ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Monday, 8 August 2011

బ్యాంకు లో పాగా వేద్దామా?


కప్పుడు బ్యాంకులో ఉద్యోగం సంపాదించాలంటే  BSRB పరీక్ష రాయాల్సివచ్చేది.

ఇప్పుడు అదే తరహాలో IBPS రాత పరీక్షను నిర్వహిస్తోంది. ఈ పరీక్షలో స్కోరు 19 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) గా నియామకం పొందటానికి   ఉపయోగపడుతుంది.

ఈ కామన్ రిటన్  ఎగ్జామ్ ను కొత్తగా  ప్రవేశపెట్టారు.  మొట్టమొదటిసారి  నిర్వహించబోతున్నారు. 40 రోజుల సమయం ఉందీ పరీక్షకు!


బ్యాంకు పరీక్షల ప్రిపరేషన్లో అభ్యర్థులు తరచూ కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. విజేలకూ, వారికీ తేడా అక్కడే వస్తుంది. పొరపాట్లను  సవరించుకోగలిగితే  పరీక్షలో  విజయం సాధించటం కష్టమేమీ కాదు.


పరీక్షలోని ఐదు విభాగాల్లోనూ విడివిడిగా ఉత్తీర్ణులవ్వటం తప్పనిసరే. కాబట్టి అన్ని విభాగాల్లోనూ కనీస సంఖ్యలో ప్రశ్నలు సాధించాల్సివుంటుంది.

త్వరగా పూర్తిచేయగలిగే జనరల్‌ అవేర్‌నెస్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ లాంటి విభాగాలకు తక్కువ సమయం కేటాయించాలి. కష్టంగా ఉండే క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌లకు అధిక సమయం వెచ్చించాలి.

150 నిమిషాల వ్యవధి ఉండే ఈ పరీక్షకు కింది విధంగా సమయం కేటాయించుకోవచ్చు.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: 50 ని.
రీజనింగ్‌: 45 ని.
ఇంగ్లిష్‌: 25 ని.
జనరల్‌ అవేర్‌నెస్‌: 15 ని.
కంప్యూటర్‌ నాలెడ్జ్‌: 15 ని.


అయితే విద్యార్థులు ఈ సమయాలను తమ సౌలభ్యాన్ని బట్టి మార్చుకోవచ్చు. 
 
 ఈ పరీక్ష  ప్రిపరేషన్లో  పాటించవలసిన మెలకువల గురించి  చదువులో ఇవాళ ప్రచురించిన  లోపాలు సరిదిద్దుకుంటే బ్యాంకులో కొలువు  లో తెలుసుకోవచ్చు.

(శీర్షిక మీద క్లిక్ చేస్తే  ఈనాడు చదువు ఆన్ లైన్ ఎడిషన్ లో ఉన్న  ఈ కథనాన్ని పూర్తిగా చదువుకోవచ్చు).

బ్యాంకు పరీక్షల కోచింగ్  నిపుణులు  జి.ఎస్. గిరిధర్  అందించిన కథనమిది.

37 comments:

  1. How to prepare for general awareness only for banking field???

    ReplyDelete
  2. నాకు జనరల్ అవేర్ నెస్ ఏమి చదవాలో అర్థం కావట్లేదు

    ReplyDelete
  3. Thanks very much for valueable information.

    -Sudarshan.

    ReplyDelete
  4. Hi Sudhir,

    Study the following magazines. It will be helpful to you.

    1) Banking service chronicle. (Especially the practice sets)
    2) Mahendra's Master in current affairs
    3) Prathiyogita Kiran.

    Other than the above magazines, you can get info from many blogspots and websites.

    Also don't forget to go through the daily news papers.

    All the best.

    Cheers,
    Sudarshan.

    ReplyDelete
  5. మాధవ రెడ్డి గారూ!

    IBPS పరీక్షలో ఇంగ్లిష్‌ సంగతే కదా మీరడిగింది? ఆబ్జెక్టివ్‌ పరీక్షలో ఇంగ్లిషు విభాగానికి 25 మార్కులు. డిస్క్రిప్టివ్‌ పేపరు పూర్తిగా ఇంగ్లిషు సబ్జెక్టుపైనే! Essay writing, Precis writing, Letter writing మొదలైన ఇంగ్లిషు writing skills పై ఉంటుంది.

    ఇంగ్లిష్‌ ప్రిపరేషన్లో Basic grammar, vocabulary చాలా ముఖ్యం. వీటిపైనా, writing skills పైనా మార్కెట్లో పుస్తకాలు చాలానే దొరుకుతున్నాయి. అర్థం చేసుకుంటూ సాధన చేయటం ముఖ్యం!

    ReplyDelete
  6. సుదర్శన్ గారూ!

    థాంక్యూ. చొరవతో సుధీర్ గారికి చక్కని సూచనలు అందచేసినందుకు కూడా!

    సుధీర్ గారూ!

    జనరల్‌ అవేర్‌నెస్‌లో బ్యాంకింగ్‌, ఆర్థిక, సామాజిక రంగాల సమకాలీన అంశాలపై ప్రశ్నలుంటాయి. దీని కోసం క్రమం తప్పకుండా ఒక ప్రామాణిక మ్యాగజీన్‌ చదవండి. సమకాలీన సమస్యలపై పరిజ్ఞానాన్ని తాజా అంశాలతో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవాలి. సుదర్శన్ గారి సూచనలు కూడా పాటించండి.

    ReplyDelete
  7. Hi Admin sir,

    Can we know your name?

    Regards,
    Sudarshan.

    ReplyDelete
  8. సుదర్శన్ గారూ!
    ‘చదువు టీమ్’ ఈ బ్లాగును నిర్వహిస్తోంది. ఇక్కడ వ్యక్తిపరమైన ప్రాధాన్యం ఏమీ లేదు!

    ReplyDelete
  9. Hai administer sir...my name is Hari im studing for bank po exams.But how will prepare and what concepts prepare send me please.I want to develop in this subjects.english,compterscience,marketing.

    ReplyDelete
  10. డియర్ హరీ!
    కంప్యూటర్‌ నాలెడ్జి ప్రశ్నలు గతంలో జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగంలో కలిపి ఉండేవి. IBPS పరీక్షలో దీన్ని ఒక ప్రత్యేక విభాగంలో చేర్చి 50 మార్కులు కేటాయించారు. కంప్యూటర్‌ నాలెడ్జికి సంబంధించిన ప్రాథమిక అంశాలతో పాటు వాటి ఉపయోగం, కొత్తగా చోటుచేసుకుంటున్న మార్పులు మొదలైన వాటిపై అవగాహన పెంచుకోవాలి.

    బ్యాంక్ పీఓ పరీక్షకు సంబంధించి మెటీరియల్ ను ‘ప్రతిభ’లో ఇస్తున్నాం. పాత సంచికలు చూడండి!

    ReplyDelete
  11. Hi Chaduvu Team,

    I have one suggestion here.

    If possible, why don't you gather all the materials (current affairs & banking awareness) which were published in district editions for the past 6 months and share across.

    It would be very helpful to the aspirants who applied for IBPS.

    And, people can understand the depth of the questions and topics.

    Please concentrate on banking awareness more in the upcoming editions. Thanks for your cooperation and assistance. :) :)

    Regards,
    Sudarshan.

    ReplyDelete
  12. డియర్ సుదర్శన్!

    IBPS ప్రకటన జులై రెండోవారంలో వచ్చింది. కాబట్టి జులై 15 నుంచి ఈనాడు ఏ మినీ (జిల్లా ) ఎడిషన్ అయినా సరే ‘ప్రతిభ’ సంచికల కోసం చూడొచ్చు. www.eenadu.net ఆన్ లైన్ ఎడిషన్ 90 రోజుల సంచికలు ఆర్కైవ్స్ లో అందుబాటులోనే ఉంటాయని తెలుసు కదా?

    రాబోయే సంచికల్లో ‘జనరల్’ అవేర్ నెస్ గురించి ఇవ్వమని కదా మీ సూచన? థాంక్యూ.

    ReplyDelete
  13. Hi Admin sir,

    Thank you very much for your information.

    Yes. That is what my question was. Please concentrate more on General Awareness
    (with special reference to Banking Industry).

    Thanks,
    Sudarshan.

    ReplyDelete
  14. thax for eenadu chaduvu page..can we have syllubus for VRO posts...where the notification will be released soon

    ReplyDelete
  15. Dear SVS,

    ఉద్యోగ ప్రకటన విడుదలయ్యాక సిలబస్ నూ, దాంతోపాటు సన్నద్ధమయ్యే విధానం వివరాలు అందిస్తాం.

    ReplyDelete
  16. Hi sir this is harsha,Thanks for starting this blog......
    నేను ఈనాడు లో వచ్చిన ఆర్టికల్స్ ని నా బ్లాగ్ లో పెట్టాను మీరు స్టార్ట్ చేయక ముందు (అంతర్యామి,editorials,sunday spl. లో వచ్చిన కొన్ని ఆర్టికల్స్)...I think no need to put your chaduvu articles in my blog thank u very mush sir..
    మీరు ఇచ్చిన లింక్ లోపాలు సరిదిద్దుకుంటే బ్యాంకులో కొలువు క్లిక్ చేస్తే NTNE SCHOLAR SHIPS కి సంబందించిన సమాచారం వస్తుంది ....
    అండ్ సర్ కొన్ని ఇంగ్లీష్ బుక్స్ పేర్లు చెప్పండి ఎక్షమ్ కి హెల్ప్ఫుల్ గా ఉండేవి ....
    నేను చాలా ఆర్టికల్స్(పాతవి) ఈనాడు లో వచ్చేవి కల్లెక్ట్ చేసి పెట్టాను
    If you give the permission i will try to put that articles in my blog....
    Thank you sir..

    ReplyDelete
  17. ఢియర్ భారతీయ!

    ఆన్ లైన్ పత్రిల్లో లింకులు ఇవ్వడం గురించి సమస్య ఉంది. లింకులు అలాగే ఉంటాయి గానీ, ఆర్టికల్స్ కొత్తవి రీప్లేస్ అవుతాయి. ఈ సమస్యను అధిగమించటం కోసం jpg files ఉంచబోతున్నాం.

    Exam కి పనికొచ్చే పుస్తకాలన్నారు, ఏ పరీక్షో చెప్పలేదు మీరు.

    ఈనాడు లో ప్రచురించే ఆర్టికల్స్ కు కాపీరైట్ ఉంటుంది. కాబట్టి వీటిని personal blogs లో ఉపయోగించటానికి వీల్లేదు.

    ReplyDelete
  18. thanq ...sir! we want to know easy methods of how to solve arguments,conclusions,decision making in reasioning part of ibps..i had little bit confusion..please make it clear..

    ReplyDelete
  19. డియర్ SVS,

    మీరు పేర్కొన్న సమస్యను Article ద్వారా మాత్రమే address చేయగలం. We hope to give such an article.

    ReplyDelete
  20. Thanks for your reply ....Need english and reasoning books names For bank POs and clerks ....

    ReplyDelete
  21. డియర్ హర్షా!

    బ్యాంకింగ్ పరీక్షలకు ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన పుస్తకాలివి:
    * ఆర్ ఎస్ అగర్వాల్ పుస్తకం- A modern approach to verbal & non verbal Reasoning (S.Chand & Company Publication)

    * ఎడ్గార్ థార్పే పుస్తకం- Test of Reasoning for competitive exams (Tata Mcgraw hill Publication)

    * ఎం.కె. పాండే పుస్తకం- Analytical Reasoning (Banking Services Chronical Publication)

    * చేతనానంద్ సింగ్ పుస్తకం- English is Easy (Banking Services Chronical Publication)

    ReplyDelete
  22. sir i want to know how to prepare banking awareness?? which book i have to refer??

    how to prepare general awareness bits its related to banking awareness??

    ReplyDelete
  23. డియర్ కార్తీక్!

    బ్యాంకింగ్ అవేర్ నెస్ కు ఉపయోగపపడే పుస్తకం- Money Banking and Finance. ఇది Banking services chronicle ప్రచురణ. దీన్ని చదివితే ప్రాథమిక అంశాలపై/భావనలపై స్పష్టత వస్తుంది. అప్పుడు బిట్లు ఎలా వచ్చినా ఆన్సర్ చేసెయ్యొచ్చు!

    ReplyDelete
  24. sir i want objective banking awareness?? plz tel me which book i have to prefer??

    ReplyDelete
  25. డియర్ శ్రీకాంత్,
    బ్యాంకింగ్ అవేర్ నెస్ కు సంబంధించి ఆబ్జెక్టివ్ బిట్లుండే పుస్తకం మార్కెట్లోకి ఇంకా ఏదీ రాలేదు. అయినా మీరు Money Banking and Finance పుస్తకం క్షుణ్ణంగా చదివితే బిట్లను తేలిగ్గా ఆన్సర్ చేయగలుగుతారు!

    ReplyDelete
  26. Hello Admin,
    I agree that the book Money Banking and Finance gives the standard knowledge regarding banking in detail but could you also please provide us the current banking awareness in Prathiba paper which covers last 6 to 8 months happenings?

    ReplyDelete
  27. డియర్ సుష్మా,
    ‘ప్రతిభ’లో ఐబీపీఎస్ పరీక్షల కోసం జనరల్ అవేర్ నెస్ బిట్స్ ఇస్తున్నాం. ఆగస్టు 14, 18 తేదీల ప్రతిభ పేజీల్లో ప్రచురించాం. రేపటి ప్రతిభ పేజీలో కూడా వచ్చే అవకాశముంది! ప్రతిరోజూ చూస్తుండండి.

    ReplyDelete
  28. hello chaduvu page team..
    im waiting for article on reasoning..please give articles on reasoning ....

    ReplyDelete
  29. డియర్ SVS,
    ఈనెల 15, 22 తేదీల్లో ఈనాడు ప్రతిభ పేజీల్లో IBPS రీజనింగ్ ప్రశ్నలు ప్రచురించాం. రెగ్యులర్ గా చూస్తుండండి! ప్రత్యేకంగా ఈ విభాగం కోసం ఆర్టికల్ ఇవ్వాలంటారా? చూద్దాం!

    ReplyDelete
  30. Hello Team,

    Thank you for the reply. I am reading those articles.

    ReplyDelete
  31. డియర్ సుష్మా,
    గుడ్!

    ReplyDelete
  32. dear admin garu..
    plz post that links of IBPS general awareness bits.. plz plz..

    ReplyDelete
  33. డియర్ అనిల్,
    ఈనాడు ఆర్కైవ్స్ లో ప్రతిభ పేజీల లింకులు ప్రస్తుతం పనిచేయటం లేదు. సరిచేశాక మీరు వాటిని చూడొచ్చు! ఈ పేపర్ వారం రోజులు ఉంటుంది కాబట్టి ఏ మినీలోనైనా వాటిని (వారం రోజుల్లోపల) చూడొచ్చు, save చేసుకోవచ్చు!

    ReplyDelete
  34. sir nenu deccan grameena bank (Officer JMG Scale-I) ki apply chesanu... ee exam ki general knowledge ki ela prepare avvalo telupagalaru?????

    ReplyDelete
  35. డియర్ wings of thoughts,
    జీకే కోసం మార్కెట్లో దొరికే ఏదైనా ప్రామాణిక పుస్తకాన్ని అనుసరించటం మంచిది. వర్తమాన వ్యవహారాలపై ‘ఈనాడు- ప్రతిభ’లో ఇచ్చే మెటీరియల్ మీకు ఉపయోగపడుతుంది!

    ReplyDelete