ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Thursday 17 November 2011

ఐఐటీల్లో చదవడానికి స్కాలర్‌షిప్‌లు

 
కార్పొరేట్‌ సంస్థలు, పేరున్న ఉన్నత విద్యాసంస్థలు సంయుక్తంగా నిర్వహించే కోర్సుల ద్వారా విద్యార్థులకు చాలా ప్రయోజనం ఉంటుంది. కంపెనీలకు అవసరమైన సామర్థ్యాలను అందించడంలో ఇలాంటి కోర్సులు ముందువరుసలో ఉంటాయి.

ప్రముఖ కార్పొరేట్‌ సంస్థ లార్సెన్‌ అండ్‌ టొబ్రొ (ఎల్‌ అండ్‌ టి) ఐఐటీల సహకారంతో ఎం.టెక్‌. కోర్సులను అందిస్తోంది. 'ఎల్‌ అండ్‌ టి బిల్డ్‌ ఇండియా స్కాలర్‌షిప్‌' పేరుతో విద్యార్థులకు మంచి శిక్షణ, తర్వాత ఉద్యోగ అవకాశం కల్పిస్తోంది.

ఇంజినీరింగ్‌ చదువుతోన్న విద్యార్థులకు ఎల్‌ అండ్‌ టి స్కాలర్‌షిప్‌లు అద్భుతమైన అవకాశం.

సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌ ద్వారా ఢిల్లీ, చెన్నైల్లోని ఐఐటీల్లో ఎం.టెక్‌. (కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌) కోర్సు చేయవచ్చు. ఇది రెండేళ్ల కోర్సు. ఏటా 40 మందిని ఎంపిక చేస్తారు.

కోర్సు జులై 2012 నుంచి ప్రారంభం కానుంది.

కోర్సు కాలం మొత్తం (రెండేళ్లు) నెలకు రూ.9000 చొప్పున స్కాలర్‌షిప్‌ లభిస్తుంది. 2012లో బీఈ లేదా బీటెక్‌ (సివిల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌) పూర్తిచేయనున్న అభ్యర్థులు మాత్రమే అర్హులు. కనీసం 65 శాతం మార్కులుండాలి. వయసు 23 ఏళ్లకు మించకూడదు.

రాత పరీక్షలు, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సంబంధిత ఐఐటీ, ఎల్‌ అండ్‌ టి సంయుక్తంగా వీటిని నిర్వహిస్తాయి. ఎల్‌ అండ్‌ టి సహకారంతో ఐఐటీలు ఈ కోర్సును రూపొందించాయి. ఎంపికైన అభ్యర్థులు కనీసం ఐదేళ్లు కంపెనీలో పనిచేయాలి.

ఈ స్కాలర్‌షిప్‌లకు అభ్యర్థుల కోసం ఎల్‌ అండ్‌ టి దాదాపు 100 ఇంజినీరింగ్‌ కాలేజీలకు సమాచారం పంపిస్తుంది. ఈ జాబితాలోలేని కాలేజీలకు చెందిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎల్‌ అండ్‌ టి వెబ్ సైట్  ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. చివరితేదీ 25 నవంబరు 2011

No comments:

Post a Comment