ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Wednesday, 21 September 2011

సహకార బ్యాంకుల్లో ఉద్యోగాలు!

 ఐబీపీఎస్‌ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనెల్‌ సెలక్షన్‌) నిర్వహించే పరీక్షల జాబితాలో మరోటి చేరింది. బ్యాంకు పీఓ, క్లర్కుల పోస్టుల ప్రకటనల తర్వాత, మూడో పరీక్షకు కూడా నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఇవి జిల్లాస్థాయి సహకార బ్యాంకుల్లో కొలువుల నియామకానికి సంబంధించినవి. డిగ్రీ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పీఓ, క్లర్కుల అభ్యర్థులు కొత్తగా ఏమీ చదవకుండానే ఈ పరీక్షను రాసెయ్యవచ్చు. అదనపు శ్రమ లేకుండానే అదనపు కొలువు అవకాశాలకు నిజంగా ఇదో గొప్ప సహకారం!

‘ఈనాడు చదువు’ పేజీలో ప్రచురించిన ఈ కథన రచయిత ఎస్. అరుణ్ మోహన్. 


జాతీయ బ్యాంకులూ, గ్రామీణ బ్యాంకులూ ఐబీపీఎస్‌ ద్వారా వేలకొద్దీ ఉద్యోగాలకు ప్రకటనలు వెలువరిస్తున్నాయి. బ్యాంకు ఉద్యోగార్థులకు అపూర్వ అవకాశాలు లభిస్తున్న ఈ తరుణంలోనే ఏపీ సహకార బ్యాంకు డీసీసీబీల ద్వారా అవకాశాలను అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంఆ 1593 క్లర్కు ఉద్యోగాలు, 960 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయబోతున్నారు!

ఈ పోస్టులకు ఆన్‌లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు జిల్లాలవారీగా దరఖాస్తు చేసుకోవాల్సివుంటుంది. ప్రతి జిల్లాకూ వేర్వేరు వెబ్‌సైట్లున్నాయి.

* ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరితేదీ: అక్టోబరు 3, 2011.

పరీక్ష తేదీలు
* క్లర్కులు/, స్టాఫ్‌ అసిస్టెంట్లు: అక్టోబరు 30, 2011, ఉదయం.
* అసిస్టెంట్‌ మేనేజర్‌ పరీక్ష: అక్టోబరు 30, 2011, మధ్యాహ్నం.

రిజర్వేషన్లు
ప్రస్తుత ఖాళీల్లో అన్ని క్యాటగిరీలలో స్త్రీలకు 30 శాతం రిజర్వేషన్‌ పాటిస్తున్నారు.

క్లర్కు ఉద్యోగాలకు ఉన్న మొత్తం ఖాళీల్లో 25 శాతం పోస్టులను ఆయా జిల్లాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో (Primary Agricultural Co-operative Societies - PACS) పనిచేస్తున్న ఉద్యోగులకు కేటాయించారు. కనీసం 10 సంవత్సరాలు ఆయా సంఘాల్లో పనిచేసిన అనుభవం ఉండాలి. PACSలో పనిచేస్తున్న అర్హత గల అభ్యర్థుల గరిష్ఠ వయః పరి మితి 45 సంవత్సరాలు.

సాధారణ అభ్యర్థుల వయః పరిమితి 18 సం. నుంచి 30 సంవత్సరాల మధ్య.

(క్లర్కు ఉద్యోగాలకు, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాలకు ఒకే వయః పరిమితి)

అభ్యర్థి ఏ జిల్లాలో ఉద్యోగాన్ని ఆశిస్తున్నాడో తప్పనిసరిగా అదే జిల్లాకు చెందినవాడై ఉండాలి. ఆయా జిల్లాల్లో స్థానిక (లోకల్‌) అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సివుంటుంది. ఒక జిల్లాకు లోకల్‌ అభ్యర్థులు వేరే జిల్లాకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు.

విద్యార్హతలు
* క్లర్కు ఉద్యోగానికి కనీస విద్యార్హత- ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
* అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగానికి కనీస విద్యార్హత ఏదైనా డిగ్రీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. లేదా కామర్స్‌ డిగ్రీ 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత

కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి. ఇంగ్లిష్‌ భాషాజ్ఞానం కూడా అవసరం. తెలుగు రాయటం, చదవటం, మాట్లాడటం... ఈ అర్హతలు తప్పనిసరిగా ఉండాలి.

ఎంపిక విధానం
ఎంపిక రెండు దశల్లో ఉంటుంది. 1) రాతపరీక్ష 2) మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ).

175 మార్కులతో 2 గంటల కాలవ్యవధిలో ఆబ్జెక్టివ్‌ రాత పరీక్ష అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాలకూ, క్లర్కు ఉద్యోగాలకూ విడివిడిగా జరుగుతుంది.

అలాగే 25 మార్కులతో అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాలకూ, క్లర్కు ఉద్యోగాలకూ విడివిడిగా ఇంటర్వ్యూలు ఉంటాయి.

రాత పరీక్షలో మెరిట్‌ జాబితా ఆధారంగా 1:4 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇంటర్వ్యూలోనూ, రాతపరీక్షలోనూ సంయుక్తంగా వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

ఆబ్జెక్టివ్‌ రాతపరీక్షలో సబ్జెక్టులు
* స్టాఫ్‌ అసిస్టెంట్స్‌/ క్లర్కు పరీక్ష
* అసిస్టెంట్‌ మేనేజర్‌ పరీక్ష
1)టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌
1) రీజనింగ్‌, కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌
2) టెస్ట్‌ ఆఫ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ
2) క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌
3) టెస్ట్‌ ఆఫ్‌ కంప్యూటర్‌, క్లరికల్‌ ఆప్టిట్యూడ్‌
3)జనరల్‌, ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌
4) టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌
4) ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌


ఎలా తయారవ్వాలి?
ఐబీపీఎస్‌ క్లర్కు ఉద్యోగాలకూ, ఐబీపీఎస్‌ పీఓ ఉద్యోగాలకూ సిద్ధమయ్యే అభ్యర్థులు అదనంగా సిద్ధం కావలసిన సబ్జెక్టులు ఏమీ లేవు.

పరీక్ష అక్టోబరు 30న జరగబోతోంది కాబట్టి ఐబీపీఎస్‌ పీఓ పరీక్ష నిన్న రాసినవారు సాధన (ప్రాక్టీస్‌) కొనసాగిస్తే ఈ పరీక్షను చాలా సులభంగా రాయవచ్చు.

అలాగే ఐబీపీఎస్‌ క్లర్కు ఉద్యోగాలకు నవంబరు 27న పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఈ పరీక్ష చక్కటి అభ్యాసంగా ఉపయోగపడుతుంది.

ఐబీపీఎస్‌ పరీక్షతో పోలిస్తే ఈ బ్యాంకు పరీక్ష కేవలం జిల్లాలకు పరిమితం. కాబట్టి పోటీ కూడా జిల్లాకే పరిమితం. ఈ బ్యాంకులో ఉద్యోగంలో చేరితే సర్వీస్‌ అంతా ఒకే జిల్లాలో స్థిరంగా కొనసాగే అవకాశం ఉంటుంది! దూరప్రాంతాలకు బదిలీ బెడద అసలుండదు.

అదనపు ప్రిపరేషన్‌ అవసరం లేకుండా ఐబీపీఎస్‌ పరీక్షల ప్రిపరేషన్‌తోనే సహకార బ్యాంకులో కొలువు సంపాదించగల చక్కని అవకాశం ఇప్పుడు అభ్యర్థుల ముందుంది!

7 comments:

 1. ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు A.P.P.S.C. , Civils , Upsc ,Bank పరీక్షలు రాయవచ్చా.?

  ReplyDelete
 2. డియర్ వినోద్,
  దూరవిద్య (ఓపెన్ యూనివర్సిటీ)లో డిగ్రీ చేసినవారు ఏపీపీఎస్సీ, సివిల్స్ ఇతర పరీక్షలన్నీ రాయవచ్చు. అయితే ఐబీపీఎస్ సంస్థ పేర్కొన్న నిబంధన ప్రకారం టెన్త్, ఇంటర్ చదవకుండా నేరుగా డిగ్రీ చేసినవారు ఈ సంస్థ నిర్వహించే బ్యాంకు పరీక్ష రాయటానికి అవకాశం లేదు!

  ReplyDelete
 3. tvaralO D.S.C. Notification vastundani antunnaru kada. Old D.S.C. papers and new material chaduvu page lo istaarani asistunnamu.

  ReplyDelete
 4. డియర్ పాలవెల్లీ,
  డీఎస్సీ ప్రకటన వచ్చాక- కొత్త మెటీరియల్ అందిస్తాం. పరీక్షకు ముందు పాత ప్రశ్నపత్రాలు కూడా. అయితే ఇవన్నీ ప్రతిభ పేజీలో. చదువు పేజీ అందించేది గైడెన్స్ మాత్రమే!

  ReplyDelete
 5. Hello Admin,

  Could you please provide model questions for APCOB assistant manager post..Thanks.

  ReplyDelete
 6. డియర్ సుష్మా!
  APCOB అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల రాత పరీక్షను IBPS నిర్వహిస్తోంది. క్లర్కుల, పీవో పోస్టుల కోసం ప్రతిభలో ఇచ్చే మెటీరియల్, మోడల్ ప్రశ్నలు దీనికి కూడా ఉపయోగపడతాయి. రెగ్యులర్ గా ఈనాడు ప్రతిభ చూస్తుండండి.

  ReplyDelete
 7. Hello Admin,

  Totally how many objective questions do we have in this written exam and in each section??

  ReplyDelete