దరఖాస్తులను www.apstatepolice.orgనుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. పూర్తిచేసిన దరఖాస్తులను నవంబరు 14 నుంచి డిసెంబరు 28 వరకూ అభ్యర్థుల సంబంధిత జిల్లా పోలీసు కార్యాలయాల్లో ఇవ్వవచ్చు. దరఖాస్తుతో పాటు అభ్యర్థులు రూ.25 ఫీజు చెల్లించాలి.
విద్యార్హతలు: జనరల్, బీసీ అభ్యర్థులు ఇంటర్‌మీడియట్ ఉత్తీర్ణత లేదా తత్సమానం. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎస్.ఎస్.సి. పాసయి ఇంటర్‌మీడియట్ 2 సంవత్సరాలూ అన్ని పరీక్షలు హాజరయి ఉండాలి. ఫెయిలయినా అర్హులే అవుతారు.
వయసు: జనరల్ అభ్యర్థులు జులై 1, 2011 నాటికి 18 సంవత్సరాలు నిండి, 22 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గరిష్ఠ వయః పరిమితిలో ఐదేళ్ల సడలింపు ఉంది.
ఫైర్‌మెన్ పోస్టులకు వయసులో సడలింపు: జనరల్ అభ్యర్థులకు జులై 1, 2011 నాటికి 18 నుంచి 30 సంవత్సరాలు. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 18 నుంచి 35 సంవత్సరాల వరకు వయః పరిమితి ఉంటుంది.
ఎత్తు (పురుష అభ్యర్థులు): అన్ని కేటగిరీల అభ్యర్థులు 167.6 సెంటీమీటర్ల ఎత్తుండాలి. ఎస్టీ ఏజెన్సీ ఏరియా అభ్యర్థులకు 160 సెంటీమీటర్లు సరిపోతుంది.
ఛాతీ చుట్టుకొలత: అన్ని కేటగిరీల అభ్యర్థులకు 81.3 సెం.మీ., గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ. విస్తీర్ణం రావాలి. ఎస్టీ ఏజెన్సీ ఏరియా అభ్యర్థులకు 80 సెం.మీ. గాలి పీల్చినప్పుడు 3 సెం.మీ. విస్తీర్ణంతో రావాలి.
మహిళా అభ్యర్థులకు తగ్గిన ఎత్తు
ఈసారి మహిళలకు అధిక సంఖ్యలో ఉన్న పోస్టులను దృష్టిలో ఉంచుకొని గత నియామకాల కంటే ఎత్తును తగ్గించారు. గతంలో ఉన్న 157.5 సెం.మీ.ను 5 సెం.మీ. తగ్గించి 152.5 సెం.మీ. చేశారు.
అన్ని కేటగిరీల మహిళలకు 152.5 సెం.మీ. ఉండాలి. ఎస్టీ ఏజెన్సీ ఏరియా మహిళలకు 150 సెం.మీ.గా నిర్ణయించారు.
శారీరక సామర్ధ్య పరీక్షలు (పురుషులకు):
ముందుగా అభ్యర్థులకు ప్రాథమిక పరీక్ష అయిన 5 కిలోమీటర్ల పరుగు ఉంటుంది. దీన్ని 25 నిమిషాల్లో పూర్తి చేయాలి. పూర్తిచేసిన అభ్యర్థులకు ఫిజికల్ ఇవెంట్స్‌కు అనుమతి ఉంటుంది. ఈ ఫిజికల్ ఇవెంట్స్‌లో...
* 100 మీ. పరుగు - 15 సెకన్లలో పూర్తి చెయ్యాలి.
* లాంగ్ జంప్ - 3.80 మీటర్లు దూకాలి.
* షాట్‌పుట్ (7.26 కి.గ్రా.) - 5.60 మీటర్లు విసరాలి.
* హైజంప్ - 1.20 మీటర్లు దూకాలి.
* 800 మీటర్ల పరుగు - 170 సెకన్లలో పూర్తి చేయాలి.
శారీరక సామర్ధ్య పరీక్షలు (మహిళలకు):
ప్రాథమిక పరీక్ష 2.5 కిలోమీటర్ల పరుగు పందెం ఉంటుంది. ఈ పరుగును 16 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఈ పరుగులో అర్హత పొందిన మహిళా అభ్యర్థులు ఈ మూడు ఇవెంట్లలో అర్హత పొందాలి.
* 100 మీ. పరుగును 18 సెకన్లలో పూర్తి చెయ్యాలి.
* లాంగ్‌జంప్ 2.75 మీటర్లు దూకాలి.
* షాట్‌పుట్ (4 కిలోలు) 4.50 మీటర్లు విసరాలి.
అరిథ్‌మెటిక్:
ఇందులో ప్రాథమిక తరగతుల్లోని గణిత విభాగాలైన సంఖ్యలు, భాగహారాలు, భిన్నాలు, కసాగు, గసాభా, శాతాలు, లాభనష్టాలు, వ్యాపార గణితం, కాలం- దూరం, రైళ్లు, బారువడ్డీ, చక్రవడ్డీ, క్యాలండర్, మెన్సురేషన్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి అంశానికీ సంబంధించిన నిర్వచన సూత్రాలు చదివి వాటి అనువర్తనాలను తెలుసుకోవాలి. వీటికి సంబంధించిన మాదిరి ప్రశ్నలను ఎక్కువగా సాధన చేయాలి.
మెంటల్ ఎబిలిటీ:
ఈ ప్రశ్నల ద్వారా అభ్యర్థి మానసిక సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. పదాల మధ్య సంబంధాన్ని కనుక్కోవడం, దాన్ని విశ్లేషించడం, దిశలు, రక్త సంబంధాలు, వెన్ చిత్రాలు, బొమ్మల పోలిక, నంబర్ సిరీస్, ర్యాంకింగ్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. గత నియామకాల్లోని (పి.ఆర్.బి., ఆర్.ఆర్.బి., బ్యాంకింగ్) ముఖ్య ప్రశ్నలను సేకరించి వీలయినన్ని ఎక్కువసార్లు వాటిని సాధన చేయాలి. తరవాత ఈ అంశాలపై స్పష్టత ఏర్పడుతుంది.
* అరిథ్‌మెటిక్ అండ్ రీజనింగ్ విభాగాల్లో అడిగే ప్రశ్నల్లో విద్యార్థి ఆలోచనా విధానం, తార్కిక లక్షణాలు పరీక్షిస్తారు. మౌలిక అంశాలపై పట్టు ఉంటేనే సరైన సమాధానాలు రాయగలరు.
* మౌలిక అంశాలను పునశ్చరణ చేసుకుంటూ ముఖ్యమైన గణిత ఫార్ములాలు, వాటి మూలాధారాలు, ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించరాదో తెలుసుకోవాలి.
* రీజనింగ్‌కు సంబంధించిన ప్రాక్టికల్ అప్లికేషన్స్‌పై, న్యూమరికల్ అంశాలైన గుణకారం, భాగహారం, కసాగు, సూక్ష్మీకరణం లాంటివాటిపై పట్టు సాధించాలి.
* ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాక సెక్షన్ల వారీగా టెస్టులను సాధన చేయాలి. మొదట్లో తక్కువ మార్కులు వచ్చినా నిరుత్సాహ పడకుండా ఎలాంటి ప్రశ్నలు ఎక్కువ సమయం తీసుకుంటున్నాయో గమనించి వాటిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.
* రీజనింగ్, అరిథ్‌మెటిక్ ప్రశ్నలు సాధన చేసేప్పుడు తలెత్తే సమస్యలను బృంద చర్చల ద్వారా నివృత్తి చేసుకోవాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
* ఫిజికల్ ఇవెంట్స్ పూర్తయ్యేవరకు రాత పరీక్ష నిర్లక్ష్యం చేయటం ఏమాత్రం సరికాదు. రాత పరీక్ష కోసం రోజూ కనీసం ఆరు గంటల సమయం కేటాయించాలి.
* ఫిజికల్ ఇవెంట్స్ పూర్తయ్యాక రోజూ 8 గంటలు తగ్గకుండా చదవాలి. గతంలో చదివిన అంశాలను పునశ్చరణ చేసుకోవాలి.
* రాతపరీక్ష కోసం రోజువారీ టైమ్‌టేబుల్ ఏర్పర్చుకోవాలి. అంశాల వారీగా సమయం కేటాయించుకొని చదవాలి.
* జనరల్ స్టడీస్‌లో వీలయినన్ని ఆబ్జెక్టివ్ ప్రశ్నలు సాధన చేయాలి. టాపిక్‌లను అంశాల వారీగా విభజించి సొంత నోట్సు తయారుచేసుకోవాలి.
ఎంపిక విధానం
దరఖాస్తు చివరి తేదీ నాటి నుంచి అంటే డిసెంబరు 28 తర్వాత పురుషులకు 5 కి.మీ. పరుగు, మహిళలకు 2.5 కి.మీ. పరుగు కోసం 20-25 రోజుల సమయం ఇస్తారు. పరుగు పూర్తయ్యాక 7-10 రోజుల వ్యవధిలో ఫిజికల్ ఇవెంట్స్ ఉంటాయి. ఇవి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పూర్తయిన తర్వాత 45-50 రోజుల్లో రాతపరీక్ష ఉంటుంది.
* పురుషులకైనా, మహిళలకైనా ప్రాథమిక పరీక్షల అయిన పరుగు (5 కి.మీ./ 2.5 కి.మీ. ) పూర్తయిన తర్వాత శారీరక కొలతలు తీసుకుంటారు. ఆ తర్వాత ఫిజికల్ ఇవెంట్స్‌కు అనుమతి ఉంటుంది.
* సివిల్ కానిస్టేబుల్, ఫైర్ కానిస్టేబుల్, మహిళా కేటగిరిలలో (ఏఆర్) పోస్టులకు కేవలం రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఉద్యోగ నిర్ణయం ఉంటుంది. - మాల్యాద్రి
Is a candidate with eye-site eligible for SI posts?
ReplyDelete