ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Sunday, 23 October 2011

You'll eat the crow అంటే తెలుసా?

ఇంగ్లిష్‌లో కొత్తగా వస్తున్న వ్యక్తీకరణలను వివరించే శీర్షిక ఇది. దీనిలో ఇచ్చే ఉదాహరణల సాయంతో ఆ expressions పై సంపూర్ణ అవగాహన పెంచుకోవటం, వాటిని సంభాషణల్లో, రచనల్లో ప్రయోగించటం చేస్తే విద్యార్థుల ఆంగ్ల భాషాపరిజ్ఞానం మెరుగుపడుతుంది!  ఈ వ్యాస రచయిత- ఎం.సురేశన్.   

Sunayana: I wish to start my own online company. Dad says it's worth a try too, though he has cautioned me against the risks involved. He's convinced me it is going to be an uphill struggle. (నేను నా సొంత online company ప్రారంభించాలనుకుంటున్నాను. నాన్న కూడా 'ప్రయత్నించదగ్గ విషయం' అన్నాడు. కానీ దాన్లో ఉన్న ప్రమాదాలను గురించి కూడా హెచ్చరించాడు. అది చాలా కష్టమైన విషయం, అతి ప్రయాసతో కూడుకున్న పనని కూడా నాకు నచ్చేట్లు చెప్పాడు.)
Neeraja: Yea. It needs a strenuous effort and personal involvement. Look at Tara. She had started on her own, that was good. But without heeding her uncle's advice not to rely on assistants, she left everything to them. She came a cropper. (అవును. దానికి కఠోరమైన శ్రమ, వ్యక్తిగతంగా చేస్కోటం అవసరం. తార విషయం చూడు. తనూ సొంతంగానే ప్రారంభించింది, కానీ సహాయకుల మీద ఆధారపడవద్దన్న వాళ్ళ మామయ్య సలహాను పాటించకుండా అన్నీ వాళ్లకు వదిలిపెట్టింది. పూర్తిగా దెబ్బతింది.)

Sunayana: Yea. I remember that. But I am not in a particular hurry. I will start it only when I feel up to it. (అవును. అది నాకు గుర్తుంది. నేనేం అంత తొందరపడటంలేదు. నేను చేయగలననుకున్నప్పుడే అది ప్రారంభిస్తాను.)

Neeraja: Tara was confident that in no time she'd be on a roll, but in the end she had to eat the crow. (తార చాలా నమ్మకంతో ఉంది- తను తక్కువ సమయంలోనే పైకొచ్చేస్తానని. కానీ చివరకు తన తప్పు తాను తెలుసుకుంది.)

Sunayana: She was over confident and paid the price for it. But I am going to be very cautious. I'm aware that the stakes involved are high; it's dad's money that I am be investing... So I'll be careful. (తన మీద తనకున్న అతి నమ్మకంతో తగిన మూల్యం చెల్లించింది. నేను మాత్రం చాలా జాగ్రత్తగా ఉండబోతున్నాను. పెట్టుబడి ఎక్కువగా ఉండబోతోంది. అదీ నాన్న డబ్బు నేను పెట్టబోయేది. కాబట్టి జాగ్రత్తగా ఉంటాను.)

Neeraja: OK. Give it your best shot. You will succeed. (నీ శక్తికొద్దీ ప్రయత్నం చేయి. నువ్వు విజయం పొందుతావు.)


4 comments:

  1. తెలుసండి. మీరు కాకిని తిందురు అని. అనగా మీరు IAS పాస్ ఐతే మీకు నాగాలాండ్ పోస్టింగు ఖాయం ! అక్కడ మీకు కాకిని తినే యోగం ఉందని దీని భాష్యం !

    ReplyDelete
  2. డియర్ Zilebi,
    మీ సరదా భాష్యం బాగుంది.:) నిజంగానే ఇలాంటి ఇంగ్లిష్ expressions విచిత్రంగా అనిపిస్తాయి.

    ReplyDelete
  3. Hello Sir,
    na peru anil. Eenadu lo Publish avuthunna 'Modren English Usage' follow avadam kudaraledu. kavuna nenu miss ayina Course Oke Set ga nenu Pondavachha..? Edaina Margam cheppandi..

    Regards,
    Anil.

    ReplyDelete
  4. డియర్ అనిల్,
    ఈ బ్లాగు ప్రారంభించిననాటినుంచీ Modern English Usage లో వచ్చిన భాగాలను ఇస్తున్నాం కదా? ఈనాడు ఇంటర్నెట్ ఎడిషన్ ఆర్కైవ్స్ లో 90 రోజుల పేపర్లుంటాయి. వాటిలో కొన్ని చూడవచ్చు. ఈ expressions వేటికవే ఇండిపెండెంట్ కాబట్టి ఇదో ‘కోర్సు’గా భావించనక్కర్లేదు. కొత్తవి ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉంటే సరిపోతుంది. మోడర్న్ ఇంగ్లిష్ యూసేజ్ పాత భాగాలు కావాలంటే గ్రంథాలయాల్లో వెతకటమే పరిష్కారం!

    ReplyDelete