ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Friday 9 December 2011

టాటా మోటార్స్‌ స్కాలర్‌షిప్‌లు

ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ టాటా మోటార్స్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థ డబ్ల్యు.ఎల్‌.సి. సంయుక్తంగా పని ఆధారిత (వర్క్‌ బేస్డ్‌) స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నాయి.

ఈ రెండు సంస్థలు కలిసి ఏర్పాటుచేసిన డబ్ల్యు.ఎల్‌.సి.ఐ. అండ్‌ టాటా మోటార్స్‌ అకాడమీ ఈ స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది.

'సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ ఆటోమొబైల్‌ డిస్ట్రిబ్యూషన్‌ మేనేజ్‌మెంట్‌' కోర్సులో భాగంగా వీటిని ఇస్తారు.

ఇంజినీరింగ్‌, డిప్లొమా కోర్సులు చేసిన విద్యార్థులకు ఈ కోర్సు, స్కాలర్‌షిప్‌ మంచి అవకాశం కల్పిస్తుంది. ఇతర గ్రాడ్యుయేట్లు కూడా అర్హులు. కోర్సు వ్యవధి 11 నెలలు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు టాటా మోటార్స్‌ అధీకృత డీలర్‌షిప్‌లలో ఉద్యోగ అవకాశం కల్పిస్తారు.

ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. చెన్నై, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్‌, కోల్‌కతా, నోయిడాలో శిక్షణ కేంద్రాలున్నాయి. శిక్షణ కాలంలో రూ.8000 - 10000 వరకు స్కాలర్‌షిప్‌ లభిస్తుంది. శిక్షణ తర్వాత ఉద్యోగంలో ప్రారంభ వేతనం ఏడాదికి రూ.2 లక్షలకుపైగా ఉంటుంది.

డబ్ల్యు.ఎల్‌.సి.ఐ., టాటా మోటార్స్‌ ఆధ్వర్యంలో నాలుగు నెలలు శిక్షణ ఉంటుంది. తర్వాత 7 నెలలు టాటా మోటార్స్‌ కంపెనీ కేంద్రాల్లో ఆచరణాత్మక శిక్షణ ఇస్తారు. అభ్యర్థి తనకు దగ్గర్లోని టాటా మోటార్స్‌ కేంద్రంలో ఈ శిక్షణ తీసుకోవచ్చు.

www.careers-tatamotorsdealers.com వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

చివరితేదీ 15 డిసెంబరు 2011.

No comments:

Post a Comment