ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Sunday 4 September 2011

ఫెలోషిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్‌టీ) ఆధ్వర్యంలో నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కమ్యూనికేషన్‌ (ఎన్‌సీఎస్‌టీసీ) పనిచేస్తోంది. 
 ఇది రజత్‌ జయంతి విజ్ఞాన్‌ సంచారక్‌ ఫెలోషిప్‌ (ఆర్‌జేవీఎస్‌ఎఫ్‌)లను అందిస్తోంది.

సైన్స్‌, ఇంజినీరింగ్‌, మెడికల్‌ సైన్స్‌, అగ్రికల్చర్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మాస్‌ కమ్యూనికేషన్‌, తదితర సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, అంతకంటే పైస్థాయి కోర్సులు చేసిన అభ్యర్థులకు ఈ ఫెలోషిప్‌లు వర్తిస్తాయి.

మంచి అకడమిక్‌ రికార్డుతోపాటు డీఎస్‌టీ ఎంపిక చేసిన కొన్ని యూనివర్సిటీ, పరిశోధన, విద్యాసంస్థల్లో ఉన్నత కోర్సులు చేసేవారు, పరిశోధనలు చేసే అభ్యర్థులు ఈ ఫెలోషిప్‌లకు అర్హులు. సైన్స్‌, టెక్నాలజీ రంగాల్లో పనిచేస్తోన్న స్వచ్ఛంద సంస్థలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థుల వయసు 35 ఏళ్లలోపు ఉండాలి.

ఆర్‌జేవీఎస్‌ఎఫ్‌ కింద జారీచేసే ఫెలోషిప్‌ల సంఖ్య 20.  ఫుల్‌టైమ్‌ కోర్సులు, పరిశోధనలు చేసేవారికి మాత్రమే వర్తిస్తాయి. ఫెలోషిప్‌ వ్యవధి ఏడాది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.12000 (పీహెచ్‌డీ చేసినవారైతే రూ.16000) ఫెలోషిప్‌గా లభిస్తుంది.

*  అభ్యర్థులు డీఎస్‌టీ వెబ్‌సైట్‌  నుంచి  (ఇక్కడ క్లిక్ చేసి) లింకు ద్వారా దరఖాస్తులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

              పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ- 30 సెప్టెంబరు 2011.

No comments:

Post a Comment