ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Sunday, 9 October 2011

'ముద్రా'లో కమ్యూనికేషన్‌ మేనేజ్‌మెంట్‌

మ్యూనికేషన్‌ ప్రత్యేక అధ్యయన అంశంగా విభిన్న కోర్సులను అందిస్తోన్న సంస్థలు మనదేశంలో చాలా తక్కువగా ఉన్నాయి. సృజనాత్మకత, నవ్యత్వం, వ్యాపార సామర్థ్యాలకు ప్రాధాన్యం ఇచ్చే కమ్యూనికేషన్‌ రంగానికి అవసరమైన నిపుణులను తయారుచేయడంలో ముద్రా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్స్‌ (మికా) అగ్రశ్రేణి సంస్థ. అహ్మదాబాద్‌ కేంద్రంగా పనిచేస్తోన్న ఈ సంస్థకు అంతర్జాతీయ స్థాయి కమ్యూనికేషన్‌ శిక్షణ సంస్థలతో విద్యాపరమైన సంబంధాలున్నాయి.

కమ్యూనికేషన్‌ రంగంలో ప్రొఫెషనల్స్‌ను తయారుచేయడం, వ్యాపార ప్రతిభను పెంపొందించడం లక్ష్యంగా పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ - కమ్యూనికేషన్స్‌ (పీజీడీఎం-సి) ప్రోగ్రామ్‌ను మికా నిర్వహిస్తోంది.

2012-14 విద్యా కాలానికి ఈ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్‌ వెలువడింది.

క్యాట్‌ స్కోరుతోపాటు మికా అడ్మిషన్‌ టెస్ట్‌ (ఎంఐసీఏటీ)లో ప్రతిభ ఆధారంగా ఇందులో ప్రవేశం లభిస్తుంది. ఈ పరీక్ష ఫిబ్రవరి - మార్చి 2012లో జరగనుంది.

ఇందులో Analytical ability, divergent thinking, written communication skills, general awareness అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. నమూనా ప్రశ్నపత్రాలు మికా వెబ్‌సైట్‌లో లభిస్తాయి. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మార్చి- ఏప్రిల్‌ 2012లో గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

ఈ కోర్సు ద్వారా తరగతి గది శిక్షణతోపాటు కమ్యూనికేషన్‌ రంగానికి సంబంధించిన నిజమైన అనుభవాన్ని అభ్యర్థి పొందడం సాధ్యమవుతుంది. ఏదైనా కమ్యూనికేషన్‌ పరిశ్రమలో పనిచేస్తూ వ్యూహాత్మక వ్యాపార ప్రణాళికను రూపొందించడం ద్వారా నూతన వ్యాపార అవకాశాలను సృష్టించడంలో మెలకువలు నేర్చుకుంటారు. యు.ఎస్‌., యు.కె., సింగపూర్‌, తదితర దేశాల్లో కమ్యూనికేషన్‌ రంగం తీరుతెన్నులపై అవగాహన కల్పిస్తారు. మంచి కమ్యూనికేషన్‌, ఇంటర్‌ పర్సనల్‌ సామర్థ్యాలు, కమ్యూనికేషన్‌ వ్యాపారానికి సంబంధించిన ప్రేరణ గల అభ్యర్థులకు ఎంపికలో ప్రాధాన్యం ఇస్తారు.

దరఖాస్తు విధానం
* అభ్యర్థులకు గ్రాడ్యుయేషన్‌లో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. క్యాట్‌/ జీమ్యాట్‌ స్కోరు అవసరం. దీనితోపాటు ఎంఐసీఏటీ స్కోరు ఆధారంగా అభ్యర్థులను తర్వాతి దశకు ఎంపిక చేస్తారు. www.mica-india.net ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు కూడా ఈ వెబ్‌సైట్‌లో లభిస్తాయి.

* సంస్థ చిరునామా: ముద్రా ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్స్‌ అహ్మదాబాద్‌, అహ్మదాబాద్‌. రాత పరీక్షను మనరాష్ట్రంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తారు.

* పూర్తిచేసిన దరఖాస్తులు చేరడానికి చివరితేదీ: 24 జనవరి, 2012.

* తరగతులు ప్రారంభం: జూన్‌ చివరి వారం, 2012.

No comments:

Post a Comment