ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Friday, 9 September 2011

ఏవియానిక్స్‌, ఏవియేషన్‌ కోర్సులు



ప్రముఖ ఇంజినీరింగ్‌ విద్యాసంస్థ శ్రీనిధి ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఎస్‌ఎన్‌ఐఎస్‌టీ), అమెరికాలోని వాన్‌ కాలేజ్‌ (Vaughn College of Aeronautics and Technology) సంయుక్తంగా ఏవియానిక్స్‌లో బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ (బి.ఎస్‌.) కోర్సును నిర్వహిస్తున్నాయి.

వాన్‌ కాలేజీకి అమెరికాలోని అక్రెడిటేషన్‌ సంస్థల గుర్తింపు ఉంది. ఇంజినీరింగ్‌, ఏవియేషన్‌ శిక్షణలో మంచి పేరున్న ఈ సంస్థలు... ఎస్‌ఎన్‌ఐఎస్‌టీలో గ్లోబల్‌ క్యాంపస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కింది కోర్సులను నిర్వహిస్తున్నాయి.

* బి.ఎస్‌. ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీ (ఏవియానిక్స్‌):
కోర్సు వ్యవధి నాలుగేళ్లు.

కనీసం 60 శాతం మార్కులతో మేథ్స్‌ సబ్జెక్టుతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఏఐఈఈఈ 2011, ఎంసెట్‌ 2011, ఇతర రాష్ట్రస్థాయి ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షల్లో అర్హత మార్కులు సాధించినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌లో 60 శాతానికి తక్కువగా మార్కులు ఉంటే, వాన్‌ కాలేజ్‌ నిర్వహించే ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో ఉత్తీర్ణులవ్వాలి.

* బి.ఎస్‌. ఎయిర్‌లైన్‌ / ఎయిర్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌:
కోర్సు వ్యవధి నాలుగేళ్లు.

ఏ గ్రూప్‌లోనైనా కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ పూర్తి చేసినవారు అర్హులు. బి.ఎస్‌. ఎయిర్‌లైన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులో చేరిన అభ్యర్థులు అదనంగా నాలుగు సబ్జెక్టులు చదవడం ద్వారా బి.ఎస్‌. ఎయిర్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌ డిగ్రీ కూడా పొందవచ్చు.

ఈ కోర్సులను వాన్‌ కాలేజ్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఎన్‌ఐఎస్‌టీ నిర్వహిస్తుంది. డిగ్రీలను వాన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ టెక్నాలజీ ప్రదానం చేస్తుంది. ప్రతిభావంతులైన అభ్యర్థులకు వాన్‌ కాలేజ్‌ స్కాలర్‌షిప్‌లను కూడా అందిస్తోంది.

దరఖాస్తులను ఎస్‌ఎన్‌ఐఎస్‌టీ వెబ్‌సైట్నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కోర్సు ఫీజులు, ఇతర వివరాలు కూడా వెబ్‌సైట్‌లో లభిస్తాయి.

జేఎన్‌టీయూహెచ్‌లో పీజీ
హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ, ఆంధ్రప్రదేశ్‌ ఏవియేషన్‌ అకాడమీ (ఏపీఏఏ) కూడా ఏవియేషన్‌లో జాయింట్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నాయి.

ఈ సంస్థలు ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన అభ్యర్థులకు ఐదేళ్ల ఇంటెగ్రేటెడ్‌ ఎం.ఎస్‌సి. (ఏవియేషన్‌) కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చాయి.

ఇది ఫుల్‌టైమ్‌ రెగ్యులర్‌ కోర్సు. ఈ కోర్సుకు అభ్యర్థులను ఎంపిక చేయడానికి జేఎన్‌టీయూ-హెచ్‌ ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షను నిర్వహించనుంది.

ఎంసెట్‌ సిలబస్‌ ఆధారంగా ప్రశ్నపత్రం ఉంటుంది.
పరీక్ష వ్యవధి 3 గంటలు. మొత్తం 160 ప్రశ్నలుంటాయి. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలో ఉంటుంది.

ఇంటర్మీడియట్‌ ఎంపీసీ గ్రూప్‌లో కనీసం 50 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు అర్హులు. జేఎన్‌టీయూ హైదరాబాద్‌ వెబ్ సైట్.  నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. లేదా ఏపీఐఐ కార్యాలయం నుంచి దరఖాస్తులను పొందవచ్చు.

పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ 15 సెప్టెంబరు 2011.

ప్రవేశ పరీక్ష తేదీ 25 సెప్టెంబరు 2011.

No comments:

Post a Comment