సామాజిక స్పృహ, అంకితభావం ఉండి దేశానికి ఉపయోగపడాలని అభిలషించే నవ యువత మొదటి మొగ్గు సివిల్స్‌కే! ఆశావహ దృక్పథం, సరైన ప్రణాళిక, సహనం, సుదీర్ఘకాలం కష్టపడే స్వభావం ఉంటేనే దేశంలోని అత్యుత్తమమైన సివిల్ సర్వీసుల్లో ప్రవేశించగలుగుతారు. పరీక్షా పద్ధతి మారిందని నిరాశపడకుండా దానికి తగ్గట్టుగా తమను మల్చుకోగలిగితే తెలుగు మీడియం విద్యార్థులకూ సివిల్స్ శిఖరారోహణ సుసాధ్యమే అంటున్నారు బ్రెయిన్ ట్రీ గోపాలకృష్ణ !
సివిల్ సర్వీసుల ప్రకటన వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రానుంది. ఈలోపు పకడ్బందీగా పూర్వరంగం సిద్ధం చేసుకుంటే సులభంగా కార్యాచరణలోకి అడుగుపెట్టవచ్చు. గత ఏడాదే ప్రవేశపెట్టిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష మార్పుల గురించి తెలుసుకుంటే స్పష్టత ఏర్పడుతుంది.
గతంలో ప్రిలిమినరీ ఐచ్ఛిక (ఆప్షనల్) పేపర్ 300 మార్కులకూ, జనరల్ స్టడీస్ పేపర్ 150 మార్కులకూ ఉండేవి. ఆప్షనల్‌లో 120 ప్రశ్నలు. ప్రతి సరైన జవాబుకూ రెండున్నర మార్కులు. జనరల్‌స్టడీస్‌లో సరైన జవాబుకు మార్కు చొప్పున 150 ప్రశ్నలు. తప్పు జవాబులకు 0.33 మార్కుల తగ్గింపు (మైనస్) ఉండేది. ఈ విధానంలో డిగ్రీలో చదివిన సబ్జెక్టును ఆప్షనల్‌గా తీసుకునే వీలుండటం వల్ల తెలుగు మీడియం విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేది. ఇంగ్లిష్‌లో ప్రశ్నలున్నప్పటికీ తెలిసివున్న సబ్జెక్టు కాబట్టి తేలిగ్గా రాయగలిగేవారు. ప్రతికూలతల్లో ప్రధానమైనది ఏమిటంటే... ఆప్షనల్స్ కటాఫ్ మార్కుల్లో రకరకాల తేడాలుండటం, కొన్ని మాత్రమే ఎక్కువ స్కోరింగ్‌గా ఉండి అభ్యర్థులందరికీ సమన్యాయం లభించకపోవటం. దీంతో సివిల్స్‌లో ఉమ్మడి (కామన్) పేపర్లు అవసరమనే వాదనకు మద్దతు ఏర్పడింది. ఫలితంగా 2011లో మార్పులు అమలయ్యాయి.
రెండు కామన్ పేపర్లు
సివిల్స్ అభ్యర్థులందరూ ఇప్పుడు రెండు కామన్ పేపర్లు రాయాలి.
1) జనరల్ స్టడీస్ పేపర్-1:
వర్తమాన వ్యవహారాలు, జనరల్ నాలెడ్జ్, భారతదేశ చరిత్ర, భారత రాజకీయ వ్యవస్థ- పాలన, జనరల్ సైన్స్, సాంఘిక ఆర్థికాభివృద్ధి, భారత, ప్రపంచ భౌగోళిక పరిస్థితులు.
2) జనరల్ స్టడీస్ పేపర్-2:
కాంప్రహెన్షన్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్- కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్- అనలిటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్- ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ (పదో తరగతి స్థాయి), డేటా ఇంటర్‌ప్రెటేషన్ (పదో తరగతి స్థాయి), ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ స్కిల్స్ (పదో తరగతి స్థాయి)
యూపీఎస్‌సీ నుంచి ప్రశ్నల సంఖ్య గురించి కానీ, ప్రశ్నల శైలి గురించి కానీ ఎలాంటి సమాచారం రాలేదు. కొన్ని నమూనా ప్రశ్నలు మాత్రం ఇచ్చి ఊరుకున్నారు. దీంతో ఏ తరహా ప్రశ్నలు వస్తాయో ఎవరికీ అర్థం కాలేదు. అనిశ్చిత స్థితిలోనే అభ్యర్థులు పరీక్ష రాయాల్సివచ్చింది.
నిరాశాపూరితం
ఈ ఏడాది జూన్ నెల్లో ప్రిలిమినరీ పరీక్ష కొత్త విధానం అభ్యర్థులకు తొలిసారి అవగతమయింది. నూతన పద్ధతి నిరాశాపూరితంగా ఉందనటం అనుచితమైన వ్యాఖ్య ఏమీ కాదు. ప్రశ్నపత్రం సృజనాత్మకంగా లేదు; క్లిష్టంగానూ లేదు. ప్రచారం జోరుగా సాగిన సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్‌పై ప్రశ్నలేమీ లేవు.
పేపర్-1 యథాప్రకారం కఠినంగా ఉంది. సూక్ష్మాంశాలతో కూడి ఉండటం వల్ల 50 శాతం కంటే మించి ఏ అభ్యర్థీ కచ్చితంగా జవాబులు గుర్తించలేకపోయారు. ఇలాంటి స్థితిలో పేపర్-2లో 75 శాతం తెచ్చుకున్నవారే పాసయ్యారు. ఉత్తీర్ణతకు అవసరమైన సాధారణ స్కోరు 200/ 400.
ఇంగ్లిష్‌లో మంచి ప్రావీణ్యమున్న పట్టణ విద్యార్థులకే ప్రశ్నపత్రం అనుకూలించినట్టుగా ఫలితాల తీరు తెలిపింది. నిజానికి గత పరీక్షా విధానంలో పరీక్షకు హాజరైవున్న చాలామంది నెగ్గలేకపోగా; అంతగా సిద్ధం కాకుండానే పరీక్ష రాసిన ఎక్కువమంది ఉత్తీర్ణులయ్యారు. ప్రాంతీయ భాషల మీడియంలో డిగ్రీ చదివినవారు విజయానికి దూరం కాగా, పట్టణ విద్యార్థులే ఎక్కువమంది విజేతలుగా నిలిచారు.
తెలుగు మీడియం విద్యార్థులు ఏం గమనించాలి?
* ఇంగ్లిష్ అంత సరిగా రాకుంటే ఈ భాష నేర్చుకోవటానికి కృషి చేయాల్సిందే. ఇంగ్లిష్ ప్రాథమికాంశాలను నేర్చుకోవడానికి సిగ్గుపడాల్సిన పని లేదు.
* పాఠశాల పుస్తకాల్లోని ప్రాథమిక వ్యాకరణం చదివి భాషను మెరుగుపర్చుకోవచ్చు. వాక్యనిర్మాణం అర్థం చేసుకోవటం, వాక్యాల భావాన్ని సరిగా బోధపరుచుకోవటం అవసరం.
* ఇంగ్లిష్‌లో ప్రాచుర్యం పొంది, తెలుగులోకి కూడా అనువాదం పొందిన పుస్తకం మీకు ఉపయోగపడుతుంది. మొదట ఆంగ్ల భాగం చదివి, దాన్ని తెలుగులోకి మార్చాలి. సరిగా వచ్చిందో లేదో తెలుగు అనువాదంతో పోల్చి చూడాలి. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ ప్రక్రియను ఆసక్తిగా సంతోషంతో చేయాలి గానీ 'తప్పదు కదా' అనే ఉద్దేశంతో కాదు.
* పాత బ్యాంకింగ్ పరీక్షల నుంచి కాంప్రహెన్షన్ పాసేజ్‌లను తీసుకుని, జవాబులు రాయటం సాధన చేయాలి.
* మెంటల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్ విభాగాల నుంచి ఎక్కువ స్కోర్ చేయటానికి ప్రయత్నించండి. వీటికి ఇంగ్లిష్‌తో సంబంధం లేదు.
* వీలైనంత త్వరగా ప్రిపరేషన్ మొదలుపెడితే ఇంగ్లిష్ నైపుణ్యాలు పెంచుకోవటానికి వ్యవధి చిక్కుతుంది.
* పేపర్-1లో మార్కులను గరిష్ఠంగా పెంచుకోవటానికి ప్రయత్నించాలి. పేపర్-2 అంశాలు మీకెటూ ఇబ్బంది కావు.
* సాధన చేసేటపుడు పొరపాట్లపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే... చేసే ప్రతి పొరపాటూ మార్కులను కోల్పోయేలా చేస్తుందని మరవకూడదు.

No comments:
Post a Comment