ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Saturday 8 October 2011

బిట్స్‌ పిలానీలో ఆఫ్‌-క్యాంపస్‌ ప్రోగ్రామ్‌లు


వివిధ రంగాల్లో పనిచేస్తోన్న ప్రొఫెషనల్స్‌ను దృష్టిలో ఉంచుకొని బిర్లా ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌ పిలానీ) అనేక ఆఫ్‌ క్యాంపస్‌ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తోంది.

టెక్నికల్‌, సైన్స్‌, ఇంజినీరింగ్‌ డిగ్రీ, డిప్లొమాలు ఉన్న ఉద్యోగులు, ఇతర అభ్యర్థులకు ఈ ప్రోగ్రామ్‌లు బాగా ఉపయోగపడతాయి. సామర్థ్యాలు పెంపొందించుకోవడంతోపాటు కెరియర్‌ వృద్ధికి ఆఫ్‌ క్యాంపస్‌ ప్రోగ్రామ్‌లు ప్రయోజనకరం.

ప్రొఫెషనల్‌ కోర్సుల నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తోన్న బిట్స్‌... ఇతర ప్రత్యేక అధ్యయన సంస్థలతో కలిసి ఆఫ్‌ క్యాంపస్‌ కోర్సులను నిర్వహిస్తోంది. వీటిని 'ఆఫ్‌-క్యాంపస్‌ వర్క్‌ ఇంటెగ్రేటెడ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌'లుగా బిట్స్‌ వ్యవహరిస్తోంది.

సామర్థ్యాలు, అర్హతలను మెరుగుపరచుకోవాలనుకునే ప్రొఫెషనల్స్‌ వీటిని చేయవచ్చు.

యూనివర్సిటీలు అందించే సాధారణ దూరవిద్య కోర్సుల కంటే బిట్స్‌ అందిస్తోన్న ఆఫ్‌-క్యాంపస్‌ ప్రోగ్రామ్‌లు ప్రమాణాల పరంగా మెరుగైనవని చెప్పవచ్చు. ఇంజినీరింగ్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌, సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్స్‌, తదితర అడ్వాన్స్‌డ్‌ స్పెషలైజేషన్లతో ఐటీ కోర్సులను అందిస్తోంది. ఆయా రంగాల్లో పనిచేస్తోన్న ఇతర సంస్థల సహకారంతో బిట్స్‌ మరికొన్ని ప్రొఫెషనల్‌ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తోంది.

ఐటీ సంబంధిత ప్రోగ్రామ్‌ల వివరాలు...

బి.ఎస్‌. ఇంజినీరింగ్‌ టెక్నాలజీ / బి.ఎస్‌. ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌: టెక్నికల్‌ డిప్లొమా గల ఉద్యోగులు లేదా కనీసం రెండేళ్లు ఏదైనా ఇంజినీరింగ్‌ పరిశ్రమలో అనుభవం ఉన్న బి.ఎస్‌సి. గ్రాడ్యుయేట్లు అర్హులు. ఇవి మూడేళ్ల కోర్సులు.


ఎం.ఎస్‌. మాన్యుఫ్యాక్చరింగ్‌ మేనేజ్‌మెంట్‌/ ఎం.ఎస్‌. సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్స్‌: బిట్స్‌ అందించే ఇంటెగ్రేటెడ్‌ ఫస్ట్‌ డిగ్రీ లేదా ఇతర బి.ఇ./ ఎం.ఎస్‌సి.తోపాటు ఇంజినీరింగ్‌ / ఐటీ పరిశ్రమలో కనీసం ఏడాది అనుభవం ఉన్న అభ్యర్థులు అర్హులు. ఇవి రెండేళ్ల ప్రోగ్రామ్‌లు.

ఈ కోర్సుల నిర్వహణలో ఈటన్‌ టెక్నాలజీస్‌, అశోక్‌ లేలాండ్‌, భారత్‌ ఫోర్జ్‌, ఎన్టీపీసీ, ఆదిత్య బిర్లా గ్రూప్‌, విప్రో, టెక్‌ మహీంద్రా, తదితర ఐటీ, ఇంజినీరింగ్‌ కంపెనీలు పాలుపంచుకుంటున్నాయి. ఈ కోర్సులకు అవసరమైన దరఖాస్తులను, సమాచారాన్ని బిట్స్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

* పూర్తిచేసిన దరఖాస్తులు చేరడానికి చివరితేదీ: 31 అక్టోబరు 2011.

ఇతర కోర్సులు...
ఇంజినీరింగ్‌, ఐటీ సంబంధిత కోర్సులతోపాటు మరికొన్ని ప్రొఫెషనల్‌ ప్రోగ్రామ్‌లను కూడా ఆఫ్‌ క్యాంపస్‌ పద్ధతిలో బిట్స్‌ పిలానీ అందిస్తోంది. ఈ ప్రోగ్రామ్‌ల వివరాలు...
ఎం.ఎస్‌. క్వాలిటీ మేనేజ్‌మెంట్‌: బిట్స్‌ ఇంటెగ్రేటెడ్‌ ఫస్ట్‌ డిగ్రీ లేదా బి.ఇ. / ఎం.ఎస్‌సి.తోపాటు క్వాలిటీ, అనుబంధ రంగాల్లో ఏడాది అనుభవం అవసరం. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ సహకారంతో ఈ కోర్సును నిర్వహిస్తోంది.

ఎం.ఎస్‌. కన్సల్టెన్సీ మేనేజ్‌మెంట్‌: బిట్స్‌ ఇంటెగ్రేటెడ్‌ ఫస్ట్‌ డిగ్రీ లేదా బి.ఇ./ ఎం.ఎస్‌సి.తోపాటు కన్సల్టెన్సీ, అనుబంధ విభాగాల్లో ఏడాది అనుభవం. ఎం.కాం./ ఏసీఏ/ ఏసీఎస్‌ అభ్యర్థులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. న్యూఢిల్లీలోని కన్సల్టెన్సీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఈ కోర్సు నిర్వహణలో పాలుపంచుకుంటుంది.

ఎం.ఫిల్‌. హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌ సిస్టమ్స్‌ మేనేజ్‌మెంట్‌: ఎం.బి.బి.ఎస్‌. చేసిన ఉద్యోగులు/ బిట్స్‌ అందించే ఇంటెగ్రేటెడ్‌ ఫస్ట్‌ డిగ్రీ లేదా బి.ఇ./ ఎం.ఎస్‌సి.తోపాటు పేరున్న వైద్యసంస్థల్లో ఏడాది అనుభవం ఉండాలి. వెలూర్‌లోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజ్‌, ముంబయిలోని బాంబే హాస్పిటల్‌ సహకారంతో ఈ కోర్సును బిట్స్‌ నిర్వహిస్తుంది.
* బి.ఎస్‌. ఆప్టోమెట్రీ (శంకర నేత్రాలయ, చెన్నై సహకారంతో)
* బి.ఎస్‌. ఆప్టోమెట్రీ (ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌, హైదరాబాద్‌ సహకారంతో)
* బి.ఎస్‌. ఫిజిషియన్‌ అసిస్టెంట్‌ (మద్రాస్‌ మెడికల్‌ మిషన్‌, చెన్నై సహకారంతో)
* ఎం.ఎస్‌. మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజీ (శంకర నేత్రాలయ, చెన్నై సహకారంతో)
* ఎం.ఫిల్‌. ఆప్టోమెట్రీ (శంకర నేత్రాలయ, చెన్నై సహకారంతో)

ఈ ప్రోగ్రామ్‌లకు ఏటా ఏప్రిల్‌లో నోటిఫికేషన్‌ వెలువడుతుంది. రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తులను బిట్స్ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
ఫీజులూ, ప్రోగ్రామ్‌ల నిర్వహణ, ప్లేస్‌మెంట్ల వివరాలు బిట్స్‌ వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చు.

No comments:

Post a Comment