ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Tuesday 23 August 2011

బ్యాంకుల్లో ఉద్యోగాలు!


బ్యాంకు ఉద్యోగం సాధించాలనుకునేవారికి ఓ శుభవార్త!

బ్యాంకు క్లర్కు కొలువుల  నియామకాల కోసం  కొత్త గా IBPS ఏర్పడింది కదా?  ఈ సంస్థ  ఏటా రెండుసార్లు కామన్ రిటన్ ఎగ్జామినేషన్ (CWE)  నిర్వహిస్తుంది.

 తాజాగా   19 బ్యాంకుల్లో క్లరికల్ పోస్టుల భర్తీ  కోసంప్రకటన విడుదల చేసింది. 

చూడండి... ఆ ప్రకటన!  ఇవాళ ఈనాడు ఉద్యోగ అవకాశాలు పేజీలో వచ్చిందీ ప్రకటన.



పదో తరగతి  చదివినవారు కూడా దరఖాస్తు చేసి, రాతపరీక్ష రాయవచ్చు.  కాకపోతే వారికి టెన్త్ లో  60 శాతం మార్కులుండాలి. కనీసం 18 సంవత్సరాల వయసు తప్పనిసరి.  గరిష్ఠ వయ: పరిమితి - 28 సంవత్సరాలు (ఇది జనరల్ క్యాటగిరీకి వర్తిస్తుంది) . 

టెన్త్ లో  60 శాతం రాకపోయివుంటే ఇంటర్మీడియట్ చదివి, దానిలో 50 శాతం మార్కులొచ్చినా సరిపోతుంది.

ఇంటర్లో 50 శాతం మార్కులు కూడా రానివారు ఉంటారు కదా?  అలాంటి వారు  డిగ్రీ  పాసైవుంటే  చాలు;  దరఖాస్తు చేసుకోవచ్చు.

వెబ్ సైట్  ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు పంపటానికి చివరి తేదీ: సెప్టెంబరు 24.

రాత పరీక్ష  నవంబరు 27న! 

10 comments:

  1. how to clarify our doubts using this website. plz help me by mailing the reply to mail-id:mdm.hasan7@gmail.com

    ReplyDelete
  2. Hello,
    Can you please tell us the dates for submission of application forms and exam dates of all the PSU's we can appear for after our under-graduation.
    my id-priyaalwayskool@gmail.com

    ReplyDelete
  3. డియర్ md hasan,

    ఈ పోస్టులో ఇచ్చిన వెబ్ సైట్ అన్న అక్షరాలను క్లిక్ చేస్తే IBPS వెబ్ సైట్లో ప్రవేశించవచ్చు. అక్కడి సమాచారంలో ఏ specific అంశంలోనైనా సందిగ్థత ఉంటే దాన్నిక్కడ పోస్ట్ చేయండి.

    ‘చదువు’లో వచ్చే వారం దీనిగురించి సవివరంగా కథనం వస్తుంది. దాన్ని చదివితే మీకు స్పష్టత వస్తుంది.

    డియర్ హరి ప్రియా,

    ప్రభుత్వరంగ సంస్థల నియామక ప్రకటనలు ఎప్పటికప్పుడు employment news లో చూసుకోవాలి. ముఖ్యమైన నోటిఫికేషన్ల సమాచారం ‘చదువు’ పేజీలోనూ, ఈ బ్లాగులోనూ అందిస్తాం!

    ReplyDelete
  4. hi,
    I have completed my B.tech in ece in svuniversity. I got placed in a MNC and so i didn't applied for any of core jobs belongs to my stream or even bank exams like IBPS Po jobs.But now my joining is postponed.When i decided to apply now to any PO jobs i didn't find any one.So please suggest me any alternative job or whether any nationalised bank is going to recruit PO's without IBPS score.Please help me svuniversity. I got placed in a MNC and so i didn't applied for any of core jobs belongs to my stream or even bank exams like IBPS Po jobs.But now my joining is postponed.When i decided to apply now to any PO jobs i didn't find any one.So please suggest me any alternative job or whether any nationalised bank is going to recruit PO's without IBPS score.Please help me

    ReplyDelete
  5. డియర్ సింధు బాలకృష్ణన్,
    ఐబీపీఎస్ స్కోరుతో సంబంధం లేని బ్యాంకు పీఓ అన్నారు కదా? దక్కన్ గ్రామీణ బ్యాంకులో ఆఫీసర్ల పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. http://www.dgbhyd.com/

    ReplyDelete
  6. thank u so much for ur valuable suggestion:) thank u so much for ur valuable suggestion:)

    ReplyDelete
  7. hello sindhu balakrishnan
    you can find some more bank po jobs in www.vidyavision.com in job alerts blog...and you can also find other category of jobs in that web easily n updated regurarly

    ReplyDelete
  8. hi can u tell me the best reference book for gk with special reference to banking..

    ReplyDelete
  9. హయ్ సర్,
    నాది ఇంటర్ లో ఒకెషనల్ A&T గ్రూప్ నేను ఈ బ్యాంకు క్లర్కు ఉద్యొగానికి అప్లే చేసుకోవచ్చా? ఆన్ లైన్ లో అప్లే చేయడం మంచిదా, పోస్ట్ ద్వారా అప్లే చేయడం మంచిదా. దయచేసి వివరాలు అందించగలరు..
    దన్యవాదాలు...
    ( ప్రవీణ్ కుమార్.జె )

    ReplyDelete
  10. డియర్ కృష్ణవేణీ,
    బ్యాంకింగ్ కు సంబంధించి ప్రత్యేకించి రాసిన జీకే- కరంట్ అఫైర్స్ బుక్ అంటూ ఉండదు. వార్తాపత్రికలూ, మ్యాగజీన్స్ లోని సమాచారాన్ని సేకరించుకోవటం అత్యుత్తమ విధానం. ముఖ్యంగా పరీక్షకు ఆరునెలల ముందు వర్తమాన అంశాలు ముఖ్యం. పోటీ పరీక్షల మ్యాగజీన్స్ అన్నీ జనరల్ గా ఉపయోగపడితే ‘బ్యాంకింగ్ సర్వీసెస్ క్రానికల్’ సంచికలు నేరుగా ఉపయోగపడతాయి.

    డియర్ ప్రవీణ్,
    ఈ పోస్టులకు 10+2+3 పద్ధతిలో చదివినవారు అర్హులు. అంటే మీ ఇంటర్మీడియట్ రెండేళ్ళ వ్యవధిలో ఉండుంటే సరిపోతుంది. లేకపోయినా టెన్త్ లో 60 శాతం మార్కులుంటే ఆ అర్హతే చాలు!

    ఇక దరఖాస్తు చేసుకోవటం- ఆన్ లైన్/ పోస్టు ద్వారా... ఏ పద్ధతైనా ఒకటే. మీకేది అనుకూలమైతే దాన్ని అనుసరించండి.

    ReplyDelete