ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Wednesday 24 August 2011

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగ ప్రకటన

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంపై ఆసక్తి ఉన్నవారికో  మంచి వార్త!
 
సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్- ఎక్స్, గ్రూప్-వై విభాగాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులను భర్తీ చేయబోతున్నారు.

దీనికోసం కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్  (10+ 2 )  ఎగ్జామినేషన్ ప్రకటన ను  స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)   విడుదల చేసింది.


ఇంటర్ పాసైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయ: పరిమితి  18- 27 సంవత్సరాలు.

ఎలా ఎంపిక చేస్తారు?

రాత పరీక్ష ఉంటుంది.

దీంతోపాటు  నిర్వహించే  పరీక్షలు -

డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు అభ్యర్థులకు... స్కిల్ టెస్టు

లోయర్  డివిజన్ క్లర్క్ పోస్టు అభ్యర్థులకు... టైపింగ్ టెస్టు.   

దరఖాస్తు చివరితేదీ : సెప్టెంబరు 16.

పరీక్ష : డిసెంబరు 4.


ఆగస్టు 23 ఈనాడు ప్రతిభలో ఈ ప్రకటన వివరాలు  చూడొచ్చు.

దరఖాస్తు ప్రక్రియ,  పరీక్ష విధానం వివరాల కోసం  SSC  వెబ్ సైట్ ఇక్కడ  చూడండి.   వెబ్ సైట్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ( అయితే SSC వెబ్ సైట్ ఇంగ్లిష్ సెక్షన్ అంత త్వరగా ఓపెన్ కావటం లేదు.... ఓపిగ్గా ప్రయత్నించాలి..! )

7 comments:

  1. సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్- ఎక్స్, గ్రూప్-వై విభాగాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు,
    ఆన్ లైన్ లో కాకుండా ఇంకా వెరెవిదంగా apply చేయడం ఎలా? ఇంకా వాటికి సంబందించిన వివరాలు తెలియచేయగలరు.
    ధన్యవాదములు...
    ( ప్రవీణ్ కుమర్.జె )

    ReplyDelete
  2. డియర్ ప్రవీణ్,

    ఔను, పోస్టు ద్వారా కూడా దరఖాస్తు పంపవచ్చు. (కానీ ఆన్ లైన్లో దరఖాస్తు చేసే తేలిక మార్గం వదలిపెట్టటం ఎందుకూ?)

    వంద రూపాయిల విలువున్న సెంట్రల్ రిక్రూట్ మెంట్ ఫీ స్టాంపులను (CRFS) దరఖాస్తుపై నిర్ణీత ప్రదేశంలో అతికించాలి. ఏ గ్రూప్ కి ప్రాధాన్యం
    ఇస్తున్నదీ దరఖాస్తులో తెలపాలి. పూర్తిచేసిన దరఖాస్తులను SSC ప్రాంతీయ కార్యాలయాలకు పంపాలి.

    వెబ్ సైట్ చూసేవుంటారు కదా? దానిలో పూర్తి వివరాలున్నాయి!

    ReplyDelete
  3. ssc website ఎంత ప్రయత్నించినా ఓపెన్ కావడం లేదూ, దయచేసి దానికి సంబందించిన దరఖాస్తులూ ఎక్కడ దొరుకుతాయి, వంద రూపాయిల విలువున్న సెంట్రల్ రిక్రూట్ మెంట్ ఫీ స్టాంపు ఎక్కడ దొరుకుతుంది, వాటిని ఏ అడ్రస్స్ కి పంపాలి, వివరాలు తెలియచేయగలరు...
    ధన్యవాదములు...
    ( ప్రవీణ్ కుమార్.జె )

    ReplyDelete
  4. Dear sir, We are very happy and satisfied with this blog. Thank you for giving suggestions and clarifying our doubts. To do more with this blog, Please publish/post articles regarding Civil Services(UPSC), it will be very useful for the aspirants of I.A.S. Many new aspirants, even some repeaters are also lacking of knowledge about what/how to read and from where they can get reference books/magazines/study material and how to make notes and preparing for current affairs.
    Thank you sir..!

    ReplyDelete
  5. డియర్ ప్రవీణ్,
    SSC వెబ్ సైట్ మాక్కూడా ఓపెన్ కావటం లేదు.

    ఈలోపు మధ్యేమార్గంగా కింద సైట్ చూడండి. మీ సందేహాలన్నీ తీరటానికి ఈ సైట్ లో లింకులు ఓపెన్ చేస్తే నోటిఫికేషన్, సిలబస్, పరీక్ష విధానం తెలుస్తాయి. దరఖాస్తు ఫారం పీడీఎఫ్ రూపంలో లభిస్తుంది.
    http://www.sscportal.in/community/deo-ldc/data-entry-operator-and-lower-division-clerk-2011

    ReplyDelete
  6. డియర్ కమలాకర్,
    ఇవాళ సివిల్స్ గురించి ఈ బ్లాగులో ఓ కథనం ఇచ్చాం. చూశారా? రాబోయే రోజుల్లో మరిన్ని కథనాలు మీరు ఆశించవచ్చు!

    ReplyDelete
  7. హయ్ సర్,
    ఇప్పటి వరకు నేను అడిగిన అన్ని ప్రశ్నలకు సమాదానం ఇచ్చినందుకు ముందుగా మీకు కృతగ్జ్నలు..
    నేను ibps వెబ్ సైట్ లో వారం రోజుల క్రింద అప్లే చేసాను, కాని ఇంతవరకు నా ఇమేల్ ఐ.డి. కి అప్లికెషన్ నంబర్, పాస్ వర్డ్ రాలేదు, ఇప్పుడు నేనేం చేయాలి, మళ్ళీ అప్లే చేసుకొవచ్చా, మళ్ళి అప్లే చేస్తె మొత్తనికే రిజిస్టర్ కాదెమో అని బయంగా ఉంది.. దయచేసి నా సమస్యని తీర్చగలరు.
    దన్యవాదములు...
    ( ప్రవీణ్ కుమార్.జె )

    ReplyDelete