ (25)
- ఏరోనాటిక్స్ (2)
- ఐఐటీ (2)
- ఐటీ/ సాఫ్ట్ వేర్ (2)
- ఐటీఐ... ఉద్యోగాలు (3)
- కాస్ట్ అకౌంటెన్సీ (1)
- కౌన్సెలింగ్ (2)
- జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు (3)
- జూనియర్ లెక్చరర్స్ (2)
- టాపర్ (1)
- దూరవిద్య (4)
- నైపుణ్యాలు (3)
- పీజీ (6)
- పీహెచ్ డీ (8)
- పోలీస్ (7)
- ఫార్మసీ (4)
- ఫైనాన్స్ (1)
- ఫ్యాషన్ డిజైనింగ్ (1)
- బోధన రంగం (7)
- బ్యాంకింగ్ (8)
- మీడియా (1)
- మేనేజ్ మెంట్ (2)
- మేనేజ్ మెంట్/ ఎంసీఏ (16)
- యూజీ/ పీజీ (3)
- యూపీఎస్ సీ (4)
- విదేశీ విద్య (9)
- వీఆర్ఏ (2)
- వీఆర్ఓ (2)
- వైద్యవిద్య (8)
- సందేహాలూ సమాధానాలూ (4)
- సమ్మర్ ఫెలోషిప్ లు (1)
- సహకార బ్యాంకులు (1)
- సాఫ్ట్ వేర్ (3)
- సివిల్స్ (16)
- సైన్సెస్ (1)
- స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (1)
- స్వాగతం (1)
- హాస్పిటాలిటీ (2)
- హెల్త్ కేర్ (2)
Showing posts with label బోధన రంగం. Show all posts

Tuesday, 28 October 2014
Monday, 14 May 2012
మీరు టెట్ రాస్తున్నారా?
టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) ఈ సారి ఉద్విగ్న భరితంగా జరగనుంది. టెట్ కేవలం అర్హతా పరీక్షే కాకుండా డీఎస్సీలో 20 మార్కుల వెయిటేజీ కూడా ఉంటుంది. తద్వారా డీఎస్సీలో అంతిమ ఫలితం ఎలా ఉంటుందనేది టెట్ స్థాయిలోనే అభ్యర్థులకు దాదాపు తెలిసిపోతుంది. మరో 17 రోజుల్లో టెట్ పరీక్ష జరగబోతుండటంతో అభ్యర్థుల్లో కొంత ఆందోళన ఉండటం సహజం. ఈ కొద్దిపాటి సమయాన్ని టెట్‌లో గరిష్ఠ మార్కులు సాధించడానికి ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం.
చాలామంది అభ్యర్థులు టెట్‌లో అర్హత మార్కులు 'ఎలాగోలా' వస్తే చాల్లే అని, స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించుకొని పూర్తి శక్తియుక్తుల్ని వినియోగించరు. నామమాత్రంగా చదువుతారు. ఇది సరైన ధోరణి కాదు. ఆ మధ్య వచ్చిన ఓ తెలుగు సినిమాలో 'ఎలాగోలా బతికేద్దాం అని ఇక్కడికి రాలేదు' అని హీరో అంటాడు చూడండి, అలాగే మీరు కూడా ఉన్నత లక్ష్యంతో టెట్ యుద్ధానికి సిద్ధమవండి. డీఎస్సీలో ప్రభావం చూపే టెట్‌లో మీ మార్కుల లక్ష్యం పైన పట్టికలో చూపించిన విధంగా ఉండాలి.
పేపర్ కఠినత్వం సగటు స్థాయిగా ఉందనుకుంటే... మొత్తం మీద 115 - 120 మధ్య స్కోరు చేయగల్గితే డీఎస్సీలో మంచి వెయిటేజీ లభించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ స్థాయిలో మీ ప్రిపరేషన్ ఉంటే విజయవంతం అయినట్లే. లేకుంటే ఈ 17 రోజుల్లో ఏమి చేసి లక్ష్యం సాధించాలో తెలుసుకుందాం.
శిశు వికాసం - పెడగాజి
సిలబస్ కింద చాలా అంశాలు ఉండటంతో ఈ విభాగంపై అభ్యర్థులు సాధారణంగా కొంత వ్యతిరేకత పెంచుకుంటారు. 2012 జనవరి టెట్‌లో పెడగాజి (10 ప్రశ్నలు), అభ్యసనం (8), శిశువికాసం (8), వైయక్తిక భేదాలు (2), మూర్తిమత్వం (2) ప్రశ్నలు అడిగారు. పాఠ్యాంశాల విభజన మళ్లీ దాదాపుగా ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. ఈ విభాగంపై ఇంకా సరైన పట్టు దొరకలేదు అనుకునేవారు, ఉన్న సమయంలో కింది అంశాలపై దృష్టిపెట్టడం మంచిది.
* పెడగాజిలోని సిలబస్‌ని జనరల్‌గా చదవండి. అక్కడక్కడ మెథడ్స్ అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశాల్ని కూడా అనుసంధానం చేసుకొని చదివితే రెండు విధాలుగా ప్రయోజనం లభిస్తుంది.
* 'అభ్యసనం' విభాగంలో ప్రశ్నలు అన్నీ బీఎడ్ / డీఎడ్ పుస్తక సమాచారంలోనివే కాబట్టి, అకాడమీ పుస్తకాల సహాయంతో అభ్యసన భావనలు బాగా చదవాలి.
* 'శిశువికాసం' విభాగంలో... వికాసం - పెరుగుదల ప్రధానాంశాలుగా కన్పిస్తున్నాయి. ఈ విభాగంలో 1-5 పాఠాలను క్షుణ్నంగా చదివి, 6, 7, 8 పాఠాల్ని సాధారణ స్థాయిలో చదివితే సరిపోతుంది.
* తరగతి గది, పాఠశాల, ఉపాధ్యాయుడు, పిల్లలు, పరిసరాలు మొదలైన అంశాలను, వాటి గురించి ఊహించుకుంటూ చదివితే పెడగాజిలో మార్కులు సులభంగా సాధించవచ్చు.
తెలుగు భాష
2011 టెట్ పేపర్ చూసి చాలామంది అభ్యర్థులు ఈ విభాగాన్ని సులభంగా భావించారు. కానీ 2012 (జనవరి) పేపర్ చూసి కారణాలు ఏవైనప్పటికీ బాగా ఒత్తిడికి లోనయ్యారు. నిజానికి 'తెలుగు భాష' కింద ఇచ్చిన 30 ప్రశ్నలలో అత్యధిక ప్రశ్నలు సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. కాకపోతే వ్యాకరణ ప్రశ్నల్ని కంటెంట్ ఆధారంగా అడగటం (సాధారణ ఉదాహరణలలో కాకుండా), వాడుకలో లేని పదాలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఒత్తిడికి లోనై ఉంటారు. 'శిశు విషాణం' అర్థం, బహువ్రీహి సమాసానికి ఛాయిస్‌లో ఇచ్చిన పదాలు, 'ఉప్పు' కోసం ఇచ్చిన పొడుపు కథ... ఇబ్బందులు కలిగించాయని భావించవచ్చు. ఏది ఏమైనా టెట్‌లో అత్యధిక స్కోరు సాధించటం లక్ష్యం కాబట్టి అభ్యర్థులు కింది అంశాలపై దృష్టి పెట్టాలి.
* సిలబస్‌లో పేర్కొన్న పాఠ్యాంశాల అధారంగా పద్యాల్ని తెలుగు వ్యాకరణ అంశాలతో అనుసంధానం చేసుకొని అధ్యయనం చేయాలి. నేరుగా వ్యాకరణ అంశాలు చదవకూడదు.
* పెడగాజి కింద 6 ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి వ్యాకరణం చదివి, 'అంతా చదివేశాం' అనుకోకుండా భాషా బోధనలో అనుసరించాల్సిన వ్యూహాలతోపాటు తెలుగు పండితులకు ఉండాల్సిన లక్షణాలపై కూడా పట్టు సాధించాలి.
ఇంగ్లిష్ భాష
అధికశాతం అభ్యర్ధులు ఈ విభాగాన్ని సహజంగా కష్టమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభ్యర్ధులు దీని గురించి ఒత్తిడికి లోనవుతారు. కంటెంట్‌లో ఎక్కువ మార్కులు సాధిద్దామని ఇంగ్లిష్ భాషను దాదాపు వదిలేస్తారు. ఇప్పటికే బాగా ప్రిపేరై ఉంటే మంచిదే. ఇంకా సరైన పట్టు సాధించకుంటే అందుబాటులో ఉన్న సమయంలో కింది అంశాలపై దృష్టిపెట్టి కనీసం 10 మార్కుల వరకు అదనంగా పొందే అవకాశం ఉంది. ముందుగా 2012 (జనవరి) ప్రశ్నల్ని పరిశీలిస్తే, ఎగ్జామినర్ పెట్టుకున్న ప్రమాణాలు ఇలా ఉన్నాయి.
వాడుకలో ఉపయోగించే పదాల్ని కాకుండా క్లిష్ట పదాల్ని ఎక్కువగా వినియోగించటం వల్ల ప్రశ్నే అర్థం కాకపోవటంతో అభ్యర్ధులు బాగా మార్కులు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాలంటే అభ్యర్థులకు ఇంగ్లిష్ పేపర్, చందమామ (జూనియర్) లాంటివి చదివే అలవాటు ఉండాలి. ఈ 17 రోజుల్లో అది సాధ్యం కాదు కాబట్టి... ఇచ్చిన సిలబస్ సంబంధిత పాఠ్యగ్రంధాల్ని రోజూ కనీసం ఓ గంట పెద్దగా చదవటం వల్ల ప్రయోజనం ఉంటుంది. చదివేటప్పుడే అర్థం కాని పదాలుంటే డిక్షనరీ ద్వారా అర్థం తెలుసుకోవాలి. ఈ అర్థాలను ఒక నోట్‌బుక్‌లో రాసుకుంటూ పునశ్చరణ చేయటం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. గత పరీక్షను పరిశీలిస్తే..
* నేరుగా పదాలకు వ్యతిరేక, సమానార్థాలు అడగకుండా ఒక వాక్యంలో ఏదో ఒక పదం ఎంచుకొని పరిశీలించడం జరిగింది. పైన పేర్కొన్న మెలకువ దీనికి కూడా ఉపయోగపడుతుంది.
* గ్రామర్ అంశాలపై ఆధారపడిన ప్రశ్నలు అధికంగా ఉన్నాయి. అందువల్ల పరీక్ష వరకు రోజుకో అంశానికి 1 గంట సమయం కేటాయించి సాధన చేయడం అవసరం.
* పెడగాజి కింద ఇచ్చిన 6 ప్రశ్నలు సాధారణ స్థాయివే. అభ్యర్థి తాను టీచర్ అయితే బోధన చేయడానికి ఎలాంటి మెలకువలు పాటించాలి అని ఆలోచిస్తూ అధ్యయనం చేస్తే చాలు. కొద్దిపాటి శ్రమతో ఈ విభాగం నుంచి 4-5 మార్కులు సులభంగా సాధించవచ్చని మరవద్దు. 10 గంటల సమయం కేటాయిస్తే ఈ విభాగంపై పట్టు కచ్చితంగా ఏర్పడుతుంది.
టెట్ పేపర్ 1 రాసినా, పేపర్ 2 రాసినా, ఈ విభాగాల ప్రిపరేషన్‌ని ఇదే శైలిలో అనుసరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
ఈ 17 రోజుల్లో చేయాల్సినవి...
* ప్రతి విభాగంపై స్థూల అవగాహనని పెంచుకునే దిశలో చదవాలి.
* కీలక పాఠ్యాంశాలకే పరిమితం అవ్వండి.
* కీలక పాఠ్యాంశాలపై పట్టు ఉంటే మిగిలిన విషయాలపై దృష్టి కేంద్రీకరించాలి.
* 14, 15 తేదీలలో ఒకట్రెండు నమూనా పరీక్షలు రాయండి. మార్కులు బేరీజు వేసుకొని, లోపాల పరిష్కారం కోసం మిగతా 15 రోజుల్ని కేటాయించండి.
* 'చదివింది బాగుంది' అని స్వీయ ప్రేరణ పొందుతూ అసంతృప్తిని దూరం చేయండి.
* పరీక్షకు వారం ముందు ఎలాంటి నమూనా పరీక్షలు రాయవద్దు.
* 'ఇవి తరువాత చదువుదాం' అనే వాయిదాలు వద్దు. ఇదే ఆఖరి రివిజన్ అనుకుంటూ ఒక్కో అంశం ముగించేయండి.
* కీలక అంశాలు కాకపోతే కొత్త పాఠ్యాంశాలు చదవడం ఈ దశలో వద్దు.
* ఇతరులతో పోల్చుకుంటూ ఒత్తిడికి లోనై, జ్ఞాపకశక్తికి ఇబ్బందులు కలగజేయవద్దు.
* మార్కెట్లో దొరికే అనేక పుస్తకాలలో విస్తృత సమాచారం ఉంది. ఆ సమాచారం చూసి 'ఇది చదవలేదు, అది చదవలేదు' అని టెన్షన్‌కు గురికావద్దు. పాఠశాల స్థాయి పాఠ్య పుస్తకాలు, తెలుగు అకాడమి పుస్తకాలకే ప్రస్తుతం పరిమితం అవ్వండి.
* ఇంపార్టెంట్ బిట్స్ అంటూ వాటిని చదవద్దు. బిట్‌బ్యాంక్ లాంటివి పునశ్చరణకు ఉపయోగించాలే కాని వాటిని ప్రధానంగా చదవద్దు.
పూర్తి కథనం కోసం eenadu.net లో చదువు విభాగం చూడండి.

Tuesday, 27 March 2012
టెట్ మార్కులతో కొలువు ఖరారు!
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ప్రకటన మూడోసారి వెలువడింది. ఆగస్టు చివర్లో నియామక పరీక్ష- డీఎస్‌సీ జరగనున్న నేపథ్యంలో మే 31న జరిగే టెట్‌కు ప్రాధాన్యం పెరిగింది. తాజా పరీక్షకు ఎలా సన్నద్ధం కావాలో నిపుణుల సూచనలు... ఇవిగో!
డీఎస్‌సీలో 20 మార్కుల వెయిటేజి టెట్‌కు ఇచ్చారు. అందువల్ల అర్హత మార్కులు మాత్రం సాధించి 'గట్టెక్కాంలే' అని ఆనందించే పరిస్థితి లేదు. తెలివైన అభ్యర్థులు టెట్‌లోనే గరిష్ఠమార్కులు సాధించటం ద్వారా డీఎస్‌సీ ఉద్యోగాన్ని ముందుగానే రిజర్వ్ చేసుకోవచ్చని మరవరాదు.
కొన్ని జిల్లాలో డీఎస్‌సీలో ఎంపికైన అభ్యర్థికీ, కాని అభ్యర్థికీ మధ్య అంతరం చాలా తక్కువగా ఉంది. అలాంటి పరిస్థితిలో టెట్‌లో మంచి మార్కుల సాధన ఇలాంటి సమస్య నుంచి బయటపడేస్తుంది.
ఉదాహరణకు టెట్‌లో 118, 90 మార్కులు సాధించిన ఇద్దరికి డీఎస్‌సీలో వెయిటేజి ఎలా మారుతుందో చూద్దాం.
టెట్ మార్కులు డీఎస్‌సీలో వెయిటేజి
ఇలాంటి తేడా వచ్చే అవకాశం ఉన్నందున టెట్‌లో 115కి పైగా మార్కులు తెచ్చుకోవడం ప్రాథమిక లక్ష్యంగా నిర్దేశించుకోవాలి. అందుకనుగుణంగా ప్రిపరేషన్ వ్యూహం ఉండాలి.
2011 టెట్‌లో 110కిపైగా మార్కులు తెచ్చుకున్న అభ్యర్థుల సంఖ్య భారీగానే ఉంది. 2012 (జనవరి) టెట్‌లో పరీక్షాపత్రం కఠినంగా ఉన్నప్పటికీ 110కి పైగా మార్కులు పొందినవారూ ఎక్కువమందే!
అందువల్ల జనరల్ కేటగిరిలో ఉద్యోగాలు సాధించాలంటే 110కి పైన లక్ష్యం పెట్టుకుంటేనే డీఎస్‌సీలో నిలబడే అవకాశముంటుంది. తాజా టెట్‌లో 115కి పైగా మార్కుల లక్ష్యం పెట్టుకుని అందుకు అనుగుణంగా సిద్ధపడాలి.
ప్రిపరేషన్ వ్యూహం
టెట్, డీఎస్‌సీ తేదీలు కూడా ముందుగానే నిర్ణయించడంతో నిన్నటివరకూ డీఎస్‌సీ చదవటంలో, ప్రిపరేషన్ ప్రాధాన్యాలు నిర్ణయించుకోవడంలో కొందరు అభ్యర్థుల్లో తికమక కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి ప్రిపరేషన్ని ఎలా మార్చుకోవచ్చంటే...
* టెట్ పూర్తయేవరకూ టెట్ సిలబస్‌పైనే 100 శాతం దృష్టి పెట్టాలి.
* టెట్ ముగిశాక రెండున్నర నెలలకు పైగా డీఎస్‌సీకి వ్యవధి ఉంది. కాబట్టి అప్పుడు దానిపై శ్రద్ధ పెట్టవచ్చు.
* టెట్ కంటెంట్‌కు తయారవుతున్నపుడే అది డీఎస్‌సీకీ ఉపకరిస్తుందని గుర్తించాలి. తద్వారా డీఎస్‌సీకి సిద్ధమవటం లేదనే ఒత్తిడి నుంచి బయటపడొచ్చు.
ఎ) ఆ 90 మార్కులు
150 మార్కుల టెట్‌కి గాను శిశువికాసం, భాష-1, భాష-2లకే 90 మార్కులు కేటాయించారు. మిగతా కంటెంట్+ పెడగాజిలకు 60 మార్కులు. క్షుణ్ణంగా పరిశీలిస్తే... కంటెంట్+ పెడగాజిలలో సాధించే మార్కుల్లో తేడా అభ్యర్థుల మధ్య తక్కువగా ఉంటుంది. కానీ కఠినంగా భావించే శిశువికాసం, ఇంగ్లిష్‌ల మార్కుల్లో తేడా మాత్రం ఎక్కువే.
టెట్-2012లో తెలుగు ప్రశ్నపత్రం కఠినత్వం గమనిస్తే 'తెలుగుభాష' కూడా మార్కుల సాధనలో కీలకంగా మారిందని తెలుస్తుంది. అందువల్ల అభ్యర్థులు ఈ మూడు అంశాలనూ పరీక్షకు అవసరమైన స్థాయిలో సిద్ధమైతేనే మార్కుల పంట పండేది!
* శిశువికాసం ప్రశ్నలు గత డీఎస్‌సీల మాదిరిగా పాఠ్యపుస్తకాల నుంచి నేరుగా ఇవ్వటం లేదు. పైగా పెడగాజి కూడా ఉండటం వల్ల ప్రశ్నలన్నీ అభ్యర్థి స్థూల అవగాహన, అన్వయాలపై అడుగుతున్నారు. అందుకని పాఠ్యపుస్తకాలో, ప్రశ్నల నిధులో చదివి 'బాగా ప్రిపేరయ్యాం' అనుకుంటే నష్టపోతున్నట్టే.
* గ్రామీణ అభ్యర్థులు ఏదో ఒక గ్రామర్ పుస్తకం చదివి భాషలను 'మమ' అనిపిస్తున్నారు. 12 మార్కులు పెడగాజి అంశాలున్నాయని మర్చిపోతున్నారు. భాషలను చదివేటప్పుడు వ్యాకరణ కిటుకులను, భాష బోధన పద్ధతులను దృష్టిలో పెట్టుకోవాలి.
బి) బట్టీయమా?
గత డీఎస్‌సీ అనుభవాలతో టెట్‌లో కూడా 'మక్కీకి మక్కీ'గా పాఠ్యపుస్తకాలు చదివినవారు ఇప్పటివరకూ జరిగిన రెండు టెట్‌లలోనూ దెబ్బతిన్నారు. శిక్షణ సంస్థలు కూడా పాఠ్యపుస్తకాల్లో ఉన్న విషయాల్నే బిట్లుగా మార్చి, బట్టీ పట్టించి మొత్తమ్మీద డీఎస్‌సీలలో విజయాలు సాధించాయి. కానీ టెట్‌లో ఆ ధోరణి తగ్గటంతో శిక్షణసంస్థలతో పాటు అభ్యర్థులూ బోల్తాపడినట్టయింది.
గత రెండు టెట్‌ల ప్రశ్నల్లో అత్యధికం అభ్యర్థి సంపూర్ణ అవగాహనను పరిశీలించేవే. ప్రతి పాఠ్య విషయాన్నీ చదివినపుడు బిట్ల మాదిరిగా ఆలోచిస్తూ, ఆయా అంశాల నేపథ్యం కూడా పరిగణనలోకి తీసుకుంటేనే మెరుగైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా శిశు వికాసం, పెడగాజి, పర్‌స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్‌లో ఈ ధోరణి అవసరం.
సి) మెథడ్స్ పెడగాజి కాదు
టెట్‌లో పేర్కొన్న పెడగాజి అంశాలను పరిశీలిస్తే- గతంలో డీఎస్‌సీ కోసం చదివిన మెథడ్స్ యథాతథంగా అన్వయించలేం. ముఖ్యంగా శిశు వికాసం కింద ఇచ్చిన పెడగాజిలో పాఠశాల నిర్వహణ, విద్య- ఆధారాలు, విద్య- సామాజిక అంశాల ప్రాధాన్యం ఉంది. అధ్యాపనం కింద బోధనా మెలకువలతో పాటు విద్యా దార్శనికత, తాత్వికత, వర్తమాన విద్యాంశాలను కూడా అనుసంధానించుకోవాలి.
డి) చదివితే సరిపోతుందా?
డీఎస్‌సీ స్థాయి పరీక్షలు రాసే అభ్యర్థులు గంటల తరబడి చదువుతారు. కానీ చదివిన అంశాలను అన్వయించుకోవటంలో కొందరు వెనకబడుతున్నారు. ముఖ్యంగా మారిన పరీక్షా ధోరణిని బట్టి చదివిన అంశాలను ఏయే రీతుల్లో సమాజంలో అన్వయించవచ్చు, వాటి ఉపయోగితా విలువ అనే కోణంలో పరిశీలించాలి.
* మార్కులు తెచ్చుకునేందుకు ప్రతి అంశాన్నీ చదవగానే ప్రశ్నలనూ, రూపాలనూ అంచనా వేయాలి.
* వీలైనన్ని నమూనా పరీక్షలను అభ్యాసం చేయాలి.
* వస్తున్న ఫలితాలను బట్టి సరైన మార్పులు చేసుకుంటూ వెళ్ళాలి.
ఇ) అన్నీ చదవాల్సిందే
* చాలామంది సోషల్ అభ్యర్థులు- జాగ్రఫీ, చరిత్ర అంశాల పట్ల కొద్దిపాటి వ్యతిరేకత వ్యక్తపరుస్తున్నారు. కానీ ఆ రెండు అంశాల నుంచే ప్రశ్నలు ఎక్కువ వచ్చే అవకాశముంది.
* సైన్స్ అభ్యర్థుల్లో- బయోసైన్స్‌వారు పదో తరగతిస్థాయి గణితం అభ్యసించేందుకు మానసికంగా సిద్ధపడటం లేదు. గణితం అభ్యర్థులు బయోసైన్స్ పట్ల ఇదే స్థాయి ధోరణితో ఉంటున్నారు. అలాంటి వ్యతిరేకతతో చదవటం వల్ల నష్టమే తప్ప ప్రయోజనం ఉండదు.
* భాష 1,2లలోని కంటెంట్, పెడగాజి అంశాల పట్ల భాషేతర అభ్యర్థులు నిరుత్సాహంగా ఉంటున్నారు.
అభ్యర్థిలో అనుకూలత ఉన్నా లేకపోయినా పరీక్ష కోసం చదవాల్సిందే.
- కొడాలి భవానీ శంకర్
విస్తృతంగా, సమగ్రంగా!
టెట్ పరీక్ష ప్రశ్నపత్రం పరిశీలిస్తే- జ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్నలకంటే అవగాహన, అనుప్రయుక్త (అప్లికేషన్) లక్ష్యాలను పరీక్షించే ప్రశ్నలను ఎక్కువగా అడిగారు
తెలుగు అకాడమీ డి.ఇడి., బి.ఇడి పుస్తకాల సిలబస్‌లో లేని అంశాలు టెట్ సిలబస్‌లో ఉన్నాయి. అందుకని ఆ అంశాలపై ప్రశ్నలు అభ్యర్థులకు కష్టతరంగా కనపడుతున్నాయి.
ఉదాహరణకు- చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజిలో ఛామ్‌స్కీ, కార్ల్ రోజర్స్, కోఫ్కా; బోధనా విధానాల్లో ఎన్‌సీఎఫ్-2005, విద్యాహక్కు చట్టం-2009 మొదలైనవి. వీటిపై అందుబాటులో ఉండే మార్గాల్లో మెటీరియల్‌ను సంపాదించుకుని పరీక్ష దృష్టితో అభ్యసిస్తే ఇబ్బంది ఉండదు.
నిర్ణీత సిలబస్‌ను విస్తృత స్థాయిలో, ప్రాథమిక భావనలను సమగ్రంగా అభ్యసించాల్సిన అవసరముంది.
కేవలం డి.ఇడి సిలబస్ పస్తకాల్లోని విషయాలే కాకుండా బి.ఇడి సిలబస్‌లోని విషయాలు కూడా అడుగుతున్నారు. అంటే టెట్ సిలబస్‌ను ప్రామాణిక పుస్తకాల్లోని ప్రాథమిక భావనలూ, వాటిలో అంతర్లీనంగా ఉన్న విషయాలపై సమగ్ర అవగాహన పెంచుకోవాలని తెలుస్తోంది. ఆ దిశలో ప్రిపరేషన్ కొనసాగించాలి.
* పేపర్-1 రాసేవారు మెథడాలజీ ప్రిపరేషన్లో అన్ని బోధనా పద్ధతుల్లో ఉమ్మడిగా ఉంటే అధ్యాయాలను సమన్వయంతో అభ్యసిస్తే మంచి ఫలితాలుంటాయి.
ఉదాహరణకు- 1) బోధనా పద్ధతులు 2) విద్యాప్రణాళిక/పాఠ్య ప్రణాళిక 3) బోధనా లక్ష్యాలు, స్పష్టీకరణలు 4) బోధనోపకరణాలు 5) మూల్యాంకనం మొదలైనవి.
* భాషలకు సంబంధించి ఆంగ్ల మాధ్యమ నేపథ్యమున్న అభ్యర్థులు తెలుగు వ్యాకరణాంశాలు, బోధనా విధానాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి బాగా సాధన చేయాలి.
* తెలుగుమీడియంలో చదివినవారు ఇంగ్లిష్ సబ్జెక్టులో గ్రామర్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లోపాలను గ్రహిస్తూ, సవరించుకుంటూ, అవసరమైతే ఇతర విద్యార్థులతో పంచుకోవడం ద్వారా మెరుగైన సాధన చేయాలి.
టెట్ కఠినమని ఎందుకనిపిస్తోంది?
డీఈడీ, బీఈడీ కోర్సుల్లో పరీక్షలను వ్యాసరూప, సంక్షిప్త సమాధానాలుగా రాస్తారు. జ్ఞాన సంబంధ ప్రశ్నలే ఎక్కువ. గత డీఎస్‌సీ పరీక్షల్లో మూసధోరణికి అలవాటు పడినవారికి ప్రస్తుత టెట్ ప్రశ్నపత్రం భిన్నంగా కనపడుతోంది.
ప్రాథమిక భావనలపై ప్రశ్నలు అడగటం, అభ్యర్థుల శక్తి సామర్థ్యాలను పూర్తిస్థాయిలో పరీక్షించే ప్రశ్నలను రూపొందించడం చేస్తున్నారు. కాబట్టి అభ్యర్థులు ప్రశ్నలు అడిగే తీరును బట్టి నేర్చుకునే విధానాన్ని, ఆ విషయాల వెనకున్న భావనలను, సూత్రాలను అవగాహన చేసుకుంటూ చదవాలి. ఆపై పునశ్చరణ చేస్తే మంచి ఫలితాలుంటాయి.
* తమకు ఏ సబ్జెక్టులోనైతే పూర్తి అవగాహన అవసరమనిపిస్తుందో ఆ విషయంపై ఎక్కువ శ్రద్ధ కనబరచాలి; పునశ్చరణ చేయాలి.
* వీలైనంత ఎక్కువగా ప్రామాణిక మాదిరి పరీక్షలు ఎంచుకుని, సాధన చేయాలి.
శక్తిసామర్థ్యాలకు తగిన విధంగా మెదడుకు శిక్షణనివ్వండి. మెరుగైన మార్కులతో టెట్ విజయం మీదే అవుతుంది!
ఉపయోగపడే పుస్తకాలు
* డి.ఇడి., బి.ఇడి తెలుగు అకాడమీ పుస్తకాలు (విద్యామనోవిజ్ఞాన శాస్త్రం, బోధనా పద్ధతులు, సమ్మిళిత విద్య)
* జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం-2005 (SCERTప్రచురణ)
* విద్యాహక్కు చట్టం- 2009
* మానవ హక్కుల విద్య (ఉపాధ్యాయ కరదీపిక)
రాజీవ్ విద్యామిషన్ (SSA) , AP ప్రచురణలు
* కంటెంట్ కోసం: ఆంధ్రప్రభుత్వ రాష్ట్ర సిలబస్ పాఠ్యపుస్తకాలు
- వి. బ్రహ్మయ్య
Monday, 6 February 2012
డీఎస్‌సీలో విజయానికి మెలకువలు!
భావి పౌరులను తీర్చిదిద్దే సదవకాశం; ఒత్తిడికి దూరంగా విధుల నిర్వహణ; వేతనాలూ, సెలవుల పరంగా ఆకర్షణ... కలగలిపితే ఉపాధ్యాయ కొలువు! దాదాపు మూడేళ్ళ తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం కోసం ప్రకటన వెలువడింది. ఉద్యోగార్థుల ఎదురుచూపులు ఫలించాయి. వీరి తక్షణ కర్తవ్యం- మే 2,3 తేదీల్లో జరిగే డీఎస్‌సీ రాతపరీక్షలో గరిష్ఠ మార్కుల సాధన. దీనికోసం దృఢ సంకల్పంతో అధ్యయనం ప్రారంభించాలి!
ఎస్‌జీటీ... తక్కువే పోటీ
టెట్‌లో దాదాపు 45 వేలమంది ఉత్తీర్ణత సాధించారని అంచనా. ప్రభుత్వం నియమించనున్న ఎస్‌జీటీ ఉద్యోగాలు 11,602. ఈ పోస్టులకు డి.ఇడి అభ్యర్థులు మాత్రమే అర్హులు కాబట్టి పోటీ చాలా పరిమితంగానే ఉంటుంది. అంటే 1:10 కంటే తక్కువే. ఈ అవకాశాన్ని చేజార్చుకోకూడదనుకుంటే వెంటనే మూడు నెలల ప్రణాళిక రచించుకుని ప్రిపరేషన్ మొదలుపెట్టాలి.
ఎస్‌జీటీ పరీక్షా పద్ధతిలో గణనీయమైన మార్పులు చేశారు. ముందుగా మారిన పరీక్షా పద్ధతినీ, అందులోని సబ్జెక్టుల ప్రాధాన్యాన్నీ తెలుసుకుని దీనికనుగుణంగా సిద్ధం కావాల్సివుంటుంది.
ఉపాధ్యాయ అభ్యర్థులు ఇప్పటికే టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లో ఉత్తీర్ణత సాధించివుంటారు కాబట్టి జరగబోయే డీఎస్‌సీ వీరికి మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. కారణం- టెట్ సిలబస్‌కూ, సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) సిలబస్‌కూ కొద్దిపాటి తేడా తప్ప చెప్పుకోదగ్గ మార్పులు లేవు.
కొత్తగా ఎస్‌జీటీకి ప్రిపరేషన్ కొనసాగించే అభ్యర్థులు జి.కె., వర్తమాన అంశాలు, పర్‌స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్‌లపై సిద్ధం కావాల్సివుంటుంది.
'పర్‌స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్' డి.ఇడి సిలబస్‌లో పేపర్-4గా అభ్యసించినదే. మిగిలిన తెలుగు, ఆంగ్లం, గణితం, సైన్స్, సోషల్ కంటెంట్ (1-8 తరగతులు, రాష్ట్ర సిలబస్), మెథడాలజీ, డి.ఇడి సిలబస్‌ను సునిశితంగా అధ్యయనం చేయాలి.
డీఎస్‌సీ పరీక్ష కోణంలో...
* టెట్‌లో చదివిన అనేక అంశాలను మళ్ళీ డీఎస్‌సీ పరీక్ష కోణంలో చదవాలి. టెట్ సిలబస్‌లో లేని అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి.
* గత డీఎస్‌సీలో కంటెంట్ 7వ తరగతి సిలబస్ వరకే ఉండేది. ఈసారి 8వ తరగతి సిలబస్ కూడా చదవాలి. టెట్ ప్రశ్నపత్రంలో జ్ఞానాన్ని పరీక్షించేవి మాత్రమే కాకుండా అవగాహన, అనువర్తనలకు సంబంధించిన ప్రశ్నలూ అడిగారు. కాబట్టి డీఎస్‌సీ సన్నద్ధత కూడా ఆ కోణంలో ఉండేలా జాగ్రత్త వహించాలి.
* కంటెంట్ కోసం... ఇప్పటికే టెట్ కోసం అభ్యసించిన విషయాలను ఇప్పుడు డీఎస్‌సీ పరీక్ష కోణంలో చదవాలి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ప్రశ్నల తీరు అవగాహనకు వస్తుంది.
* కఠినమైన/కొత్త అంశాలకు తగిన సమయం కేటాయించి చదవాలి.
* మెథడాలజీ కూడా టెట్‌లో చదివిందే కాబట్టి గతంలోని పొరపాట్లను సరిదిద్దుకుంటూ ప్రిపరేషన్ ప్రారంభించాలి.
పదో తరగతి స్థాయి వరకూ...
* తెలుగు, ఆంగ్లం భాషలకు సంబంధించి భాషా ప్రావీణ్యం, భాషాంశాలు, భావప్రసారం, భాషణ నైపుణ్యం, భావావగాహన సామర్థ్యాలను పదోతరగతి స్థాయి వరకూ అభ్యసించాలి.
* బోధనా పద్ధతుల కోసం ఏపీ రాష్ట్రప్రభుత్వం నిర్దేశించిన డి.ఇడి సిలబస్ దృష్టిలో ఉంచుకుని వివరణాత్మకంగా, సమగ్రంగా అభ్యసించాలి.
* సిలబస్ 8వతరగతి వరకే అయినప్పటికీ ప్రశ్నల స్థాయి పదో తరగతి వరకూ ఉంటుంది. అంటే ప్రశ్నల కఠినతా స్థాయి కొంత ఎక్కువ ఉండవచ్చు. కాబట్టి ప్రతి విషయాన్నీ అంశాల వారీగా, విశ్లేషణాత్మక ధోరణిలో చదవాలి. ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి. తొలిదశలో ప్రేరణను పరీక్ష జరిగేవరకూ నిలుపగలిగి సాధన చేస్తే ఎస్‌జీటీ ఉద్యోగం మీ సొంతమే!
Tuesday, 31 January 2012
21,343 ఉపాధ్యాయ పోస్టులకు ప్రకటన!
16 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్ - న్యూస్‌టుడే
రాష్ట్రంలో చాన్నాళ్లుగా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి తీపికబురు. ఒకేసారి 21,343 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
సోమవారం డీఎస్సీ-2012 ప్రకటన వెలువరించింది.
ఇదే ప్రకటనతో విద్యాశాఖలో సుమారు పదహారేళ్లుగా వేళ్లూనుకుపోయిన అప్రెంటీస్ వ్యవస్థను రద్దు చేసింది. అప్రెంటిస్ రద్దు కోసం ఉపాధ్యాయ సంఘాలు ఎన్నాళ్లుగానో పోరాడుతున్నాయి. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం.. ఉపాధ్యాయులుగా నియామకం పొందిన వారు రెండేళ్లపాటు అప్రెంటీస్‌గా స్వల్పవేతనంతో పనిచేయాలి. ఇప్పుడు అప్రెంటీస్ విధానానికి స్వస్తి పలికినందున ఇకపై ఉద్యోగాల్లో చేరేవారికి ప్రారంభం నుంచే పూర్తి వేతనం లభిస్తుంది.
డీఎస్సీ-2012 ప్రకటన ప్రకారం... తొలిసారిగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు.
సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్, ఇతర పోస్టుల భర్తీకి మే 2, 3 తేదీల్లో రాత పరీక్షలు జరగనున్నాయి. ప్రకటన వివరాలను మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి సచివాలయంలో సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ప్రాథమిక విద్యా శాఖ నుంచి 38వేల ఎస్జీటీ పోస్టుల భర్తీపై తమకు ఎటువంటి సమాచారం అందలేదని తెలిపారు. భవిష్యత్తులో సమాచారం వస్తే ఇందులో కలిపేందుకు ప్రయత్నిస్తామని, లేదంటే మరో డీఎస్సీ ద్వారా భర్తీచేసే అవకాశం ఉంటుందని వివరించారు. కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి మాత్రమే ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ వారికి అర్హత కల్పించలేకపోతున్నామని వెల్లడించారు. ఉపాధ్యాయుల నియామకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని భర్తీచేస్తుందని పేర్కొన్నారు.
ఆదర్శ పాఠశాలల్లో 7100 పోస్టులను నేరుగా భర్తీ చేసేందుకు త్వరలోనే మరో ప్రకటన వెలువడుతుందని చెప్పారు. ఇవికాకుండా వివిధరకాల 4,970 ఉద్యోగాలను పొరుగుసేవల కింద భర్తీ చేయనున్నామని తెలిపారు. వీటితో తమ శాఖ తరఫున 33,413 పోస్టులను భర్తీ చేయబోతున్నామన్నారు. గురుకులాల్లో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని కూడా మంత్రి పేర్కొన్నారు. డీఎస్సీ-2008 ద్వారా హామీపత్రాలు పొందిన 1002 మంది అభ్యర్థులకు పోస్టింగులు ఇచ్చినట్లు చెప్పారు.
అధికారికంగా పూర్తి సమాచారం కింది లింకులో చూడవచ్చు.
http://apdsc.cgg.gov.in/APDSCJAN2012/INFORMATION_BULLITEN.pdf
మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధికం
అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 1862, ఆ తరువాత రంగారెడ్డి జిల్లాలో 1552, తూర్పుగోదావరిలో 1,474 ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయనున్నారు. తక్కువగా కృష్ణా జిల్లాలో 303, గుంటూరు జిల్లాలో 362, కడప జిల్లాలో 263 పోస్టులను విద్యాశాఖ భర్తీచేయనుంది.
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ
ఈనెల 15వ తేదీ నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను అందుబాటులో ఉంచనున్నారు. స్వీకరణ ఈనెల 16 నుంచి ప్రారంభమై వచ్చేనెల (మార్చి) 17వ తేదీ వరకు జరగనుంది. రుసుము మాత్రం మార్చి 16వ తేదీలోగా చెల్లించాలి.
నియామక ప్రకటనకు సంబంధించిన అర్హతలు, సిలబస్, ఇతర వివరాలకు http://apdsc.cgg.gov.in, www.dseap. gov.inలో చూడొచ్చునని విద్యాశాఖ సంచాలకులు శివశంకర్ వెల్లడించారు.
దరఖాస్తు ధర రూ.250
డీఎస్సీ-2008 వరకు దరఖాస్తు ధర కింద రూ.200 వసూలు చేశారు. దీనిని ఇప్పుడు రూ.250కి (ప్రతి పోస్టుకు) పెంచారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నందున విద్యాశాఖకు వ్యయం తగ్గుతుంది. అయినా దరఖాస్తు ధరను పెంచేశారు.
'ఇంటర్ నిబంధన'కు స్వస్తి
డీఎస్సీ-2012లో స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు డిగ్రీలో సెరికల్చర్, ఫారెస్ట్రీ, ఫౌల్ట్రీ అర్హత ఉంటే, ఇంటర్‌లో సంబంధిత సబ్జెక్టులోనే ఉండాలనే నిబంధనలు తొలగిస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డి.సాంబశివరావు ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల విడుదల చేసిన అర్హతల జీవో4ను అనుసరించి ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. దూరవిద్యలో డిగ్రీ, బీఎడ్ చదివి టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని అధికారులు తెలిపారు.
సిలబస్‌లో మార్పులు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నేపథ్యంలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డీఎస్సీ-2012 సిలబస్‌లో భారీ మార్పులు చేశారు. సెకండరీగ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్, భాషా పండితుల పోస్టుల రాతపరీక్షలో ప్రశ్నల సంఖ్యతో పాటు సమయాన్ని తగ్గించారు. కొత్తగా పర్‌స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ పేరిట ఓ సబ్జెక్టును చేర్చారు. సబ్జెక్టు సిలబస్‌ను తరువాత ప్రకటించనున్నారు. ప్రధాన సబ్జెక్టుల సిలబస్‌ను మరింత కఠినం చేయనున్నారు. ఇప్పటికే నిర్వహించిన టెట్ పరీక్షలో సైకాలజీ, ఆంగ్ల పరిజ్ఞానాన్ని పరీక్షించినందున డీఎస్సీ రాత పరీక్ష నుంచి ఆయా సబ్జెక్టులను తప్పించారు. ఎస్జీటీలు, పీఈటీలకు ఆంగ్ల భాష పరిజ్ఞానంపై ప్రశ్నలు ఉంటాయి.
80 మార్కులకే పరీక్ష
గతంలో 100 మార్కులకు మొత్తం 200 ప్రశ్నలు అడిగేవారు. పరీక్ష కాలపరిమితి 3 గంటలుగా ఉండేది. టెట్‌లో వచ్చిన మార్కులకు ఉపాధ్యాయ నియామకాల్లో 20 శాతం ప్రాధాన్యం ఇవ్వనున్న నేపథ్యంలో... ప్రశ్నలను 160కి, మార్కులను 80కి పరిమితం చేశారు. పరీక్ష సమయాన్ని రెండున్నర గంటలకు తగ్గించారు.
ఎస్జీటీలో ఇలా...
గతంలో ఎస్జీటీలో ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు ప్రశ్నలు అడిగేవారు. ఈ సారి ప్రశ్నల స్థాయిని ఎనిమిదో తరగతికి పెంచారు. ఈ ప్రశ్నల కాఠిన్యత పదోతరగతి స్థాయి వరకు ఉంటుంది. 100 ప్రశ్నలు సబ్జెక్టు కేంద్రంగా ఉంటాయి.
స్కూల్ అసిస్టెంట్స్‌లో..
స్కూల్ అసిస్టెంట్స్‌కు సంబంధించి మేథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్, బయోలజికల్ సైన్సెస్, సోషల్ స్టడీస్ పోస్టుల రాతపరీక్ష సిలబస్‌లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో ఎనిమిది నుంచి పదో తరగతి వరకు ప్రశ్నలు అడిగేవారు. ఈ సారి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రశ్నలు అడుగుతారు. అలాగే ఈ ప్రశ్నల కాఠిన్యత ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఉంటుంది. ప్రధాన సబ్జెక్టుపైనే 88 ప్రశ్నలు ఉంటాయి. భాషా పండితుల్లోనూ ప్రశ్నలు ఇదే మాదిరి ఉంటాయి.
లాంగ్వేజ్ పండిట్స్‌లో..
లాంగ్వేజ్ పండిట్ గ్రేడ్-2 పోస్టుల్లోనూ ప్రధాన సబ్జెక్టు సిలబస్ స్థాయి పదోతరగతి వరకు నిర్దేశించారు. పీఈటీలో ఆంగ్ల భాషపై పదోతరగతి స్థాయి వరకు ప్రశ్నలు ఉంటాయి. పీఈటీ పోస్టుల ప్రశ్నల సంఖ్యలో మార్పులేదు. మొత్తం 100 మార్కులకు 200 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష కాలపరిమితి 3 గంటలుగా నిర్దేశించారు.

Thursday, 10 November 2011
'టెట్'కు దరఖాస్తు చేస్తున్నారా?
ఏపీ టెట్ ప్రకటన వెలువడింది!
డీఈడీ, బీఈడీ, భాషాపండిత శిక్షణ కోర్సు విద్యార్హతలున్న అభ్యర్థులందరూ ఈ పరీక్ష రాసేందుకు అర్హులే.
డీఎస్‌సీ ద్వారా ఉద్యోగ సాధనకు టెట్ తప్పనిసరి కాబట్టి దీనిలో మెరుగైన స్కోరు సాధించాల్సిందే.
ఇందుకు తొలిమెట్టుగా ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను సక్రమంగా ముగించటంపై అభ్యర్థులు దృష్టి పెట్టాలి.
టెట్ మార్కులకు డీఎస్‌సీలో 20 శాతం వెయిటేజీ ఇస్తారు. అంటే డీఎస్‌సీ ద్వారా ఉద్యోగ సాధనలో టెట్ స్కోరు కీలకం. ఈ ఏడాది జులై 31న నిర్వహించిన మొదటి ఏపీ టెట్‌లో ఉత్తీర్ణత పొందనివారూ, ఉత్తీర్ణులైనా ఇంకా ఎక్కువ మార్కులు పొందాలనుకునేవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను నవంబరు 26 వరకూ దాఖలు చేయవచ్చు. హాల్ టికెట్లను డిసెంబరు 24 నుంచి అంతర్జాలం (నెట్) ద్వారా పొందటానికి వీలుంది.
జనవరి 8న పేపర్-1 ఉదయం, పేపర్-2 మధ్యాహ్నం నిర్వహిస్తారు.
* జనవరి 7 నాటికి లేదా అంతకుముందు డీఈడీ/బీఈడీ/భాషా పండిత శిక్షణ కోర్సు చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా టెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
* ప్రత్యేక విద్య (special education) లో డీఈడీ/బీఈడీ/కోర్సులు, రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో గుర్తింపు పొందినవారు కూడా టెట్ రాయటానికి అర్హులు.
* భాషాపండితులు పేపర్-1 రాయాలా, పేపర్-2 రాయాలా అనే సందేహం వ్యక్తపరుస్తున్నారు. వీరు 6వ తరగతి నుంచి మాత్రమే భాషలను బోధించటానికి నిర్దేశించిన ఉద్యోగాల్లో నియమితులవుతారు కాబట్టి భాషాపండితులు పేపర్-2 రాస్తే సరిపోతుంది.
* టెట్ పేపర్-2లో ఉత్తీర్ణత పొందినవారు, డీఎస్‌సీలో వారి డిగ్రీ సబ్జెక్టు, బి.ఇడి మెథడాలజీ ఆధారంగా స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. టెట్‌లో గణితం, ఫిజికల్ సైన్స్, బయాలజీ వీరందరికీ ఒకే సిలబస్‌పై ప్రశ్నలుంటాయి. డీఎస్‌సీలో ఎవరి సబ్జెక్టుకు సంబంధించి వారు కంటెంట్ సన్నద్ధం కావాల్సివుంటుంది.
* ఒక్క జనరల్ నాలెడ్జ్ (జీకే) విషయంలో తప్ప మిగతా టెట్ సిలబస్ దాదాపు డీఎస్‌సీ పరీక్షలో ఉపయోగపడుతుంది. కాబట్టి టెట్‌కి బాగా సిద్ధమైతే డీఎస్‌సీలో తేలిగ్గా మంచి స్కోరు సాధించవచ్చు.
ఇవి గమనించండి...
* టెట్‌లో పేపర్-1కి గానీ, పేపర్-2కు గానీ; రెండు పేపర్లకు గానీ రూ.300 పరీక్ష ఫీజుగా aponlineద్వారా లేదా ఈ-సేవ ద్వారా గానీ నవంబరు 25 వరకూ చెల్లించవచ్చు.
* ఈ-సేవా కేంద్రానికి వెళ్ళేటపుడు అభ్యర్థులు తమ పుట్టిన తేదీ, మొబైల్ ఫోన్ నంబరు మొదలైనవాటికి సంబంధించిన ప్రాథమిక సమాచారం తీసుకువెళ్ళాల్సివుంటుంది.
* దరఖాస్తులో సరైన ఫొటో లేకుండా పంపితే తిరస్కరణకు అవకాశముంది. ఫొటో మళ్ళీ పంపటానికి అవకాశం లేదు.
* ఐడీ నంబరును జాగ్రత్తగా భద్రపరచుకున్నట్లయితే భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుంది.
* అభ్యర్థులు తమ దరఖాస్తులకు సంబంధించిన ఫిర్యాదుల కోసం నవంబరు 7 నుంచి 28 వరకూ ఏపీ టెట్ వెబ్‌సైట్‌ను చూడవచ్చు. కానీ ఫొటోకు సంబంధించిన వినతులను మాత్రం స్వీకరించరు.

Monday, 24 October 2011
రెండు పరీక్షలు దాటితే.. ఉపాధ్యాయ ఉద్యోగమే!
టెట్‌లో సాధించిన మార్కులు డీఎస్‌సీలో అంతిమ ఫలితాన్ని నిర్ణయించనున్నాయి. ఈ రెండు పరీక్షల సిలబస్‌లో పోలికలు చాలానే ఉన్నాయి. పోలికలను అనుసంధానించి (ఇంటిగ్రేట్) చదవటం ప్రణాళికలో భాగం కావాలి. టెట్, డీఎస్‌సీలలో సంబంధం లేని సిలబస్ అంశాలున్నాయి. వాటికి ప్రత్యేకంగా చదివే విధానాన్ని అనుసరించాలని సూచిస్తున్నారు కొడాలి భవానీ శంకర్.
అనుసంధానం
* టెట్ పేపర్-1 కనీస అర్హత మార్కులు పొందితేనే ఎస్‌జీటీకి అర్హత లభిస్తుంది. పైగా ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం టెట్‌లో వచ్చిన మార్కులకు డీఎస్‌సీలో 20 శాతం వెయిటేజీ ఇచ్చే అవకాశం కన్పిస్తోంది.
* టెట్ పేపర్-2 కనీస అర్హత మార్కులు పొందితేనే స్కూల్ అసిస్టెంట్‌కి అర్హత లభిస్తుంది. పైన పేర్కొన్న రీతిలోనే స్కూల్ అసిస్టెంట్ ఎంపికలో టెట్ వెయిటేజి పొందుతుంది.
అందువల్ల టెట్‌లో ఎంత గరిష్ఠ మార్కులు పొందితే అందుకు అనుగుణంగా మార్కులు డీఎస్‌సీలో కలుపుతారు. అభ్యర్థులు టెట్‌ను ప్రణాళిక ప్రకారం సిద్ధమవ్వడమే తొలి వ్యూహం.
* భాషల ఎంపికకు ప్రమాణాలను జి.ఒ. ఎం.ఎస్. నంబర్ 51 (ఏప్రిల్ 16, 2011) లో పేర్కొన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకోవడం కీలకం. భాష-1 కింద ఎంచుకున్న భాష మాధ్యమంగా ఉన్న పాఠశాలలో నియమితులవుతారనే విషయం పరిగణనలోకి తీసుకోవాలి.
* పండిత్‌లు, బి.కామ్ మొదలైన విభిన్న వర్గాల అభ్యర్థులు పేపర్-1కి హాజరు కావొచ్చు. మిగతా అభ్యర్థుల మాదిరిగానే ఎస్‌జీటీకి ఎంపిక కావొచ్చు.
* 34 ప్రశ్నల వరకూ పెడగాజి విభాగం కింద 2011 టెట్ ప్రశ్నపత్రంలో కనిపిస్తున్నాయి. అందువల్ల పెడగాజి సంబంధిత అంశాల అధ్యయనం టెట్‌లో విజయం అందించడమే కాకుండా డీఎస్‌సీ విజయానికి రాచబాట వేస్తుంది.
* భాష-1,2 లలో 'భాషా బోధనా పద్ధతులు' పండిత్ కాని అభ్యర్థులకు మింగుడుపడటం కష్టమే. అయినా స్కోరింగ్ కోసం వ్యూహం ప్రకారం ప్రిపరేషన్లో ప్రాధాన్యం ఇవ్వాల్సిందే!
సిలబస్ స్థాయి
* పేపర్-1కు ఎనిమిదో తరగతి స్థాయి, పేపర్-2 పదో తరగతి స్థాయి (కాఠిన్యత) ఉంటుంది.
* టెట్ ఉత్తీర్ణతా ప్రమాణం
* జనరల్ అభ్యర్థి: 60 శాతం (90 మార్కులు)
* బీసీ అభ్యర్థి: 50 శాతం (75 మార్కులు)
* ఎస్‌సీ/ ఎస్‌టీ అభ్యర్థి: 40 శాతం (60 మార్కులు)
* వికలాంగులు: 40 శాతం (60 మార్కులు)
* కేవలం అర్హత మార్కులకే పరిమితం కాకుండా గరిష్ఠ మార్కులు పొందేందుకు ప్రయత్నించటం అవసరం.
పరీక్ష వ్యూహం ఏమిటి?
* జనవరి నెలలో టెట్ జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాతే డీఎస్‌సీ జరుగుతుంది కాబట్టి టెట్‌లో గరిష్ఠ మార్కులు సాధించడానికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
* రెండు పరీక్షలకు ఉమ్మడిగా ఉన్న అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి. అలాగే టెట్ ముందుగా జరుగుతుంది కాబట్టి తెలుగుభాష, పెడగాజి అంశాలకు కూడా ప్రాధాన్యం ఇస్తూ టెట్‌ను ముందుగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి.
* టెట్ పూర్తయిన తర్వాత జీకే అండ్ కరంట్ అఫైర్స్ లాంటి అదనపు అంశాలపై దృష్టి సారించాలి. ఇలా చేస్తే తేలిగ్గా డీఎస్‌సీని ఎదుర్కోవచ్చు.
* ఇప్పటికే టెట్ అర్హత పొందిన అభ్యర్థులు సంతృప్తి చెందకుండా తమ స్కోరింగ్ పెంచుకునేందుకు ప్రయత్నించాలి. కనీసం 115కి పైన టెట్ స్కోరు ఉండే రీతిలో ప్రిపరేషన్ ప్రమాణాలను నిర్దేశించుకోవాలి.
* బీఈడీ అభ్యర్థులకు ఎస్‌జీటీ పరీక్ష అర్హత వస్తే వారు తెలుగు, ఇంగ్లిష్ బోధనాపద్ధతులపై కూడా దృష్టి సారించాలి (టెట్ కోసం). డీఈడీ అభ్యర్థులు డీఈడీ కోర్సులో భాగంగా అన్ని రకాల మెథడ్స్ చదువుతారు. అందువల్ల ఎస్‌జీటీ కోసం బీఎడ్‌లు వాటిని చదవకపోతే నష్టం ఎక్కువగా ఉండే అవకాశముంది.
* గ్రామీణ అభ్యర్థులు ఇంగ్లిష్ భాష అంశాలపై పట్టు సాధించటం విజయానికి దారితీసే సోపానమని గుర్తించాలి. తెలుగు వ్యాకరణంపై పట్టు లేనివారు టెట్ కోసం దీన్ని మెరుగుపరచుకోవాల్సివుంది.
* భాషా పండితులు, పీఈటీలు పేపర్-1 (టెట్‌లో) అందరిమాదిరిగానే రాయాల్సిందే. పేపర్-2 (టెట్‌లో) సాంఘికశాస్త్ర అంశాల్నే ఎన్నుకోవడం వల్ల టెట్ స్కోరింగ్ మెరుగుపడే అవకాశం ఉంటుంది.
* సొంతంగా ప్రిపేరవుతున్న అభ్యర్థులు మారిన పాఠ్యగ్రంథాల ఆధారంగా ప్రిపరేషన్ సాగుతోందా లేదా అని పరిశీలించుకోవాలి. పాత నోట్సుల, పాత పాఠ్యపుస్తకాల ఆధారంగా సిద్ధమైతే బావిలో కప్ప మాదిరి పరిస్థితి ఉంటుందని గుర్తించాలి.ఈ అంశాలు గుర్తించి అధ్యయనం చేస్తే తప్పనిసరిగా సత్ఫలితాలు సిద్ధిస్తాయి!
టెట్ సిలబస్ మతలబు
ఈ సిలబస్ లో గమనించాల్సిన ముఖ్యాంశాలను వివరిస్తున్నారు వి. బ్రహ్మయ్య.
టెట్‌లోని అన్ని అంశాలూ డీఎస్‌సీ పరీక్షలో ఉపయోగపడతాయి. తొలిసారి జరిగిన టెట్ ప్రశ్నలు నిర్దేశిత సిలబస్ నుంచే అడిగారు. అయితే అభ్యర్థులు ప్రధానంగా గమనించాల్సింది- టెట్ సిలబస్ కేవలం డీఎడ్, బీఎడ్, సైకాలజీ పుస్తకాల్లో పూర్తిగా లభ్యం కాదు. ఇతర ప్రామాణిక పుస్తకాల నుంచో, ఇంటర్నెట్ నుంచో విషయసేకరణ చేసుకుని అభ్యసించాలి.
ఉదాహరణకు... విద్యాహక్కు చట్టం-2009, NCF-2005, వైగాట్‌స్కీ, ఛామ్‌స్కీ సిద్ధాంతాలు, వికాస అధ్యయన ఉపగమాలు, స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఉపగమాలు మొదలైనవి.
డీఎస్‌సీ పరీక్ష లాగా కేవలం డీఎడ్, బీఎడ్, తెలుగు అకాడమీ మనోవిజ్ఞాన శాస్త్రం పాఠ్యపుస్తకాలపైనే ఆధారపడితే టెట్‌లో కొన్ని ప్రశ్నలకు జవాబులు రాయటంలో అవరోధాలు ఎదురు కావొచ్చు.
* గత ప్రశ్నపత్రం తీరును సూక్ష్మంగా పరిశీలించి ఆ వచ్చిన అవగాహనతో ప్రిపరేషన్ సాగించాలి.
* తొలి టెట్‌లో ప్రధానంగా శిశువికాసం-అధ్యయనానికి సంబంధించి ప్రశ్నలు అడిగిన తీరు విశ్లేషణాత్మకంగా, అనుప్రయుక్తానికి చెందినట్టు గమనించవచ్చు. జ్ఞానాన్ని మాత్రమే పరీక్షించేలా కాకుండా తరగతి గది అధ్యయనానికి చెందిన ప్రశ్నలను పరిశీలనా దృష్టితో రాసేలా అడిగారు.
* పెడగాజి విషయంలో దాదాపు ప్రశ్నలన్నీ జ్ఞానాన్ని పరీక్షించేలాగే ఉన్నాయి. ముఖ్యంగా బోధనా ఉద్దేశాలు, లక్ష్యాలు-స్పష్టీకరణలు, శిశుకేంద్ర పద్ధతులు, బోధనోపకరణాలు, మూల్యాంకనం మొదలైనవి అవగాహన చేసుకుంటే తేలిగ్గా సమాధానాలు రాయవచ్చు.
* తెలుగు భాష 24 మార్కుల కంటెంట్ విభాగానికి సంబంధించి వ్యాకరణాంశాలను పదో తరగతి వరకూ క్షుణ్ణంగా అభ్యసించాలి. బోధనా పద్ధతుల్లో డీఎడ్ సిలబస్ తెలుగు అకాడమీని అనుసరిస్తే అభ్యసనానికి సులువు.
* ఏపీ రాష్ట్ర సిలబస్‌లోని అన్ని టాపిక్స్‌ను కాకుండా టెట్‌కు నిర్దేశించిన సిలబస్ ప్రకారమే అధ్యాయాల వారీగా అభ్యసించడం ఉత్తమం.
* అభ్యసించిన అంశాలను పునశ్చరణ, సాధన, మాదిరి ప్రశ్నపత్రాల సాధన చేస్తే మంచి మార్కులు సంపాదించవచ్చు.
* ప్రధాన అంశాలను పునరభ్యసనం, పునర్విమర్శ చేయాలి.

Subscribe to:
Posts (Atom)