ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Saturday, 10 December 2011

ఐటీ అవకాశాలకు... సీడాక్‌ డిప్లొమాలు



టీ, సాఫ్ట్‌వేర్‌ రంగాలకు అవసరమైన స్వల్ప వ్యవధి కోర్సులను అందించడంలో మంచి పేరున్న సంస్థ... సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీడాక్‌). 

 ఇంజినీరింగ్‌, ఎం.ఎస్‌సి. అభ్యర్థులకు ఈ సంస్థ అనేక రకాల జాబ్‌ ఓరియంటెండ్‌ కోర్సులను నిర్వహిస్తోంది. ప్రతిభావంతులైన అభ్యర్థులకు ప్లేస్‌మెంట్‌ విషయంలో సహకరిస్తుంది.

ఆధునిక ప్రయోగశాలలు, పరిశ్రమల అవసరాలకు తగినట్లు కోర్సుల రూపకల్పన, శిక్షణలో సీడాక్‌కు చాలా నైపుణ్యం ఉంది. హార్డ్‌వేర్‌ టెక్నాలజీస్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌, వెబ్‌ టెక్నాలజీస్‌, తదితర అంశాల్లో ప్రత్యేక శిక్షణను అందిస్తోంది. దేశవ్యాప్తంగా అనేక ప్రదేశాల్లో సీడాక్‌ కేంద్రాలున్నాయి. హైదరాబాద్‌లోని సీడాక్‌ కింది డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

* డిప్లొమా ఇన్‌ ఎంబెడెడ్‌ సిస్టమ్‌ డిజైన్‌: సీడాక్‌ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా, నోయిడా, పుణె, తిరువనంతపురం, ఔరంగాబాద్‌ కేంద్రాల్లో ఈ కోర్సు ఉంది. ఇంజినీరింగ్‌ డిగ్రీ లేదా పీజీ, ఎం.ఎస్‌సి. ఎలక్ట్రానిక్స్‌ లేదా ఐటీ కోర్సులు చేసిన అభ్యర్థులు అర్హులు.

* డిప్లొమా ఇన్‌ సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌: హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, పుణె కేంద్రాల్లో చేయవచ్చు. ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా పీజీ, ఎం.ఎస్‌సి. కంప్యూటర్స్‌, ఎంసీఏ అభ్యర్థులు అర్హులు.

* డిప్లొమా ఇన్‌ అడ్వాన్స్‌డ్‌ బిజినెస్‌ కంప్యూటింగ్‌: హైదరాబాద్‌ కేంద్రంలో మాత్రమే ఈ కోర్సు ఉంది. ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా పీజీ, ఎం.ఎస్సీ. కంప్యూటర్స్‌, ఎంసీఏ చదివినవారు ఈ కోర్సు చేయవచ్చు.

ప్రవేశం ఎలా?
ఈ కోర్సుల వ్యవధి 22 వారాలు. కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది. సీడాక్‌ కోర్సులకు పరిశ్రమల్లో బాగా విలువ ఉంటుంది. సీడాక్‌ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు నిర్వహిస్తోంది. శామ్‌సంగ్‌, సీమెన్స్‌, ఐగేట్‌, మహీంద్రా సత్యం, టెరాడేటా, హెచ్‌ఎస్‌బీసీ, హానీవెల్‌ టెక్నాలజీస్‌, సీడాక్‌, తదితర సంస్థలు సీడాక్‌ కోర్సులు చేసినవారికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి.

మూడు కోర్సులకు ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీఈటీ)లో టెక్నికల్‌, ఆప్టిట్యూడ్‌ అంశాలకు సంబంధించిన ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. సెట్‌ స్కోరు, శిక్షణ కేంద్రం, అకడమిక్‌ రికార్డు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. దరఖాస్తు సమయంలో శిక్షణ కేంద్రం, కోర్సు ప్రాధమ్యాలను ఎంచుకోవాలి. 


కోర్సులు 12 మార్చి 2012న ప్రారంభమై 11 ఆగస్టు 2012న ముగుస్తాయి.

సెట్‌కు ఉపయోగపడే పుస్తకాలు
* Digital Logic and Computer Design by Morris Mano
* Microprocessors and Interfacing by Douglas V Hall
* Data & Computer Communication by William Stallings
* The C Programming Language by B W Kernighan & Dennis Ritchie
* Data Structures by Lipschutz and Seymour
* Operating System Concepts by Silbeschatz and Galvin

* సీడాక్‌ హైదరాబాద్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 10 జనవరి 2012
* సెట్‌ తేదీ: 29 జనవరి 2012
* సెట్‌ ఫలితాల విడుదల: 14 ఫిబ్రవరి 2012

2 comments:

  1. sir i want to see eenadu epaper not the update news paper so please tell me the how to open that
    moreover if i get the register but not open that....sencerly requested

    ReplyDelete
  2. నెట్ ఎడిషన్ www.eenadu.net ద్వారా ఈ-పేపర్ లోకి వెళ్ళవచ్చు. నేరుగా చూడాలంటే ...http://epaper.eenadu.net/login.php క్లిక్ చేసి, వచ్చిన పేజీలో direct access క్లిక్ చేస్తే సరిపోతుంది! ఈ డైరెక్ట్ యాక్సెస్ మార్గంలో పేరును రిజిస్టర్ చేసుకునే అవసరం లేదు.

    ReplyDelete