ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Monday 8 August 2011

గ్రూప్-2 పరీక్షకు సిద్ధమవుతున్నారా?

న రాష్ట్రంలో రెండో ఉత్తమ సర్వీసు గ్రూప్-2. ప్రభుత్వోద్యోగం సాధించాలనుకునే లక్షలమంది అభ్యర్థులు  ఈ పరీక్ష రాస్తుంటారు.

దీనికి మీరు సిద్ధమవుతుంటే  చదువు పేజీలో ఇవాళ  ప్రచురించిన  కథనం

గ్రూప్‌-2 ...సమర సన్నాహాలు  చదవాల్సిందే.




రాత పరీక్షకు ఇంకా  70 రోజుల వ్యవధి ఉంది. ఈ సమయంలో ఎలా ప్రణాళిక వేసుకోవాలి, సరైన విధానంలో రివిజన్  (పునశ్చరణ)  ఎలా చేసుకోవాలి, ప్రిపరేషన్లో లోటుపాట్లు ఎలా తొలగించుకోవాలి... వీటన్నిటినీ  వివరంగా తెలుసుకోవచ్చు.


శాస్త్రీయంగా పునశ్చరణ చేస్తే మంచి ఫలితం సాధించవచ్చు. వారం, పది రోజులు ఒక్కో సబ్జెక్టుకి కేటాయించి జరిపే పునశ్చరణ సరైంది కాదు. 

ప్రతిరోజూ గ్రూప్‌-2లోని మూడు పేపర్లకూ సమయం కేటాయించుకోవాలి. 
 
సిలబస్‌, క్లిష్టత దృష్ట్యా పునశ్చరణ కోసం సమయ విభజన ఇక్కడ డయాగ్రమ్ లో చూపిన విధంగా విభజించుకోండి. 
 
*  ప్రతి పేపర్లోనూ కీలక/ క్లిష్టమైన పాఠ్యాంశాలు ఏమిటో స్పష్టంగా నిర్వచించుకోవాలి.  పాఠ్యాంశాల్ని ప్రతి 2, 3 రోజులకోసారి తప్పనిసరిగా పునశ్చరణ చేసుకోవాలి. 
 
*  ఎప్పటికప్పుడు పునశ్చరణ చేయడం ద్వారా జ్ఞాపకశక్తి చక్కగా స్థిరపడుతుందని గుర్తించాలి. 
 
ఈ పరీక్షకు సర్వసన్నద్ధం కావటానికి  మెలకువలు అందించిన పోటీ పరీక్షల నిపుణులు...  కొడాలి భవానీ శంకర్‌.

16 comments:

  1. Hi sir Suggest some books for Group-2 preparation

    ReplyDelete
  2. డియర్ భారతీయ!
    గ్రూప్-2 పరీక్షకు పనికొచ్చే కొన్ని పుస్తకాలు:
    * జనరల్ స్టడీస్ - టాటా మెక్ గ్రాహిల్ జీఎస్ గైడ్
    * ఆంధ్రుల చరిత్ర - బీఎస్‌ఎల్ హనుమంతరావు
    * ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర- రఘునాథరావు
    * ఇండియన్ పాలిటీ- కె. లక్ష్మీకాంత్
    * ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ - తెలుగు అకాడెమీ పుస్తకాలు.
    * కరంట్ అఫైర్స్- వార్తాపత్రికలు, పోటీ పరీక్షల మ్యాగజీన్ లు.
    * ఇండియా ఇయర్ బుక్
    * ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే
    * అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎంఏ పుస్తకాలు

    ReplyDelete
  3. Hi sir...I have a few doubts regarding the reforms taken by APPSC regarding the compoulsary medical examination for those who had selected for state and subordinate services. As per the new G.O.M.S. 420, followed by G.O.M.S.490 all candidates should undergo physical fitness medical examination. But the physical fitness examination is conducted for those candidates who had applied for spl. uniform posts (D.S.P., Excise S.I., etc) and the normal physical fitness certificate is to be obtained for other posts (non-uniform posts)from a civil surgeon of a govt. dist. hospital earlier. My question is that whether all selected candidiates should undergo the physical medical examination irrespective of uniform and non-uinform posts. Also pl. tell what ate the parameters / tests that are conducted for a candidate for physical fitness (non-uinform posts only).
    Thank You.

    ReplyDelete
  4. డియర్ ఫణిరెడ్డీ,
    మీ సందేహాలకు APPSC పరీక్షల నిపుణుడు భవానీశంకర్ గారిచ్చిన సమాధానం ఇక్కడ ఇస్తున్నాం.
    ఔను. APPSC కి ఎంపికైన అభ్యర్థులందరికీ ఇప్పుడు (2008 నియామకం దగ్గరనుంచి) ఫిజికల్ మెడికల్ ఎగ్జామినేషన్ తప్పనిసరి చేశారు. యూనిఫామ్ అభ్యర్థులకు మళ్ళీ వాళ్ళ విభాగంలో టెస్టులు ఉంటాయి. నాన్ యూనిఫామ్ అభ్యర్థులకు రక్త,నేత్ర పరీక్షలు, చెస్ట్ ఇన్ఫెక్షన్స్ పరీక్ష లాంటివి చేస్తారు.

    ReplyDelete
  5. plz send me vro post notification details and recruitment process

    ReplyDelete
  6. డియర్ ఉమేశ్,
    VRO పోస్టుల ప్రకటన ఇంకా విడుదల కాలేదు. త్వరలో వెలువడే అవకాశముంది. ఆ ప్రకటన వచ్చాక పూర్తి వివరాలను ‘చదువు’లో అందిస్తాం.

    ReplyDelete
  7. Dear sir,

    Please suggest books for Gr-2, who are preparing in english meduim,
    Especially for paper-3(economy)

    Is the material available in english meduim.
    Plz give some suggestions also how to prepare for Gr-2 in english medium for all three papers

    ReplyDelete
  8. Thanks a lot for the information provided by CHADUVU and Bhavani Shankar sir.

    Sir, Iam preparing Gr-2 in english medium. Could u plz. make a space in the Chaduvu blog for the APPSC material (esp. Indian economy and A.P. state economy) in english medium as the available material / books are in telugu medium.
    Thank You.

    ReplyDelete
  9. డియర్ నగేష్,
    డియర్ ఫణిరెడ్డీ,

    గ్రూప్-2 ప్రిపరేషన్ తీరు ఏ మీడియానికైనా ఒకటే. చదువులో గైడెన్స్, మెటీరియల్ ప్రతిభలో చూస్తుండండి.

    ఇంగ్లిష్ మీడియంలో గ్రూప్-2 సిలబస్ కు కచ్చితంగా కాకుండా general గా ఉపయోగపడే పుస్తకాలున్నాయి.
    * AP Economy : 50 Years of Andhra pradesh
    * Indian Economy by Datta and Sundaram
    * Refer- Yearly Budgets Of India and AP
    * Economic Survey of India and AP.

    ReplyDelete
  10. VRO SELECTIONS WOULD BE MADE ON THE FOLLOWING PARAMETERS.
    1.weightage of Intermediate Marks-75%
    2.Age -5%
    3.Rural Back ground-5%
    4. Interview ,headed by Dist collector-15%

    FOR VAOs 10th class marks will be considered as detailed
    1.weightage of 10th Marks-75%
    2.Age -5%
    3.Rural Back ground-5%
    4. Interview,headed by Dist collector-15%



    BHAVANI SANKAR KODALI

    ReplyDelete
  11. భవానీ శంకర్ గారూ,
    VRO పోస్టుల ఎంపిక ఏ తీరులో జరుగుతాయనేది తెలిపినందుకు మీకు కృతజ్ఞతలు. ఈ పోస్టులపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అంశాలను గమనించగలరు!

    ReplyDelete
  12. hi chaduvu team good morning naa name padmaja naaku civils raayalani korika kaani neenu tm student and syllabus emity ee class nundi books prepare avvali anedi teliyadu plz naaku help cheyyaru

    ReplyDelete
  13. can you suggest books for group-1 services???please...

    ReplyDelete
  14. డియర్ SVS, గ్రూప్-1 గురించి రాయబోయే కథనాల్లో ఈ పరీక్షకు ఉపయోగపడే పుస్తకాల వివరాలు కూడా అందిస్తాం!

    ReplyDelete
  15. thanq sir..school books chavadam grops prelims ki entha varaku use untadi...? and inter books kuda chadvala?? plz make it clear..

    ReplyDelete