ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Monday, 8 August 2011

జర్నలిజంలో మీరూ ప్రవేశించండి!

మీకు సామాజిక అవగాహన ఉంది.  భాషా పరిజ్ఞానం,  సాంకేతిక నైపుణ్యాలపై  ఆసక్తి ఉంది.  అయితే ఇంకేం?  ఉత్సాహం పరవళ్ళు తొక్కే మీలాంటి  విద్యార్థులనెందరినో  జర్నలిజం, మాస్‌మీడియా కోర్సులు ఆకర్షిస్తున్నాయి.

సవాళ్ళను సాహసోపేతంగా ఎదుర్కొనగలిగే యువతీ యువకులకు మీడియా సరైన కెరియర్‌!

తగిన శిక్షణ పొందితే- ఈ రంగంలో ప్రవేశించవచ్చు.  అద్భుతాలు సృష్టించి వృత్తి నిపుణులుగా రాణించగలుగుతారు.

జర్నలిజం కోర్సును అందిస్తున్న కొన్ని ప్రముఖ విద్యాసంస్థలు

* ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం
* ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌
* కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌
* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, న్యూఢిల్లీ
* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జర్నలిజం అండ్‌ న్యూమీడియా, బెంగళూర్‌
* సింబయాసిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, పుణె
* జేవియర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌, ముంబయి
* ముద్రా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌, అహ్మదాబాద్‌

విశ్వవిద్యాలయాల నుంచి జర్నలిజం పట్టాలతో వచ్చే విద్యార్థుల ప్రమాణాలు ఆశాజనకంగా లేనందున మీడియా సంస్థలే స్వయంగా కోర్సులు నిర్వహిస్తున్నాయి. విద్యార్థులను పూర్తిస్థాయి శిక్షణతో మెరికల్లా
తీర్చిదిద్ది, తమ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి!

మరో పక్క ఛానెళ్ళ విస్తృతి, పత్రికా సంస్థల విస్తరణ మూలంగా సుశిక్షిత జర్నలిస్టులు పెద్దసంఖ్యలో కావాల్సివస్తున్నారు. ఈ పరిణామాల దృష్ట్యా మీడియా సంస్థలు స్వయంగా జర్నలిజం పాఠశాలలనూ, కళాశాలలనూ స్థాపించుకోవాల్సివచ్చింది.

మీడియాలో ప్రవేశించాలనుకునేవారికి ఉపకరించే  సమాచారంతో  ‘చదువు’ పేజీ 3  వరుస  కథనాలను అందించింది.  ఈ కింది ఇచ్చిన  లింకులు క్లిక్ చేసి  ఈనాడు ఆన్ లైన్ ఎడిషన్లో  ఆ కథనాలను  చదువుకోవచ్చు.

మీడియా-1   నేటి యువతకు మేటి కెరియర్‌ 
మీడియా-2   నైపుణ్యాలుంటేనే రాణింపు 
మీడియా-3   పత్రికల సారథ్యంలో సమగ్ర కోర్సులు  

ఈ కథనాలపై  మీ అభిప్రాయాలను   పంచుకోండి! 

12 comments:

  1. మీరు ప్రతిభ కూడ ఇస్తే బాగుంటుంది

    ReplyDelete
  2. ప్రతిభ ఆర్కివ్స్ కూడ అప్ లోడ్ చెయ్యగలరు

    ReplyDelete
  3. PBS గారూ!

    పోటీ పరీక్షలకు సంబంధించి ‘చదువు’లో గైడెన్స్; ‘ప్రతిభ’లో సంబంధిత మెటీరియల్ ప్రచురిస్తుంటాం. ‘ప్రతిభ’లో ఇచ్చేవాటిలో నిర్దిష్టంగా ఏ అంశాలు ఇక్కడ కావాలనుకుంటున్నారో తెలుపగలరు.

    ReplyDelete
  4. If possible avail archives of groups & bank exams material which were published in news paper. Actually we are using paper cuttings.

    ReplyDelete
  5. డియర్ PBS!

    పేపర్ కటింగ్స్ ను ఉపయోగించటం మంచిదే. అయితే వాటిని క్రమపద్ధతిలో ఫైల్ చేసుకోవాల్సివుంటుంది. లేకపోతే వెతుకులాటలోనే చాలా సమయం వృథా అవుతుంది!

    ‘ఈనాడు’ ఆన్ లైన ఎడిషన్ ఆర్కైవ్స్ 90 రోజులకు మాత్రమే ఉంటున్నాయి, ప్రస్తుతం! 90 రోజులు దాటితే లభ్యం కావు. అందుకనే వాటిని ఎప్పటికప్పుడు ఈ-పేపర్ క్లిపింగ్స్ గా సేవ్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు.

    విద్యార్థులు తమకవసరమైన గైడెన్స్, మెటీరియల్ ను భద్రపరచుకోవాలంటే- పేపర్ (ప్రింటు) క్లిపింగ్స్ ను సేకరించి, వాటిని ఆర్గనైజ్డ్ గా వుంచుకోవటం తేలికైన, ఉత్తమమైన పద్ధతి!

    ReplyDelete
  6. please tell me the way to prepare for civils

    ReplyDelete
  7. డియర్ వాసవీ,
    సివిల్స్ పరీక్షల గురించి ఆర్టికల్ ని త్వరలోనే అందిస్తాం.

    ReplyDelete
  8. Iam doing my post graduation in urban and regional planning.Iam interested in journalism. Now also whether I have to do a special cource in journalism or there is any chance of entering directly into it.

    ReplyDelete
  9. i'm doing ma b.tech 3rd yr..can u suggest me some best institutes which offer correspondence courses so that i can finish ma bachelor degree in journalism along with b.tech..n i can go to further studies in mass communications later on..

    ReplyDelete
  10. డియర్ కృష్ణచంద్,

    జర్నలిజంలో ప్రవేశించటానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి - డిగ్రీ తర్వాత విశ్వవిద్యాలయాలూ, కళాశాలలూ అందించే ఎంసీజే కోర్సుల్లో చేరటం. ప్రవేశపరీక్ష రాయాల్సివుంటుంది. కరస్పాండెన్స్ కోర్సులకైతే ప్రవేశపరీక్ష అవసరం లేదు.

    మరో మార్గం- వార్తాపత్రికల జర్నలిజం స్కూళ్ళలో చేరి పీజీ డిప్లొమా (ఏడాది కోర్సు) చేయటం. డిగ్రీ పాసైనవారికి ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్ వ్యూ నిర్వహించి సెలక్టయినవారిని విద్యార్థులుగా చేర్చుకుంటారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేశాక ఉద్యోగాల్లోకి కూడా తీసుకుంటారు.

    డియర్ శ్రావణీ,

    ఒకే విద్యాసంవత్సరంలో రెండు కోర్సులు చేయకూడదు కదా? హైదరాబాద్ లోని ఉస్మానియా, తెలుగు విశ్వవిద్యాలయాల్లో ఎంసీజే కరస్పాండెన్స్ కోర్సు ఉంది. ఆ వర్సిటీల వెబ్ సైట్లు చూసి వివరాలు తెలుసుకోండి.

    ReplyDelete
  11. I have completed my B.Tech (ECE).I am interested in doing bachelor degree in mass communication or in journalism.Can u please give me details of course,fee etc. Also what are qualification to get into eenadu journalism school.thanks in advanceI have completed my B.Tech (ECE).I am interested in doing bachelor degree in mass communication or in journalism.Can u please give me details of course,fee etc. Also what are qualification to get into eenadu journalism school.thanks in advance

    ReplyDelete
  12. nenu btech 3rd year chaduvutunnanu cse lo naku add film director avvalani undi daniki sambandinchina courses nd institutes nd entrance texts nd fee vivaralu cheptara?????????

    ReplyDelete