ఇంజినీరింగ్ విద్య అంటే ఐఐటీలే. ఇవి మేనేజ్‌మెంట్ కోర్సులను కూడా నిర్వహిస్తున్నాయి.
ఐఐఎంల తర్వాత నాణ్యమైన మేనేజ్‌మెంట్ శిక్షణ వీటిలో లభిస్తోంది!
ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఐఐటీలు ఏటా నిర్వహించే జాయింట్ మేనేజ్‌మెంట్ ఎంట్రన్స్ టెస్ట్ (జేఎంఈటీ)పై ఈ ఏడాది సందిగ్థత ఏర్పడింది. ఈ పరీక్షకు స్పందన తగ్గిపోతుండటంతో ఐఐటీలు ఆలోచనలో పడ్డాయి. జేఎంఈటీకి బదులుగా క్యాట్ ఆధారంగా ఐఐటీల్లో కూడా మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశం కల్పించాలనే ప్రతిపాదనలపై ఐఐటీలు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నాయి.
వీటితోపాటు బెంగళూరులోని ఐఐఎస్‌సీ కూడా ఎంబీఏ కోర్సు నిర్వహిస్తోంది.
మేనేజ్‌మెంట్ కోర్సుల నిర్వహణకు జాతీయస్థాయిలో ప్రసిద్ధిగాంచిన కార్పొరేట్ సంస్థలు మనదేశంలో అనేకం ఉన్నాయి. వీటిలో ప్రముఖమైనవి...
ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ,
ఇర్మా,
నార్సీమోంజీ,
సింబయోసిస్,
ఎఫ్.ఎం.ఎస్.,
టిస్.
ఇవన్నీ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల ఆధారంగా ఎంబీఏ లేదా పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఉన్నత ప్రమాణాలతో కోర్సుల నిర్వహణలో ఈ సంస్థలన్నీ ఐఐఎంలతో పోటీపడుతున్నాయి.
ఎంబీఏ చదవాలనుకునే అభ్యర్థులు కేవలం ఐసెట్ మీదనే ఆధారపడటం కంటే ఇలాంటి ప్రఖ్యాత సంస్థల మీద దృష్టిపెట్టడం మంచిది.
ఈ సంస్థలు నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో కొంత సారూప్యం ఉంటుంది. ప్రణాళిక ప్రకారం సిద్ధమైతే వీటిలో విజయం సాధించి మంచి భవిష్యత్తు అందుకోవచ్చు!
పూర్తి వ్యాసాన్ని చదువు ఆన్ లైన్ ఎడిషన్లో ఇక్కడ చదవండి. ఈ వ్యాస రచయిత రామకృష్ణ.
No comments:
Post a Comment