ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Saturday, 10 September 2011

ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్ కోర్సురాష్ట్రంలోని ప్రముఖ విద్యాసంస్థ గీతం విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని 'గీతం స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌' (జి.ఎస్‌.ఐ.బి.) ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ స్పెషలైజేషన్‌తో ఎంబీఏ కోర్సును నిర్వహిస్తోంది.

ఈ స్పెషలైజేషన్‌తో ఎంబీఏని అందిస్తోన్న సంస్థలు మనదేశంలో చాలా తక్కువగా ఉన్నాయి.

2012-14 సంవత్సరానికి జీఎస్‌ఐబీ అందిస్తోన్న ఎంబీఏ (ఐబీ), ఇతర మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ వెలువడింది.

గీతం స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ మూడు మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లను అందిస్తోంది. అంతర్జాతీయ వ్యాపార ధోరణులను దృష్టిలో ఉంచుకొని వీటిని రూపొందించారు. ఆయా కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు వివిధ కంపెనీల్లో సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌లను కూడా జీఎస్‌ఐబీ అందిస్తోంది.

కోర్సుల వివరాలు...
1. ఎంబీఏ (ఇంటర్నేషనల్‌ బిజినెస్‌
2. ఎంబీఏ (ఇంటర్నేషనల్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌)
3. ఎంబీఏ (గ్లోబల్‌ లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లయ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్‌)

దేశంలోని అగ్రశ్రేణి బిజినెస్‌ స్కూళ్లలో బోధించే అధ్యాపక బృందం, పరిశ్రమల నిపుణులు ఎంబీఏ కోర్సుల నిర్వహణలో పాలుపంచుకుంటారు. ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ప్యారిస్‌, బర్గుండీ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లతో జీఎస్‌ఐబీకి ఫ్యాకల్టీ, స్టూడెంట్‌ ఎక్చేంజ్‌ ప్రోగ్రామ్‌ ఒప్పందం కూడా ఉంది.

జి.ఇ.టి. 2012 ఆధారంగా ప్రవేశం
జీఐఎస్‌బీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (జీఈటీ) 2012, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలలో ప్రతిభ ఆధారంగా ఎంబీఏ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. ఏదైనా డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు అర్హులు. చివరి సంవత్సరం పరీక్షలు రాయబోతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

* క్యాట్‌-2011, ఐఐఎఫ్‌టీ- 2011, ఎక్స్‌.ఎ.టి.- 2012, మ్యాట్‌ (సెప్టెంబరు 2011, డిసెంబరు 2011, ఫిబ్రవరి 2012), జీమ్యాట్‌ పరీక్షల్లో స్కోరు సాధించిన అభ్యర్థులకు జీఈటీ 2012 నుంచి మినహాయింపు ఉంటుంది. ఆయా టెస్ట్‌లలో స్కోరు ఆధారంగా గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ అభ్యర్థులు కావాలనుకుంటే జీఈటీ- 2012 కూడా రాయవచ్చు. ఇందులో మంచి స్కోరు వస్తే దీని ఆధారంగా ప్రవేశం పొందవచ్చు.

జీఎస్‌ఐబీ వెబ్‌సైట్‌  ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక చేసిన యాక్సిస్‌ బ్యాంకు శాఖలు, ఐఎంఎస్‌ సెంటర్లలో కూడా దరఖాస్తులు లభిస్తాయి. దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థులు ప్రోగ్రామ్‌ ప్రాధమ్యాలను గుర్తించాలి. ఇతర వివరాలు జీఎస్‌ఐబీ వెబ్‌సైట్‌లో లభిస్తాయి.

* పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 14 జనవరి 2012

* జీఈటీ 2012 పరీక్ష తేదీ: 29 జనవరి 2012

* ఇతర పరీక్షల స్కోర్లతో దరఖాస్తు చేయడానికి చివరితేదీ: 29 ఫిబ్రవరి 2012

* కేస్‌ ఎనాలిసిస్‌, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ తేదీలు: 10-11 మార్చి 2012.

No comments:

Post a Comment