ప్రముఖ ప్రైవేటు బ్యాంకు ఐసీఐసీఐ, ఎన్‌ఐఐటీ యూనివర్సిటీ సంయుక్తంగా ఎంబీఏ (ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్) కోర్సును నిర్వహిస్తున్నాయి.
ఈ కోర్సు పూర్తిచేసిన వారికి ఐసీఐసీఐ బ్యాంకులో ఉద్యోగం లభిస్తుంది. 'ఐసీఐసీఐ బిజినెస్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్' పేరుతో ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నారు.
బ్యాంకింగ్ రంగంలో ఉన్నత స్థాయి ప్రొఫెషనల్స్‌ను తయారుచేయడం దీని ప్రధాన లక్ష్యం.
కార్పొరేట్ రంగంలో వివిధ విభాగాల్లో పనిచేస్తోన్న ప్రొఫెషనల్స్‌కు ఐసీఐసీఐ -ఎన్‌ఐఐటీ అందిస్తోన్న ఎంబీఏ మంచి అవకాశాలు కల్పిస్తోంది. ఆయిల్, గ్యాస్,ప ఎనర్జీ, పవర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇంటర్నేషనల్ ట్రేడ్, ఫార్మా, స్టీల్, ఏవియేషన్, టెలికాం, ఫైనాన్స్, టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్, అకౌంట్స్, తదితర రంగాల్లో పనిచేస్తోన్న ప్రొఫెషనల్స్ ఈ ప్రోగ్రామ్ ద్వారా ఉన్నత స్థాయి మేనేజ్‌మెంట్ ఉద్యోగాలను చేజిక్కించుకోవచ్చు.
ఏడాదికి రూ.15 లక్షల ప్రారంభ వేతనంతో ఐసీఐసీఐ బ్యాంకు ఈ అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటుంది. హోల్‌సేల్ బ్యాంకింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గ్లోబల్ రిస్క్ మేనేజ్‌మెంట్, తదితర విభాగాల్లో వీరికి అవకాశాలుంటాయి.
కోర్సు స్వరూపం
కోర్సు వ్యవధి రెండేళ్లు. మొత్తం 8 టర్మ్‌లు ఉంటాయి. వీటిలో 1, 2 టర్మ్‌లు క్లాస్‌రూమ్ ప్రోగ్రామ్, తర్వాతి రెండు (3, 4) టర్మ్‌లు ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఇంటర్న్‌షిప్ ఉంటుంది. 5,6 టర్మ్‌లు క్లాస్‌రూమ్ ప్రోగ్రామ్, 7,8 టర్మ్‌లలో సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఒక్కో టర్మ్ వ్యవధి మూడు నెలలు. అభ్యర్థి ఎంచుకున్న ఎలక్టివ్‌లను బట్టి కార్పొరేట్ బ్యాంకింగ్, రిస్క్ మేనేజ్‌మెంట్, ఐటీలో శిక్షణ ఉంటుంది. కోర్సు పూర్తయ్యాక మేనేజర్ గ్రేడ్-2, అనుభవాన్ని బట్టి అంతకంటే ఉన్నత స్థాయిలో ఉద్యోగం పొందవచ్చు.
* కోర్సు ఫీజు రూ.4.5 లక్షలు. ఈ మొత్తాన్ని ఐసీఐసీఐ బ్యాంకు ఏడాదికి 2.5 శాతం వడ్డీతో రుణంగా ఇస్తుంది. కోర్సుకాలంలో ఏమీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. కోర్సు పూర్తయ్యాక, ఉద్యోగంలో చేరిన దగ్గర్నుంచి 60 ఈఎంఐల రూపంలో రుణం తిరిగి చెల్లించాలి.
* కోర్సు కాలంలో నెలకు రూ.10000 స్టయిపెండ్ లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంకులో ఇంటర్న్‌షిప్ కాలంలో నెలకు రూ.50000 స్టయిపెండ్ ఇస్తారు. అభ్యర్థులు కనీసం మూడేళ్లు ఐసీఐసీఐ బ్యాంకులో తప్పనిసరిగా పనిచేయాలి. ఈమేరకు రూ.20 లక్షలకు బాండ్ సమర్పించాలి.
ఎంపిక, అర్హతలు
మొత్తం సీట్లు 120. ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎంట్రన్స్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, సైకోమెట్రిక్ ప్రొఫైలింగ్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటాయి. ఎంట్రన్స్ టెస్ట్‌లో వెర్బల్ ఎబిలిటీ, న్యుమరికల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. గ్రూప్ డిస్కషన్‌లో ప్రధానంగా అభ్యర్థికి గల విశ్లేషణాత్మక, సమస్యా పరిష్కార సామర్థ్యాలను పరీక్షిస్తారు. కోర్సు ఏప్రిల్ 2012 నుంచి ప్రారంభమవుతుంది. శిక్షణ రాజస్థాన్‌లోని ఎన్‌ఐఐటీ యూనివర్సిటీలో ఉంటుంది.
సీఏ, ఇంజినీరింగ్, ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ప్రొఫెషనల్స్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీ, ఫైనాన్స్, ఎకనమిక్స్, లా, కామర్స్, స్టాటిస్టిక్స్ గ్రాడ్యుయేట్లు కూడా అర్హులు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఫార్మా, స్టీల్, ఇన్‌ఫ్రా, సాఫ్ట్‌వేర్, ఏవియేషన్, పవర్, టెలికాం, ఫైనాన్స్, పెట్రోలియం, మాన్యుఫ్యాక్చరింగ్, తదితర రంగాల్లో కనీసం మూడేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. పదో తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ వరకు అన్ని కోర్సుల్లో కనీసం 60 శాతం మార్కులుండాలి.
వయసు 15 ఏప్రిల్ 2012 నాటికి 30 ఏళ్లకు మించరాదు.
* అభ్యర్థులు ఐసీఐసీఐ కెరీర్స్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూలు మనరాష్ట్రంలో హైదరాబాద్‌లో మాత్రమే నిర్వహిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ 1 జనవరి 2012.
No comments:
Post a Comment