ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Saturday, 3 December 2011

ప్రముఖ సంస్థల్లో పరిశోధనలకు... జెస్ట్‌-2012


ఫిజిక్స్‌, కంప్యూటర్స్‌, ఇతర శాస్త్ర విజ్ఞాన సంబంధిత సబ్జెక్టుల్లో పరిశోధనలు చేయాలనుకునే అభ్యర్థులకు మంచి అవకాశం... జాయింట్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ (జెస్ట్‌- 2012).

దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 23 శాస్త్ర పరిశోధన సంస్థల్లో ప్రవేశానికి నిర్వహిస్తోన్న పరీక్ష ఇది.

ఫిజిక్స్‌, థీరీటికల్‌ కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టులకు సంబంధించిన అంశాల్లో ఇంటెగ్రేటెడ్‌ ఎం.ఎస్‌సి లేదా ఎం.టెక్‌.- పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశానికి జెస్ట్‌ అవకాశం కల్పిస్తుంది. జెస్ట్‌ స్కోరుతోపాటు, ఇతర అంశాల ఆధారంగా ఆయా సంస్థలు దాదాపు అభ్యర్థులందరికీ స్కాలర్‌షిప్‌లు అందిస్తాయి.

శాస్త్ర విజ్ఞాన రంగంలో ప్రపంచ స్థాయి సంస్థలు మనదేశంలో చాలా ఉన్నాయి. బెంగళూరులోని ఐఐఎస్‌సీ, జేఎన్‌సీఏఎస్‌ఆర్‌, ఐఐఎస్‌ఈఆర్‌లు, ఎన్‌ఐఎస్‌ఈఆర్‌, హోమీ భాభా ఇనిస్టిట్యూట్‌, రామన్‌ రిసెర్చ్‌ ఇన్ స్టిట్యూట్‌ మొదలైనవి అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ పరిశోధన సంస్థలు పేరు గడించాయి. ఇలాంటి సంస్థల్లో ప్రవేశం పొందడం, పరిశోధనలు చేయడం కొద్ది మంది సైన్స్‌ విద్యార్థులకు మాత్రమే లభించే అవకాశం. ఇలాంటి అనేక సంస్థలు జాయింట్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌లో ప్రతిభ ఆధారంగా సీట్లను భర్తీ చేస్తున్నాయి. చాలా సంస్థలు ఇంటెగ్రేటెడ్‌ ఎం.ఎస్‌సి./ ఎం.టెక్‌. - పీహెచ్‌డీ కోర్సులను కూడా నిర్వహిస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి కూడా జెస్ట్‌ ర్యాంకునే ప్రాతిపదికగా తీసుకుంటారు.

జెస్ట్‌-2012తోపాటు ఇతర విద్యార్హతల విషయంలో సంస్థలు వేటికవే ప్రత్యేక నిబంధనలను పాటిస్తున్నాయి. సంబంధిత సంస్థల వెబ్‌సైట్లలో ఈ సమాచారం లభిస్తుంది. ఫిజిక్స్‌లో ప్రవేశానికి దాదాపు అన్ని సంస్థలు ఎం.ఎస్‌సి. ఫిజిక్స్‌ లేదా సంబంధిత సబ్జెక్టులో ఎంఈ/ ఎం.టెక్‌. డిగ్రీని ప్రధాన అర్హతగా పరిగణనలోకి తీసుకుంటున్నాయి. కొన్ని సంస్థలు బీఈ, బీటెక్‌ చేసిన అభ్యర్థులను కూడా అనుమతిస్తున్నాయి.

* థీరీటికల్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో ప్రవేశానికి కంప్యూటర్‌ సైన్స్‌, ఇతర సంబంధిత సబ్జెక్టుల్లో ఎం.ఎస్‌సి./ ఎంఈ/ ఎంటెక్‌/ ఎంసీఏ అవసరం. కంప్యూటర్‌ సైన్స్‌లోని మేథమేటికల్‌ అంశాలపై అభ్యర్థులకు మంచి ఆసక్తి ఉండాలి.

  ఇంటెగ్రేటెడ్‌ కోర్సులకు...
* ఇంటెగ్రేటెడ్‌ ఎం.ఎస్‌సి.- పీహెచ్‌డీ: ఈ కోర్సు మూడు సంస్థల్లో అందుబాటులో ఉంది. అవి... ఐఐఎస్‌ఈఆర్‌, పుణె; హెచ్‌ఆర్‌ఐ, అలహాబాద్‌; ఎస్‌ఎన్‌బీఎన్‌సీబీఎస్‌, కోల్‌కతా. వీటిలో ప్రవేశానికి ఏదైనా డిగ్రీని ప్రధాన అర్హతగా పరిగణనలోకి తీసుకుంటున్నాయి.

* ఎం.ఎస్‌సి. (రిసెర్చ్‌) - పీహెచ్‌డీ ఇంటెగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌: ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేథమేటికల్‌ సైన్సెస్‌, చెన్నైలో ఈ కోర్సు ఉంది. బి.ఎస్‌సి./ బీఈ/ బీటెక్‌ అభ్యర్థులు అర్హులు.

* ఇంటెగ్రేటెడ్‌ పోస్ట్‌ బి.ఎస్‌సి. - పీహెచ్‌డీ: కోల్‌కతాలోని ఎస్‌ఎన్‌బీఎన్‌సీబీఎస్‌లో ఈ కోర్సును నిర్వహిస్తున్నారు. బి.ఎస్‌సి. (ఫిజిక్స్‌/ మేథ్స్‌)/ బీఈ/ బీటెక్‌ డిగ్రీలున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

* ఇంటెగ్రేటెడ్‌ ఎం.టెక్‌.- పీహెచ్‌డీ: ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌ ఈ కోర్సును అందిస్తోంది. ఎం.ఎస్‌సి. (ఫిజిక్స్‌/ అప్లయిడ్‌ ఫిజిక్స్‌)/ బీఈ/ బీటెక్‌ అభ్యర్థులు అర్హులు.

* ఆయా సంస్థల్లో లభించే స్పెషలైజేషన్ల ఆధారంగా సంస్థలు ప్రవేశార్హతలను నిర్ణయిస్తాయి.

* జెస్ట్‌- 2012లో ప్రశ్నలు ఫిజిక్స్‌, థీరీటికల్‌ కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఉంటాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో, విద్యా సంస్థల్లో అమల్లో ఉన్న సిలబస్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.

దరఖాస్తు విధానం
అభ్యర్థులు సాధ్యమైనంతవరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇంటర్నెట్‌, ప్రింట్‌ అవుట్‌లు లభించని తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫ్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తు చేయవచ్చు. జెస్ట్‌ 2012ను చెన్నైలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేథమేటికల్‌ సైన్సెస్‌ నిర్వహిస్తుంది.

ఈ సంస్థ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో  http://www.jest.org.in/apply  దరఖాస్తు చేయవచ్చు.

సంస్థల వారీగా పరిశోధనలకు అందుబాటులో ఉన్న స్పెషలైజేషన్లు, ఇతర వివరాలు కూడా వెబ్‌సైట్‌లో లభిస్తాయి.

* మనరాష్ట్రంలో హైదరాబాద్‌, విశాఖపట్నంలలో పరీక్ష కేంద్రాలున్నాయి.
* ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పద్ధతుల్లో దరఖాస్తులు చేరడానికి చివరితేదీ: 15 డిసెంబరు 2011.
* పరీక్ష తేదీ: ఫిబ్రవరి 19, 2012.

No comments:

Post a Comment