ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Tuesday, 6 September 2011

పీజీ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌ కోసం..!

    పీజీఈసెట్‌ 2011 కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ త్వరలో వెలువడబోతోంది.

    కౌన్సెలింగ్‌ పూర్తిగా ఆన్‌లైన్‌ పద్ధతిలో జరగనుంది. అభ్యర్థులు ముందుగా సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరై, వివిధ ర్యాంకులకు కేటాయించిన తేదీల్లో ఇంటర్నెట్‌ ద్వారా వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాలి.

    ఆన్‌లైన్‌లో సీట్ల కేటాయింపు తర్వాత ఫీజు చెల్లించి, కేటాయించిన కాలేజీలో చేరాల్సి ఉంటుంది.

     ఇంజినీరింగ్‌, టెక్నాలజీ, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌, ప్లానింగ్‌ సబ్జెక్టుల్లో రెగ్యులర్‌ మాస్టర్స్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష పీజీఈసెట్‌.

    వీటితోపాటు మూడేళ్ల ఫార్మ్‌ డి (పీబీ) కోర్సులో ప్రవేశానికి కూడా పీజీఈసెట్‌ ర్యాంకులను ప్రాతిపదికగా తీసుకుంటారు. ఆయా కోర్సుల్లో స్పాన్సర్డ్‌ సీట్లలో చేరడానికి కూడా పీజీఈసెట్‌ లేదా గేట్‌ / జీప్యాట్‌ ఉత్తీర్ణత తప్పనిసరి. గేట్‌ / జీప్యాట్‌ అభ్యర్థులకు కేటాయించిన తర్వాత మిగిలిన సీట్లను పీజీఈసెట్‌ ర్యాంకుల ఆధారంగా భర్తీచేస్తారు. గేట్‌/ జీప్యాట్‌ ఆధారంగా సీట్ల భర్తీకి ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు.

   పీజీఈసెట్‌ ఆధారంగా ప్రవేశం లభించే కోర్సుల వివరాలు...

1). సాంప్రదాయ ఎం.టెక్‌. / ఎంఈ ప్రోగ్రామ్‌లు (కేటగిరీ- I): సివిల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌, బయోటెక్నాలజీ, బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌.

* ఎం.ఫార్మసీ: ఫార్మాస్యూటిక్స్‌, ఫార్మకాలజీ, ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్‌ ఎనాలిసిస్‌ అండ్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌, ఫార్మాస్యూటికల్‌ బయోటెక్నాలజీ, ఫార్మకాలజీ అండ్‌ ఫైటోకెమిస్ట్రీ.

2) ఎం.టెక్‌. (కేటగిరీ-II) కోర్సులు: రిమోట్‌ సెన్సింగ్‌, జియో ఇంజినీరింగ్‌, ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, నానోటెక్నాలజీ, మెరైన్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ మెకానికల్‌ హ్యాండ్లింగ్‌, ఇండస్ట్రియల్‌ మెటలర్జీ, ఇండస్ట్రియల్‌ ప్రాసెస్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌.

* ఎం.ప్లానింగ్‌

3) ఎం.టెక్‌. (కేటగిరీ-III) కోర్సులు: ఎనర్జీ సిస్టమ్స్‌, డిజిటల్‌ సిస్టమ్స్‌ అండ్‌ కంప్యూటర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌, ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌, ఎన్విరాన్‌మెంటల్‌ జియోమేటిక్స్‌, స్పేషియల్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, జియోఇన్ఫర్మేటిక్స్‌, వాటర్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ టెక్నాలజీ, ప్లానింగ్‌, కంట్రోల్‌ ఇంజినీరింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్స్‌, రిలయబిలిటీ ఇంజినీరింగ్‌, కంప్యూటర్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, అర్బన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌, ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌.

* ఎం.ఆర్క్‌: ఆర్కిటెక్చరల్‌ కన్జర్వేషన్‌, ఆర్కిటెక్చర్‌ ఇన్‌ ఇంటీరియర్‌ డిజైన్‌.

4) గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ ఫార్మ్‌ డి (పీబీ) (కేటగిరీ-IV): ఈ కోర్సుకు పీజీఈసెట్‌ అభ్యర్థులు మాత్రమే అర్హులు.

కౌన్సెలింగ్‌ ప్రక్రియ
వెబ్‌ కౌన్సెలింగ్‌లో భాగంగా అభ్యర్థులు మొదట సర్టిఫికెట్‌ల తనిఖీకి హాజరు కావాల్సి ఉంటుంది. దీనికి అభ్యర్థులు తీసుకురావాల్సిన సర్టిఫికెట్లు...

* పదో తరగతి మార్కుల జాబితా
* ఇంటర్మీడియట్‌ మార్కుల జాబితా
* బీటెక్‌/ బీఈ/ బీఆర్క్‌/ బీఫార్మ్‌/ ఎం.ఎస్‌సి./ ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌ / బీఎస్‌సీ అగ్రికల్చర్‌/ బీవీఎస్‌సీ/ ఇతర సంబంధిత డిగ్రీ సర్టిఫికెట్‌. అభ్యర్థుల కోర్సును బట్టి సంబంధిత సర్టిఫికెట్‌ సమర్పించాలి. * పదో తరగతి నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్‌లు
* నాన్‌ లోకల్‌ అభ్యర్థులైతే రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌
* తల్లిదండ్రుల ఆదాయ ధృవీకరణ పత్రం (1 జనవరి 2011 తర్వాత జారీచేసింది). ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీచేసే ఆదేశాలను బట్టి ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ పథకం వర్తిస్తుంది.

ఫీజు ఎంతెంత?
* యూనివర్సిటీ కాలేజీలలో: ఎంఈ/ ఎంటెక్‌/ ఎం.ఫార్మసీ/ ఎంఆర్క్‌/ ఎం.ప్లానింగ్‌, తదితర ఇతర కోర్సులకు (సెమిస్టర్‌కు): కోర్సును బట్టి రూ.15000 నుంచి రూ.25000 వరకు.

* ప్రైవేటు కాలేజీల్లో ఎంఈ/ ఎం.టెక్‌./ ఎంఆర్క్‌/ ఎం.ప్లానింగ్‌ కోర్సులకు (ఏడాదికి): కన్వీనర్‌ కోటా సీట్లకు రూ.57000, మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లకు రూ.1,25,000. స్పెషల్‌ ఫీజు రూ.7500

* ప్రైవేటు కాలేజీల్లో ఎం.ఫార్మసీ ఫీజు (ఏడాదికి): కన్వీనర్‌ కోటాకు రూ.1,10,000; మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లకు రూ.2,25,000. స్పెషల్‌ ఫీజు రూ.7500

* ప్రైవేటు కాలేజీల్లో ఫార్మ్‌ డి (పీబీ) కోర్సుకు (ఏడాదికి): కన్వీనర్‌ సీట్లకు రూ.68000, మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లకు రూ.1,55,000. స్పెషల్‌ ఫీజు రూ.5500.

కాలేజీలు, సీట్ల వివరాలు...
రాష్ట్రంలో ఎం.టెక్‌. కోర్సులను అందిస్తోన్న కాలేజీలు 350 పైచిలుకు ఉన్నాయి. వీటిలో దాదాపు పాతికవేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. పీజీఈసెట్‌ ద్వారా ఎం.టెక్‌.కు ఉత్తీర్ణులైన అభ్యర్థుల సంఖ్య కూడా దాదాపు పాతికవేలు. గేట్‌ అభ్యర్థులు ఐదువేలకు పైగా ఉంటారు. అంటే పీజీఈసెట్‌ ఉత్తీర్ణుల్లో చాలామందికి ఎం.టెక్‌. సీటు లభించే అవకాశం ఉంది.

అభ్యర్థులు పీజీ స్థాయిలో నాణ్యమైన కాలేజీని ఎంచుకోవడం చాలా ముఖ్యం.
ఫ్యాకల్టీ, మౌలిక సౌకర్యాలు, ప్లేస్‌మెంట్లు, తదితర అంశాలను పరిశీలించి కాలేజీని ఎంచుకోవాలి. ఎం.ఫార్మసీలో కూడా సీట్ల సంఖ్య, ఉత్తీర్ణులైన అభ్యర్థుల సంఖ్య దాదాపు సమానంగా ఉంది. అభ్యర్థులు విశ్వవిద్యాలయ క్యాంపస్‌ కాలేజీలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.

ఇంజినీరింగ్‌, ఫార్మసీ కాలేజీల్లో పీజీ కోర్సులు, వాటిలోని స్పెషలైజేషన్ల వివరాల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి.

ఫొటో కర్టసీ:  EEC

No comments:

Post a Comment