ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Thursday, 10 November 2011

'టెట్‌'కు దరఖాస్తు చేస్తున్నారా?

పీ టెట్‌ ప్రకటన వెలువడింది!

డీఈడీ, బీఈడీ, భాషాపండిత శిక్షణ కోర్సు విద్యార్హతలున్న అభ్యర్థులందరూ ఈ పరీక్ష రాసేందుకు అర్హులే.

డీఎస్‌సీ ద్వారా ఉద్యోగ సాధనకు టెట్‌ తప్పనిసరి కాబట్టి దీనిలో మెరుగైన స్కోరు సాధించాల్సిందే.

ఇందుకు తొలిమెట్టుగా ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియను సక్రమంగా ముగించటంపై అభ్యర్థులు దృష్టి పెట్టాలి.

టెట్‌ మార్కులకు డీఎస్‌సీలో 20 శాతం వెయిటేజీ ఇస్తారు. అంటే డీఎస్‌సీ ద్వారా ఉద్యోగ సాధనలో టెట్‌ స్కోరు కీలకం. ఈ ఏడాది జులై 31న నిర్వహించిన మొదటి ఏపీ టెట్‌లో ఉత్తీర్ణత పొందనివారూ, ఉత్తీర్ణులైనా ఇంకా ఎక్కువ మార్కులు పొందాలనుకునేవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను నవంబరు 26 వరకూ దాఖలు చేయవచ్చు. హాల్‌ టికెట్లను డిసెంబరు 24 నుంచి అంతర్జాలం (నెట్‌) ద్వారా పొందటానికి వీలుంది.

జనవరి 8న పేపర్‌-1 ఉదయం, పేపర్‌-2 మధ్యాహ్నం నిర్వహిస్తారు.

* జనవరి 7 నాటికి లేదా అంతకుముందు డీఈడీ/బీఈడీ/భాషా పండిత శిక్షణ కోర్సు చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా టెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

* ప్రత్యేక విద్య (special education) లో డీఈడీ/బీఈడీ/కోర్సులు, రిహాబిలిటేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాతో గుర్తింపు పొందినవారు కూడా టెట్‌ రాయటానికి అర్హులు.

* భాషాపండితులు పేపర్‌-1 రాయాలా, పేపర్‌-2 రాయాలా అనే సందేహం వ్యక్తపరుస్తున్నారు. వీరు 6వ తరగతి నుంచి మాత్రమే భాషలను బోధించటానికి నిర్దేశించిన ఉద్యోగాల్లో నియమితులవుతారు కాబట్టి భాషాపండితులు పేపర్‌-2 రాస్తే సరిపోతుంది.

* టెట్‌ పేపర్‌-2లో ఉత్తీర్ణత పొందినవారు, డీఎస్‌సీలో వారి డిగ్రీ సబ్జెక్టు, బి.ఇడి మెథడాలజీ ఆధారంగా స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. టెట్‌లో గణితం, ఫిజికల్‌ సైన్స్‌, బయాలజీ వీరందరికీ ఒకే సిలబస్‌పై ప్రశ్నలుంటాయి. డీఎస్‌సీలో ఎవరి సబ్జెక్టుకు సంబంధించి వారు కంటెంట్‌ సన్నద్ధం కావాల్సివుంటుంది.

* ఒక్క జనరల్‌ నాలెడ్జ్‌ (జీకే) విషయంలో తప్ప మిగతా టెట్‌ సిలబస్‌ దాదాపు డీఎస్‌సీ పరీక్షలో ఉపయోగపడుతుంది. కాబట్టి టెట్‌కి బాగా సిద్ధమైతే డీఎస్‌సీలో తేలిగ్గా మంచి స్కోరు సాధించవచ్చు.

ఇవి గమనించండి...
* టెట్‌లో పేపర్‌-1కి గానీ, పేపర్‌-2కు గానీ; రెండు పేపర్లకు గానీ రూ.300 పరీక్ష ఫీజుగా aponlineద్వారా లేదా ఈ-సేవ ద్వారా గానీ నవంబరు 25 వరకూ చెల్లించవచ్చు.

* ఈ-సేవా కేంద్రానికి వెళ్ళేటపుడు అభ్యర్థులు తమ పుట్టిన తేదీ, మొబైల్‌ ఫోన్‌ నంబరు మొదలైనవాటికి సంబంధించిన ప్రాథమిక సమాచారం తీసుకువెళ్ళాల్సివుంటుంది.

* దరఖాస్తులో సరైన ఫొటో లేకుండా పంపితే తిరస్కరణకు అవకాశముంది. ఫొటో మళ్ళీ పంపటానికి అవకాశం లేదు.

* ఐడీ నంబరును జాగ్రత్తగా భద్రపరచుకున్నట్లయితే భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుంది.

* అభ్యర్థులు తమ దరఖాస్తులకు సంబంధించిన ఫిర్యాదుల కోసం నవంబరు 7 నుంచి 28 వరకూ ఏపీ టెట్‌ వెబ్‌సైట్‌ను చూడవచ్చు. కానీ ఫొటోకు సంబంధించిన వినతులను మాత్రం స్వీకరించరు.

- వి. బ్రహ్మయ్య

No comments:

Post a Comment