ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Monday, 22 August 2011

డిగ్రీ చదవటానికి స్కాలర్ షిప్పులు


 భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో ‘ఫౌండేషన్‌ ఫర్‌ అకడమిక్‌ ఎక్స్‌లెన్స్‌ అండ్‌ యాక్సెస్‌ (ఎఫ్‌ఏఈఏ)’ సంస్థ ఉంది. ఇది వివిధ  ఉపకార వేతనాలను (స్కాలర్‌షిప్‌లు) అందిస్తోంది.

 ప్రస్తుతం  షెడ్యూల్డ్‌ కులాల, షెడ్యూల్డ్‌ తెగల  అభ్యర్థులు వివిధ డిగ్రీ కోర్సులు చదవడానికి ఈ సంస్థ  ఆర్థిక సహాయం చేస్తోంది.

ఆర్ట్స్‌, కామర్స్‌, సైన్స్‌, మెడికల్‌, ఇంజినీరింగ్‌, ఇతర సాంకేతిక  సబ్జెక్టుల్లో అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కు  ఈ స్కాలర్‌షిప్‌లు వర్తిస్తాయి.

మొత్తం  స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 230.

ఇంటర్మీడియట్‌ / 10+2 ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.  గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కాలేజీలో డిగ్రీ మొదటి ఏడాది కోర్సు చదువుతున్న అభ్యర్థులూ అర్హులే.

స్కాలర్‌షిప్‌ వ్యవధి గరిష్ఠంగా ఐదేళ్లు.  దీనిలో భాగంగా ట్యూషన్‌ ఫీజులు, హాస్టల్‌, పుస్తకాలు, ఇతర ఖర్చులను ఎఫ్‌ఏఈఏ భరిస్తుంది.

ఎఫ్‌ఏఈఏ కొన్ని విద్యాసంస్థలను సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా గుర్తించింది. వాటిలో చదివే విద్యార్థులకు అయ్యే అన్ని ఖర్చులనూ భరిస్తుంది.  ఫుల్‌టైమ్‌ కోర్సులకు మాత్రమే స్కాలర్‌షిప్‌ వర్తిస్తుంది.

* దరఖాస్తుల పరిశీలన తర్వాత ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలను అన్ని ప్రధాన నగరాల్లో నిర్వహిస్తారు.

* ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు.

పూర్తిచేసిన దరఖాస్తులను, ఫొటోతో సహా 'Foundation for Academic Excellence and Access (FAEA), C-25, Qutab Institutional Area, New Mehrauli Road, New Delhi- 110016'  చిరునామాకు పంపాలి.

* దరఖాస్తులు పంపటానికి  చివరి తేదీ: 27 ఆగస్టు 2011.

2 comments:

  1. is there any scholorship for bc caste....?

    ReplyDelete
  2. డియర్ AoneModels,
    BC విద్యార్థుల ఉపకారవేతనాలకు సంబంధించి ప్రకటన విడుదలైతే తప్పకుండా అందిస్తాం.

    ReplyDelete