ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Wednesday, 7 September 2011

మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషనల్స్‌ కోసం...


ప్రముఖ కార్పొరేట్‌ బిజినెస్‌ స్కూల్‌  XLRI (జేవియర్‌ లేబర్‌ రిలేషన్స్‌ ఇన్ స్టిట్యూట్‌, జంషెడ్‌పూర్‌).  ఇది దేశంలోని అగ్రశ్రేణి మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థల్లో  ముందువరుసలో ఉంటుంది.

మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషనల్స్‌ కోసం అనేక పీజీ సర్టిఫికెట్‌ కోర్సులను నిర్వహిస్తోంది.

హెచ్‌సీఐఎల్‌, రిలయన్స్‌ వరల్డ్‌ సహకారంతో నిర్వహిస్తోన్న ఈ కోర్సులను శాటిలైట్‌ ప్రోగ్రామ్‌లుగా వ్యవహరిస్తోంది.

మేనేజ్‌మెంట్‌ రంగంలో అనుభవం ఉన్న/  పనిచేస్తోన్న అభ్యర్థులకు ఈ కోర్సులు బాగా ఉపయోగపడతాయి.

ప్రోగ్రామ్‌ల వివరాలు...

* పోస్టు గ్రాడ్యుయేట్‌ సర్టిఫికెట్‌ ఇన్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌/ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌/ లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లయ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్‌/ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌.

ఏదైనా గ్రాడ్యుయేషన్‌ చేసిన అభ్యర్థులు అర్హులు. గ్రాడ్యుయేషన్‌ తర్వాత మేనేజ్‌మెంట్‌ రంగంలో కనీసం రెండేళ్ల పని అనుభవం తప్పనిసరి. విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలను వీడియో కాన్ఫరెన్స్‌ పద్ధతిలో నిర్వహిస్తారు.

* ఎక్స్‌.ఎల్‌.ఆర్‌.ఐ. వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రింట్‌ను ఫీజు డీడీతో కలిపి పంపించాలి. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు, ప్రింట్‌ల స్వీకరణకు చివరితేదీ 28 సెప్టెంబరు 2011.

* అర్హులైన అభ్యర్థులకు 10-25 అక్టోబరు 2011 మధ్య ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఉద్యోగాలు చేసే అభ్యర్థులకు అనుకూలమైన సమయాల్లో తరగతులు ఉంటాయి.

ఇతర వివరాలు ఎక్స్‌.ఎల్‌.ఆర్‌.ఐ. వెబ్‌సైట్‌ లో లభిస్తాయి.

3 comments:

 1. ఇది ఇక్కడ అడగకూడదు. కాని ఎవరిని అడగాలో తెలియదు. ఈనాడు లొ సండేకి నేను వ్రాసిన కధ పంపాలంటె rules ఎమిటి దయచేసి తెలుపగలరు.

  ReplyDelete
 2. డియర్ PBS,

  ఆగస్టు 7 ఈనాడు ఆదివారం సంచిక చూశారా? దానిలో ‘కలం కదిలించండి’ అంటూ కథా రచయితలకు సూచనలు ఇచ్చారు. ‘మానవ జీవితంలోని విభిన్న పార్శ్వాలను స్పృశిస్తూ మధురమైన అనుభూతులను పాఠకులకు పంచే కథలకు స్వాగతం’ అంటూ తెలిపారు.

  ‘భావం ఏదైనా ... కథనంలో వైవిధ్యం, పాఠకులను ఏకబిగిన చదివించగలిగే బిగువూ ఉండాలి. ఆశావహ దృక్పథంతో సాగే కథలకు ప్రాధాన్యం. కథ సాధారణ చేతిరాతలో ఏడు అరఠావులకు మించకూడదు.
  కథలు పంపాల్సిన చిరునామా: ఆదివారం అనుబంధం, ఈనాడు కాంప్లెక్సు, సోమాజిగూడ, హైదరాబాద్-82.’

  ReplyDelete