ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Wednesday, 17 August 2011

‘చందమామను తీసుకొచ్చేస్తా’నంటే?

ది ‘చందమామ’ పత్రిక గురించి కాదు!
ఇంగ్లిష్ లో ఇదో వ్యక్తీకరణ. 

నిలబెట్టుకోగలమా లేమా అనే ఆలోచన లేకుండా అసాధ్యమైనవి చేస్తానంటూ కొందరు వాగ్దానాలు చేస్తుంటారు.

ఇదే Promise the moon.  Make promises without the ability to fulfil them.


ఈ వ్యక్తీకరణను ఉపయోగించిన మూడు సంభాషణలు చూడండి-

Achyuth: Mukund says that he can get us both jobs in any good company.
(ఏ కంపెనీలోనైనా మనిద్దరికీ మంచి ఉద్యోగాలిప్పించగలనని ముకుంద్‌ అన్నాడు.)

Saradhi: Well, that's promising the moon. I doubt very much his ability to do it.
(అది అసాధ్యమైన విషయం గురించి మాటివ్వటమే. అలా చేయగల శక్తి అతనికుందా అని నాకు అనుమానం.)

* * *

Nandini: The minister has promised to see that by the year end, every house has a gas connection.            (ఈ సంవత్సరాంతానికి ప్రతి ఇంటికీ gas connection ఉండేలా చూస్తానని మాటిచ్చారు మంత్రిగారు.)

Gayathri: That's promising the moon; typical of a politician.
(అది చందమామను తెచ్చివ్వగలననటమే. రాజకీయ వాదులందరూ చేసే పనిదే.)

 * * *

Sukumar: When Prasad told me that all this was going to be there I thought that he was promising the moon. I'm happy, however, that I had been proved wrong.
(ప్రసాద్‌ ఇవన్నీ ఉంటాయని నీతో అన్నప్పుడు అసాధ్యమైన వాటిని మనకందిస్తున్నాడేమోనని అన్పించింది. నేను తప్పని రుజువయినందుకు సంతోషిస్తున్నా.)

Subodh: I thought so too. I had doubted his ability to pull it off. I had thought that he was simply going into orbit without realising the effort and the expense involved in it.
(నేనూ అలానే అనుకున్నాను. ఇవన్నీ చేయగల్గేందుకతని శక్తిని శంకించాను నేను. ఇంత పెద్ద పార్టీకి కావలసిన ప్రయత్నమూ, ఖర్చూ తెలుసుకోకుండా ఏదో ఉత్సాహపడ్తున్నాడనుకున్నాను.)

* * *

ఇంగ్లిష్‌లో కొత్తగా వాడుకలోకి వచ్చే expressions తెలిసే Modern English Usage (రచయిత: ఎం. సురేశన్‌) లో  ఈ వారం Promise the moon తో పాటు  Went to town, strung out ... మొదలైనవాటి గురించి తెలుసుకోవచ్చు!

పూర్తి వివరాల కోసం ‘చదువు’లో ప్రచురితమైన ఈ వ్యాసం  చదవండి-

3 comments:

  1. ఈనాడు వారికి,
    ఇది ఈ టపాకు చెందని వ్యాఖ్య. http://eenadu.net/breakhtml.asp?qry=break5 ఈ లంకెలో ఉన్న వార్తను ఒకసారి పరిశీలించండి. కర్నూలు సికింద్రాబాదులో ఆగిపోవటమేటి? అసలు విషయం కర్నూలు వెళ్ళాల్సిన ప్యాసింజరు లేదా కర్నూలు ప్యాసింజరు సికింద్రాబాదులో ఆగిపోయింది. ఇటువంటి భాషాదోషాలు ఈ మధ్య ఈనాడులో అధికం అయిపోతున్నాయి. అలాగే తెలుగులో కొత్త పదాలను కనిపెట్టే ప్రక్ర్రియను స్వాగతిస్తున్నాను అయితే కొన్ని పదాలు మాత్రం పంటికింద రాళ్ళలా తగులుతున్నాయి. ఈ కింద వెబ్సైట్లపై ఈనాడు తెలుగు-వెలుగు విభాగంవారు ఒక కన్నేసి ఉంచితే ఆయా కొత్తపదాల విషయమై సామాన్యజనం అభిప్రాయాలు కొంతవరకూ తెలుసుకోవచ్చు.

    http://telugupadam.org/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80

    http://groups.google.com/group/telugupadam

    ReplyDelete
  2. అచంగ గారూ!
    థాంక్యూ. మీరు పేర్కొన్న వార్తను ఈ లింకులో సరిచేశాం. చూడండి... http://online.eenadu.net/Homeinner.aspx?qry=break5

    ‘తెలుగు పదం’ గురించి ‘తెలుగు వెలుగు’ విభాగానికి చెపుతాం.

    ReplyDelete
  3. ఇప్పుడీ లింకులో వేరే వార్త ఉంటుంది. ఆన్ లైన్ ఎడిషన్ తో సమస్య ఇదే. లింకులు అవే ఉంటాయి కానీ ఎప్పటికప్పుడు తాజా వార్తలు పాతవాటిని రీప్లేస్ చేస్తుంటాయి!

    ReplyDelete