మీకు సామాజిక అవగాహన ఉంది. భాషా పరిజ్ఞానం, సాంకేతిక నైపుణ్యాలపై ఆసక్తి ఉంది. అయితే ఇంకేం? ఉత్సాహం పరవళ్ళు తొక్కే మీలాంటి విద్యార్థులనెందరినో జర్నలిజం, మాస్‌మీడియా కోర్సులు ఆకర్షిస్తున్నాయి.
సవాళ్ళను సాహసోపేతంగా ఎదుర్కొనగలిగే యువతీ యువకులకు మీడియా సరైన కెరియర్!
తగిన శిక్షణ పొందితే- ఈ రంగంలో ప్రవేశించవచ్చు. అద్భుతాలు సృష్టించి వృత్తి నిపుణులుగా రాణించగలుగుతారు.
జర్నలిజం కోర్సును అందిస్తున్న కొన్ని ప్రముఖ విద్యాసంస్థలు
* ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం
* ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్
* కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్
* ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్, న్యూఢిల్లీ
* ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జర్నలిజం అండ్ న్యూమీడియా, బెంగళూర్
* సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్, పుణె
* జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్, ముంబయి
* ముద్రా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్, అహ్మదాబాద్
విశ్వవిద్యాలయాల నుంచి జర్నలిజం పట్టాలతో వచ్చే విద్యార్థుల ప్రమాణాలు ఆశాజనకంగా లేనందున మీడియా సంస్థలే స్వయంగా కోర్సులు నిర్వహిస్తున్నాయి. విద్యార్థులను పూర్తిస్థాయి శిక్షణతో మెరికల్లా
తీర్చిదిద్ది, తమ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి!
మరో పక్క ఛానెళ్ళ విస్తృతి, పత్రికా సంస్థల విస్తరణ మూలంగా సుశిక్షిత జర్నలిస్టులు పెద్దసంఖ్యలో కావాల్సివస్తున్నారు. ఈ పరిణామాల దృష్ట్యా మీడియా సంస్థలు స్వయంగా జర్నలిజం పాఠశాలలనూ, కళాశాలలనూ స్థాపించుకోవాల్సివచ్చింది.
మీడియాలో ప్రవేశించాలనుకునేవారికి ఉపకరించే సమాచారంతో ‘చదువు’ పేజీ 3 వరుస కథనాలను అందించింది. ఈ కింది ఇచ్చిన లింకులు క్లిక్ చేసి ఈనాడు ఆన్ లైన్ ఎడిషన్లో ఆ కథనాలను చదువుకోవచ్చు.
మీడియా-1 నేటి యువతకు మేటి కెరియర్
మీడియా-2 నైపుణ్యాలుంటేనే రాణింపు
మీడియా-3 పత్రికల సారథ్యంలో సమగ్ర కోర్సులు
ఈ కథనాలపై మీ అభిప్రాయాలను పంచుకోండి!