ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Tuesday, 15 November 2011

ఆస్ట్రేలియా వీసాకు కొత్త నిబంధనలు

 విద్యార్జనపై ఆసక్తి ఉన్న ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులు తమ దేశంలో చదవటాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఆస్ట్రేలియా వీసా నిబంధనల్లో కొన్ని మార్పులను అమలు చేస్తోంది. మరికొన్నిటిని వచ్చే ఏడాది ప్రవేశపెట్టనుంది.

ఈ మార్పులను పరిశీలిద్దాం.

మైకేల్‌ నైట్‌ రివ్యూ సిఫార్సుల ఆధారంగా న్యూఢిల్లీలోని ఆస్ట్రేలియన్‌ హైకమిషన్‌ విద్యార్థి వీసాల మంజూరుకు నూతన నిబంధనలను ప్రకటించింది. ఇవి ఈ నెల 5 నుంచే అమల్లోకి వచ్చాయి. ముఖ్యమైన కొన్ని మార్పులను ప్రవేశపెట్టి వీసా ప్రక్రియ సులభం చేయటానికి ప్రయత్నించారు.

ఆస్ట్రేలియా హై కమిషన్‌ విడుదల చేసిన గత కొద్దినెలల గణాంకాలు పరిశీలిస్తే భారతదేశంలో వీసా దరఖాస్తులు సమర్పించిన రెండో పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. తాజా మార్పుల మూలంగా ఈ సంఖ్య మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.

జెన్యూన్‌ టెంపరరీ ఎంట్రన్స్‌ (GTE)ని నూతనంగా ప్రవేశపెట్టారు.

దీనికి పరిశీలించే వివిధ అంశాలు:
* దరఖాస్తుదారు విద్యానేపథ్యం ఉత్తమంగా ఉండాలి.
* విద్యార్థి ఆంగ్లభాషా నైపుణ్యం బాగుండాలి.
* దరఖాస్తుదారు ఇమిగ్రేషన్‌ చరిత్ర..
* విద్యాపరంగా అంతరాయాలు, వయసు
* భారత్‌లో దరఖాస్తుదారు ప్రస్తుత స్థితి
* ఇంటర్వ్యూ (విద్యార్థి కెరియర్‌ లక్ష్యం, ఫలానా కోర్సు, విద్యాసంస్థను ఎంచుకోవటానికి హేతువు, ఆస్ట్రేలియాలోనే విద్యాభ్యాసానికి మొగ్గుచూపటానికి కారణం...)

తగ్గిన ఆర్థిక భారం
సబ్‌ క్లాస్‌ 573 (AL3) పరిధిలో హయ్యర్‌ డిప్లొమా, అసోసియేట్‌ డిగ్రీ, బ్యాచిలర్‌, బ్యాచిలర్‌ (ఆనర్‌), గ్రాడ్యుయేట్‌ సర్టిఫికెట్‌, గ్రాడ్యుయేట్‌ డిప్లొమా, మాస్టర్‌ కోర్సులు వస్తాయి. 575 సబ్‌ క్లాస్‌ (AL3)కింద ఫౌండేషన్‌ స్టడీస్‌ ప్రోగ్రాం, నాన్‌ అవార్డ్‌ ప్రోగ్రాములు ఉన్నాయి. ఈ కోర్సులు చదవటానికి విద్యార్థికి కనీసం ఉండాల్సిన ఆర్థిక స్థోమతను తగ్గించారు. చూపాల్సిన నిధులు మూడు మాసాలనాటివై ఉండాలి. ఈ నిధులను గరిష్ఠంగా 18 నెలలు చూపితే సరిపోతుంది. స్పాన్సర్‌గా ఎవరైనా ఉండొచ్చు.

సబ్‌ క్లాస్‌ 572 (AL4)పరిధిలో సర్టిఫికెట్‌ IV,డిప్లొమా, అడ్వాన్స్‌ డిప్లొమాలు ఉన్నాయి. ఇవి చదవటానికి విద్యార్థి చూపించే నిధులు మూడు మాసాలనాటివై ఉండాలి. వీటిని గరిష్ఠంగా 2 ఏళ్ళు చూపాల్సివుంటుంది. కేవలం రక్తసంబంధికులు (తల్లిదండ్రులు, తాత-అమ్మమ్మలు, తోబుట్టువులు) మాత్రమే స్పాన్సర్‌ చేయాల్సివుంటుంది. Aunt, uncle ఆస్ట్రేలియా పౌరులైవుంటే వారు కూడా స్పాన్సర్లుగా అర్హులవుతారు.

ముందస్తు రుసుము
ఆఫర్‌ లెటర్‌ ఆధారంగానే దరఖాస్తు చేయాలి. వీసాకు దరఖాస్తు చేసేముందే విద్యార్థి రుసుము ముందుగానే చెల్లించి, eCOE తప్పనిసరిగా పొందాల్సివుంటుంది. PVAవిధానాన్ని రద్దు చేశారు.

పదిహేను రోజులకు 40 గంటలసేపు పనిచేయటానికి అవకాశం కల్పించారు. గతంలో వారానికి 20 గంటలు పనిచేయటానికి వీలుండేది.

టోఫెల్‌ (ఐబీటీ), ఐఈఎల్‌టీఎస్‌, పీటీఈ, సీఏఈ టెస్టు స్కోర్లను పరిగణనలోకి తీసుకుంటారు.

పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ క్రైటీరియా (PIC)ని కొత్తగా ప్రవేశపెట్టారు. దీని ప్రకారం... ఆస్ట్రేలియా హైకమిషన్‌ /DIACకి సమర్పించిన ఏ డాక్యుమెంటయినా నకిలీదని తేలితే వీసాను తిరస్కరించటమే కాకుండా, ఆ దరఖాస్తుదారు మూడు సంవత్సరాల పాటు ఆస్ట్రేలియాకు దరఖాస్తు చేయకుండా అనర్హత వేటు వేస్తారు.

- శుభకర్ ఆలపాటి

No comments:

Post a Comment