ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు జైళ్లశాఖలోని డిప్యూటీ జైలర్లు, జైల్ వార్డర్లు, అసిస్టెంట్ మ్యాట్రన్‌ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
గతంలో ఈ పోస్టులతోపాటు ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్స్ పోస్టులకు అన్నిటికీ ఒకే నోటిఫికేషన్, రాతపరీక్ష ఉండేవి. డిప్యూటీ జైలర్లు, జైల్ వార్డర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు కూడా ఉండటం వల్ల సెలక్షన్స్ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా జైళ్ల శాఖకు వేరుగా నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఇప్పటికే ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, జైళ్ల శాఖ పోస్టులకు కూడా ఒకే సమయంలో ప్రిపేర్ కావడం కలిసొస్తుంది.
కొత్తగా జైలుకు వచ్చిన ఖైదీల కేస్‌షీట్‌లను పరిశీలించి, వారిని కేటగిరీల వారీగా విభజించి బ్యారక్‌లను కేటాయించడం డిప్యూటీ జైలర్ల ప్రధాన బాధ్యత. అంతేగాక ఖైదీల పర్యవేక్షణ, వసతి లాంటివాటిని కింది స్థాయి సిబ్బందితో కలిసి పరిశీలించడం లాంటివి ఉంటాయి. డిప్యూటీ జైలర్ స్థాయి అధికారి 5 నుంచి 6 ఏళ్లలో జైలర్‌గా పదోన్నతి పొందవచ్చు. ఆ తర్వాత అనుభవాన్ని బట్టి డీఎస్పీ జైల్స్, ఎస్పీ జైల్స్‌గా ఉన్నత స్థాయులకు ఎదగవచ్చు.
* జైల్ వార్డరుగా ప్రవేశించి, అనుభవాన్ని బట్టి హెడ్ వార్డర్, చీఫ్ హెడ్ వార్డర్, డిప్యూటీ జైలర్‌గా పదోన్నతులు పొందవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ జైలర్స్- 75 పోస్టులు, అసిస్టెంట్ మ్యాట్రన్స్ -4 పోస్టులు, జైల్ వార్డర్స్ - 692 పోస్టులను భర్తీచేయనున్నారు.
నియామక ప్రక్రియలో మార్పులు
ఈసారి జైళ్లశాఖ నియామకాల్లో కొన్ని మార్పులు జరిగాయి. గతంలో అన్ని రిక్రూట్‌మెంట్‌లలో నోటిఫికేషన్ వెలువడిన సంవత్సరం జులై 1వ తేదీని విద్యార్హతలకు కటాఫ్‌గా నిర్ణయించారు. దీనివల్ల ఆ ఏడాది సప్లిమెంటరీ పరీక్షల్లో పాసైనవారికి అవకాశం ఉండేది కాదు. ఈసారి నోటిఫికేషన్‌లో విద్యార్హతల కటాఫ్ తేదీని 26-12-2011గా నిర్ణయించారు. దీనివల్ల సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారు కూడా పోటీ పడే అవకాశం లభిస్తుంది.
* బయోమెట్రిక్ పద్ధతిలో శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించనున్నారు.
* బ్లూ లేదా బ్లాక్ పెన్‌తో ఓఎంఆర్ షీట్‌ను పూర్తిచేయాలి. గతంలో పెన్సిల్ వాడేవారు.
* రాత పరీక్ష అనంతరం ఓఎంఆర్ షీటు నకలును అభ్యర్థులు తమతోపాటు తీసుకెళ్లవచ్చు.
రాత పరీక్షలో విజయానికి...
జైళ్లశాఖలోని పోస్టులకు అభ్యర్థులను శారీరక సామర్థ్య పరీక్ష, రాతపరీక్ష, ఓరల్ టెస్ట్ (ఇంటర్వ్యూ) ఆధారంగా ఎంపిక చేస్తారు. శారీరక సామర్థ్య పరీక్షల్లో... మొదట 5 కి.మీ. రన్నింగ్ ఉంటుంది. పురుష అభ్యర్థులు దీన్ని 25 నిమిషాల్లో పూర్తిచేయాలి. మహిళా అభ్యర్థులు 2.5 కి.మీ. దూరాన్ని 16 నిమిషాల్లో పరుగెత్తాలి. ఇందులో ఉత్తీర్ణులైనవారికి రాతపరీక్షలు ఉంటాయి. రాత పరీక్ష డిప్యూటీ జైలర్, జైల్ వార్డర్ పోస్టులకు వేర్వేరుగా ఉంటుంది.
డిప్యూటీ జైలర్లు, అసిస్టెంట్ మ్యాట్రన్ పోస్టులకు రాత పరీక్షకు ఎలా సిద్ధమవ్వాలో తెలుసుకుందాం...
పేపర్ 1, పేపర్ 2లకు...
ఈ రెండు పేపర్లు (ఇంగ్లిష్, తెలుగు) కేవలం అర్హత పరీక్షలే. వీటిలో కనీస మార్కులు (జనరల్‌కు 40 మార్కులు, బీసీలకు 35, ఎస్సీ, ఎస్టీలకు 30 మార్కులు) సాధిస్తే సరిపోతుంది. ప్రశ్నపత్రాలు వ్యాసరూప తరహాలో ఉంటాయి. రెండు పేపర్లలోనూ ఒకే విధానంలో ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థి భాషా సామర్థ్యాన్ని పరీక్షించడం ఈ పేపర్ల ఉద్దేశం. ఇందులో షార్ట్ ఎస్సేలు, కాంప్రహెన్షన్, లెటర్ రైటింగ్, పేరాగ్రాఫ్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, అనువాదం (తెలుగు నుంచి ఇంగ్లిష్‌లోకి, ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి), తదితర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.
లేఖా రచన, నివేదికలు రాసేటప్పుడు అభ్యర్థి రచనా నైపుణ్యంతోపాటు రచనా విధానం కూడా ముఖ్యం. అందువల్ల అక్షర దోషాలు, కొట్టివేతలు లేకుండా చూసుకోవాలి. పేరు, తేదీ, స్థలం మొదలైనవి రాసేటప్పుడు ఫుల్‌స్టాప్‌లు, కామాలు చూసుకోవాలి.
* కాంప్రహెన్షన్‌లో ఒక ప్యాసేజ్ ఇచ్చి దాని కింద కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్యాసేజ్‌ని చదివి జవాబులు గుర్తించాలి. కనీసం రెండు మూడు సార్లు ప్యాసేజ్ చదివి సమాధానాలు గుర్తిస్తే మంచిది.
* అనువాద రచనలో... అనువాదం మక్కీకి మక్కీ కాకుండా, మూల భావం చెడకుండా అనువదించాలి. దీనికోసం ఆంగ్ల దినపత్రికలోని అంశాలను తెలుగులోకి మార్చుకోవడం, తెలుగు పత్రికలోని అంశాలను ఇంగ్లిష్‌లోకి అనువదించడం సాధన చేస్తే సులువవుతుంది.
అరిథ్ థమెటిక్, రీజనింగ్‌లకు...
డిప్యూటీ జైలర్స్, అసిస్టెంట్ మ్యాట్రన్ రాత పరీక్షలో పేపర్-3 అరిథ్ మెటిక్, రీజనింగ్‌కు సంబంధించినది. ఇందులో 200 మార్కులకు 200 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి 3 గంటలు. ఎంపికలో ఈ పేపర్ చాలా కీలకమైనది. ఇందులో అర్థమెటిక్ విభాగం నుంచి సంఖ్యలు, వాటి ధర్మాలు, అంటే... సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, కరణీయ, అకరణీయ, ప్రధాన సంఖ్యలు, వాటి మొత్తాన్ని, వర్గాల మొత్తాన్ని కనుక్కోవడం, భాగహార నియమాలు సాధన చేయాలి.
* కసాగు - గసాభాను లెక్కించడం, వాటి మధ్య సంబంధాన్ని తెలుసుకోవడం, వాటి అనువర్తనాలు, భిన్నాలలో పెద్దవి, చిన్నవి, ఆరోహణ, అవరోహణ క్రమంలో రాయడంలాంటి ప్రశ్నలు సాధన చేయాలి.
* శాతం, లాభనష్టాల విభాగంలో ఒక విలువ మారక విలువలో ఎంతశాతం?, అక్షరాస్యత శాతం, ఉత్తీర్ణత శాతం, పెరిగిన శాతం, తగ్గినశాతం, ఒక వస్తువును మరో వస్తువుతో మార్పిడి చేసిన మార్పు శాతాన్ని లెక్కించడం తెలుసుకోవాలి.
* కాలం-పని, ట్యాంకులు- కుళాయిలు విభాగంలో మనుషుల సామర్థ్యాన్ని పనిచేసే కాలంలోకి మార్చడం; కుళాయిలు, ట్యాంకులు నింపడం, ఖాళీ చేయడం, తదితర అంశాలకు సంబంధించిన సూత్రాలను నేర్చుకోవాలి.
* కాలం- దూరం, రైళ్లు విభాగంలో... వేగాన్ని, దూరాన్ని, సగటు వేగాన్ని, సాపేక్ష వేగాన్ని, రైలు పొడవు, ప్లాట్‌ఫారం పొడవులను లెక్కించడం తెలుసుకోవాలి.
* బారు, చక్రవడ్డీలలో... నిర్ణీత కాలంలో కొంత అప్పుపై వచ్చే మొత్తాన్ని లెక్కించడం; అర్థ సంవత్సరం, ప్రతి మూడు నెలలకు వచ్చే మొత్తాన్ని లెక్కించడం; బారు వడ్డీ, చక్ర వడ్డీల మధ్య సంబంధాన్ని లెక్కించడం నేర్చుకోవాలి.
* మెంటల్ ఎబిలిటీ విభాగంలో... దిశలు, రక్తసంబంధాలు, లెటర్ - సీరీస్, ఎనాలజీ, వర్గీకరణ, ర్యాంకింగ్, సిటింగ్ అరేంజ్‌మెంట్, పజిల్స్, గణిత ప్రక్రియలు; నాన్ వెర్బల్ రీజనింగ్‌లో డేటా సఫిషియన్సీ, డెసిషన్ మేకింగ్, జడ్జిమెంట్ - కంక్లూజన్స్, వాదనలు అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
జనరల్ స్టడీస్‌కు...
పేపర్-4 జనరల్ స్టడీస్‌కు సంబంధించినది. ఇందులో కూడా 200 మార్కులకు 200 ప్రశ్నలుంటాయి. సమయం 3 గంటలు. జనరల్ నాలెడ్జ్, కరెంట్ ఈవెంట్స్‌తోపాటు భారతదేశ చరిత్ర, ఇండియన్ పాలిటీ, జాగ్రఫీ, జనరల్ సైన్స్, శాస్త్ర - సాంకేతిక రంగాలు, ఇండియన్ ఎకానమీ, మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. కరెంట్ అఫైర్స్ కోసం పరీక్ష సమయానికి 6 నుంచి 7 నెలల ముందు ఉన్న సమాచారం చూసుకుంటే సరిపోతుంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వర్తమాన విషయాలు కీలకమైనవి. ముఖ్యంగా అంతరిక్ష పరిశోధనలు, భూకంపాలు, సునామీలు, ఉపగ్రహాలు, యుద్ధక్షిపణులు, అణు పరిశోధన, భారత రక్షణ వ్యవస్థ మొదలైన అంశాలను నేర్చుకోవాలి. రాత పరీక్షలో ఉత్తీర్ణులైతే ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ 20 మార్కులకు ఉంటుంది. రాత పరీక్షలోని పేపర్-3, పేపర్-4, ఇంటర్వ్యూలో మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
- మాల్యాద్రి.

No comments:
Post a Comment