ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Thursday 8 September 2011

బేసిక్ సైన్సెస్ లో పీహెచ్‌డీ కోర్సులు


   బేసిక్‌ సైన్సెస్‌లో పరిశోధనలకు అధిక ప్రాధాన్యం ఇస్తోన్న సంస్థ ఇండియన్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌ - తిరువనంతపురం).

   బయోలాజికల్‌, కెమికల్‌, ఫిజికల్‌, మేథమేటికల్‌ సైన్సెస్‌లో పీహెచ్‌డీ కోర్సులను నిర్వహిస్తోంది.

   జనవరి 2012 నుంచి ప్రారంభం కానున్న అకడమిక్‌ సెషన్‌లో ప్రవేశానికి ఐఐఎస్‌ఈఆర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.   

కింది సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ కోర్సులను నిర్వహిస్తోంది...

* బయోలాజికల్‌ సైన్సెస్‌:
బయోలాజికల్‌/ కెమికల్‌/ ఫిజికల్‌/ మేథమేటికల్‌/ మెడికల్‌ సైన్సెస్‌/ ఇంజినీరింగ్‌ లేదా మెడిసిన్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉన్న అభ్యర్థులు అర్హులు. కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలో ఉంటుంది. మేథ్స్‌, స్టాటిస్టిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలడుగుతారు.

* కెమికల్‌ సైన్సెస్‌:
కనీసం 60 శాతం మార్కులతో కెమిస్ట్రీలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేసుండాలి. పరిశోధన అనుభవం, ప్రచురణలు ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు.

* ఫిజికల్‌ సైన్సెస్‌:
ఫిజికల్‌ సైన్సెస్‌, ఇంజినీరింగ్‌, టెక్నాలజీలో మాస్టర్‌ డిగ్రీ అవసరం. 60 శాతంపైగా మార్కులున్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.

* మేథమేటికల్‌ సైన్సెస్‌:
ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ/ మేథమేటిక్స్‌/ స్టాటిస్టిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ లేదా ఇంజినీరింగ్‌ / టెక్నాలజీలో బ్యాచిలర్‌ డిగ్రీతోపాటు మేథ్స్‌ ఒలింపియాడ్‌లలో ప్రతిభ చూపినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

జాతీయ స్థాయిలో నిర్వహించే సీఎస్‌ఐఆర్‌ - యూజీసీ జేఆర్‌ఎఫ్‌ / డీబీటీ- జేఆర్‌ఎఫ్‌/ గేట్‌/ ఐసీఎంఆర్‌ - జేఆర్‌ఎఫ్‌, తదితర పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఈ అభ్యర్థులకు అర్హత పరీక్షల్లో మినహాయింపులు కూడా ఉంటాయి.

* దరఖాస్తులను ఐఐఎస్‌ఈఆర్‌, తిరువనంతపురం వెబ్‌సైట్నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ‌:   30 సెప్టెంబరు 2011.

2 comments:

  1. Hi, Please Ph.D in computer Science Guringchi vivaralanu teliyacheyagalaru.. mana rastram lo una universities and eligibility criteria telupandi. Giudenceship ela pondali e area lo research baguntundi telupandi plzzz.. thankin advance. my email: snrperumalla@gmail.com

    ReplyDelete
  2. డియర్ భవానీటెక్,
    కంప్యూటర్ సైన్స్ లో పీహెచ్ డీ వివరాలు హైదరాబాద్ లోని ట్రిపుల్ ఐటీ వెబ్ సైట్లో చూడొచ్చు. http://www.iiit.ac.in/academics/programmes/postgraduate/phdcse

    ReplyDelete