ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Sunday, 4 December 2011

ఐఐటీ హైదరాబాద్‌లో సర్టిఫికెట్‌ కోర్సు


హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌లో సర్టిఫికెట్‌ కోర్సును అందిస్తోంది.

ఐఐటీ ఆధ్వర్యంలోని కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ విభాగం Foundations of Efficient Software Development' పేరుతో ఈ కోర్సును అందిస్తోంది.

డిసెంబరు 17, 2011న శిక్షణ మొదలవుతుంది. 24 డిసెంబరు 2011న కోర్సు ముగుస్తుంది.

సమర్థమైన సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్స్‌ రాయడానికి అవసరమైన శిక్షణ ఇవ్వడం ఈ కోర్సు లక్ష్యం. డేటా స్ట్రక్చర్స్‌, అల్గోరిథమ్స్‌, తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారు. గ్రాడ్యుయేషన్‌ స్థాయిలోని అంశాలతోపాటు అడ్వాన్స్‌డ్‌ డేటా స్ట్రక్చర్స్‌ అంశాలపై అవగాహన కల్పిస్తారు. 8 రోజుల ఇంటెన్సివ్‌ కోర్సులో ప్రాక్టికల్స్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తారు.

కోర్సు ఫీజు కాలేజీ అధ్యాపకులకు రూ.5000, ప్రభుత్వ కంపెనీల్లో పనిచేసేవారికి రూ.10000. ప్రైవేటు రంగంలోని కంపెనీల్లో పనిచేసే అభ్యర్థులకు ఫీజు రూ.12000. కోర్సు మెటీరియల్‌, వసతి, భోజన ఖర్చులను సంస్థ భరిస్తుంది.

ఐఐటీ హైదరాబాద్‌ వెబ్‌సైట్‌ http://www.iith.ac.in/ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా: ప్రొఫెసర్‌ సీహెచ్‌. శోభన్‌బాబు (కోర్సు కోఆర్డినేటర్‌), సీఎస్‌ఈ డిపార్ట్‌మెంట్‌, ఐఐటీ హైదరాబాద్‌, ఎద్దుమైలారం, మెదక్‌ జిల్లా.

పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ  10 డిసెంబరు 2011.

No comments:

Post a Comment