బాంబే స్టాక్ ఎక్చేంజ్ (బీఎస్‌ఈ) ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్, ఇగ్నో సంయుక్తంగా పీజీ డిప్లొమా ఇన్ స్టాక్ మార్కెట్స్ కోర్సును నిర్వహిస్తున్నాయి.
స్టాక్ మార్కెట్లకు సంబంధించిన విభాగాల్లో కెరియర్‌కు ఈ కోర్సు ఉపయోగపడుతుంది.
స్టాక్ మార్కెట్ రంగానికి సంబంధించిన ప్రాథమిక అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలనుకునేవారు కూడా ఈ కోర్సు చేయవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు స్టాక్ మార్కెట్ రంగంలోని పరిశ్రమల్లో పనిచేయడానికి అవసరమైన సామర్థ్యాలను అందిస్తారు.
ప్రైమరీ మార్కెట్ సంబంధిత కంపెనీల్లో ఇప్పటికే పనిచేస్తోన్నవారికి కూడా ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. అర్హతలు, సామర్థ్యాలను పెంపొందించుకోవచ్చు. శిక్షణలో భాగంగా జనరల్ మేనేజ్‌మెంట్ అంశాలపై కూడా అవగాహన కల్పిస్తారు. ఈ కోర్సు ప్రధానంగా గ్రాడ్యుయేట్ల కోసం ఉద్దేశించినది.
దూరవిద్య పద్ధతిలో దీన్ని అందిస్తారు.
ఎంబీఏ, ఇంజినీరింగ్, ఎం.కాం, సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యుఏ, లా, తదితర ప్రొఫెషనల్ కోర్సులు చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సు వ్యవధి ఏడాది.
మొదటి సెమిస్టర్‌లో మేనేజ్‌మెంట్ ఫంక్షన్స్, క్వాంటిటేటివ్ ఎనాలిసిస్, మేనేజీరియల్ అప్లికేషన్, ఎకనమిక్ అండ్ సోషల్ ఎన్విరాన్‌మెంట్, క్యాపిటల్ మార్కెట్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్ అంశాలుంటాయి.
చివరి సెమిస్టర్‌లో కార్పొరేట్ ఫైనాన్స్, ఫండమెంటల్ అండ్ టెక్నికల్ ఎనాలిసిస్, ఫారెక్స్ మార్కెట్స్, డెరివేటివ్స్, డెట్ మార్కెట్స్, ఇంటర్నేషనల్ స్టాక్ మార్కెట్స్, తదితర అంశాలుంటాయి.
కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు బీఎస్‌ఈ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్, ఇగ్నో సంయుక్తంగా పీజీ డిప్లొమా ఇన్ స్టాక్ మార్కెట్స్ డిగ్రీని ప్రదానం చేస్తాయి.
ఇతర వివరాలకు బీఎస్‌ఈ వెబ్‌సైట్ http://www.bseindia.com/ చూడగలరు.
పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ 20 డిసెంబరు 2011.

No comments:
Post a Comment