పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు అన్నారు గాంధీజీ. గ్రామ స్వరాజ్యం గురించి మన రాజ్యాంగంలోని నిర్దేశిక నియమాలలో కూడా ప్రస్తావించడం జరిగింది.
అంతటి ప్రాధాన్యం గల గ్రామాల్లో దిగువ స్థాయి ప్రజాసేవకులు చాలా కీలకపాత్ర పోషిస్తారు. అందుకే ప్రభుత్వం చేపట్టిన వీఆర్‌ఓ (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్), వీఆర్‌ఏ (విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్) నియామకాలకు అభ్యర్థుల్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఎన్నో ఏళ్ల తర్వాత ప్రభుత్వం చేపట్టిన ఈ నియామకాలకు బాగా పోటీ నెలకొంది.
ఈ సందర్భంగా అభ్యర్థులకు సూచనలు అందిస్తున్నారు వి.జె.రెడ్డి.
గ్రామానికి తలలో నాలుకలా ఉండే వీఆర్‌ఓ, వీఆర్‌ఏ ఉద్యోగాల ద్వారా ప్రజలకు చేరువై సేవచేసే అవకాశం లభిస్తుంది. ఇంటర్మీడియట్ విద్యార్హతతో వీఆర్‌ఓ, పదో తరగతి అర్హతతో వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నియామక ప్రకటన విడుదల చేసింది. వీఆర్‌ఓ పోస్టులు 1172, వీఆర్‌ఏ పోస్టులు 6063 ఉన్నాయి. వీఆర్‌ఓ ఉద్యోగాల్లో 760 పోస్టులు జనరల్ కేటగిరీకి, 412 పోస్టులు మహిళలకు కేటాయించారు. వీఆర్‌ఏ పోస్టులకు లక్షన్నర మంది, వీఆర్‌ఓ పోస్టులకు సుమారు నాలుగు లక్షల మంది పోటీపడతారని అంచనా.
వీఆర్‌ఓ ఉద్యోగాలు జిల్లా స్థాయికి చెందినవి. అందువల్ల సంబంధిత జిల్లా అభ్యర్థులు మాత్రమే ఆయా జిల్లాలోని ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. నాన్‌లోకల్ రిజర్వేషన్లు వర్తించవు. వీఆర్‌ఏ ఉద్యోగాలకు... ఏ గ్రామంలో ఖాళీ ఉంటే ఆ గ్రామవాసులే దరఖాస్తు చేసుకోవాలి.
ఈ రెండు పోస్టులకు రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 3 విభాగాలు ఉంటాయి...
* జనరల్ స్టడీస్: 60 మార్కులు
* అర్థమెటిక్ స్కిల్స్: 30 మార్కులు
* లాజికల్ స్కిల్స్: 10 మార్కులు
జనరల్ స్టడీస్ విభాగంలోని 60 ప్రశ్నల్లో 30 ప్రశ్నలు గ్రామాలకు సంబంధించిన అంశాలపై ఉంటాయి. వీఆర్‌ఓలుగా నియమితులైన అభ్యర్థులు పదోన్నతుల ద్వారా తహసీల్దారు దశ వరకు ఎదిగే అవకాశం ఉంటుంది. పరీక్షలోని వివిధ విభాగాలను పరిశీలిద్దాం.
జనరల్ స్టడీస్
ఇందులో కామన్ సబ్జెక్టులైన చరిత్ర, భూగోళశాస్త్రం, అర్థశాస్త్రం, భారత రాజ్యాంగం, జనరల్ సైన్స్ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి.
* చరిత్ర: భారతదేశ చరిత్రలో ఉన్న ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక యుగ అంశాలను అధ్యయనం చేయాలి. చరిత్రలో నాగరికతలు, ప్రాచీన భారతీయ రాజవంశాలు, వారి పాలన, దండయాత్రలు, రాజుల ఆస్థానంలోని విశేషాలు, ప్రముఖ గ్రంథాలు, బిరుదులు సిలబస్‌లో ఉన్నాయి. మధ్యయుగంలో విశేషాలు, ఆధునిక చరిత్రలో బ్రిటిష్‌వారి రాక, వారి రాజ్యకాంక్ష, ఇతరులతో ప్రముఖ యుద్ధాలు, ప్రముఖ సంఘటనలు, సిపాయిల తిరుగుబాటు, భారత జాతీయ స్వాతంత్య్ర సంగ్రామం మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
అభ్యర్థులు చరిత్రకు సంబంధించిన అంశాలను ఇంటర్మీడియట్ స్థాయిలో చదవాలి. స్కూలు పుస్తకాలను కూడా క్షుణ్నంగా చదవాలి. సొంతగా నోట్సు రాసుకునే సమయం లేదు కాబట్టి చదివేటప్పుడు ముఖ్యమైన పాయింట్లను పుస్తకాల్లోనే అండర్‌లైన్ చేసుకోవడం మంచిది. దీనివల్ల రివిజన్ సులువవుతుంది.
* భూగోళశాస్త్రం: ఈ అంశాలను ప్రాథమిక తరగతుల నుంచే అధ్యయనం చేయాలి. ఆరు, ఏడు తరగతులలోని ప్రపంచ భౌగోళికాంశాలను బాగా చదవాలి. తొమ్మిదో తరగతిలో ఉండే ఫిజికల్ జాగ్రఫీ, దిగువ తరగతులలో ఉండే సముద్రశాస్త్రం, ఎనిమిదో తరగతిలోని ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీని, పదో తరగతిలోని ఇండియన్ జాగ్రఫీని క్షుణ్నంగా చదవాలి. పాయింట్ల వారీగా నోట్ చేసుకుంటూ, మ్యాప్‌ల సాయంతో పాఠ్యాంశాలను అధ్యయనం చేయడం మంచిది.
జనరల్ సైన్స్‌లో ఎలా?
ప్రశ్నపత్రంలో ముఖ్యమైన భాగం జనరల్ సైన్స్. ఈ అంశాలను పాఠశాల స్థాయిలో చదివితో సరిపోతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ విషయాలను చదవాలి. దిగువ తరగతులలోని పాఠ్యాంశాలు పైస్థాయిలో కాఠిన్యత పెరగడంతోపాటు రిపీట్ అవుతుంటాయి. వీటిని గమనిస్తూ అర్థం చేసుకుంటూ చదవాలి. పటాలు ప్రాక్టీస్ చేయడం ద్వారా సబ్జెక్టుపై పట్టు ఏర్పడుతుంది. వివిధ పరీక్షల్లో అడిగిన జనరల్ సైన్స్ విభాగాలను అధ్యయనం చేయడం ద్వారా ప్రశ్నలను అంచనా వేయవచ్చు. ఇటీవల సైన్స్ రంగంలో వస్తోన్న పరిణామాలను పరిశీలించడం ద్వారా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయవచ్చు.
గ్రామీణ జీవన స్థితిగతులు
జనరల్ స్టడీస్‌లో సగం ప్రశ్నలు ఈ అంశం నుంచి వస్తాయి. ఇందులో గ్రామస్థాయిలో స్థానిక అంశాలను అధ్యయనం చేయాలి. పాలిటీ, ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీలను గ్రామీణ ప్రాంతాల నేపధ్యంతో ముడిపెట్టి చదవాలి. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, జిల్లా పరిషత్ నిర్మాణాలు, పాలన విధానం, విధులు, తదితర అంశాలను పరిశీలించాలి. ఈ విభాగంలో గ్రామీణ ప్రాంతాల్లోని మౌలిక వసతులు, రోడ్లు, పారిశుధ్య సమస్యలు, వ్యవసాయరంగ సమస్యలు, ప్రజల జీవన స్థితిగతులు, గ్రంథాలయాలు, విద్యావిషయక అంశాల నేపధ్యంలో ప్రశ్నలు అడగవచ్చు. జాగ్రఫీని గ్రామీణ నేపధ్యంలో... వివిధ ప్రాంతాల్లో భూమి వివరాలు, అటవీ సంపద, గ్రామీణ, ఏజన్సీ ప్రాంతాల్లో ప్రజల అవసరాలు, ఇక్కట్లు, గ్రామీణ వ్యవస్థలకు అనుబంధం చేసి చదువుకోవాలి.
ఉదాహరణకు కింది ప్రశ్నలు పరిశీలించండి...
* రాష్ట్రంలో భూగర్భ జలాలు అధికంగా ఉన్న భౌగోళిక ప్రాంతం ఏది?
* రాష్ట్రంలో ఖనిజ వనరులు అధికంగా ఉన్న జిల్లా ఏది?
* ప్రాంతీయ పాలనా మండలాల్లో అధిక ప్రాధాన్యం గల వ్యవస్థ?
* స్థానిక సంస్థలకు అధిక ఆదాయం చేకూర్చే పన్నులు ఏవి?
* వాహనదారులు టోల్‌గేట్ల వద్ద చెల్లించే పన్నులు ఎవరికి చేరుతాయి?
* సాగునీటి సంఘాలకు అధ్యక్షులుగా ఎవరు ఉంటారు?
* రాష్ట్రంలో కాయగూరలు అత్యధికంగా పండే ప్రాంతం ఏది?
* ఏజన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు ముఖ్య ఆదాయ వనరు ఏది?
* ఆదివాసీ భూములకు చెందిన యాజమాన్య హక్కులపై నిర్ణయం ఎవరు తీసుకుంటారు?
* రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి?
* గ్రంథాలయాలపై విధించే ఫీజులు ఎవరికి చెందుతాయి?
* గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎక్కువగా ఏరంగంపై ఆధారపడి ఉన్నారు?
* గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి ఎలా ఉంది?
గ్రామీణ జీవన విధానపై ప్రశ్నలు ప్రతి రోజూ మనం చూస్తున్న, వింటున్న, మనకు అనుభవంలోకి వచ్చే విషయాలపై ఉంటాయి. కొద్దిపాటి పరిశీలనతో వీటికి జవాబులు గుర్తించవచ్చు. గ్రామీణ వ్యవస్థల పనితీరు, విధులు, స్థితిగతులు, గ్రామీణ ప్రాంతాల్లో నిత్యం ఉండే సమస్యలను అధ్యయనం చేయడం మంచిది.
అర్థమెటిక్ సామర్థ్యాలు
అభ్యర్థి ప్రాథమిక గణిత సామర్థ్యాలను పరీక్షించే విధంగా ఇందులో ప్రశ్నలు ఉంటాయి. మనకు పరిచయమైన సంఖ్యలు, సంఖ్యామానాలు, సగటులు, భిన్నాలు, సంభావ్యత, కాలం- దూరం, కాలం- పని, రేఖాగణితం, క్షేత్రమితి, తదితర అంశాలపై ప్రశ్నలుంటాయి. వీటికి 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాల్లోని గణిత అంశాలను చదివితే సరిపోతుంది. ఎక్కువ సమస్యలను సాధన చేయడం ద్వారా గణిత అంశాలపై పట్టు సాధించవచ్చు.
* లాజికల్ స్కిల్స్: ఈ విభాగంలో పోలిక పరీక్ష, భిన్న పరీక్ష, రక్త సంబంధాలు, పజిల్ టెస్ట్, లాజికల్ వెన్ డయాగ్రామ్, శ్రేణీకరణ, మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు అడగవచ్చు. అభ్యర్థుల గణిత పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా, సమయానికి తగిన ప్రతిస్పందనలు టెస్ట్ చేసే విధంగా ప్రశ్నల కూర్పు ఉంటుంది. పాత ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా లాజికల్ స్కిల్స్‌పై అవగాహన పెంపొందించుకోవచ్చు.

No comments:
Post a Comment