ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Sunday, 6 November 2011

సీడీఎఫ్‌డీ రిసెర్చ్‌ స్కాలర్స్‌ ప్రోగ్రామ్‌

మాలెక్యులర్‌, సెల్‌ బయాలజీలో ఆధునిక పరిశోధనలకు దేశవ్యాప్తంగా పేరున్న సంస్థ సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నస్టిక్స్‌ (సీడీఎఫ్‌డీ).

కేంద్ర బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలోని సీడీఎఫ్‌డీ... ప్రతి సంవత్సరం రెండు దశల్లో రిసెర్చ్‌ స్కాలర్స్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోంది. ప్రస్తుతం 'రిసెర్చ్‌ స్కాలర్స్‌ ప్రోగ్రామ్‌ 2011' కింద రెండో దశ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఆధునిక జీవశాస్త్రాల్లో పరిశోధనలు చేయాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.

సీడీఎఫ్‌డీ ప్రధానంగా జెనెటిక్స్‌, కంప్యూటేషనల్‌ అండ్‌ స్ట్రక్చరల్‌ బయాలజీ, కేన్సర్‌ బయాలజీ, ఇమ్యునాలజీ, స్ట్రక్చరల్‌ బయాలజీ, సెల్‌ సైకిల్‌ రెగ్యులేషన్‌, బ్యాక్టీరియల్‌ జెనెటిక్స్‌, జెనోమిక్స్‌, తదితర అంశాల్లో పరిశోధనలు నిర్వహిస్తోంది. ఇంటర్‌ డిసిప్లీనరీ పరిశోధనలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని వివిధ రకాల విద్యానేపధ్యం ఉన్న అభ్యర్థులను రిసెర్చ్‌ స్కాలర్స్‌ ప్రోగ్రామ్‌లోకి తీసుకుంటోంది. ప్రవేశం పొందిన అభ్యర్థులు యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ లేదా మణిపాల్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేయడానికి ప్రోత్సహిస్తోంది.

రాత పరీక్ష లేదా లాన్‌ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంబీబీఎస్‌ చేసిన అభ్యర్థులకు ప్రత్యేకంగా రెండు రిసెర్చ్‌ ఫెలోషిప్‌లు కేటాయిస్తారు. వీరిలో ఒక అభ్యర్థి హ్యుమన్‌ జెనెటిక్స్‌ విభాగంలో యూనివర్సిటీ ఆఫ్‌ పిట్స్‌బర్గ్‌, సీడీఎఫ్‌డీ సంయుక్తంగా నిర్వహించే ప్రోగ్రామ్‌లో ట్రెయినీగా పనిచేయాలి.

అభ్యర్థులు ఎంబీబీఎస్‌/ ఏదైనా సైన్స్‌, టెక్నాలజీ, అగ్రికల్చర్‌ సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ చేసుండాలి. ఎంబీబీఎస్‌ అభ్యర్థులు తప్ప మిగిలిన వారందరూ సీఎస్‌ఐఆర్‌/ యూజీసీ/ డీబీటీ/ ఐసీఎంఆర్‌/ ఐసీఏఆర్‌ నిర్వహించే నెట్‌ పరీక్షలో జేఆర్‌ఎఫ్‌ సాధించాలి. లేదా గేట్‌లో 90 శాతం మార్కులు అవసరం. జెస్ట్‌ అభ్యర్థులు కూడా అర్హులు. ఎంబీబీఎస్‌ అభ్యర్థులకు ఈ పరీక్షల స్కోర్లు ఏవీ అవసరం లేదు. ఆయా పరీక్షలు రాసి, ఫలితాల కోసం నిరీక్షిస్తోన్న అభ్యర్థులు కూడా అర్హులు.

* సీడీఎఫ్‌డీ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. లేదా నిర్దేశిత నమూనాలో ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

* పూర్తిచేసిన దరఖాస్తులు చేరడానికి చివరితేదీ 25 నవంబరు 2011.

అర్హులైన అభ్యర్థుల జాబితాను 8 డిసెంబరు 2011న ప్రకటిస్తారు.

కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష 16 జనవరి 2012న ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైనవారికి మరుసటి రోజే ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

సంస్థ చిరునామా: సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నస్టిక్స్‌ (సీడీఎఫ్‌డీ), గృహకల్ప బిల్డింగ్‌ 7, ఎంజే రోడ్‌, నాంపల్లి, హైదరాబాద్‌.

No comments:

Post a Comment