ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Sunday, 18 December 2011

నిమ్స్‌లో పీజీ మెడికల్ కోర్సులు

మెడిసిన్‌లో పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ సూపర్‌ స్పెషాలిటీ కోర్సులను అందిస్తోంది నిజామ్స్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌).

వివిధ వైద్య విభాగాల్లో ఎం.డి., ఎం.ఎస్‌. కోర్సుల్లో ప్రవేశానికి నిమ్స్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కోర్సుల వ్యవధి మూడేళ్లు. నిమ్స్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (NIMSET)ద్వారా వీటిలో ప్రవేశం లభిస్తుంది.

కోర్సుల వివరాలు...
* ఎం.డి. ఎనస్థీషియాలజీ: 7 సీట్లు
* ఎం.డి. జనరల్‌ మెడిసిన్‌: 4 సీట్లు
* ఎం.డి. హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌: 3 సీట్లు
* ఎం.ఎస్‌. ఆర్థోపెడిక్స్‌: 4 సీట్లు
* ఎం.డి. పాథాలజీ: 5 సీట్లు
* ఎం.డి. రేడియోథెరపీ: 1 సీటు

అన్ని కోర్సులకు అర్హత ఎంబీబీఎస్‌. 31 మార్చి 2012 నాటికి ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసుండాలి. నిమ్‌సెట్‌లో 15 శాతం ప్రశ్నలు అసర్షన్‌, రీజనింగ్‌ పద్ధతిలో ఉంటాయి. మరికొన్ని మల్టీ రెస్పాన్స్‌ పద్ధతిలో, మిగతావి ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలో ఉంటాయి. నమూనా ప్రశ్నలు నిమ్స్‌ వెబ్‌సైట్‌లో లభిస్తాయి. ప్రశ్నలు రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో అమల్లో ఉన్న ఎంబీబీఎస్‌ కోర్సు స్థాయిలో ఉంటాయి.


ఆంధ్ర యూనివర్సిటీ, ఉస్మానియా, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీల పరిధిలోని అభ్యర్థులకు వరుసగా 42 శాతం, 36 శాతం, 22 శాతం చొప్పున సీట్లను కేటాయిస్తారు. నిమ్స్‌ వెబ్‌సైట్‌ www.nimsexams.in  ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. తర్వాత ప్రింట్‌ కాపీలను పంపించాలి.

* పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ 31 డిసెంబరు 2011.
* నిమ్‌సెట్‌ తేదీ: 12 ఫిబ్రవరి 2012
* కౌన్సెలింగ్‌ తేదీ: 26 ఫిబ్రవరి 2012

No comments:

Post a Comment