గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్) ద్వారా ఇంజినీరింగ్ అభ్యర్థులకే కాదు... బేసిక్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్ అభ్యర్థులకు కూడా మంచి ఉన్నత విద్య, పరిశోధన అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఈ విశేషాలను ఎస్.కిరణ్‌కుమార్ రాసిన ఈ కథనంలో తెలుసుకుందాం.
గేట్‌లో మంచి స్కోరు సాధించిన లైఫ్ సైన్సెస్ అభ్యర్థులు ప్రఖ్యాతిగాంచిన ఐఐటీలు, సీఎస్‌ఐఆర్ పరిధిలోని ముప్పైకిపైగా శాస్త్ర పరిశోధన సంస్థల్లో ఎం.టెక్. లేదా పీహెచ్‌డీ చేయవచ్చు. ప్రముఖ సంస్థల్లో ప్రాజెక్టు అసిస్టెంట్‌లుగా కూడా పనిచేయవచ్చు.
లైఫ్ సైన్సెస్, బేసిక్ సైన్సెస్‌లో ఉన్నత విద్య, పరిశోధనల పట్ల ఆసక్తి గల అభ్యర్థులు గేట్ ద్వారా తమ లక్ష్యం నెరవేర్చుకోవచ్చు.
బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మేథ్స్‌లో పీజీ చేసిన విద్యార్థులు గేట్ స్కోరు ఆధారంగా ఐఐటీల్లో ఎం.టెక్., పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. లైఫ్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్ అభ్యర్థులు సీసీఎంబీ, ఐఐసీటీ, ఐఐఎస్‌సీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఎన్‌సీఎల్, తదితర ప్రముఖ సంస్థల్లో పరిశోధనలు చేయవచ్చు. అనేక సంస్థల్లో పరిశోధన ప్రాజెక్టుల్లో పనిచేయడానికి కూడా గేట్ స్కోరు ఉపయోగపడుతుంది. చాలా సంస్థలు సీఎస్‌ఐఆర్ -నెట్‌కు ప్రత్యామ్నాయంగా గేట్ స్కోరును పరిగణనలోకి తీసుకుంటున్నాయి. సింగపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ కూడా గేట్ స్కోరు ఆధారంగా పీహెచ్‌డీలో ప్రవేశం కల్పిస్తోంది.
* గేట్ (లైఫ్ సైన్సెస్) పరీక్షలో 65 ప్రశ్నలు ఉంటాయి. వీటికి కేటాయించిన మొత్తం మార్కులు 100. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో ఉంటాయి. పరీక్ష సమయం 3 గంటలు. తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగటివ్ మార్కులు ఉంటాయి. అందువల్ల కచ్చితంగా సరైన సమాధానం తెలిస్తేనే రాయడం మంచిది.
బయోటెక్నాలజీలో ఏవి ముఖ్యం?
గేట్ బయోటెక్నాలజీ (బీటీ) పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు మేథ్స్ ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానాలు రాయాలి. గేట్ బయోటెక్నాలజీ ప్రవేశ పరీక్ష సిలబస్‌లో ఇటీవలి కాలంలో అనేక మార్పులు కూడా చేశారు. మేథమేటిక్స్ సంబంధిత అంశాలను చేర్చడం ఇందులో భాగమే. మేథ్స్ సిలబస్‌లో లీనియర్ ఆల్జీబ్రా, కాలిక్యులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, న్యుమరికల్ మెథడ్స్ మొదలైన పాఠ్యాంశాలను ప్రవేశపెట్టారు. బయోటెక్నాలజీ అభ్యర్థులు ఈ అంశాలపై కూడా పట్టు సాధించాలి. బయోటెక్నాలజీ సిలబస్‌లో రీకాంబినెంట్ డీఎన్‌ఏ టెక్నాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్, ఇమ్యునాలజీ, మాలెక్యులర్ బయాలజీ, జెనెటిక్స్, ప్లాంట్ బయోటెక్, ఏనిమల్ బయోటెక్, బయోప్రాసెస్ ఇంజినీరింగ్ అండ్ ప్రాసెస్ బయోటెక్నాలజీ, తదితర అంశాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అందువల్ల ఈ అంశాలను క్షుణ్నంగా నేర్చుకోవాలి. ఈ పేపర్‌కు బీటెక్ (బయోటెక్నాలజీ), ఎం.ఎస్‌సి. లైఫ్ సైన్సెస్ విద్యార్థులు అర్హులు.
వేటికి ప్రాధాన్యం?
గేట్ లైఫ్ సైన్సెస్ (ఎక్స్‌ఎల్) రాసే అభ్యర్థులు బోటనీ, బయోకెమిస్ట్రీ, ఫుడ్ టెక్నాలజీ, మైక్రోబయాలజీ, జువాలజీ నుంచి ఏవైనా రెండు ఆప్షనల్స్‌ను ఎంచుకోవాలి. వీటితోపాటు కెమిస్ట్రీ తప్పనిసరి పేపర్‌గా ఉంటుంది. కెమిస్ట్రీకి 25 మార్కులు వెయిటేజ్ ఉంటుంది. కెమిస్ట్రీలో కెమికల్ బాండింగ్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ రియాక్షన్స్ మెకానిజమ్, స్టీరియో కెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్, థర్మోడైనమిక్స్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, గ్రూప్స్, ఎరోమాటిసిటీ, తదితర అంశాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతారు. అందువల్ల ప్రిపరేషన్‌లో వీటికి ఎక్కువ సమయం కేటాయించాలి.
* మైక్రోబయాలజీ ఎంచుకున్న అభ్యర్థులు జనరల్ మైక్రోబయాలజీ, మైక్రోబియల్ జెనెటిక్స్, మైక్రోబియల్ ఎకాలజీ అంశాలను క్షుణ్నంగా చదవాలి.
* బయోకెమిస్ట్రీ ఎంచుకుంటే... ఇమ్యునాలజీ, ఆర్‌డీఎన్‌ఏ టెక్నాలజీ, బయోమాలెక్యూల్స్, ప్రొటీన్స్, ఎంజైమ్స్, మాలెక్యులర్ బయాలజీ, కార్బొహైడ్రేట్ మెటబాలిజం, తదితర అంశాల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలి.
కెమిస్ట్రీలో కీలకం!
గేట్ పరీక్షలో కెమిస్ట్రీకి బాగా పోటీ ఉంటుంది. అభ్యర్థులు బి.ఎస్‌సి. సిలబస్ నుంచి ప్రిపరేషన్‌ను ప్రారంభించాలి. ప్రాథమిక అంశాలను బాగా నేర్చుకున్న తర్వాత పీజీ సిలబస్‌ను చదవడం మంచిది. ఫిజికల్, ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ... మూడింటికీ సమాన ప్రాధాన్యం ఇవ్వాలి.
* ఫిజికల్ కెమిస్ట్రీలో క్వాంటమ్ కెమిస్ట్రీ, ఎలక్ట్రో కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్, కెమికల్ కైనెటిక్స్, సాలిడ్ స్టేట్, మొదలైన అంశాల్ని బాగా చదవాలి. * ఆర్గానిక్ కెమిస్ట్రీలో స్టీరియో కెమిస్ట్రీ, రియాక్షన్ మెకానిజమ్, పెరిసైక్లిక్ రియాక్షన్స్, ఫొటోకెమిస్ట్రీ, బయో మాలెక్యూల్స్, స్పెక్ట్రోస్కోపీ, తదితర పాఠ్యాంశాలను బాగా అధ్యయనం చేయాలి.
* ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ప్రధానంగా మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ స్పెక్ట్రోస్కోపీ, మొదలైన అంశాలను క్షుణ్నంగా నేర్చుకోవాలి.
ఫిజిక్స్, మేథ్స్ అభ్యర్థులకు...
* గేట్ ఫిజిక్స్ (పీహెచ్) రాసే అభ్యర్థులు ముఖ్యంగా క్లాసికల్ మెకానిక్స్, ఎలక్ట్రో మేగ్నటిక్ థియరీ, క్వాంటమ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్ అండ్ స్టాటిస్టికల్ ఫిజిక్స్, అటామిక్ అండ్ మాలెక్యులర్ ఫిజిక్స్, సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, న్యూక్లియర్ అండ్ పార్టికిల్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ పాఠ్యాంశాలను బాగా అధ్యయనం చేయాలి.
* గేట్ మేథ్స్ (ఎం.ఎ.) రాసే అభ్యర్థులు... లీనియర్ ఆల్జీబ్రా, కాంప్లెక్స్ ఎనాలిసిస్, రియల్ ఎనాలిసిస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఫంక్షనల్ ఎనాలిసిస్, పార్టికల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, మెకానిక్స్, టోపోలజీ, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, లీనియర్ ప్రోగ్రామింగ్, కాలిక్యులస్ ఆఫ్ వేరియేషన్, ఇంటెగ్రల్ ఈక్వేషన్స్, తదితర అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి.
లైఫ్ సైన్సెస్, బేసిక్ సైన్సెస్ అభ్యర్థులు సబ్జెక్టు భావనలపై బాగా పట్టు సాధించాలి. పాఠ్యపుస్తకాలతోపాటు రిసెర్చ్ జర్నళ్లను కూడా అధ్యయనం చేయడం ద్వారా సబ్జెక్టులోని తాజా అంశాలను నేర్చుకోవచ్చు. అలాగే పాత ప్రశ్నపత్రాలను, నమూనా ప్రశ్నపత్రాలను సాధన చేయడం ద్వారా ప్రిపరేషన్ స్థాయిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవచ్చు. సమయపాలన కూడా అలవాటవుతుంది.
* గేట్‌కు ఈ ఏడాది నుంచి విద్యార్హతల్లో మార్పులు చేశారు. ఈ వివరాల కోసం ఇదే బ్లాగులో కథనాన్ని ఇక్కడ. క్లిక్ చేసి చదవండి.
Good one ! :)
ReplyDeleteడియర్ బాలూ, థాంక్ యూ !
ReplyDeletehello everyone may follow another blog for education i.e.,
ReplyDeletehttp://nvseducation.blogspot.com/
thank u.