ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Tuesday, 16 August 2011

విద్యార్థులకు పనికొచ్చే పుస్తకం!


ద్యోగాల కోసం పోటీపడే  వేల, లక్షల మందిలో కొందరే విజేతలవుతారు.  వారికీ ,  మిగిలినవారికీ ఏమిటి తేడా? వారిని ఇతరుల్నుంచి  విభిన్నంగా మార్చేసే  లక్షణాలు  ఏమిటి?

వారిలో మాత్రమే ఉన్న నైపుణ్యాలు ఏమిటి?

అవే సాఫ్ట్ స్కిల్స్ !  

చిరునవ్వు, నిజాయతీ, భావ ప్రసారం (కమ్యూనికేషన్‌), సహనం, అణకువ, సమయపాలన, వినయం, కఠోరశ్రమ, నిర్ణయ కౌశలం, నిష్కాపట్యం, వివరాల పట్ల సావధానత, చొరవ, హాస్య చతురత.... ఇవన్నీ ఆ నైపుణ్యాల్లో భాగమే!

విద్యార్థులకైనా, వృత్తినిపుణులకైనా ఇవెంతో అవసరం.

ఇవి  ఏ విద్యాసంస్థల్లోనూ నేర్పనివి!  వ్యక్తిత్వాన్ని వికసింపజేసేవి;  అందరి ప్రశంసలకూ అర్హులుగా  చేసేవి!

జీవితంలో ఏ దశలోనైనా, ఎక్కడైనా  గెలుపును సులువుగా అందించే  నైపుణ్యాలివి!

వీటిని సరళంగా, క్లుప్తంగా వివరిస్తూ ఓ పుస్తకం ఇంగ్లిష్ భాషలో వెలువడింది.  రచయిత డా. రఘు కొర్రపాటి.  యు.ఎస్‌.ఎ. లోని సౌత్‌ కరొలినా ఉన్నత విద్యాకమిషనర్‌ గా వ్యవహరిస్తున్నారు.

'ఈ పుస్తకం ఫైనలియర్‌ డిగ్రీ చదువుతూ ఉద్యోగ మార్కెట్లో ప్రవేశించబోయే విద్యార్థుల కోసం' అన్నారు రచయిత.

కంప్యూటర్‌ సైన్స్‌లో, మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీలున్న ఆయన పాతికేళ్ళుగా ప్రపంచంలోని వృత్తినిపుణులనూ, విద్యార్థులనూ కలిసి గడించిన అనుభవ సారమిది.


దీనిలో ప్రస్తావించిన ఆణిముత్యాలు 108. ఈ సంఖ్య విశిష్టత ఏమిటో  ముందుమాటలో  తెలుసుకోండి! ఈ108 Pearls of wisdom ప్రముఖ పుస్తకాల దుకాణాల్లో లభ్యమవుతోంది. Diamond Books  వారు ప్రచురించారు. 

వెల రూ. 250.

భారత యువతలో ఉద్యోగార్హత నైపుణ్యాల కోసం ప్రధానమంత్రి చొరవతో రూపుదిద్దుకున్న 'నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోఆర్డినేషన్‌ బోర్డ్‌'కు అనుగుణంగా ఉన్నాయి ఈ పుస్తకంలోని  అంశాలు.  జేఎన్‌టీయూ (కాకినాడ) ఈ పుస్తకాన్ని తన విద్యార్థుల కోసం స్వీకరించింది.

వచ్చే నెలలో తెలుగు అనువాదం  అందుబాటులోకి వస్తుంది. హిందీ, తమిళం భాషల్లో కూడా  వెలువడబోతోంది.

గెలుపును తెలిపే నైపుణ్యాలు   శీర్షికతో  ‘చదువు’  ప్రచురించిన  కథనంలో ఈ పుస్తకం గురించి  పూర్తి వివరాలు చూడొచ్చు.

11 comments:

  1. i like this blog because it is very useful for every student in present days

    ReplyDelete
  2. డియర్ arasavelli,
    మీ అభినందనలకు కృతజ్ఞతలు. విద్యార్థులకు ఉపయోగపడే అంశాలు ఇంకా ఏమేం ఇస్తే బాగుంటుందో మీ సూచనలు తెలపండి.

    ReplyDelete
  3. hindi prachara sabha maadhiri ga telugu sabhalu unnaya, unte vati ki kooda pareekshalu undi levels unnaya

    ReplyDelete
  4. డియర్ సుధా,
    హైదరాబాద్ లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉంది కదా? ఇక్కడ దూరవిద్యలో తెలుగుకు సంబంధించిన ఈ కింది కోర్సులు చేయవచ్చు.
    * C.C.M.T (Certificate Course in Modern Telugu) (English Media)
    టెన్త్ చదివినవారు ఈ కోర్సు చేయొచ్చు.

    * B.A. Special Telugu (Telugu media)
    ఇంటర్మీడియట్ పూర్తయ్యాక దీనిలో చేరొచ్చు.

    * P.G. Diploma in Lingustics and Telugu Teaching (PGDLTT) (Telugu media)
    దీనికి డిగ్రీ ఉండాలి.
    * ఇవే కాకుండా ఎంసీజే తెలుగు మీడియంలో ఉందిక్కడ. డిగ్రీ అర్హతతో ప్రవేశం లభిస్తుంది.

    వెబ్ సైట్ చూడండి- http://www.teluguuniversity.ac.in/distance/distan_courses.html

    ReplyDelete
  5. plz request you to
    give the information for bpt counselling notification in ntruniversity health and science,vijayawada.......

    ReplyDelete
  6. డియర్ all govt notifications,
    విచిత్రంగా ఉంది మీరు పెట్టుకున్న పేరు! :)

    BPT కౌన్సెలింగ్ సెప్టెంబరు మూడో వారంలో ఉండొచ్చని Dr.NTR UNIVERSITY OF HEALTH SCIENCES అధికారులు చెపుతున్నారు. తేదీలు ఖరారయ్యాక ఈనాడు మెయిన్ ఎడిషన్లో వస్తుంది. యూనివర్సిటీ వెబ్ సైట్ - http://59.163.116.210/ చూస్తుండండి!

    ReplyDelete
  7. i want to get updates of this blog to my mobile number. how can i get.. and please keep useful websites in this blog which are useful for students and also keep audio files of c language

    ReplyDelete
  8. డియర్ నవదీప్ రెడ్డి,
    ఈ బ్లాగు ను రోజూ చూస్తుండండి, అప్ డేట్స్ తెలుస్తాయి.:) మీ మొబైల్ లో నెట్ ఉంటే ఈ బ్లాగు విశేషాలు తేలిగ్గానే తెలుసుకోవచ్చు కదా?

    ‘ చదువు’ పేజీ ఈనాడు లో ప్రతి సోమవారం వెలువడుతుందని తెలుసు కదా? దాన్ని ఫాలో అవండి. మీ అభిప్రాయాలను ఈ బ్లాగు ద్వారా తెలపండి. ఇక సీ లాంగ్వేజ్ ఆడియో ఫైల్స్ ని ఈ బ్లాగులో ఉంచే ఉద్దేశం ఏమీ లేదు!

    ReplyDelete
  9. Hi
    good morning,
    this blog is a treasure to every student of present generation.
    thanks and hats off to your idea and implementation.
    keep developing this blog with useful stuff.
    thank you
    Santhosh

    ReplyDelete
  10. డియర్ సంతోష్,
    కృతజ్ఞతలు... మీ అభినందనకు!

    ReplyDelete