ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Sunday, 13 November 2011

ఇంగ్లిష్ collocations లో Make + mark!

Make తోcollocate అయ్యే వ్యక్తీకరణల గురించి మీరు విన్నారా?

అలాంటి కొన్నిexpressionsను తెలుసుకుందాం!  దీన్ని రాసినవారు ఎం. సురేశన్.

ఈ సంభాషణ గమనించండి...

Malhar: Jayaram's become too busy nowadays. I haven't met him for two months now. (జయరాం ఈమధ్య మరీ తీరిక లేకుండా ఉన్నాడు. రెండు నెలలుగా అతన్ని కలుసుకోలేదు.)
Naresh: Yea, his practice keeps him so. Not even two years into the profession, he has a thriving practice. (అవును. అతని practice అలా ఉంచుతోందతన్ని. వృత్తిలో చేరి సరిగ్గా రెండేళ్లయినా కాలేదు, అతని practiceమంచి ఊపులో ఉంది.)

Malhar: At this rate, he is sure to be rolling in riches very soon. (ఈ వూపులో కొనసాగితే, త్వరలోనే సంపదలో మునిగి తేలుతుంటాడు.)
Naresh: That is beyond doubt. Soon after he got his degree, his father wanted him to do a job. He even landed a job. But in the last minute he changed his mind. He opted for practice. (అందుకు సందేహం లేదు. అతను డిగ్రీ తెచ్చుకున్నవెంటనే, వాళ్ళ నాన్న ఏదయినా ఉద్యోగం చేయమన్నాడు. అతనికి ఉద్యోగం కూడా వచ్చింది. కానీ చివరి నిమిషంలో మనసు మార్చుకుని, practice ఎంచుకున్నాడు.)

Malhar: He has made a mark in his profession, true, but I still feel it would have been better for him if he had been holding a job. (అతను వృత్తిలో మంచి స్థానాన్నే సంపాదించుకున్నాడు. నిజమే. కానీ ఉద్యోగం చేస్తుంటేనే అతనికి మేలుగా ఉండేదన్పిస్తుంది నాకు.)
Naresh: But he wouldn't have been making this kind of money, you know. (అప్పుడతను ఇంత డబ్బు సంపాదిస్తూండేవాడు కాదు కదా?)

Malhar: Does money matter, when you can't enjoy yourself with what you earn? What he threw up was a good managerial position, wasn't it? (సంపాదిస్తున్న డబ్బు అనుభవించలేనప్పుడు ఆ డబ్బు ముఖ్యమా? అతను వదులుకున్నది యాజమాన్యపు హోదా కదా?)
Naresh: Even a job brings with its own troubles. Look at my manager. He does earn a lot, but he has his troubles too. The workers staged a strike the other day. That gave him a sleepless night. Earlier, they had been on strike for a week. He was a worried man then too. (ఉద్యోగం విషయంలో కూడా దానికుండే బాధలు దానికుంటాయి కదా? మా మేనేజర్‌ చూడు. బాగానే సంపాదిస్తాడు. కానీ ఆయన బాధలు ఆయనకున్నాయి. మొన్నొకరోజు మా కార్మికులు సమ్మె చేశారు. ఆ రాత్రి ఆయనకు నిద్ర లేదు. అంతకుముందు వారం సమ్మెలో ఉన్నారు. అప్పుడూ ఆందోళనలో ఉన్నాడాయన.

Malhar: Didn't you tell me about his deft handling of such situations? (అప్పుడా పరిస్థితిని నైపుణ్యంతో చక్కదిద్దాడన్నావు కదా?)
Naresh: I did, of course, But a problem is problem always, isn't it? But no problem is better than having a problem, and being able to solve it. (అన్నాను నిజమే. కానీ సమస్యంటే సమస్యే కదా? అయినా సమస్య ఉత్పన్నమయి దాన్ని తీర్చుకునేకంటే సమస్య లేకుండా ఉండటమే మెరుగు కదా?).


No comments:

Post a Comment