ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Thursday, 10 November 2011

ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్లో యూజీ, పీజీస్టాటిస్టిక్స్‌, మేథమేటిక్స్‌, సంబంధిత కోర్సులకు ప్రసిద్ధి చెందిన సంస్థ... ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్ స్టిట్యూట్‌ (ఐఎస్‌ఐ). 

ప్రఖ్యాత ఆర్థికవేత్త పి.సి. మహాలనోబిస్‌ కోల్‌కతాలో దీన్ని స్థాపించారు. ఆపరేషన్స్‌ రిసెర్చ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సును కూడా ఈ సంస్థ నిర్వహిస్తోంది.

2012-13 విద్యా సంవత్సరానికి వివిధ అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌, ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి ఐఎస్‌ఐ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ప్రవేశం పొందిన అభ్యర్థులు అందరికీ ఐఎస్‌ఐ స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం విశేషం.

ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్ స్టిట్యూట్‌ ప్రధానంగా స్టాటిస్టిక్స్‌, మేథమేటిక్స్‌ కోర్సులపై దృష్టి కేంద్రీకరిస్తున్నప్పటికీ, సైన్స్‌, కంప్యూటర్స్‌, టెక్నాలజీ సబ్జెక్టుల్లో కూడా నాణ్యమైన ప్రోగ్రామ్‌లను అందిస్తోంది.

బయోలాజికల్‌ సైన్సెస్‌, ఆంత్రోపాలజీ, ఫిజిక్స్‌, సోషియాలజీ, జియాలజీ, సైకాలజీ, తదితర సబ్జెక్టుల్లో పరిశోధన కోర్సులను నిర్వహిస్తోంది. ఐఎస్‌ఐకి ఢిల్లీ, బెంగళూరులో అధ్యయన కేంద్రాలున్నాయి.

 ఐఎస్‌ఐలో అందుబాటులో ఉన్న కోర్సుల వివరాలు...

* గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లు: బ్యాచిలర్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌/ మేథమేటిక్స్‌ (ఆనర్స్‌). వ్యవధి మూడేళ్లు. ఈ కోర్సులకు ఎంపికైన వారికి నెలకు రూ.800 స్టయిపెండ్‌ లభిస్తుంది.

* పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లు: మాస్టర్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌/ మేథమేటిక్స్‌/ సైన్స్‌ (ఎం.ఎస్‌.)/ కంప్యూటర్‌ సైన్స్‌ (ఎం.టెక్‌.)/ ఎం.టెక్‌. క్వాలిటీ, రిలయబిలిటీ, ఆపరేషన్స్‌ రిసెర్చ్‌. ఇవన్నీ రెండేళ్ల కోర్సులు. డిగ్రీలో మేథ్స్‌/ స్టాటిస్టిక్స్‌/ ఫిజిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఎలక్ట్రానిక్స్‌/ బీఈ/ బీటెక్‌ చేసిన అభ్యర్థులు మాస్టర్స్‌ కోర్సులకు అర్హులు. స్టయిపెండ్‌ ఎం.ఎస్‌. కోర్సులకు నెలకు రూ.1200, ఎం.టెక్‌. కోర్సులకు రూ.5000.

* ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌లు (జేఆర్‌ఎఫ్‌): స్టాటిస్టిక్స్‌/ మేథ్స్‌/ క్వాంటిటేటివ్‌ ఎకానమిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఆపరేషన్స్‌ రిసెర్చ్‌/ బయోలాజికల్‌ ఆంత్రోపాలజీ/ ఫిజిక్స్‌ అండ్‌ అప్లయిడ్‌ మేథ్స్‌/ అగ్రికల్చర్‌ అండ్‌ ఎకాలజీ/ సోషియాలజీ/ జియాలజీ/ సైకాలజీ/ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ సబ్జెక్టుల్లో పరిశోధనలు చేయవచ్చు. స్టయిపెండ్‌ ఎం.టెక్‌. అభ్యర్థులకు నెలకు రూ.14000, ఇతరులకు నెలకు రూ.12000.

* పీజీ డిప్లొమా ఇన్‌ స్లాటిస్టికల్‌ మెధడ్స్‌: బీఎస్‌సీ మేథ్స్‌/ బీఈ/ బీటెక్‌ అభ్యర్థులు అర్హులు.

ఎంపిక విధానం 
అభ్యర్థుల అకడమిక్‌ రికార్డు, రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో ప్రతిభ ఆధారంగా ఆయా కోర్సులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత పరీక్ష చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా అర్హులు.

* వచ్చే విద్యాసంవత్సరానికి ఐఎస్‌ఐ పరీక్ష తేదీలను ప్రకటించింది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది.

* కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలోని ఐఎస్‌ఐ కేంద్రాల్లో దరఖాస్తులు అందుబాటులో ఉంచుతారు. ఐఎస్‌ఐ వెబ్‌సైట్‌ నుంచి కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

* ప్రవేశ పరీక్ష 13 మే 2012న జరగనుంది.

1 comment:

  1. udyogam chesey vallaki PG course la avakasalanu teliya cheya galaru

    ReplyDelete