ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Sunday 7 August 2011

‘చదువు’ పేజీ బ్లాగు మొదలైంది!


విద్యార్థులకూ,  పాఠక  మిత్రులకూ నమస్కారం!

తెలుగు ప్రజల జీవనాడిగా  అత్యధిక సర్క్యులేషన్ తో   పాఠకుల ఆదరణ పొందుతున్న   ‘ఈనాడు’ పత్రిక  ప్రతి సోమవారం ‘చదువు’ పేజీని వెలువరిస్తోంది.

విద్యార్థులకు అవసరమైన  విలువైన  సమాచారం  ప్రామాణికంగా,  సరళమైన భాషలో అందించి వారి అభ్యున్నతికి తోడ్పడటం చదువు పేజీ లక్ష్యం.

ఉన్నత విద్యావకాశాల సమాచారం,  పోటీ పరీక్షలకు  మార్గదర్శకత్వం,  ఉద్యోగ సాధనకు అవసరమైన  నైపుణ్యాల వివరాలను  ‘చదువు’ పేజీ అందిస్తోంది.

విద్యావేత్తలూ,  పోటీ పరీక్షల నిపుణులూ  అందించే ప్రామాణిక సమాచారం మీకు ఇందులో లభిస్తుంది! 
 
ఈ పేజీ  పాఠక విద్యార్థులకు మరింతగా చేరువ అయ్యేందుకు ఇప్పుడు బ్లాగు రూపంలో ఇలా...   అందుబాటులోకి వచ్చింది.


‘చదువు’ పేజీ లో ప్రచురించే అంశాలపై  పాఠకులు తమ అభిప్రాయాలు  పంచుకునేందుకు ఇదో  చక్కటి వేదిక.

*  ఈ పేజీలో  ఏయే అంశాలు ఉండాలని కోరుకుంటున్నారో  వ్యాఖ్యల రూపంలో తెలపవచ్చు.

*   మీ వ్యాఖ్యలను ఇంగ్లిష్ లో కానీ, తెలుగులో కానీ రాయవచ్చు. http://lekhini.org/  సైట్ లో ఇంగ్లిష్ స్పెలింగ్స్ తో  రాస్తే తెలుగు లిపిలోకి  దానికదే మారుతుంది.  దాన్ని  Copy &  Paste చేస్తే సరి!

*   నచ్చిన, నచ్చని  కథనాల గురించి చర్చించవచ్చు.

*  ఈ  పేజీని మెరుగుపరచటానికి సూచనలూ, సలహాలూ  ఇవ్వవచ్చు.


చదువు పేజీ ఆన్ లైన్ ఎడిషన్ లింకు ఇది-


ప్రయోజనకర  సమాచారాన్నీ, కథనాలనూ అందించేందుకు మీ నుంచి ఉత్సాహపూరితమైన  సహకారం ఆశిస్తూ...

-  ‘చదువు’ పేజీ  టీమ్

61 comments:

  1. good 2 hear, that chaduvu blog is here, but when i send email 2 edc@eenadu.net, its not goning, plz look aftr it

    ReplyDelete
  2. mehasin zahra గారూ,

    ‘చదువు’ పేజీ ఈమెయిల్ edc@eenadu.net ఇన్ బాక్సులో స్పామ్ మెయిల్స్ పెరిగినపుడు ఇలా తాత్కాలికంగా ఇబ్బంది ఏర్పడుతుంది. ఇప్పుడు క్లియర్ చేశాం. థాంక్యూ వెరిమచ్.

    ReplyDelete
  3. ఇన్ని సంవత్సరాలైన, ఇన్ని పత్రికలూ వచ్హినా, ఈనాడు పత్రికలోని ఆ తెలుగుదనం ఎంతను తగ్గలేదు. తెలుగు భాషను నిరంతర సేవ చేస్తున్న, ఈనాడు యాజమాన్యానికి, సిబ్బందికి నా కృతజ్ఞతలు.

    ReplyDelete
  4. Sir is der any other blog for other speacial pages of eenadu (like ee tharam, siri, sukhibhava etc...)...

    ReplyDelete
  5. Dear Shafi SK,

    మా పత్రికపై మీకున్న అభిమానానికి కృతజ్ఞతలు!

    Dear Shafi,

    ఈనాడు స్పెషల్ పేజీల్లో ప్రస్తుతానికి ‘చదువు’కు మాత్రమే బ్లాగును నిర్వహిస్తున్నాం!

    ReplyDelete
  6. ఈ బ్లాగ్ పెట్టి, మాలంటి ఎంతో మంది విద్యర్తులకు, నిరుద్యొగులకు, సహయం చేస్తున్న, ఈనాడు మరియూ ఈ బ్లాగ్ యాజమాన్యానికి నా మనస్పూర్తిగా దన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను, ఇలాగే ఈ బ్లాగ్ లో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తు ఉంటారని కొరుకుంటున్నాను,
    మొన్న ఈ మద్య VRO, VRA పొస్ట్ లు భర్తి చేస్తాం అని పెపర్ లో వచ్చింది, కాని దానికి సంబందించిన నొటిఫికెషన్ మాత్రం ఇప్పటి వరకు రాలేదు, నాకు తెలిసిన కొంత మందిని అడిగితే, ఆ ఉద్యొగాలు మనలాంటి వాళ్ళాకి రావు, అసలు వాటి గురించిన విషయాలు కుడా తెలియనివ్వరు, ఆ డిపర్ట్ మెంట్ లో పని చేసే వారికి సంబందించిన బందువులకో, స్నేహితులకో, ఇస్తారు తప్ప మనకు ఇవ్వరు అని చెప్పారు..
    అది ఎంత వరకు నిజమో నాకు తెలియదు కాని అలా చేస్తే ఉద్యొగం కొసం ఎదిరి చూసే నాలంటి వాళ్ళా పరిస్తితి ఎం కావాలి? ఒక్కసారి అలోచించండి.. మీకు వీలైతే ఏ ఉద్యోగం గురించి నొటిఫికెషన్ విడుదల అయినా ఈ బ్లాగ్ లో ఆ వివరాలు, ఆ job apply చేసే విదానం, ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ ఉండండి. ప్లీస్.....
    దన్యవాదాలు......
    ( ప్రవీణ్ కుమార్.జె )

    ReplyDelete
  7. డియర్ ప్రవీణ్ కుమార్,

    మీ అభిమానానికి కృతజ్ఞతలు. VRO పోస్టుల ప్రకటన ఇంకా రాలేదు. త్వరలో విడుదల కావొచ్చు.
    >> ఆ ఉద్యొగాలు మనలాంటి వాళ్ళాకి రావు, అసలు వాటి గురించిన విషయాలు కుడా తెలియనివ్వరు, ఆ డిపార్ట్ మెంట్ లో పనిచేసేవారికి సంబందించిన బంధువులకో, స్నేహితులకో, ఇస్తారు తప్ప మనకు ఇవ్వరు>>
    ఇలాంటి మాటలు మీకు ఎంత బాగా తెలిసినవారు చెప్పినా పట్టించుకోకండి. ప్రకటన పేపర్లలో, వెబ్ సైట్లలో ప్రకటించకుండా ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఏమాత్రం లేదు.

    నియామక ప్రకటనలు విడుదలైనపుడు ‘చదువు’లో ప్రముఖంగానే ఇస్తాం. ఈ బ్లాగులోనూ అప్ డేట్ చేస్తాం. ఈ రోజుల్లో సమాచారం తెలియకపోవటం అంటూ ఏమీ ఉండదు. నిరాశపడకండి!

    ReplyDelete
  8. మీరు చెప్పిన సమదానం తో నాకు నమ్మకం కలిగింది. ఈ బ్లాగ్ లో కూడా అప్ డేట్ చేస్తాం అన్నందుకు థ్యాంక్యు సో మచ్ సర్...

    ReplyDelete
  9. డియర్ ప్రవీణ్ కుమార్!
    వెరీ గుడ్!

    ReplyDelete
  10. thank you verymuch forgiving us this valuable Educationalsite

    ReplyDelete
  11. డియర్ Jsknadh,
    మీ అభినందనలకు కృతజ్ఞతలు.

    ReplyDelete
  12. thanks for ur reply! doubts ekkada post cheyali regularga doubts adagocha?
    thanks for ur quick support!
    meru daily answer chestara?

    ReplyDelete
  13. డియర్ Jsknadh,
    ఈ బ్లాగులో ఓ 14 విభాగాలున్నాయి కదా? ఏ విభాగానికి సంబంధించిన అభిప్రాయాన్నీ/ ప్రశ్ననూ అక్కడే పోస్టు చేస్తే బాగుంటుంది. కొత్త విభాగమైతేనంటారా? అలాంటపుడు ’స్వాగతం’ టపా దగ్గర రాయదల్చింది రాసెయ్యండి.:)

    రెగ్యులర్ గా మీ సందేహాలు/ అభిప్రాయాలు నిరభ్యంతరంగా తెలియజేయండి. మరేం ఫర్వాలేదు!

    ReplyDelete
  14. thank you sir! how to becoma an editor in newspaper.qualification,age,etc..?

    ReplyDelete
  15. డియర్ jsknadh,
    జర్నలిజంలో ప్రవేశానికి డిగ్రీ కనీసార్హత. శిక్షణ తర్వాత ట్రెయినీ సబ్ ఎడిటర్ /రిపోర్టర్ తో తొలి అడుగులు వేయాలి. ఈ బ్లాగులో మీడియా విభాగం క్లిక్ చేసి పూర్తివివరాలు చదవండి.

    ReplyDelete
  16. sir! how to becoma a bus conducter? what are the eligibilities and qualification ?pls inform

    ReplyDelete
  17. డియర్ Jsknadh,
    బస్ కండక్టర్ ఉద్యోగానికి టెన్త్ క్లాస్ పాసైతే సరిపోతుంది. వయసు 21-35
    సంవత్సరాల మధ్య ఉండాలి. ఉద్యోగ ప్రకటన కోసం రెగ్యులర్ గా దినపత్రికలు చూస్తుండాలి. ఆర్టీసీ వెబ్ సైట్ http://apsrtc.gov.in/ కూడా!

    ReplyDelete
  18. thank you sir!
    my another doubt is i applied for n.i.o.s (national institute of open schooling)
    i forget to select language and the certificate without any language is valuable or not jobs ki apply cheyocha? i apllied for sr.secondary

    ReplyDelete
  19. dear sir DIETCET rayadaniki interlo kachithanga telugu undala? DIETCET(ttc) future elavuntundi telupagalaru! danyavadamulu!

    ReplyDelete
  20. hellow sir this is ashok,
    please tell me how to apply paramedical cource...

    ReplyDelete
  21. sir photography courses gurunchi telupagalaru! thank u

    ReplyDelete
  22. chaduvu page lo m.suresan lessons eppati nunchi vastunai??

    nenu ee roju chaduvu page lo chuste collocations-15 ani undi...ante mundu 14(old) vachi untay kada..avi meeru post cheyagalara??

    ReplyDelete
  23. డియర్ సూర్య,
    మీ దరఖాస్తులో దొర్లిన లోపం గురించి ఓపెన్ స్కూలింగ్ అధికారులనే అడగాల్సివుంటుంది. వెబ్ సైట్ తెలుసు కదా? http://www.nos.org/

    ReplyDelete
  24. డియర్ అశోక్,
    పారా మెడికల్ లో డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులకు ఈ నెల 20వతేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు చూడండి... http://www.appmb.org/appmb/Notif_Admissions.aspx

    ReplyDelete
  25. డియర్ jsknadh,
    ఫొటోగ్రఫీ గురించి చదువు పేజీలో రాసినపుడు మీరు ఈ బ్లాగులో కూడా చదవొచ్చు.

    మీ మరో ప్రశ్న- డైట్ సెట్ గురించి. డైట్ సెట్ దరఖాస్తుల విక్రయం వచ్చే ఏడాది మార్చిలో మొదలవుతాయి. పరీక్ష ఏప్రిల్లో ఉంటుంది. ఈ ఏడాది పరీక్ష ఏప్రిల్ 24న జరిగింది.
    సంబంధిత మాధ్యమం (తెలుగు/ఉర్దూ/తమిళం)లో టెన్త్/ఇంటర్ చదివినవారు అర్హులు. లేదా..
    టెన్త్ /దీనికి సమానమైన పరీక్షలో ప్రథమ భాషగా తెలుగు/ఉర్దూ/తమిళం చదివినవారు అర్హులు. లేదా..
    ఇంటర్మీడియట్ లో పార్ట్-1 లో పై భాషల్లో ఒకటిగా చదివినవారు సంబంధిత మాధ్యమంలో మాత్రమే సీట్ల కోసం అర్హులు.
    ఉపాధ్యాయ శిక్షణ తీసుకున్నవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలు చాలా ఉంటాయి.

    ReplyDelete
  26. డియర్ చంద్ర,
    సురేశన్ గారి ఇంగ్లిష్ వ్యాసాలు చదువు పేజీ ప్రారంభించిననాటినుంచీ అంటే ఎనిమిదేళ్ళ నుంచీ వస్తున్నాయి. Collocations పాతవాటిని మీరు ఆర్కైవ్స్ లో చూడొచ్చు! పాతవాటిని ఈ బ్లాగులో పోస్టు చేసే ఉద్దేశం మాకు ప్రస్తుతానికి లేదు. కావాలంటే వాటిని మీరు ఏ లైబ్రరీలోనైనా తేలిగ్గానే సేకరించుకోవచ్చు.

    ReplyDelete
  27. ఆర్కైవ్స్ ante emiti??

    ReplyDelete
  28. డియర్ చంద్ర,
    పాత సంచికలుండే చోటు. ‘ఈనాడు నెట్ ఎడిషన్’లో పాత సంచికలు దాదాపు 100 రోజుల కిందటివి చూడొచ్చు. http://archives.eenadu.net/

    ReplyDelete
  29. cs avalante yemcheyali? career elavuntundi ? degree chesinatharuvatha kuda cheyocha?
    telupagalaru!

    ReplyDelete
  30. Sir,

    nenu eenadu pratyeka pagilaki articles rayalante em cheeyyali.

    daya chesi samadhanam ivvagalaru.

    Regards
    Shafi

    ReplyDelete
  31. డియర్ Jsknadh,
    కంపెనీ సెక్రటరీ కోర్సు మంచి కెరియర్ ఇస్తుంది. కష్టపడి చదవాలి. ఫౌండేషన్ కోర్సులో చేరాలంటే ఇంటర్ అర్హత అవసరం. 17 సంవత్సరాల వయసు నిండివుండాలి. డిగ్రీ తర్వాత కూడా కోర్సు చేయవచ్చు. పూర్తి వివరాలకు http://www.icsi.edu/ చూడండి.

    ReplyDelete
  32. డియర్ Shafi,
    ఈనాడు లో ఏ ప్రత్యేక పేజీకి ఏ అంశంపై మీరు రాయాలనుకుంటున్నారు? సాంకేతిక అంశాలపై పాఠకులు పాల్గొనే శీర్షిక ‘ఈ.నాడు’లో ఉంది. ఈతరం, హాయ్ బుజ్జీల్లో కొన్ని శీర్షికలకు రాసే అవకాశముంది. ఆ పేజీలు గమనిస్తే మీకే తెలుస్తుంది, ఏం రాయొచ్చనేది!

    ReplyDelete
  33. మీ సమాధానమునకు కృతఘ్నతలు.

    నేను ఈనాడు (గురువారం ప్రత్యేకం), ఈతరం (శనివారం ప్రత్యేకం)లకు శీర్షికలు రాయలనుకుంటున్నను.

    ఈరొజు పేపర్ చూసాను, కానీ శీర్షికలు పంపటానికి నాకు అందులొ ఎక్కడ కూడ మెయిలు ఐడి కానీ, అడ్రెస్ కానీ కనపడలెదు.

    ఈరెండే కాకుండ ఈనాడు ఆదివారం పుస్తకమునకు కుడా శీర్షికలు పంపటానికి మార్గమును సూచించగలరు.

    షఫి

    ReplyDelete
  34. acharyanagarjuna university dwara distancelo degree cheste value vuntunda? degree tharuvatha anni exams rayadaniki eligible? telupagalaru
    thanks for the previous replys!

    ReplyDelete
  35. డియర్ jsknadh,
    నాగార్జున విశ్వవిద్యాలయం గుర్తింపు పొందిందే కాబట్టి అక్కడ దూరవిద్య డిగ్రీ చేయవచ్చు. మిగిలిన డిగ్రీల్లాగే దీనిక్కూడా విలువుంటుంది. దూరవిద్య డిగ్రీని పరిగణనలోకి తీసుకోని నియామక సంస్థలు కొన్ని ఉంటాయి. అయితే సాధారణంగా దూరవిద్య డిగ్రీ ఉన్నతవిద్య, ఉద్యోగాలకు బాగానే ఉపయోగపడుతుంది.

    ReplyDelete
  36. డియర్ షఫీ,
    ‘కృతజ్ఞతలు’ చెప్పాలనే మీ భావం అర్థమైంది. సరే, మీరు రాయదల్చిన ప్రత్యేక పేజీలను/ మ్యాగజీన్ ను కనీసం 5, 6 సంచికలైనా పరిశీలించండి. మెయిల్ ఐడీలు ఆ పేజీల్లోనే ఉంటాయి. ఆదివారం మ్యాగజీన్ పుస్తకం సంగతి కూడా అంతే. http://www.eenadu.net/ లో వివిధ విభాగాలను శ్రద్ధగా గమనించండి!

    ReplyDelete
  37. dear sir thank u for the reply!
    s.s.c(Staff selection commission)
    material online lo yekadina dorukuthunda
    meru prathiba logani leda chaduvu bloglogani prachurinche avakasam vunda telupagalaru!
    danyavadamulu!

    ReplyDelete
  38. N.I.O.S(National Institute Of Open Schooling)
    tho inter complete chesthe 10+2+3 jobs ki eligibility vuntunda?
    ade vidamga A.P.S.O.S(Andhrapradesh State Open School) tho kuda inter complete chesthe 10+2+3 ki eligibility vuntunda?
    Telupagalaru!
    Danyavadamulu!

    ReplyDelete
  39. డియర్ jsknadh,

    ఓపెన్ స్కూలింగ్ లో చదివే టెన్త్ కూ, ఇంటర్ కూ గుర్తింపు ఉంది. కాబట్టి ఆ అర్హతలతో టెన్త్ లో 60 శాతం/ ఇంటర్లో 50 శాతం తెచ్చుకుంటే ఐబీపీఎస్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్, ఇంటర్ చదవకుండా నేరుగా డిగ్రీ దూరవిద్యలో చదివినవారు ఈ పరీక్షలు రాయటానికి వీల్లేదని గమనించండి.

    మీ మరో ప్రశ్న- స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మెటీరియల్. కొత్తగా ప్రారంభమైన ఈనాడు ఎడ్యుకేషన్ పోర్టల్ http://www.eenadupratibha.net లో ఈ మెటీరియల్ ని ఇచ్చే అవకాశముంది!

    ReplyDelete
  40. thank u sir!(My friend's doubt) after b.com(general) my aim is to become a teacher what is the best whether going to B.ED or DIETCET.
    which has choices of getting govt.job!
    telupagaru!
    Danyavadamulu!

    ReplyDelete
  41. డియర్ jsknadh,
    డైట్ సెట్ రాయాలంటే (డి.ఇడి) డిగ్రీ చదివిందాకా ఆగనక్కర్లేదు. ఇంటర్ అర్హత తోనే రాయొచ్చు. ఇక డిగ్రీ పూర్తయ్యాక ఎడ్ సెట్ రాసి, బి.ఇడిలో చేరొచ్చు. బోధనలో ఆసక్తి (ప్రాథమిక తరగతులు/ ఉన్నత తరగతులు)ని బట్టి ఏ కోర్సు అనేది ఎంచుకోవాలి. ప్రభుత్వోద్యోగం చేసే అర్హత ఈ రెండు కోర్సుల్లో దేనికైనా ఉంటుంది.

    ReplyDelete
  42. thanku sir! meru chepina eenaduprathiba.net chusanu chala usefulga undi thanks for the advise!
    D.ED ki ye books referchesthe baguntundi?

    ReplyDelete
  43. డియర్ jsknadh,
    మీ వ్యాఖ్యలో url తేడా ఉంది. ఇదీ సరైంది-http://www.eenadupratibha.net.
    డి.ఇడి కొత్త నోటిఫికేషన్ మార్చిలో వస్తుంది. పూర్తి వివరాలు అప్పుడు మీరు చదవొచ్చు!

    ReplyDelete
  44. sorry sir wrongly spelt! thanks for the info
    nenu inter a.p.o.s.s inter rasthunanu danigurunchi konchum tellupagalaru a.p.o.s.s inter dwara DIETCET eligible avuna kada?
    A.P.O.S.S INTER exams yepudu?

    ReplyDelete
  45. B.SC elcetronics gurinchi telupagalaru!

    ReplyDelete
  46. Eenadu pratibha lo vunna personality development srticles chusanu simply superb and inspiring dayachesi avi mana chaduvu bloglo kuda pettalani asisthunanu itlu thama priya patakudu jsknadh!

    ReplyDelete
  47. డియర్ Jsknadh,
    ఇంటర్మీడియట్ కానీ, దానికి సమానమైన కోర్సు గానీ పాసైనవారు డైట్ సెట్ రాయవచ్చు. 45 శాతం మార్కులుండాలి. SC, ST and Physically Challenged candidates కు 40 శాతం మార్కులుంటే చాలు. అయితే ఇంటర్ ఒకేషనల్ కోర్సు చదివినవారికి అర్హత లేదు.
    డైట్ సెట్ 2010 నోటిఫికేషన్ లింకు ఇక్కడ చూడండి-
    http://www.manabadi.co.in/institute/DisplayDocsSource.aspx?DocType=NOTIFICATION&DocSourceId=7

    మీ కోర్సు గురించిన అదనపు వివరాలూ, పరీక్షల తేదీల గురించి మీ సంబంధిత విభాగాన్ని అడిగితే సరిపోతుంది కదా!

    ReplyDelete
  48. డియర్ jsknadh,
    బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ కోర్సు గురించి రాయటానికి అడ్మిషన్ల సమయం సరైన సందర్భం.

    http://www.eenadupratibha.netలో వ్యక్తిత్వవికాస కథనాలు మీకు నచ్చినందుకు సంతోషం. అవి అక్కడ చదవటానికి అందుబాటులోనే ఉన్నాయి కదా... వాటినే మళ్ళీ ఈ బ్లాగులో పెట్టటం అనవసరం కదా!

    ReplyDelete
  49. Dear Chaduvu,
    nenu open inter chaduvu thunnanu (A.P.O.S.S) inudlo telugu,hindi languages ga thisukunnanu english tesukoledu DIETCET rayalante inter lo english vundala?
    telupagalaru!

    ReplyDelete
  50. డియర్ jsknadh,
    మీరు డైట్ సెట్ 2010 ప్రకటన (ఇదే పోస్టులో లింకు ఇచ్చాం.) చూశారా? దానిలో ఇంగ్లిష్ సబ్జెక్టు కంపల్సరీగా ఉండాలనే నిబంధన లేదు. APOSS ఇంటర్మీడియట్ సర్టిఫికెట్- ఫార్మల్ ఇంటర్మీడియట్ తో సమానం కాబట్టి డైట్ సెట్ రాయటానికి అవరోధం ఎదురయ్యే అవకాశం లేదు!

    ReplyDelete
  51. Thanks for previous reply sir!

    B.SC ANIMATION course andinche institutes mana rastramlo ekadavunnayo mariyu fee structure elavuntundo telupagalaru!

    ReplyDelete
  52. డియర్ jsknadh,
    యానిమేషన్ లో డిగ్రీ కోర్సులను ప్రముఖ శిక్షణ సంస్థలన్నీ అందిస్తున్నాయి. ఉదాహరణకు ఎరీనా మల్టీమీడియా అందించే బీఎస్సీ కోర్సు. వివరాలకు చూడండి-

    http://www.bestmultimedia.com/bsc-animation-degree.html

    జేఎన్ టీయూ హైదరాబాద్ తో కలిసి IACG నాలుగేళ్ళ బ్యాచిలర్ కోర్సును అందిస్తోంది. వివరాలు ఇక్కడ- http://www.iacg.info/application.html

    ReplyDelete
  53. thanks for all the information u gave me! yenni question adigina vopikaga answer chepinanduku hatsoff to Eenadu ! haety thanks to our team

    ReplyDelete
  54. sir prathi adivaram morning 10.30 a.m ki lakshya prasaramauthoindi kada memu current leku , some problems valla missipothunnamu kabbati velithe aa episodes ni mana bloglo vunchithe baguntundi!
    thanku sir!

    ReplyDelete
  55. sir na friend horticulture lo polytecnic 2 yrs complete chesadu N.G.RANGA agricultural university conduct chese B.SC Agriculture entrance ki eligibility vuntunda?

    ReplyDelete
  56. డియర్ Jsknadh,
    ఈటీవీలో వచ్చే ‘లక్ష్యం’ ప్రోగ్రాం మీకు ఉపయోగపడుతోందా? ఆ ఎపిసోడ్స్ ఈటీవీ exclusive కాబట్టి వాటిని ఈ బ్లాగులో అందుబాటులో ఉంచటానికి అవకాశాలు తక్కువే!

    ReplyDelete
  57. yes,sir it's very useful! and pratiroju meru etv-2 lo 3.30 P.M ki prasaramayye "ѕυкнιвнανα"
    me,my family and people in my colony watch it daily! superb suggestions by the doctors and helping us so much thanks you ! i want to send a doubt to "ѕυкнιвнανα" pls give me the email address.

    ReplyDelete
  58. sprca railway notification padindi kada mpc secondyear chaduvuthunnavaru kuda applycheyocha?

    ReplyDelete
  59. Dear chaduvu!,

    shithya visharada from prayaga (i don't know actual name of the university)but it's from prayaga! is it equal to Praveena hindi prachar sabha madras and is it eligible to write tet?

    pls reply it;s urgent!

    ReplyDelete
  60. sir inter apsos(Andhrapradesh state open school)
    ఎగ్జామ్స్ ఎపుడువుంటై ? dietcet రాయాలంటే dietcet ఎగ్జాం అయ్యేలోపు ఇంటర్ అయిపోవాల ? T.T.c అప్లికేషను లో ఇంటర్ హాల్ టికెట్ నంబరు ఇవ్వాళా ? తెలుపగలరు
    ధన్యవాదములు!

    ఇట్లు

    సూర్య కేదార్ నాద్ జ్యోస్యుల

    ReplyDelete