ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Saturday, 12 November 2011

మీ కెరియర్ కు ఉపయోగపడే సమ్మర్‌ ఫెలోషిప్‌లు



ఇంజినీరింగ్‌, శాస్త్రరంగంలో పరిశోధనలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోన్న సంస్థ... జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రిసెర్చ్‌ (జేఎన్‌సీఏఎస్‌ఆర్‌).

బెంగళూరులోని ఈ సంస్థ గ్రాడ్యుయేషన్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేస్తోన్న విద్యార్థులకు సమ్మర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌లను అందిస్తోంది.

2012లో రానున్న వేసవి సెలవులను ప్రయోజనకరంగా మార్చుకోవాలనుకునే విద్యార్థులకు ఈ ఫెలోషిప్‌లు ఉపయోగపడతాయి.

ఈ సంస్థలో పనిచేసిన అనుభవం కెరియర్‌కు ఎంతో ఉపయోగపడుతుంది.

దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తలతో కలిసి పనిచేయాలని తహతహలాడే అభ్యర్థులకు జేఎన్‌సీఏఎస్‌ఆర్‌ అందిస్తోన్న సమ్మర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్స్‌ - 2012 చాలా మంచి అవకాశం. ఈ ఫెలోషిప్‌ ద్వారా లైఫ్‌ సైన్సెస్‌, మెటీరియల్‌ సైన్సెస్‌, కెమికల్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ సైన్సెస్‌, ఇంజినీరింగ్‌, మేథమేటిక్స్‌, అట్మాస్ఫియరిక్‌ సైన్సెస్‌లో రెండు నెలలపాటు పరిశోధన చేయవచ్చు.

నెలకు రూ.6000 స్టయిపెండ్‌ లభిస్తుంది.

సమ్మర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ల సంఖ్య 120. వీటికోసం దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఐదువేల మందికిపైనే విద్యార్థులు పోటీ పడుతుంటారు. దేశంలోని ఇతర ప్రముఖ పరిశోధన సంస్థల్లో పనిచేసే అవకాశం కూడా ఉంటుంది. సమ్మర్‌ ప్రాజెక్టు ఫలితాలను అంతర్జాతీయ జర్నళ్లలో ప్రచురించడానికి సంస్థ సహకరిస్తోంది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ, జేఎన్‌సీఏఎస్‌ఆర్‌, న్యూఢిల్లీలోని రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌ సంయుక్తంగా ఈ ఫెలోషిప్‌లను అందిస్తున్నాయి.

ఎవరు అర్హులు?
జేఎన్‌సీఏఎస్‌ఆర్‌ అందిస్తోన్న సమ్మర్‌ ఫెలోషిప్‌లకు కింది అర్హతలున్న అభ్యర్థులు అర్హులు...

* పదో తరగతి, ఇంటర్‌లలో మేథ్స్‌, సైన్స్‌ సబ్జెక్టుల్లో కనీసం 80 శాతం మార్కులు ఉండాలి. గ్రాడ్యుయేషన్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌ అభ్యర్థులైతే కనీసం 60 శాతం మార్కులు అవసరం.

* బి.ఎస్‌సి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారు.

* బీఈ/ బీటెక్‌ /బీవీఎస్‌సీ/ బీఫార్మా ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులు.

* ఎం.ఎస్‌సి. మొదటి సంవత్సరం చదువుతున్నవారు.

* ఇంటెగ్రేటెడ్‌ ఎం.ఎస్‌సి. 1 నుంచి 4 సంవత్సరాల విద్యార్థులు.

* జేఎన్‌సీఏఎస్‌ఆర్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

*  పూర్తిచేసిన దరఖాస్తులు చేరడానికి చివరితేదీ 2 డిసెంబరు 2011.

No comments:

Post a Comment