ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Thursday 15 December 2011

గ్రూప్‌-1 కొలువుకు తొలిమెట్టు

గ్రూప్‌-1 పరీక్ష ప్రిపరేషన్‌లో కీలకఘట్టం ఆన్‌లైన్‌ దరఖాస్తును సక్రమంగా పూర్తిచేసి పంపడంతోనే ప్రారంభమవుతుంది.

'దరఖాస్తు పంపించటమేముందిలే?' అనే తేలికభావం తగదు. సరిగా పూరించని చాలామంది అభ్యర్థుల దరఖాస్తులు గతంలో తిరస్కరణకు గురై హాల్‌టికెట్లు జారీ కాలేదు. ఇలాంటి చిక్కుల్లేకుండా లక్ష్యం దిశగా దూసుకువెళ్ళాలంటే ఆన్‌లైన్‌ దరఖాస్తు నింపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఎ.ఎం. రెడ్డి! 

లక్షల మంది ఉద్యోగార్థుల చిరకాల నిరీక్షణ ఫలించి గ్రూప్‌-1 స్థాయి ఉద్యోగాల నియామకానికి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలయింది. దీని ద్వారా 19 రాష్ట్రప్రభుత్వ శాఖలకు సంబంధించి 304 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. వీటిని సాధించటం లక్ష్యంగా పెట్టుకున్నవారు వెంటనే ఆన్‌లైన్‌ దరఖాస్తును పంపుకోవాలి.

తెలుగు మీడియం అభ్యర్థులు, కంప్యూటర్‌ అవగాహన లేనివారు, ఇంటర్నెట్‌ అందుబాటులో లేనివారు ఈ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు పొందడమెలా?
అభ్యర్థులు మొట్టమొదట ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌ కోసం www.apspsc.gov.inను క్లిక్‌ చేయాలి. హోమ్‌పేజీ కనపడుతుంది. గ్రూప్‌-1 నోటిఫికేషన్‌పై క్లిక్‌ చేసి తన పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, కమ్యూనిటీ (కులం) ఎంటర్‌ చేస్తే చెల్లించవలసిన ఫీజుకు సంబంధించిన చలాన్‌ వస్తుంది. దాన్ని ప్రింట్‌ తీసుకోవాలి. ఏపీ ఆన్‌లైన్‌లో కానీ, ఏదేని ఎస్‌.బి.ఐ. బ్రాంచిలో కానీ నిర్దేశించిన ఫీజు చెల్లించాలి.

ఇక్కడ ముఖ్యంగా గ్రూప్‌-1 రాయబోయే ప్రతి అభ్యర్థీ ఏ విధమైన రిజర్వేషన్‌తో ప్రమేయం లేకుండా రూ. 100 దరఖాస్తు ప్రాసెసింగ్‌ కోసం తప్పక చెల్లించాలని మరిచిపోకూడదు.

ఫీజు మినహాయింపులో చిక్కు
ఏ విధమైన ఫీజు మినహాయింపు లేనివారికి అంటే... ఉద్యోగం చేసే ఒ.సి. అభ్యర్థులందరూ అదనంగా మరో రూ. 120 చెల్లించవలసి ఉంటుంది. ఒ.సి. అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగస్తులైనా, ప్రైవేటు లేదా సాఫ్ట్‌వేర్‌లో పనిచేస్తున్నా రూ. 120 తప్పక చెల్లించాలి.

నిజానికి 34 సంవత్సరాల లోపు నిరుద్యోగ ఒ.సి.లు ఈ రూ. 120 చెల్లించవలసిన పనిలేదు. కాబట్టి చాలామంది ప్రైవేటు విద్యా సంస్థలలో లేదా ఇతర ప్రైవేటు సంస్థలలో పని చేసేవారు ఈ ఫీజు మినహాయింపు పొందాలని చూస్తారు

కానీ, ఇంటర్వ్యూ సమయంలో ఆ అభ్యర్థులను 'డిగ్రీ/పీజీ అయిన తరవాత ఏం చేస్తున్నారు' అనడిగితే వెంటనే 'ప్రైవేటు రంగంలో ఫలానా ఉద్యోగం చేస్తున్నా'నని సమాధానం ఇస్తూ ఉంటారు. అప్పుడు వారు నిజాయతీగా ఫీజు మినహాయింపు పొందలేదని బోర్డుకు తెలిసిపోతుంది. ఇంటర్వ్యూలో అలాంటి అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే రూ. 120 ఫీజు చెల్లిస్తే తమ నిజాయతీని నిరూపించుకొన్నట్లు అవుతుంది. ఇది వారికి 'ప్లస్‌ పాయింటే'!

అభ్యర్థులందరూ ఫీజు చెల్లించిన తరవాత వారికి ఫీజు చెల్లించిన చలాన్‌కు ఓ జర్నల్‌ నం. బ్యాంకు ద్వారా గానీ, ఏపీ ఆన్‌లైన్‌ ద్వారా గానీ లభిస్తుంది. ఆ నంబరు ద్వారా ఫీజు చెల్లించిన మర్నాడు మధ్యాహ్నం రెండు గంటల తరవాత తిరిగి ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి సంబంధిత కాలమ్‌లో ఆ జర్నల్‌ నంబర్‌ను ఎంట్రీ చేసి దరఖాస్తును పొందవచ్చు.

ఇంటర్నెట్‌ కేంద్రాలు
చాలామంది గ్రామీణ అభ్యర్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తు పంపటంలో స్థానికంగా ఉండే ఇంటర్నెట్‌ కేంద్రాలపై ఆధారపడతారు. ఆ కేంద్రాల ఆపరేటర్లు తమ ఇష్టం వచ్చినట్టు తెలిసో తెలియకో ఆప్షన్లను క్లిక్‌ చేసే అవకాశముంది. దీనివల్ల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే ప్రమాదముంది. కాబట్టి జాగ్రత్త వహించాల్సివుంటుంది. ప్రతి ఒక్కరూ తమ దరఖాస్తు ప్రింట్‌ కాపీని తప్పనిసరిగా తీసుకుని అందులోని సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి.

చివరి తేదీ
ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాల్సిన చివరితేదీ జనవరి 8 కదా అని ఆ రోజు వరకూ తాత్సారం చేస్తే గ్రూప్‌-1 అవకాశం చేజారిపోతుంది. దరఖాస్తు పంపే చివరితేదీ జనవరి 8 కానీ ఫీజు చెల్లించాల్సిన చివరితేదీ జనవరి 6 అని మర్చిపోకూడదు.

చివరితేదీ వరకూ వేచివుండకుండా సాధ్యమైనంత త్వరగా దరఖాస్తు పంపుకోవడం మంచిది. ఎందుకంటే దరఖాస్తు పంపిననాటి నుంచే అభ్యర్థుల్లో పరీక్ష పట్ల ఆసక్తి పెరుగుతుంది. 'దరఖాస్తు పంపిన తర్వాత అంటే జనవరి 8 నుంచి ప్రారంభిద్దాంలే' అని నిర్లక్ష్యం చేస్తే ఈ పోటీపరీక్షకు సమయం సరిపోదని గుర్తించండి.

దరఖాస్తును ఆన్‌లైన్‌ ద్వారా పంపాక అది ఏ స్థాయి (status)లో ఉందో తెలుసుకోవాలంటే ఏపీపీఎస్‌సీ హోమ్‌ పేజ్‌లో పోటీపరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ నంబర్‌నూ, రెఫరెన్స్‌ ఐడీ నంబర్‌నూ, మీ పుట్టినతేదీనీ ఎంటర్‌ చేసి తెలుసుకోవచ్చు. దీనికోసం గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ నంబర్‌ 18/2011- తేదీ 28-11-2011 నూ, అభ్యర్థి రెఫరెన్స్‌ ఐడీనీ భద్రపరుచుకోవాలి.

చివరిగా ఆన్‌లైన్‌ దరఖాస్తులోని చివర్లో ఉన్న imageలోని అక్షరాలను యథాతథంగా టైపు చేయాలి. లేకుంటే దరఖాస్తును స్వీకరించరు.

ఈ విధంగా దరఖాస్తును సరైనరీతిలో గడువుకు ముందుగానే పంపించడంతో గ్రూప్‌-1 ప్రిపరేషన్‌ తొలి మెట్టు అధిరోహించినట్టే!

10 comments:

  1. I'm a fourth year undergraduate. Can I apply for this?

    ReplyDelete
  2. డియర్ బ్లాగర్, డిగ్రీ ఫైనలియర్ వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు!

    ReplyDelete
  3. hi sir.i'm studying 1st year MSc shill i pay the amount 120?
    please send your valuable suggest to me.

    ReplyDelete
  4. డియర్ నారాయణా! నిబంధనలు ఓసారి చూస్తే అర్థం చేసుకోగలిగే సమస్యే కదా మీది! మీరు విద్యార్థిగానే ఉన్నారు; ప్రస్తుతం ఏ ఉద్యోగమూ చేయటం లేదు కాబట్టి మీరు 120 రూపాయిల ఫీజు మినహాయింపు పొందవచ్చు!

    ReplyDelete
  5. when can we expect Group 2 notification sir ??

    ReplyDelete
  6. డియర్ అర్జున్ కుమార్! గ్రూప్-2 నోటిఫికేషన్ ఈ నెలాఖరులోపే వెలువడుతుంది.

    ReplyDelete
  7. sir iam facing problem in submitting the application.it is showing like this.."Please verify the Journal No.,if you have paid, please Contact SBI Branch where you have made payment and get correct Journal No."
    i didnt submitted on next day of payment. is it compulsary to submitt on payment of next day only or can sumbitt later.now what i have to do?pls rply soon

    ReplyDelete
  8. డియర్ కృష్ణవేణీ! పేమెంట్ చేసిన రోజు కాకుండా తర్వాత ఏ రోజైనా దరఖాస్తును సబ్మిట్ చేయవచ్చు. మరుసటి రోజే చేయాలన్న నిబంధన ఏమీ లేదు. మీ విషయంలో ఎస్.బి.ఐ. జర్నల్ నంబర్లో పొరబాటుందేమో వెరిఫై చేసుకోండి!

    ReplyDelete
  9. thank u sir.. but how can i correct it?

    ReplyDelete
  10. జర్నల్ నంబర్లో తేడా ఉందనేది కదా సమస్య? బ్యాంకు దగ్గర వెరిఫై చేసుకుని సరైన జర్నల్ నంబర్ వేస్తే సరిపోతుంది కదా!

    ReplyDelete